ఇద్దరూ ఏపిలో ప్రతిపక్ష నాయకులు అని చెప్పుకు తిరుగుతున్నారు... తీరా చూస్తే ఇక్కడ ప్రజా సమస్యల పై మాత్రం వీరికి పట్టదు.. ఒకతనేమో సియం అయ్యేదాకా ఏమి చెయ్యను అంటాడు.. ఇంకో అతను, చంద్రబాబు మళ్ళీ సియం అవ్వకుండా చెయ్యటమే నా పని అంటాడు... వీళ్ళ ఇద్దరు చిందులు గత పది రోజులుగా వ్యక్తిగతంగా వెళ్ళిపోయాయి. ఒకాయన చింతమనేని నామస్మరణ చేస్తుంటే, ఇంకో అతను లోకేష్ నామస్మరణ చేస్తున్నాడు. వీరికి తన పని తాను చేసుకుపోయే చంద్రబాబే సాఫ్ట్ టార్గెట్. కెసిఆర్ ఆంధ్రా వారి పై అన్ని మాటలు అంటున్నా నోరు మెదపరు. 7 మండలాలు మన హక్కు, సీలేరు ప్రాజెక్ట్ మనది, మన విద్యుత్ వాడుకుని మనల్నే కెసిఆర్ తిడుతుంటే, ఈ ఇద్దరికీ కెసిఆర్ పేరు తలిచే దమ్ము లేదు..

jagn 09102018 2

కెసిఆర్ సంగతి సరే.. ఎందుకంటే వీళ్ళ బ్రతుకు హైదరాబాద్ లో బ్రతకాలి కాబట్టి, భయపడుతున్నారు అనుకోవచ్చు.. మరి కేంద్రం చేస్తున్న అన్యాయం పై ఎందుకు మాట్లడరు ? ఒకరికి కేసుల భయం, మరొకరికి పెన్ డ్రైవ్ ల భయమా ? నిన్న కేంద్రం, మన రాష్ట్ర ప్రజలని ఎలా కవ్వించిందో అందరూ చూసారు.. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారం.. తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల(అవిభక్త) అభివృద్ధికి ప్రత్యేక సాయం కింద 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తాజాగా రూ.450 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు మొండిచెయ్యి చూపించింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారమే.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లను కేంద్రం ఇవ్వాల్సి ఉంది.

jagn 09102018 3

2017-18 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ.350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకుంది. కేంద్రం చర్యపై రాష్ట్రం ఇప్పటికే తీవ్ర ఆందోళన, నిరసన తెలియజేసింది. దీనిపై చీమ కుట్టినట్టయినా లేని కేంద్రం మరోసారి ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేసింది. 2018-19 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు పైసా ఇవ్వకపోవడం, 2017-18కి సంబంధించిన బకాయిలు రూ.350 కోట్ల గురించీ పట్టించుకోకపోవడం కేంద్రం కక్ష సాధింపునకు నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ఇంత జరుగుతున్నా, ప్రతిపక్షం అని చెప్పుకునే జగన్, పవన్, ఇలాంటి విషయం పై కేంద్రాన్ని నిలదియ్యాలి అంటే భయం.. కేంద్రం పై ఆందోళన చెయ్యాలి అంటే భయం.. కాని కుల గొడవలు పెట్టటానికి మాత్రం చింతమనేని నామస్మరణ మాత్రం చేస్తారు.. వీళ్ళు దమ్ముల గురించి మాట్లడతారు....

మంగళగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. జగన్ మెప్పు కోసం ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెయ్యని ప్రయత్నమే లేదు. చీటికీ మాటికీ కోర్ట్ లో కేసులు వేసి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే డ్యూటీ తీసుకుని, ప్రతిసారి జగన్ దగ్గర మార్కులు కొట్టేస్తూ ఉంటాడు. అయితే ప్రతి సారి, కోర్ట్ ఆ కేసులు కొట్టేసింది అనుకోండి అది వేరే విషయం. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అమరావతి దగ్గర నుంచి, ఫైబర్ గ్రిడ్ దాకా, అన్నిటి పై, కోర్ట్ ల్లో కేసులు వేసి, కావాలని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పార్టీకి, జగన్‌కు ఆర్కే తొలి నుంచి వీరవిధేయుడుగా వ్యవహరిస్తూ వచ్చారు.

