పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తన రెండో విడత ప్రజాపోరాట యాత్ర కార్యక్రమాన్ని ఈ నెల 25 నుంచి ప్రారంబించిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా తెలుగుదేశం నాయకుల పై, చంద్రబాబు పై విరుచుకుపడుతూ, బీజేపీ, జగన్ జోలికి వెళ్ళకుండా యాత్ర కొనసాగుతుంది. అయితే ఈ రోజుతెల్లవారుజామున జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ జగన్నాధపురంలోని నరసింహస్వామి ఆలయంలో రహస్య పూజలు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 4.30 వరకు గుడిలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారని అర్చకులు తెలిపారు.

pk 0110201 1

ఈ పూజలు జరుపుతున్నట్టు ముందుగా ఎవరికీ తెలియదు. ఎక్కడికి వెళ్ళినా హంగామా హంగామా చేసి, తన సొంత టీవీలో లైవ్ లు ఇచ్చే పవన్, ఈ పర్యటన మాత్రం అత్యంత గోప్యంగా ఉంచారు. అయితే గుడిలో పూజలు చేసిన అర్చకులు బయటకు చెప్పే వరకు ఎవరికీ తెలియదు. పవన్, అసలు రహస్య పూజలు ఎందుకు చేశారన్న విషయం ఏపీలో చర్చనీయాంశమైంది. ఇదే ఆలయంలోనే పవన్ కళ్యాణ్ తాంత్రిక పూజలు చేశారని, గతంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దాని పై అప్పట్లో తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. ఆ గుడి అంటే పవన్ కు చాలా ఇష్టమనే, అక్కడ తాంత్రిక పూజలు చేస్తారని, ఇది వరుకే కత్తి మహేష్ చేసిన గోల అందరికీ తెలిసిందే.

pk 0110201 1

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పూజలు ఎందుకు నిర్వహించారన్న విషయం తెలియరాలేదు. గత రెండు రోజుల నుంచి, నన్ను చంపటానికి ప్లాన్ చేసారు, నా ఇంటి పై డ్రోన్ లు తిప్పారు, అంటూ పవన్ చెప్పిన నేపధ్యంలో, తనకు ఎటువంటి ప్రాణ హాని జరగకుండా, ఈ పూజలు చేసారనే ప్రచారం జరుగుతుంది. నిన్న ముఖ్యమంత్రి సెక్యూరిటీ పమిస్తాం అంటే, నాకు ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. పవన్‌ ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ సోమవారం ఏపీలో కలిసిన విలీనమండలాల్లో పర్యటించనున్నారు. ముంపుకు గురౌతున్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలోని పోలవరం నిర్వాసితులతో పవన్ సమావేశంలో పాల్గొననున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్‌చంద్ర పునేఠా, ఆదివారం సచివాలయంలో దినేష్‌కుమార్‌ నుంచి బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1984వ ఐఏఎస్‌ అధికారిగా ఏపీకి వచ్చానని మొదటిసారిగా రాజంపేటలో సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టానన్నారు. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ప్రజలకు సేవలందించానని గత రెండేళ్లుగా సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

new cs 01102018

ప్రధాన కార్యదర్శి అనే పదవి పెనుసవాళ్లతో కూడినదని, నూతన రాష్ట్రం అయినందున సహజంగా అనేక ఇబ్బందులుంటాయన్నారు. వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల జీవన విధానం మరింతగా మెరుగు పడే రీతిలో అన్ని కుటుంబాలు ఆనందంగా ఉండేందుకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు కేంద్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు చేరేలా పనిచేస్తానన్నారు. ఎప్పటికప్పుడు కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లతో సమన్వయ పరుచుకుంటూ ఒక బృందంగా ఏర్పడి మెరుగైన ఫలితాలు రాబడతామన్నారు. మొదటి నుంచి పేదలకు ఇళ్లు, ఇతర పథకాలను అందేలా శ్రద్ధ వహించామన్నారు.
పలువురి అభినందనలు..

new cs 01102018

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనిల్‌చంద్రపునేఠను పలువురు అభినందించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన అనిల్‌చంద్రపునేఠను పలువురు అభినందనలతో ముంచెత్తారు. శ్రీశైలం, తిరుపతి నుంచి వచ్చిన వేదపండితులు సీఎస్‌ను ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌, గుంటూరు,చిత్తూరు జిల్లాల కలెక్టర్లు కోన శశిధర్‌, ప్రద్యుమ్న, ప్రణాళికాశాఖ కార్యదర్శి సంజ§్‌ుగుప్త, ఉద్యానవన శాఖ కమిషనర్‌ చిరంజీవిచౌదరి, ఐఏఎస్‌ అధికారి విజయరామరావు తదితరులు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.అలాగే 19 ఉద్యోగ సంఘాల నాయకులు కేవీ కృష్ణయ్య, అజ§్‌ుబాబు, తిరుపతి ఎలైట్‌ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ చైర్మన్‌ కె.బాలసుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు.

