ఆత్మగౌరవం నినాదంతో, ఢిల్లీ అహం పై తిరగబడి, ఎన్టీఆర్‌ స్దాపించిన తెలుగుదేశం పార్టీ, అనూహ్యంగా అధికారం లోకి వచ్చింది.. రాజకీయాల్లో కొత్త నీరు, కొత్త ఒరవడి, సంక్షేమం, క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధత వచ్చాయి... ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా దేశంలో ఏర్పడిన జనతా పార్టీ ప్రయోగం విఫలమై, ఇందిరే ఇండియా...ఇండియా నే ఇందిర అనుకుంటున్న కాలం... గవర్నర్ లను అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలను కూలుస్తున్న కాలం... అదే విధంగా ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చారు... తెలుగువారికి రాజకీయ జుగుప్సాకర విన్యాసాలు తెలిసివచ్చాయి.. ప్రజాస్వామ్య పునరుద్దరణ ఉద్యమం ...దేశంలోని కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పక్షాలన్నీ యన్టీఆర్‌ కి బాసట గా నిలిచాయి... సిద్దాంతాలు...భావజాలాలు..అన్నీ పక్కన పెట్టి రాజకీయ పక్షాలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చిన సందర్భం...

cbn 09092018

ఇందిర లాంటి ఐరన్ లేడీ...డైనమిక్ లీడర్...దేశానికి ఎమర్జెన్సీ అంటే ఏంటో చూపించిన ప్రధానమంత్రి ...ప్రజా ఉద్యమానికి తలవంచి...ప్రజాభిప్రాయాన్ని గౌరవించి...తిరిగి యన్టీఆర్‌ ని ముఖ్యమంత్రి స్దానంలో కూర్చోపెట్టారు..
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ...వరుసగా పార్లమెంటు ...అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ని మట్టికరిపించారు...ఇందిర మరణానంతరం వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో అయితే దేశమంతా కాంగ్రెస్ కి పట్టం కడితే ...ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కి ఘన విజయాన్నిచ్చారు...భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధానప్రతిపక్షం గా పని చేసే అవకాశం ఇచ్చారు... సహజంగా ఏపి లో కాంగ్రెస్ ...టీడీపీ లే ప్రధాన పక్షాలవటం తో ...ఆనాటి నుండి టీఆరెస్ ఆవిర్భావం వరకు పోటీ పడుతూ వచ్చాయి.. టీడీపీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఇప్పటి వరకు అన్ని ఎన్నికలలో పోటీ చేసింది..అనంతరం దేశం మొత్తం మీద రెండు సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ తో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే...

cbn 09092018

జాతీయ పార్టీ లు ...కాంగ్రెస్ ...బీజేపీ లు ఆయా రాష్ట్రాల లో తమ ప్రత్యర్థి పార్టీ లతో ...పొత్తులు పోటీలు తడవ తడవ కు మార్చుకున్నాయి...అప్పటి అవసరాలు కి ప్రాధాన్య మిచ్చాయి...సిద్దాంతాలు ప్రాతిపదికన పనిచేసే కమ్యూనిస్టు లు కూడా ...వేర్వేరు రాష్ట్రాల లో వేర్వేరు పార్టీ లతో కలిది పనిచేసాయి...ఇన్నాళ్ళూ కాంగ్రెస్ దేశమంతా ప్రధానపక్షం గా ఉండేది... ఇప్పుడు ఆ స్దానం బీజేపీ ఆక్రమించింది... కాలం మారుతుంది...రాజకీయాల్లో కి కొత్త తరం వచ్చింది... సమాజం ...మారింది...సమాచార వ్యవస్దమెరుగైంది..సాంకేతిక విప్లవం వచ్చింది...మూడుదశాబ్దాల నాటి రాజకీయ వాతావరణం ఇప్పుడు లేదు...ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల లో యన్టీఆర్‌ టీడీపీ పుణ్యాన ...బడుగు బలహీన వర్గాలు ...విద్యావంతులు...రాజకీయ వేదిక మీదకు ప్రవేశించారు...అధికారం అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చింది...