rk 09102018

ఓదార్పు యాత్రల సమయంలో ఎంతో వ్యయం చేసుకొని రాష్ట్రమంతటా పార్టీ అధినేత జగన్‌ను నీడలా వెన్నంటి పయనించారు. అంతేకాదు, ఏ మాత్రం రాజీ పడకుండా అధికార పార్టీపై ఎన్నో పోరాటాలు చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ విషయం వచ్చే సరికి, మొదట్లో తానే ఈ సారి పోటీ చేయలేనని, కొంత ఆర్థిక ఇబ్బందులు మూలంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని జగన్‌కు చెప్పగా, జగన్ ఏ మాత్రం మాట్లాడకుండా, మౌనం వహించడమే తప్ప తిరిగి పోటీ చేయాలని ఒత్తిడి చేయలేదు. ఆర్కే మాత్రం, జగన్ ఏమన్నా సహాయం చేస్తాడేమో అని అనుకున్నాడు. కాని, జగన్ మాత్రం మొండి చెయ్య చూపించాడు...

rk 09102018

దీంతో, జగన్ ని నమ్ముకుంటే పని అవ్వడాని, అప్పో సొప్పో చేసి ఆర్థిక వనరులు సమకూర్చుకున్న ఆర్కే, కొద్ది రోజుల క్రితం తిరిగి తాను పోటీకి సిద్ధమని చెప్పగా, నీ పై నియోజకవర్గంలో అసమ్మతి ఉంది, వారందరినీ కలుపుకొని వస్తేనే టిక్కెట్‌ ఇస్తానంటూ పరోక్షంగా టిక్కెట్‌ లేదని చెప్పేసినట్లు తెలిసింది. దీంతో ఆర్కే షాక్ అయ్యాడు. అందరిలా 20-30 కోట్లు ఖర్చ్ పెట్టకపోయినా, నేను నెగ్గుకు రాగాలనని, బలమైన ప్రత్యర్ధి అక్కడ లేరని, జగన్ ను ఎంత బ్రతిమిలాడినా, చూద్దాములే, ముందు అందరినీ కలుపుకు వెళ్ళు అని చెప్పటంతో, ఆర్కే షాక్ అయ్యారు. ఇటీవల, బీజేపీ, జనసేనతో అంతర్గత పొత్తులో భాగంగా, కొన్ని చోట్ల బలమైన అభ్యర్ధులు ఉన్నా, వాళ్ళను తీసి, బలహీనమైన అభ్యర్ధులను జగన్ పెట్టటం చూస్తుంటే, మంగళగిరి కూడా, బీజేపీకో, జనసేనకో ఇచ్చి, స్నేహపూర్వక పోటీ చేసే ఆలోచనలో జగన ఉన్నట్టు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. చంద్రబాబుకు గ్లోబర్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ అవార్డు దక్కింది. డాక్టర్ స్వామినాథన్‌ కమిటీ చంద్రబాబును ఎంపిక చేసింది. ఈనెల 24న ఢిల్లీలో చంద్రబాబుకు అవార్డు అందజేయనున్నారు. ఈ అవార్డును కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌, చంద్రబాబకు అందజేయనున్నారు. వ్యవసాయ విధానం, రైతులకు ప్రోత్సాహాలు, పరిశోధన, పంటల అభివృద్ధి, నాయకత్వం అంశాలను కమిటీ పరిశీలించింది. సాగునీరు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటెంగ్‌ వంటి అంశాలను కూడా కమిటీ పరిగణలోకి తసుకుంది. అన్ని అంశాల్లో ఏపీ అగ్రగామిగా ఉన్నట్లు కమిటీ తేల్చింది.

swaminathan 08102018 2

స్వామినాథన్‌ ఎవరు..? ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌ స్వామినాథన్‌ను హరితక్రాంతికి మార్గదర్శకుడిగా రైతులు కొలుస్తారు. తమిళనాడుకు చెందిన ఆయన స్వతహాగా జన్యుశాస్త్రవేత్త. 1966లో మెక్సికోకు చెందిన విత్తనాన్ని పంజాబ్‌కు తెచ్చి దేశీయ రకాలుగా మార్చారు. అత్యధికంగా గోధుమ పండే విత్తనాన్ని సృష్టించారు. అప్పటి యూపీఏ సర్కారు రైతుల స్థితిగతు లపై ఆరా తీయటానికి వెళ్లినప్పుడు స్వామినాథన్‌ గురించి తెలుసుకున్నది. అన్నదాతకు అండగా నిలిచేలా 2004 నవంబర్‌ 18న స్వామినాథన్‌ కమిషన్‌ను వేసింది. ఈ కమి షన్‌ పలు సిఫారసులు చేస్తూ ఐదు రిపోర్టులను కేంద్రానికి సమర్పించింది.

