త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించనున్న వ్యూహానికి సంబంధించిన నివేదికను ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అందించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని టీటీడీ కల్యాణ మండపంలో మూడ్రోజుల ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత సమన్వయ బైఠక్‌లు శుక్రవారం మొదలయ్యాయి. ఈ సమావేశాలకు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతోపాటు 32 సంఘ్‌ పరివార్‌ సంస్థలకు చెందిన 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

bjp 01092018

ఈ సందర్భంగానే పార్టీ నివేదికను అందజేసినట్లు సమాచారం. మోదీ ప్రభుత్వ పనితీరుపై విమర్శనాత్మక చర్చ జరిగే అవకాశం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్య సాధనకు మోదీ సర్కారు ఎంత మేరకు తోడ్పడిందో చర్చిస్తారని తెలిసింది. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలు కలిసికట్టుగా, మరింత సమన్వయంగా పనిచేసేందుకు అవసరమైన వ్యూహ రచనను ఈ భేటీలో ఖరారు చేస్తారని అనుకొంటున్నారు. అయితే ఈ సమావేశాలు రాజకీయ చర్చలకు వేదిక కాదని విలేకరులతో మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార ప్రముఖ్‌ అరుణ్‌కుమార్‌ చెప్పారు.

bjp 01092018

మీడియా సమావేశంలో కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేశారు. ఈ సమావేశాలను మంత్రాలయం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ప్రారంభించారు. భద్రతను కట్టుదిట్టం చేయడంతో అనుమతి లేనిదే ఎవరినీ రానివ్వడం లేదు. సమీపంలోని దుకాణాలను మూసివేయించారు. దీంతో ఈ మార్గంలో వెళ్లే వారు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.

 

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నిన్న విజయవాడ వచ్చింది కొడుకు పెళ్లి సంబంధం కోసమా ? అవును అనే ప్రచారం జరుగుతుంది. ఈ రోజు అన్ని దినపత్రికల్లో ఈ వార్తా ప్రముఖంగా ప్రసారం అయ్యింది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కోడలిగా బెజవాడ అమ్మాయి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కుమారస్వామి శుక్రవారం ఉదయం విజయవాడ వచ్చారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు అని అధికారికంగా వెల్లడించినా, ఆయన పర్యటన ముఖ్య ఉద్దేశం కొడుకు నిఖిల్‌ గౌడకు పెళ్లి కుమార్తెను చూడటమేనని తెలిసింది.

kumaraswamy 01092018 2

విజయవాడకు చెందిన ప్రముఖ షూ కంపెనీ యజమాని కోటేశ్వరరావు కుమార్తెను చూసేందుకు కుమారస్వామి సతీసమేతంగా వచ్చినట్లు చెబుతున్నారు. కుమారస్వామి వెంట మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌, రఘురామ కృష్ణంరాజు తదితరులు ఉన్నారు. షూ కంపెనీ యజమాని కోటేశ్వరరావు ఇంట్లోనే కుమారస్వామి దంపతులు భోజనం చేశారు. షూ కంపెనీ యజమాని కుమార్తెకు, కుమారస్వామి కొడుకు నిఖిల్‌కు రెండేళ్ల క్రితమే బెంగళూరులో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. దీంతో వీరిద్దరికీ వివాహం చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగా కుమారస్వామి శుక్రవారం కాబోయే కోడలిని చూసుకునేందుకు విజయవాడ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

kumaraswamy 01092018 3

పెళ్లిచూపుల సమాచారాన్ని ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయంటున్నారు. నిన్న బెంగుళూరులో దేవగౌడ చెప్పిన వ్యాఖ్యలు కూడా, ఈ ప్రచారానికి బలాన్ని ఇస్తున్నాయి. శుక్రవారం బెంగళూరులోని పద్మనాభనగర్‌లో మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి బ్రిటీష్ హైకమిషనర్ డోనాల్డ్ మైక్ అలిస్టర్ వచ్చారు.ఈ సందర్భంగా దేవేగౌడ మీడియాతో మాట్లాడుతూ,కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం విషయంపై అలిస్టర్ తనతో చర్చించారని చెప్పారు. అదే సమయంలో తన తనయుడు, సీఎం కుమారస్వామి, ఆయన సతీమణి అనితా కుమారస్వామి ఏపీలోని విజయవాడకు వెళ్లరని చెప్పారు. ఎందుకు వెళ్లారని మీడియా ప్రశ్నించగా... కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడకు అమ్మాయిని చూసేందుకు వెళ్లారని దేవేగౌడ సమాధానం ఇవ్వడంతో పాటు అందరికీ ఇష్టమైతే పెళ్లి జరిపిస్తామని, ఇది వ్యక్తిగత విషయమని, తాను ఎక్కువగా మాట్లాడనని అన్నారు.

