శాసన సభను రద్దు చేస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో, తెలంగాణలో ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. కేసీఆర్ నిర్ణయాన్ని తప్పని ఓ వైపు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే... ఎలాగైనా సరే ఈ సారి టీఆర్ఎస్‌ను ఓడిండాలని కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపధ్యంలో, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి నాయకులు లేకపోయినా, క్యాడర్ ఇప్పటికీ అలాగే ఉంది. హైదరబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో, వీళ్ళు గట్టిగా ప్రభావం చూపిస్తారు. అలాగే సంస్థాగతంగా, తెలంగాణా బీసీల్లో తెలుగుదేశం అంటే ఇప్పటికీ అభిమానం ఉంది. ఈ నేపధ్యంలోనే, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు అని కాంగ్రెస్ భావిస్తుంది.

revanth 07092018 2

మరో పక్క, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, బీజేపీ పై పోరాటం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేస్తుంది అనే అభిప్రాయం ఇక్కడ ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగు అయిపొయింది. ఇప్పుడు మోడీతో, కెసిఆర్ అంటకాగుతూ, ఆంధ్రప్రదేశ్ కు ఏ విషయంలోనూ కెసిఆర్ కలిసి రావటం లేదు. అందుకే కెసిఆర్ ను దించటానికి, తెలంగాణాలో మాత్రమే కాంగ్రెస్ తో వెళ్తే ఎలా ఉంటుంది అనే చర్చ తెలంగాణా తెలుగుదేశంలో మొదలైంది. కాంగ్రెస్ కనుక తనంతట తాను, తెలుగుదేశం వద్దకు పొత్తుకు వస్తే, ఆలోచిద్దాం అనే అభిప్రాయంలో చంద్రబాబు కూడా ఉన్నారు. ఇలా ఉండగానే, కెసిఆర్ నిన్న ప్రెస్ మీట్ లో చంద్రబాబుని తిట్టటం, ఆంధ్రా ప్రాంతం వారి పై మరోసారి విషం చిమ్మారు.

revanth 07092018 3

ఇవన్నీ అటుంచితే... తెలంగాణలో పొత్తు విషయమై టీడీపీతో చర్చించాలని ముగ్గురు కీలక నేతలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగి హస్తం గూటికి చేరిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కీలక నేత మధుయాష్కీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బోస్ రాజులకు బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే టీడీపీ కీలక నేతలతో చర్చలు ఎప్పుడు.. ఎక్కడ జరపాలన్న దానిపై అధిష్ఠానం ప్లాన్ చేస్తోందని తెలిసింది. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో ముగ్గురు కీలక నేతలు రంగంలోకి దింపి.. తెలంగాణకు చెందిన టీడీపీ కీలక నేతలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అయ్యి చర్చిస్తారని సమాచారం.

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మంత్రి ఆదినారాయణ రెడ్డి శుక్రవారం ఫైర్ అయ్యారు. తమను ఊర కుక్కలు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. జగన్ అనే ఒక సైకో టార్చర్ మేము భరించలేక, మేము పార్టీ నుంచి బయటకు వచ్చామని అని అన్నారు. ఇప్పటికే మా రాజీనామాలు స్పీకర్ పరిధిలో ఉన్నాయని, స్పీకర్ పరిధిలో ఉండగానే, జగన్ కోర్ట్ కి వెళ్ళాడని, కోర్ట్ లో తేలకుండా, ఎవరూ ఏమి చెయ్యలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది, ప్రజారాజ్యం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు స్టేజి మీద ఉండగానే జగన్ తన పార్టీని ప్రకటించలేదా అని ప్రశ్నించారు.