cbn 09092018 2

బీజేపీ దేశమంతా వ్యాపించింది...రాజనీతిజ్ఞులు..వాజ్ పాయ్ ...అద్వానీ లు ...ఇంకా పలువురు ప్రాధాన్యత కోల్పోయారు... మోదీ షా లాంటి వారు వీర విహారం చేస్తున్నారు... దేశానికి ఎమర్జెన్సీ రుచి చూపించిన ఇందిర కంటే అప్రకటిత ఎమర్జెన్సీ ని అమలు చేస్తున్న తీరు ..ఏక పక్ష ధోరణి...అధికార కాంక్ష దేశ ప్రజలను నివ్వెర పోయేలా చేస్తున్నాయి...మాట విన్నా...వినక పోయినా...మిత్రపక్షమైనా ...శత్రుపక్షమైనా .....స్వపక్షంలో ని సీనియర్లైనా ...ఎవ్వరైనా ఒకటే మంత్రం... బీజేపీ ..మోదీ ...షా ల అరాచక పాలన...దుందుడుకు నిర్ణయాలు దేశ ప్రజలను హతాశులను చేస్తున్నాయి.. ఎమర్జెన్సీ విధించిన ఇందిర కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు...కాని దేశాన్ని కాషాయమయం చేయటానికి మోదీ బృందం ...అనుసరిస్తున్న విధానాలు...ఎటుదారి తీస్తాయీ అన్న గుబులు కలుగుతుంది...

cbn 09092018 3

దక్షిణాది రాష్ట్రాలపట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ...కాంగ్రెస్ బెటరనిపిస్తుంది... బీజేపీ అవనీతి పరులను నెత్తికెత్తుకున్న తీరు...కేసుల బూచి చూపించి పార్టీ లను వశపర్చుకుంటున్న విధానం ...ఆందోళన కలిగిస్తుంది.. ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ ...మోదీ ...షా లు వ్యవహరిస్తున్న తీరు వారి గుట్టు బయటపెట్టింది...అవమానం ...అవహేళన..బాధ్యతారాహిత్యం...అణచివేత ధోరణి ...కొత్త రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న తీరు తో విసిగి పోయిన టీడీపీ తప్పని పరిస్దితుల్లో ...పోరాటానికి మద్దతు వెతుక్కోవలసి వస్తుంది... ఆ క్రమం లో భావస్వారూప్యం తో పాటు..ఏక లక్ష్య సాధన లో కలసి వచ్చే పార్టీ లతో జట్టు కట్టాల్సివస్తుంది... తెలంగాణ లో మోదీ సామంతులను నిలువరించే అవకాశం వచ్చింది... ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చారిత్రక నిర్ణయం తీసుకుని తీరాలి... భవిష్యత్తులో కూడా కలసి వచ్చి విభజన హామీలు నెరవేరుస్తారని నమ్మాలి...హామీలు అమలు కాక పోతే తిరిగి పోరాటమే శరణ్యం... ప్రస్తుతం ఉమ్మడి శత్రువుని కలిసి ఎదుర్కోవటమే సరైన సమయంలో సరైన నిర్ణయం... courtesy: శ్రీనివాస రావు గారు.

రాజధాని అమరావతికి రక్షణ కవచంగా పనిచేయనున్న కొండవీటివాగు ఎత్తిపోతల పథకం సెప్టెంబర్‌ 10 లేదా సెప్టెంబర్‌ 14న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ఎత్తిపోతల పథకాల నిర్మాణం, నిర్వహణలో విశేష అనుభవం గడించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చేపట్టిన కొండవీటి ఎత్తిపోతల పథకం డ్రై ట్రయల్ రన్ విజయవంతమైంది. శుక్రవారం ఆరుమోటార్లను ఆన్ చేసి వాటి పనితీరును పరీక్షించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎత్తిపోతల పథకా న్ని రూ.222.44 కోట్లతో చేపట్టారు. నిర్మాణ బాధ్యతలను మేఘా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. గత ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ పథకానికి శంకుస్థాపన చేశా రు. అప్పటి నుంచి ఎన్నో సవాళ్లను అధిగమించి పథకాన్ని పూర్తి చేసింది.

