ఉత్తర కోస్తా, ఒడిశాను తిత్లీ తుపాను వణికిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నఈ తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. రేపు తెల్లవారుజామున 4 నుంచి 6 గంట‌ల మ‌ధ్య శ్రీకాకుళం జిల్లా క‌ళింగ‌ప‌ట్నం-సంతబొమ్మాళి మ‌ధ్య తీరం దాటే అవ‌కాశం ఉందని ఆర్టీజీఎస్‌ ద్వారా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల్లో ఏడో నంబర్‌.. విశాఖ, గంగవరం ఓడరేవుల్లో ఐదో నంబర్‌ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. తిత్లీ తుపాను కళింగపట్నానికి 230కి.మీ, గోపాల్‌పూర్‌కు 280 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

srikakulam 10102018 2

దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంబడి 100 నుంచి 130 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని, గాలుల తీవ్రత 145 కి.మీ వరకు పెరిగే అవకాశముందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు రాత్రి, రేపు ఉత్తరాంధ్రలో 15 నుంచి 25 సెంటీమీట‌ర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. అల‌లు 7 మీటర్ల ఎత్తువ‌ర‌కు ఎగ‌సిప‌డే అవ‌కాశాలున్నాయని.. ప్రజ‌లు స‌ముద్ర తీరం వ‌ద్దకు వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, క‌విటి, మంద‌స‌, ప‌లాస‌, వ‌జ్రపుకొత్తూరు, సంత‌బొమ్మాళి, శ్రీకాకుళం, లావేరు, ర‌ణ‌స్థలం, పాత‌ప‌ట్నం, న‌ర‌స‌న్నపేట‌, పోలాకి, గార‌, ఎచ్చెర్ల‌, ఆమదాల‌వ‌ల‌స‌, పొందూరు, సంత‌క‌విటి, జి.సిగడాం మండలాలు..

srikakulam 10102018 3

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చీపురుప‌ల్లి, పూస‌పాటిరేగ‌, గ‌రివిడి, నెల్లిమ‌ర్ల‌, గుర్ల, విజ‌యన‌గ‌రం, డెంకాడ‌, భోగాపురం, గంట్యాడ‌, బొండ‌ప‌ల్లి, గ‌జ‌ప‌తిన‌గ‌రం, ద‌త్తి రాజేరు.. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో బీమునిప‌ట్నం, ఆనంద‌పురం, ప‌ద్మనాభం, విశాఖ‌ప‌ట్నం అర్బన్‌, విశాఖ రూర‌ల్‌ మండలాలపై ప్రభావం పడే అవకాశముంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో సికింద్రాబాద్‌-హవ్‌డా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్‌, బిలాస్‌పూర్‌ మీదుగా దారి మళ్లించారు. తిత్లీ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ ధనంజయరెడ్డి చెప్పారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే జిల్లా కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందించాలని ఆయన సూచించారు. 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున రేపు సాయంత్రం వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇవాళ ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న సీఎం... అక్కడి నుంచి హెలికాప్టర్లో గుమ్మఘట్ట మండలానికి చేరుకున్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి బీటీ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరించారు. ఆ తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష నీటి కుంటలు జిల్లాలో పూర్తైన సందర్భంగా లక్షవ నీటి కుంటను సందర్శించారు.

cvbn 10102018

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాను కరవు నుంచి దూరం చేసేందుకు ప్రత్యేకంగా చొరవ చూపుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే లక్ష నీటి కుంటలు పూర్తి చేయడం, 5లక్షల ఎకరాలకు బిందు, తుంపర సేద్య పరికరాలు అందించామని చెప్పారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలోకి తీసుకురావాలని తాము ఎంతో కృషి చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని నిలదీసే తాము ఎన్డీయే నుంచి వైదొలిగామని... అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల్లో అభివృద్ధి నిమిత్తం విడుదల చేసిన నిధులను సైతం కేంద్రం వెనక్కి తీసుకుందని.. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు.

cvbn 10102018

మన రాష్ట్రంలో రెండుమూడు పార్టీలున్నాయని, అందులో ఒకటి వైసీపీ అని.. అది అవినీతి పార్టీ అని ఆయన విమర్శించారు. అడ్డంగా దొరికారని, సీబీఐ ఎంక్వైరీలు ఎదుర్కున్నారని.. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లు పట్టుకుని కేసుల మాఫీ కోసం ప్రయత్నిస్తున్నారని.. రాష్ట్ర ప్రయోజనాలు ఏ మాత్రం పట్టవని వైసీపీపై పరోక్ష విమర్శలు చేశారు. వైసీపీ ఎంపీలు ఎన్నికలు రావని తెలిసి రాజీనామా చేశారని సీఎం ఆరోపించారు. జైలుకెళ్తారనే భయంతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని జగన్‌ను విమర్శించారు. జనసేన తరపున పవన్ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ వేశారని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబు పవన్‌ను ప్రశ్నించారు. తనకు మెచ్యూరిటీ లేదని.. తెలంగాణ సీఎంకు మెచ్యూరిటీ ఉందని మోదీ అన్నారని, ఎన్డీఏ నుంచి బయటకు రాగానే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో మహాకూటమిలో చేరితే విమర్శిస్తున్నారని, టీడీపీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ అని.. ఎవరికి ఇబ్బంది ఉన్నా అందరినీ ఆదుకుంటుందని చంద్రబాబు చెప్పారు.