aadi 07092018 2

ఆ రోజే జగన్ మా అందరినీ ఎందుకు రాజీనామా కోరలేదో చెప్పాలని నిలదీశారు. తాము 2014లో వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ బొమ్మలు పెట్టుకొని గెలిచామని చెబుతున్నారని, మరి అదే బొమ్మ పెట్టుకున్న విజయమ్మ విశాఖపట్నం ఎంపీగా ఎందుకు ఓడిపోయారో చెప్పాలన్నారు. అసలు తల్లిని గెలిపించుకోలేని జగన్ తమను గెలిపించాడని ఎలా అనుకుంటున్నారని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. విశాఖపట్నంలో విజయమ్మ ఓటమికి తాను కారణం అని జగన్ అంగీకరిస్తే మా గెలుపుకు కూడా ఆయనే కారణమని ఒప్పుకుంటామని చెప్పారు. ‘మా వంశ చరిత్ర గురించి నీవు మాట్లాడితే నీ చరిత్ర వందసార్లు చెబుతా.. మేం ఊరకుక్కలమైతే.. నువ్వు ఊరపందివి’ అంటూ జగన్‌నై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

aadi 07092018 3

జగన్ ఉదయం లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి అని కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ పెట్టిన నాటి చరిత్ర ఏమిటో చెబితే పారిపోతావని మంత్రి జగన్‌ను హెచ్చరిస్తూ అన్నారు. తన తండ్రి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు జగన్ ఇంకా పుట్టలేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా నీ వద్దకు వచ్చానని, ఆ రోజు ఎమ్మెల్యేల ఫిరాయింపులు గుర్తులేదా? అని జగన్‌ను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. పార్టీ మారినందుకు తనకు రూ. 20 కోట్లు ఇచ్చారని విమర్శలు చేస్తున్నారని, గతంలో నీ వద్దకు వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చావో చెప్పాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.

సింగపూర్‌కు విమానాన్ని నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరి కొద్ది రోజుల్లోనే సింగపూర్ కి గన్నవరం నుంచి సర్వీస్ లు మొదలవనున్నాయి. విజయవాడ నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ సర్వీసును అందిస్తున్నామని ప్రైవేటు విమానయాన సంస్థ ‘ఇండిగో’ప్రకటించింది. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ప్రాతిపదికన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు అక్టోబర్‌ 2 తేదీ నుంచి వారంలో రెండు రోజుల పాటు సింగపూర్‌కు ఇండిగో తన విమాన సర్వీసును ప్రారంబించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

gannavaram 07092018 2

180 సీట్లుండే ఈ విమానాన్ని వారంలో విజయవాడ నుంచి రెండు, మూడుసార్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట ఆగస్టు 27 నుంచి సేవలు ప్రారంభించాలనుకున్నారు. కాని అక్టోబర్‌ 2 వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టు తెలిసింది. వారంలో రెండు రోజుల పాటు విమాన సర్వీసును ఇండిగో విమాన సర్వీసును సింగపూర్‌కు నడుపుతుంది. వారంలో ఆ రెండు రోజులు ఎప్పుడు ? ఏ సమయంలో ఇండిగో విమాన సర్వీసును ఉంటుంది. ఆ షెడ్యూల్‌ను అధికారికంగా మరికొద్ది రోజులలోఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించనుంది. ప్రస్తుతానికి అందిన సమాచారం మేరకు ఎయిర్‌ బస్‌ 320 విమానాన్ని 180 సీటింగ్‌తో ఉంటుందని ఇండిగో సంస్థ ప్రకటించింది.

gannavaram 07092018 3

సింగపూర్‌కు విమాన సర్వీసు నడపటం వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఎంతో ఉండనే చెప్పాలి. గన్నవరం ఎయిర్ పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అయ్యి చాలా నెలలు అయ్యింది. అశోక్ గజపతి రాజు కేంద్రం మంత్రిగా ఉండటంతో, పనులు చకచకా జరిగాయి. మరి కొద్ది రోజుల్లో దుబాయ్ కి, సింగపూర్ కి గన్నవరం నుంచి సర్వీస్ లు మొదలవుతాయి అనుకుంటున్న టైంలో, ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు రావటం, తెలుగుదేశం మంత్రులు రాజీనామా చెయ్యటంతో, గన్నవరం కధ మొదటికి వచ్చింది. ఎంత మంది ప్రైవేటు ప్లేయర్స్ వచ్చి, మేము ఫ్లైట్ నడుపుతాం అన్నా పర్మిషన్ ఇవ్వలేదు. సింగపూర్‌కు ఇంటర్నేషనల్‌ చార్టర్డ్‌ ఫ్లైట్‌ సర్వీసు నడిపే విషయంలో డీజీసీఏ నో అనేసింది.

