తమ సమస్యల పరిష్కారించాలని కోరుతూ ఉత్తరాఖండ్‌కు చెందిన రైతులు పది రోజుల కిందట హరిద్వార్‌ నుంచి ఢిల్లీకి మహాపాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని దిల్లీలోకి ప్రవేశించకుండా దాదాపు 30వేల మంది రైతులను పోలీసుల బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. పది రోజులుగా మహా పాదయాత్ర చేపట్టి దిల్లీకి చేరుకున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళన చేస్తున్నారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు భాష్పవాయువు‌, జలఫిరంగులను‌ ఉపయోగిస్తున్నారు. దీంతో భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన వేలాది మంది రైతులు దిల్లీ- ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులో రోడ్లపై వేచి చూస్తున్నారు.

kisan 02102018 2

అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అడ్డుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత నరేశ్‌ మాట్లాడుతూ.. ‘మమ్మల్ని ఇక్కడ(దిల్లీ-యూపీ సరిహద్దు) ఎందుకు ఆపారు? మేము క్రమశిక్షణతో శాంతయుతంగా నిరసన ర్యాలీ చేస్తున్నాం. మా సమస్యల గురించి ప్రభుత్వానికి కాకుండా ఎవరికి చెప్పాలి? పాకిస్థాన్‌కో లేదా బంగ్లాదేశ్‌కో వెళ్లిపోవాలా?’ అని ఆవేశంగా అన్నారు. కాగా ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతి తీసుకోలేదని దిల్లీ పోలీసులు చెప్తున్నారు. అయితే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రైతులను నగరంలోకి ప్రవేశించనివ్వండి... వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. వారిని అడ్డుకోవడం తప్పని పేర్కొన్నారు.

kisan 02102018 3

స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని, రుణాలు మాఫీ చేయాలని, ఎన్సీఆర్‌లో పదేళ్లు పైబడిన ట్రాక్టర్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఇంకా పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ నుంచి సెప్టెంబరు 23న కిసాన్‌ క్రాంతి ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల మీదుగా అక్టోబరు 2న దిల్లీలోని కిసాన్‌ ఘాట్‌కు చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ వారిని పోలీసులు దిల్లీలోకి అనుమతించడం లేదు.

ఎలక్ట్రానిక్స్ రంగంలో రాష్ట్రానికి రూ.35వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న 500 బిలియన్‌ డాలర్ల ఎలక్ర్టానిక్స్‌లో రాష్ట్రం నుంచే 250 బిలియన్‌ డాలర్ల విలువైనవి ఉత్పత్తి అయ్యేలా చూస్తున్నామన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి లోకేశ్‌ విలేకరులతో మాట్లాడారు. తన 7 రోజుల చైనా పర్యటన విజయవంతమైందని చెప్పారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం న్యూచాంఫియన్‌ వార్షిక సమావేశాలు, ఇతర 40 సమావేశాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. బ్లాక్‌ చైన్‌, డ్రోన్‌ వంటి టెక్నాలజీతో రాష్ట్రంలో 4వ పారిశ్రామిక విప్లవం వస్తుందన్నారు. ఎలక్ర్టానిక్స్‌ రంగానికి షన్‌జన్‌ ఎలాగో తిరుపతి అలాగే ఎలక్ర్టానిక్స్‌ హబ్‌గా తయారవుతుందని చెప్పారు. అవసరమైతే 3, 4 నెలల్లో మళ్లీ చైనా వెళతానని, మరికొన్ని ఒప్పందాలు చేసుకువస్తానని తెలిపారు.

dixon 02102018 2

ఎలక్ర్టానిక్స్‌ రంగంలో ప్రపంచంలో 2 స్థానంలో ఉన్న టీసీఎల్‌... ఏపీలో పరిశ్రమ నెలకొల్పడానికి ఒప్పందం చేసుకున్నట్లు లోకేష్ తెలిపారు. ఈ కంపెనీ ద్వారా 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని, నవంబరు చివరివారంలో ఆ కంపెనీ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఈ లోగా డీపీఆర్‌, 135 ఎకరాల భూమి కేటాయింపులు వంటి పనులు పూర్తి అవుతాయన్నారు. భాగస్వామ్య సదస్సులు, ఇప్పటి వరకూ జరిగిన ఎంవోయూల ద్వారా రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 35 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. 1994లో ఐటీ రంగానికి ఎలా పేరు వచ్చిందో.. ఇప్పుడు ఎలకా్ట్రనిక్స్‌రంగానికి కూడా అలాగే అవకాశాలు లభిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల లోపు 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటవుతాయన్నారు.