prakasam 09092018 2

మేఘా సంస్న ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా పంప హౌస్,డిశ్చార్జి పాయింట్, రెగ్యులేటర్, సబ్ స్టేషన్, ట్రాన్స్మిషన్లైన్ల నిర్మాణాన్ని సంస్థ చేపట్టింది. పంప్ హౌస్ నిర్మాణం పూర్తయింది. 16 మోటార్లు, 16 పంపులు బిగించారు. ఒక్కో మోటార్ నుంచి 350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. 16 పంపుల్లో ఒకటి స్టాండ్ బైగా ఉంటుంది. ఏదైనా మోటార్ మరమ్మతు వచ్చినప్పుడు ఈ మోటార్లు వినియోగిస్తారు. డిశ్చార్జి పాయింట్ నిర్మాణం కూడా పూర్తయింది. కృష్ణానదికి భారీ వరద వచ్చినా 19 అడుగులకు మించ దు. అయితే ఇక్కడ డిశ్చార్జి పాయింట్ ను 22 అడుగుల ఎత్తులో నిర్మించా రు. డిశ్చార్జి పాయిం ట్ నుంచి పంప్ హౌ స్ మధ్య 16 వరు సల పైప్ లైన్ ఏర్పాటు చేశారు.

prakasam 09092018 3

ఎత్తిపోతల పథకం నిర్వ హణకు ప్రధాన అవసరమైన విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయింది. ఈ ఎత్తిపోతల పథకం నడిచేందుకు 132 బై11కేవీ సామర్థ్యం కలిగిన సబ్ స్టేషన్ ను నిర్మించారు. అమరావతికి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం 29.5 కిలోమీటర్ల మేర కొండవీటి వాగు ద్వారా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఇతర వాగులు, వంకల నీరు కూడా ఇందులోనే చేరుతుంది. లామ్‌ ఆనకట్ట వద్ద ప్రారంభమైన ఈ కొండవీటి వాగు మేడికొండూరు, తాడికొండ, మంగళగిరి తాడేపల్లి మండలాల్లో ప్రవహిస్తూ ఉండవల్లి అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ ద్వారా కృష్ణానదిలోకి చేరుతుంది. అయితే, అమరావతి మునిగిపోతుంది అంటూ, విష ప్రచారం చేసే వాళ్ళకి, ఈ చర్య పాపం మింగుడు పడటం లేదు. అమరావతిలో ఏం జరుగుతుంది అనే వారు, ఈ ప్రారంభోత్సవానికి వస్తే, అన్నీ చూడవచ్చు.. ఇదే మా ఆహ్వానం...

ఉత్తరప్రదేశ్ ఎంపీ, ఢిల్లీ ఆధర్ కార్డు ఉన్న జీవీఎల్ మరోసారి, ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్మారు. ప్రతి వారం ఒక రోజు, ఆంధ్రా పై విమర్శలు చెయ్యాలనే అమిత్ షా ఒప్పందం మేరకు, ఈ వారం కూడా వచ్చి తన కోటా పూర్తి చేసుకున్నారు. అలాగే, కుటుంబరావు గారి చేత, ఈ వారం తీసుకోవాల్సిన కోటింగ్ తీసుకుని, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయారు. జీవీఎల్ తాజగా చేసిన ఆరోపణ, 602 కోట్ల బడ్జెట్ ఉన్న మత్స్యశాఖలో, 6,700 కోట్లు కుంబకోణం జరిగిందని. దీని పై, కుటుంబరావు విలేకరులతో మాట్లాడుతూ, జీవీఎల్ కి వీకెండ్ కోటింగ్ ఇచ్చి పమించారు. వారానికో అబద్ధం ప్రచారం చేసి డిల్లీ వెళ్లడం జీవీఎల్‌కి రివాజుగా మారిందని ఆయన ఆరోపించారు.