gannavaram 07092018 4

దేశీయంగా చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు సంబంధించి అనుమతులు ఇవ్వటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతర్జాతీయంగా చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు అనుమతి ఇవ్వలేమని డీజీసీఏ చెబుతున్నట్టు తెలిసింది. అయినా పట్టు వదలకుండా డీజీసీఏతో అనుమతుల కోసం ప్రయత్నాలు జరిపారు అధికారులు. వెంకయ్య నాయుడుతో కూడా చెప్పించారు, చివరకు చంద్రబాబు కూడా రంగంలోకి దిగటంతో, ఎట్టకేలక అనుమతి లభించింది. చార్టర్డ్‌ ఫ్లైట్‌ కాకుండా, మామూలు ఫ్లైట్ కే అనుమతి వచ్చింది. విజయవాడ నుంచే నేరుగా సింగపూర్‌కు విమానాన్ని నడపనున్నారు.అలాగే విజయవాడ నుంచి సౌత్‌ఈస్ట్‌ ఏషియాలో సింగపూర్‌ తొలి విమాన సర్వీసును నడుపుతున్న ఘనతను ఎయిర్‌ పోర్టు సాధించనుంది.

నిన్న కెసిఆర్, తెలంగాణా అసెంబ్లీ రద్దు చేస్తూ, ఎలా పెలాడో అందరూ చూసారు. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతం పై మరోసారి తన కడుపు మంట చూపించారు. చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసారు. కెసిఆర్ నిన్న మాట్లాడుతూ, ఆంధ్రా అనే మాట తెలంగాణాలో వినపదకూడదు అని, ఇంకా ఆంధ్రా నాయకులు మనకు ఎందుకు అంటూ, తీవ్ర విమర్శలు చేసారు. ఆంధ్రా ప్రాంతం పై, నాలుగేళ్ళు దాటుతున్నా, కెసిఆర్ కి ఎంత విద్వేషం ఉందో, ఈ మాటలను బట్టి అర్ధమావుతుంది. అంతే కాదు, చంద్రబాబుని నేలకేసి కొట్టాం, ఇంకా చంద్రబాబు పార్టీ ఎక్కడ ఉంది అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

kcr 07092018 2

ఈ వ్యాఖ్యల పై, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి, ఆంధ్రపదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. ఓ పక్క తెలుగువారంతా కలిసుండాలంటూనే జాగో బాగో అంటూ కేసీఆర్ చేసిన విమర్శలను లోకేశ్‌ తప్పుపట్టారు. తెరాస మొత్తం తెలుగుదేశం వాళ్ళతో నింపుకుని, మళ్ళీ తెలుగుదేశం ఆంధ్రా పార్టీ అని విషం చిమ్ముతున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో మండలికి వెళ్తూ లోకేశ్‌ తెలంగాణ పరిణామాలపై కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు.

kcr 07092018 3

ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకోకుండానే జీహెచ్ఎంసీని తెరాస చేజిక్కించుకుందా? అని లోకేశ్ నిలదీశారు. ఆంధ్రా ప్రాంతం వారు అంటే ఇంత లెక్క లేని తనం పనికిరాదని, ఈ ఆంధ్రా ప్రజలే రేపు, ఎవరు ఏంటో నిర్ణయిస్తారని అన్నారు. నిజానికి, కెసిఆర్ ఇలా ఆంధ్రా ప్రాంతం పై విషం చిమ్మటం ఇది మొదటిసారి కాదు. అసలు కెసిఆర్ రాజకీయం నడుస్తుందే, ఆంధ్రా ప్రాంతం పై నిత్యం ఏడుస్తూ.. కాని, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వాళ్ళ ఓట్లు మాత్రం కావలి.. తెలంగాణాలో జనాలే ఛీ కొడుంటే, ఇంకా ఆంధ్రా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కెసిఆర్ కి త్వరలోనే తెలుస్తుంది. మోడీతో అంటకాగుతూ, ఆంధ్రా పై కుట్రలు చేస్తున్న వారికి, ఆంధ్రా ప్రజలు, సెటిలర్లు తగిన బుద్ధి చెప్తారు.

Advertisements

Latest Articles

Most Read