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని ఆసుప‌త్రి సిబ్బంది నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమాని కొడుకు పెళ్లికి వెళుతూ బుధ‌వారం ఉద‌యం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల‌పాలైన అనంత‌రం ఆసుప‌త్రికి తీసుకువ‌చ్చాక నందమూరి హరికృష్ణ మృతి చెందారు. ఆ భౌతికకాయంతో ఆసుప‌త్రి సిబ్బంది ప‌లువురు సెల్ఫీ దిగడం వివాదాస్పదమైంది. హరికృష్ణ మృతదేహంతో ఇద్దరు డ్యూటీ నర్సులు, ఒక వార్డు బాయ్, మరో వార్డ్ గర్ల్ కలిసి న‌వ్వుతూ సెల్ఫీ దిగటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆస్పత్రి సిబ్బంది చర్య పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

selfie 31082018 2

ప్రాణాలు కాపాడాల్సింది పోయి మృత‌దేహాల వ‌ద్ద కూడా ఇంత పిచ్చిగా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై కామినేని ఆసుప‌త్రి యాజమాన్యం స్పందించింది. హరికృష్ణ భౌతికకాయం వద్ద సెల్ఫీ దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొంది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అయితే తాజాగా, తీవ్రంగా గాయపడిన హరికృష్ణతో సెల్ఫీలు దిగిన ఆస్పత్రి సిబ్బందిని కామినేని ఆసుప‌త్రి యాజమాన్యం సస్పెండ్ చేసింది. విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో యాజమాన్యం స్పందించి వారిపై వేటు వేసింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హెచ్ సీఎల్ కల మరికొద్దీ రోజులలో సాకారం కాబోతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో విజయవాడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు అభిముఖంగా మేధ టవర్స్ లో, సెప్టెంబర్ 13న హెచ్ సీఎల్ సంస్థకు చెందిన సోదర సంస్థ స్టేట్ స్ట్రీట్ హెచ్ సీఎల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు కాబోతోంది. మొత్తం 900 మంది ఉద్యోగులతో ఈ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. ఇది పూర్తిగా సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ సంస్థ. ఈ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు రాకను దృష్టిలో ఉంచుకుని హైటెక్ సిటీ ముస్తాబౌతోంది.

hcl 01092018 2

ప్రధాన గ్రాండ్ ఎంట్రన్స్ మార్గాన్ని ఆధునికీకరించారు. హైవే - 16 వెంబడి గ్రాండ్ ఎంట్రన్స్ మార్గంలో పైలాన్ ను ఏర్పాటు చేశారు. హెచ్ సీఎల్ సంస్థ మేధ టవర్లో తన సోదర సంస్థ కోసం 900 సీట్ల ఆక్యుపెన్సీ ఉన్న స్థలాన్ని తీసుకుంది. పూర్తిగా మేధ టవర్లో ఒక బ్లాక్ అన్నమాట. దాదాపుగా నాలుగునెలలుగా మేధ టవర్లో జరుగుతున్న ఇంటీరియర్ పనులు పూర్తయ్యాయి. స్టేట్ స్ట్రీట్ కార్యకలాపాలు నిర్వహించటానికి వీలుగా అధికారుల
ఛాంబర్లు, సమావేశపు హాల్, వర్కింగ్ గ్రూప్లతో పాటు సిబ్బందికి రెస్ట్ రూమ్స్ వంటివి కూడా ఏర్పాటయ్యాయి.

hcl 01092018 3

హెచ్ఎల్ ఏర్పాటుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలిపేందుకు గోప్యత పాటిస్తున్నారు. ఇంకా సమయం ఉండటం వల్ల అధికారికంగా తర్వాత ప్రకటిద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. హెచ్ సీఎల్ సంస్థకు గన్నవరంలోని ఆర్టీసీ జోనల్ డ్రైవింగ్ కాలేజీకి చెందిన 21 ఎకరాలను కేటాయించారు. ఏపీఐఐసీ, హెచ్ సీఎల్ సంస్థల మధ్య సేల్ డీడ్ కూడా జరిగింది. ప్రస్తుతం ఈ స్థలాన్ని హెచ్ స్పీల్ అధికారులు చదును చేశారు. ఇక్కడ
టెక్నాలజీస్ పార్కును ఏర్పాటు చేయనుంది. ఇక్కడ హై రైజ్ భవనం నిర్మించిన తర్వాత స్థానికంగా ఉన్న పట్టభద్రులకు ఉద్యోగాలలో అవకాశం కల్పిస్తుంది.

hcl 01092018 4

ప్రస్తుతం మేథ టవర్లో కార్యకలాపాలు ప్రారంభించే తన సోదర సంస్థలో మాత్రం పాత ఉద్యోగులే ఉంటారని సమాచారం. హెచ్ సీఎల్ సోదర సంస్థ మేధలో కాలు పెట్టనుండటంతో ఐటీ పార్క్కే కళ వచ్చింది. మేధ టవర్ పూర్తిగా ఐటీ కంపెనీలతో నిండిపోయింది. ఐదేళ్ల కిందట ఐటీ కంపెనీలు లేక వెలవెలపోయింది. రెండు మూడు చిన్న కంపెనీలు తప్పితే ఖాళీగా ఉండేది. అలాంటిది అనేక ఐటీ కంపెనీలు ఏర్పాటు కావటంతో పాటు బిగ్ ఐటీ కంపెనీగా స్టేట్ స్ట్రీట్ ' సంస్థ రంగ ప్రవేశం చేయటంతో కేసరపల్లికి మహర్దశ పట్టుకుంది.

Advertisements

Latest Articles

Most Read