తెలంగాణా ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో, కేంద్రం తనకు బాగా అలవాటు అయిన ఆట ఆడుతుంది. కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లో చేసిన విధంగానే, తెలంగాణాలో విపక్ష నేతల పై, ఐటి, ఈడీ దాడులు చేపిస్తుంది. దీనికి కెసిఆర్ సంపూర్ణ సహకారం అందిస్తూ ఉండగా, హైదరాబాద్ మీడియా పూర్తిగా కెసిఆర్ కి లొంగిపోయింది. ఒక పక్క రేవంత్ ఇంటి పై ఐటి దాడులు జరుగుతూ ఉండగానే, కొన్ని ఫేక్ పత్రాలు పుట్టించి, ఇవి రేవంత్ ఆస్తులు అని, ఇవి రేవంత్ బ్యాంక్ ఎకౌంటు నెంబర్లు అని, రేవంత్ కి 1000 కోట్ల ఆస్తి ఉందని, రేవంత్ ఇంట్లో రెండు కోట్లు పట్టుకున్నారని, ఇలా హైదరాబాద్ మీడియా రకరకాల ప్రచారాలు చేసింది. చివరకు 50 గంటల సోదాలు తరువాత, ఒక్క కాగితం ముక్క కూడా ఐటి అధికారులు పట్టుకోలేదు.

cbn arrest 30092018 2

కనీసం ఇది రేవంత్ చేసిన తప్పు, ఇందుకు మేము సోదాలు చేసాం అని మీడియాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇది ఇలా ఉంటే, రేవంత్ ని మరోసారి అక్టోబరు 3వ తేదీన విచారణకు రావాలని రేవంత్‌కు నోటీసు ఇచ్చారు. బషీర్‌బాగ్‌లోని ఆయకార్‌ భవన్‌లో అధికారుల ఎదుట విచారణ ఉంటుందని, దానికి హాజరు కావాలని సూచించారు. అయితే, ఇదే వార్తా పట్టుకుని, దీన్ని చంద్రబాబుకి లింక్ చేస్తూ, హైదరాబాద్ మీడియా కవర్ చేసుకుంటుంది. ఎప్పుడో కొట్టేసిన ఓటు కు నోటు కేసుని మళ్ళీ ప్రచారం చేస్తూ, ఇది రేవంత్ వర్సెస్ కెసిఆర్ ఫైట్ గా తెలంగాణా సమాజం చూస్తుంది కాబట్టి, దీన్ని డైవార్ట్ చేసి, రేవంత్ కి వచ్చిన హైప్ తగ్గించటానికి, మళ్ళీ దీన్ని చంద్రబాబు వెర్సెస్ కెసిఆర్ ఫైట్ గా చిత్రీకరిస్తుంది హైదరబాద్ మీడియా..

cbn arrest 30092018 3

ఇందులో భాగంగానే రేవంత్ అక్టోబర్ 3 న అరెస్ట్ అవ్వటం ఖాయమని, దీనికి ఓటు కు నోటు కేసు కారణమని, తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. అంతే కాదు, రేవంత్ అరెస్ట్ సాకుగా చూపి, అక్టోబర్ 8 న చంద్రబాబు ఇళ్ళ పై ఏక కాలంలో ఐటి, ఈడీ దాడులు జరుగుతాయి అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టింది హైదరాబాద్ మీడియా. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై, ఇతర ఆస్తులపై దాడులు చేయబోతున్నారని కొన్ని పత్రికలు, సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ అన్నట్టు, రేవంత్, చంద్రబాబు బినామీ అని ప్రచారం మొదలు పెట్టారు. దీనికి కారణం, కెసిఆర్ ని ఎన్నికల్లో గట్టు ఎక్కించటానికి. ఎన్నికలు కెసిఆర్ పరిపాలన మీద కాకుండా, కెసిఆర్ వర్సెస్ చంద్రబాబుగా మార్చటానికి, హైదరాబాద్ మీడియా తెగ తాపత్రయ పడుతుంది. అందుకే అసలు కేసు లేని ఓటు కు నోటు అంటూ హడావిడి చేస్తున్నారు. ఇలాంటి పిచ్చ కేసులు పట్టుకుని చంద్రబాబు లాంటి వాడి పైకి వస్తే, ఏమి అవుతుందో మోడీకి బాగా తెలుసు. హైదరాబాద్ మీడియా, ఇప్పటికైనా కొంచెం వెన్నుముక తెచ్చుకుని, నిజాలు రాయాలని మనవి.