అనుభవం లేదు, అవగాహన లేదు, ఏం చేయాలో తెలియదని చెప్పే జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఏ అర్హతతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఎక్సైజ్‌ మంత్రి కేఎస్‌ జవహర్‌ ప్రశ్నించారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతారో తెలియని ఆయన.. పౌరుషం గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ నాయకులను పంచెలు ఊడేలా కొట్టాలని పిలుపిచ్చిన ఆయనకు.. అదే పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసినప్పుడు ఆ పౌరుషం ఏమైందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం పవన్‌కు బహిరంగ లేఖ రాశారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌ను తాట తీస్తానని హెచ్చరించి.. రాజకీయ లబ్ధి కోసం ఆయనతోనే మిలాఖత్‌ అయ్యారని విమర్శించారు.

pk 1102018 2

‘బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై ప్రతి 15 నిమిషాలకు ఒక అత్యాచారం, హత్య జరుగుతున్నాయి. గత నాలుగున్నరేళ్లలో 52 వేల అత్యాచారాలు జరిగాయి. 11 మందిని కాల్చి చంపారు. వీటిపై బీజేపీని మీరెందుకు ప్రశ్నించడం లేదు? ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టాన్ని కేంద్రం నీరుగార్చాలని ప్రయత్నించినప్పుడు మీరెక్కడకు వెళ్లారో చెప్పాలి. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కోసం కేటాయించిన రూ.22 వేల కోట్లను దారి మళ్లించారు. ఇడుపులపాయకు రోడ్లు వేసుకున్నారు. గిరిజనులకే సొంతమైన 1.6 లక్షల ఎకరాలను వైఎస్‌ అల్లుడికి కట్టబెట్టిన విషయాలు తెలియవా? అసలు దళితులంటేనే గిట్టని జగన్‌ వ్యక్తిగతంగా మిత్రుడు ఎలా అయ్యారో మీరే చెప్పాలి.

pk 1102018 3

దళితుల అభివృద్ధి కోసం నాలుగున్నరేళ్లలో రూ.48 వేల కోట్లు ఖర్చుచేసిన టీడీపీ శత్రువు ఎలా అయిందో కూడా వివరించాలి. అధికారంపై ఆశ లేదంటూనే, నన్ను సీఎంను చేయాలని ప్రజలను వేడుకోవడాన్ని ఏమనాలోచెప్పండి. ప్రశ్నించడానికే వచ్చానంటూ ఎప్పుడూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. కేసీఆర్‌ను బాబాయిగా, కవితను చెల్లెమ్మగా, కేసీఆర్‌ కుటుంబమే దేవుడు ఇచ్చిన గొప్ప వరంలా మీరు అభివర్ణించడం దేనికి సంకేతం’ అని మంత్రి లేఖలో ప్రశ్నించారు.

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అధికార టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. ఏంది స్వామీ ఇది.. మీదగ్గరేమైనా అక్షయపాత్ర ఉందా లేదా ఆంధ్రా కోసం ప్రత్యేకంగా కరెన్సీని ముద్రించే ప్రింటింగ్ మిషన్ ఉందా అంటూ ప్రశ్నించారు. పైగా ఈ ప్రశ్నకు ఇపుడే సమాధానం చెప్పాలంటూ వేదికపై నిలదీశారు. దీంతో వేదికపై వున్నంతవారితో పాటు సభకు వచ్చిన ప్రజలు నవ్వుల్లో మునిగిపోయారు. చంద్రబాబును పొగుడుతూ, ప్రశ్నలు వేస్తూ, జేసి హాల్ చల్ చేసారు. ఎప్పటిలాగే తన సహజ శైలితో అందరినీ ఆకట్టుకున్నారు.

jc 10102018

చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించి, బైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబును ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. నదుల అనుసంధానం గురించి చాలాకాలంగా విన్నామని, ఏ మొగోడు చేయలేదని... కానీ దాన్ని చంద్రబాబు కార్యాచరణలో చేసి చూపించారని జేసీ ప్రశంసించారు. నదుల అనుసంధానం వల్లే బైరవానితిప్ప ప్రాజెక్టుకు నీళ్లొస్తున్నాయని, అందుకు చంద్రబాబుకు జేసీ ధన్యవాదాలు తెలిపారు.

jc 10102018

అలాగే, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి కేంద్రం నిధులివ్వకుండా మొండిచేయి చూపినా.. పనులు చేస్తున్నారని.. డబ్బులెక్కడ నుంచి వస్తున్నాయని.. మీ దగ్గరేమైనా అక్షయ పాత్ర ఉందా లేక ఆంధ్రా కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మిషన్ పెట్టారా.. ఈ రహస్యం మాత్రం చెప్పాల్సిందేనని జేసీ చంద్రబాబును ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. అయితే, పోలవరం పై ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది. దీని కోసం మన బడ్జెట్ లో, 9 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కేంద్రం సకాలంలో డబ్బులు ఇవ్వకపోవటంతో మనమే ముందు ఖర్చు పెట్టి, తరువాత కేంద్రం నుంచి తీసుకుంటున్నాం. కాని ఇక్కడ కూడా కేంద్రం చాలా లేట్ చేస్తూ ఉండటంతో, మన మీద అధిక వడ్డీ భారం పడుతుంది.

 

 

Advertisements

Latest Articles

Most Read