gvl 09092018 2

ఏపీలో గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో మత్స్యశాఖకు కేటాయించిన నిధులు రూ.602 కోట్లు కాగా ఇప్పటి వరకు వ్యయం చేసింది రూ.572 కోట్లని వివరించారు. వాస్తవం ఇదైతే రూ.6,700 కోట్లు గోల్‌మాల్‌ ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఒక వేళ జరిగినట్లు ఆధారాలు చూపితే తిరిగి వసూలు చేసి జీవీఎల్‌కు 10 శాతం నిధులు చెల్లిస్తామన్నారు. ఎప్పటికప్పుడు దొంగ నాటకం ఆడడం, ప్రభుత్వంపై బురద జల్లడం రివాజుగా మారిందని ఆయన ఆరోపించారు. అమరావతి బాండ్లను కేవలం 10 మంది దరఖాస్తు చేసుకుని తీసుకొన్నారని, ఆ కంపెనీల సమగ్ర వివరాలు సంబంధిత రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

gvl 09092018 3

బాండ్లు తీసుకున్నవారి వివరాలు తెలుసుకుని బెదిరించటానికి చేస్తున్న వారి ఆటలు సాగవని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు బ్రాండ్‌ ఇమేజ్‌ తెలిసిన సంస్థల ప్రతినిధులు విశ్వాసంతో అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావడానికి ముందుకు వచ్చారని వివరించారు. అమరావతి బాండ్లలో అవినీతిని నిరూపించిన పక్షంలో 24 గంటల వ్యవధిలో పదవికి రాజీనామా చేస్తానని కుటుంబరావు సవాల్‌ చేశారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో అవినీతి చోటుచేసుకుందని, రాజా ఆఫ్‌ కరప్షన్‌పై చర్చకు సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. జగన్‌ అప్పటి ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టే ‘‘క్విడ్‌ ప్రోకో’’ కింద ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని కుటుంబరావు ఆరోపించారు. జగన్‌ అవినీతిపరుడు కాదని మీ దగ్గర ఆధారాలుంటే.. వాటిని కోర్టులో ప్రవేశపెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు.

పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదల, రాఫెల్‌ ఒప్పందం, ఎస్సీ-ఎస్టీ చట్టంపై అగ్రవర్ణాల వ్యతిరేకత వంటి కీలక అంశాలపై సమాధానాలిచ్చేందుకు బీజేపీ ఇబ్బంది పడింది. శనివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సు ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు. సమావేశం లోపల ఏం జరిగిందో చెప్పిన తర్వాత ఆమెను విలేకరులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభోపన్యాసానికి సంబంధించిన ప్రశ్నలే అడగాలని నిర్మల కోరారు. ముందుగా తాము అడిగిన ప్రశ్నలకు బదులివ్వాలని పాత్రికేయులు డిమాండ్‌ చేశారు.

bjp 90092018 2

బీజేపీ మీడియా విభాగం డిప్యూటీ ఇన్‌ఛార్జ్‌ సంజయ్‌ మయూఖ్‌ జోక్యం చేసుకుని.. సమావేశం పూర్తైనట్లు ప్రకటించారు. వెంటనే నిర్మల కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముందస్తు ఆదేశాలు లేనిదే.. నిర్మల ఇలా పాత్రికేయుల ప్రశ్నల నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించబోరని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మీడియా లేవనెత్తిన ఆ మూడు అంశాలు పార్టీకి ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉన్నాయని.. వాటిని అధిగమించేందుకు అగ్ర నాయకత్వం కృషి చేస్తోందని బీజేపీ అంతర్గత వర్గాలు తెలిపాయి.

bjp 90092018 3

పెట్రోల్‌ను కూడా జీఎస్‌టీ పరిధిలోకి తేవాలని ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పిలుపు రావాలని కేంద్రం ఆశిస్తోంది. ఎస్సీ-ఎస్టీ చట్టానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాల ఉద్యమంతో.. భాజపాకు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్దతు పెరిగే అవకాశం ఉంది. దీంతో అగ్రవర్ణాల డిమాండ్‌ను ఆ పార్టీ తీవ్రంగా పరిగణించడం లేదు. మరోవైపు రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌పై ప్రతిదాడిగా.. హరియాణాలోని భాజపా ప్రభుత్వం రాబర్ట్‌ వాద్రా పై భూ అక్రమాలకు సంబంధించిన కేసు పెట్టింది. రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ ముందుకు వెళ్తే.. వాద్రాపై విచారణ తీవ్రమవుతుందని ఈ చర్యతో భాజపా హెచ్చరించినట్లైంది.

Advertisements

Latest Articles

Most Read