2019 ఎన్నికలే ధ్యేయంగా పెట్టుకొని అధికారం చేజిక్కించుకోవడానికి ప్రతిపక్షాలు,ప్రత్యేకించి కేంద్రం ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పెట్టడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.ఇందుకు నిదర్శనం ఆదివారం రాష్ట్ర బిజేపి చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ విజయవాడలో ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ మరో రెండు మూడు నెలల్లో సీఎం బాబు పదవి ఊడడం ఖాయమని ప్రకటించడంతో కేంద్రం బాబుపై చేస్తున్న కుట్రలు బలపడుతున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో బిజేపి ఎంపీ ఆపార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్‌ నరసింహరావు,ఎమ్మెల్సీ వీర్రాజు తదితరులు పటు సందర్భాల్లో బాబును జైల్‌కు పంపుతామని,సినిమా చూపిస్తామని ప్రకటించడం విధితమే. దీంతో రాష్ట్రంలో కలకలం రేకెత్తిస్తోంది.

cbn 01102018 2

ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎ.రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటి, ఈడి దాడులు, ఫోరెన్సిక్‌ నిపుణులు స్టేట్‌మెంట్‌ రికార్డులు నమోదు పై కేంద్రం చేస్తున్న వ్యూహాం బాబుపై చర్యలకేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బాబు ఎన్డీయేతో తెగదెంపులు చేసుకోవడం,కేంద్రంపై జాతీయస్థాయిలో విపక్షాలను ఏకంచేసి కేంద్రంపై బాబు ఢీ అంటే ఢీ అనడం మిగిలిన విపక్షాలను కేంద్రంపై ఎదురించే విధంగా పావులు కదిపి సఫలీకృతులైయ్యారు.దీంతో కేంద్రం ఎనిమిది నెలలుగా గుర్రుమంటుంది.అయితే కేంద్రం వ్యవహరిస్తున్న విధానాలతో సీఎం బాబు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి తనను కేంద్రం ఏదో చేయబోతుందని,కుట్ర పన్నిందని పలు బహిరంగ సభల్లో ప్రకటించారు.అయినా బాబు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌లు కేంద్రం వ్యూహాలకు భయపడకుండా కేంద్రంపై మరింత దూకుడు పెంచారు.అంతేకాకుండా బాబు లోకేష్‌లు బిజేపి,వైసీపీ,జనసేన పార్టీనేతలు చేస్తున్న ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇస్తూ తారాస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

cbn 01102018 3

ఇక ప్రత్యేకహోదా,విభజన చట్టం హామీల అమల్లో కేంద్రం విఫలమై,ఇచ్చిన హామీలను నిలుపుకోలేదని ధర్మపోరాటం పేరిట రాప్ట్రవ్యాప్తంగా టిడిపి చేపట్టిన దీక్షలు,సభలు,ఆందోళన కార్యక్రమాలతో ఏపి ప్రజలు కేంద్రంపై మండిపడుతున్నారు.రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీ కంటే ప్రస్తుతం బిజేపిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.దీంతో ఎటు తిరిగి బాబుకు దూకుడు కళ్ళెం వేయని పక్షంతో రాష్ట్రంలో బిజేపి పరిస్థితి ఘోరంగా ఉంటుందని,దేశవ్యాప్తంగా విపక్షాలను ఐక్యం చేసిన బాబు వ్యూహాలను దెబ్బతీసే విధంగానే కేంద్రం వ్యూహాం సిద్ధం చేసిన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు వైసీపీ,జనసేనలు చేస్తున్న ఆరోపణలు తరహాలోనే బిజేపి నేతలు ఆరోపణలు చేయడం రేవంత్‌,బాబ్లీ సంఘటనలతో పాటు పలు నిరూపణకాని కేసులతో బాబును ఇరకాటంలో పెట్టి 2019ఎన్నికల్లో ప్రతిపక్షాలతోపాటు బిజేపి లబ్దిపొందే వ్యూహాంలో ఉన్నారని వినికిడి.బాబు కూడా వారి వ్యూహాలకు ప్రతివ్యూహాన్ని పన్ని అన్ని ఏర్పాట్లలో ఉంటూ,పార్టీ శ్రేణులను అన్నింటిని ఎదుర్కొవడానికి సర్వం సిద్ధం చేశారు.

Advertisements

Latest Articles

Most Read