swaminathan 08102018 3

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా, స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చెయ్యాలని గట్టిగా కోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత, రైతులకి రుణ మాఫీ దగ్గర నుంచి, నీటిని సమర్ధవంతంగా వినియోగించి పంటలు కాపాడే దాకా అనేక కార్యక్రమాలు చేసారు. రైతుల కోసం ఎన్నో పధకాలు ప్రవేశ పెట్టారు. యాంత్రీకరణ, టెక్నాలజీ ఉపయోగించేలా రైతులని ప్రోత్సహిస్తున్నారు. 52 ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు పూర్తి చెస్ లక్ష్యంతో పనులు మొదలు పెట్టి, ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేసారు. మరో పక్క పోలవరం నిర్మాణం కోసం శ్రమిస్తున్నారు. నీరు-చెట్టు,. నీరు-ప్రగతి, పంట సంజీవిని (వ్యవసాయ చెరువులు), పంట రక్ష (రెయిన్ గన్స్),. ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం క్రింద బోరు బావులు వంటి కార్యక్రమాల ద్వారా సుస్థిర. భూగర్భ, ఉపరితల నీటి నిర్వహణ కోసం పనిచేస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు కాబట్టే, సాక్షాత్తు, స్వామినాథన్‌ కమిటీనే చంద్రబాబు కృషి గుర్తించింది. ఇక ఏడవటానికి జీవీఎల్, జగన్, పవన్ రెడీ అవ్వండి.. ఆయన చేసే మంచి పనులకు దిష్టి తగలకుండా ఉంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితుడు, ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు కుమారుడు శ్రీహర్ష మరణ వార్త పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కొమ్మినేని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఏకైక కుమారుడు శ్రీహర్ష (32) కెనడాలో రెండు రోజుల కిందట మృతిచెందారు. రెండేళ్ల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న శ్రీహర్ష కెనడాలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కొద్ది రోజుల క్రితమే కొమ్మినేని శ్రీనివాసరావు దంపతులు కెనడాకు వెళ్లారు.

kommineni 08102018 2

అయితే, ఆరోగ్యం మరింత విషమించడంతో శ్రీహర్ష కెనడాలోనే మృతి చెందారు. దీంతో కొమ్మినేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు కొమ్మినేనిని ఫోన్‌లో పరామర్శిస్తున్నారు. అలాగే, పాత్రికేయుడు భోగాది వెంకటరాయుడి భార్య రైలు ప్రమాదంలో మృతిచెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తంచేశారు. వెంకటరాయుడు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇద్దరు సీనియర్‌ పాత్రికేయులు తమ కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు.

kommineni 08102018 3

మంత్రి నారా లోకేష్ కూడా, సంతాపం తెలిపారు. ఒకే రోజు ఇద్ద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల కుటుంబానికి తీర‌ని శోకం మిగ‌ల‌డం త‌న‌ను తీవ్రంగా క‌ల‌చి వేసింద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ, పంచాయ‌తీరాజ్‌శాఖా మంత్రి నారా లోకేష్ విచారం వ్య‌క్తం చేశారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, రాజ‌కీయ విశ్లేష‌కులు కొమ్మినేని శ్రీనివాస‌రావు త‌న‌యుడు కొమ్మినేని శ్రీహ‌ర్ష మ‌ర‌ణ వార్త విని తాను దిగ్భ్రాంతికి గుర‌య్యాన‌ని, కొడుకును క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి బ‌లిగొన‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని లోకేష్ విచారం వ్య‌క్తం చేశారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ బోగాది స‌తీమ‌ణి మృతి ప‌ట్ల విచారం.. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ బోగాది వెంక‌ట‌రాయుడు స‌తీమ‌ణి రైలు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డం ప‌ట్ల మంత్రి లోకేష్ త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని తెలియ‌జేశారు.

Advertisements

Latest Articles

Most Read