dixon 02102018 3

ఈ నెల 4వ తేదీన డిక్సన్‌ ప్లాంట్‌ను తిరుపతిలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. తిరుపతి రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో టీవీలు,సెక్యురిటి కెమెరాలుని డిక్సన్ కంపెనీ తయారు చేయ్యనుంది. త్వరలో సెల్ ఫోన్లు, వాషింగ్ మెషిన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీని ప్రారంభించేందుకు డిక్సన్ కంపెనీ రెడీ అవుతుంది. రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2 లో మొట్టమొదట కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీగా డిక్సన్ కంపెనీ పేరు తెచ్చుకుంది. మార్కెట్లోని వివిధ కంపెనీలకు డిక్సన్ ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీ చేసి ఇస్తుంది. ఈ కంపెనీ రాష్ట్రంలో 150 కోట్ల పెట్టుబడులు పెట్టింది. పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం అయితే 2000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

ప్రజాపోరాటయాత్రలో భాగంగా పోలవరం ముంపు మండలాలైన కుకునూరు, వేలేరుపాడు పర్యటనకు వెళ్తున్న క్రమంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సోమవారం ఉదయం తెలంగాణాలోని, భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వెళ్లారు. అయితే ఆయన ఉదయం 9-30గంటలకు అశ్వారావుపేటకు చేరుకొని పది నిమిషాల పాటు ప్రజలనుద్దేశించి మాట్లాడతారని ప్రచారం జరిగింది. దీంతో జనసేన కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీగా పేటకు తరలివచ్చారు. ఇప్పటికే ఏపీ రాజకీయాల పై విరుచుకుపడుతున్న పవన్‌కల్యాణ్, ఇక్కడ ఏం మాట్లాడతారు? ఏదైనా పార్టీకి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని మాట్లాడతారా? ఆయన అభిమానులకు తెలంగాణాలో ఏ విధంగా ఉండాలనే దానిపై దిశానిర్దేశమేమైనా చేస్తారా? అని ఎదురుచూశారు.

pk 021102018 2

పవన్ అక్కడ ఆగిన సమయంలో తెలంగాణా ఎన్నికల పై మాట్లాడాలని కోరారు. పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా పవన్‌ ప్రసంగం కోసం వేచిచూశారు. తెలంగాణా ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణా గడ్డ మీద ఉన్న పవన్, ఎన్నికల పై మాట్లడతారేమో అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో, ఉదయం 10గం.లకు భారీ కార్ల ర్యాలీతో అశ్వారావుపేట పట్టణంలోకి ప్రవేశించిన పవన్‌కల్యాణ్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. కానీ... పవన్‌కల్యాణ్‌ టాప్‌లెస్‌ వాహనంలో నిలబడి అందరికి అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. కొద్దిసేపు ఆయన ప్రయాణిస్తున్న కారును ఆపడంతో.. ఆయన ఏదైనా మాట్లాడతారని అందరూ భావించారు.

pk 021102018 3

అయితే పవన్‌కల్యాణ్ అభివాదాలతోనే సరిపెట్టారు. దీంతో పవన్‌ ప్రసంగం కోసం ఎదురుచూసిన అభిమానులు, వివిధ పార్టీ నాయకులు నిరుత్సాహానికి గురయ్యారు. ఏపీ, తెలంగాణాల్లో పూర్తి విరుద్ధమైన రాజకీయాలు ఉండడం వల్లే పవన్‌కల్యాణ్‌ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కెసిఆర్ తో పవన్ కు చాలా సాన్నిహిత్యం ఉందని అందరికీ తెలిసిందే. కెసిఆర్ పలు సందర్భాల్లో చిటికెను వేలు అంత ఆక్టర్ గాడు, అని బహిరంగ సభల్లో తిట్టినా, పవన్ మాత్రం, కెసిఆర్ కు దాసోహం అయిపోయారు. పలు సందర్భాల్లో, ఆంధ్రాని తక్కువ చేసి, తెలంగాణాని ఆహా ఓహో అంటూ ఎత్తిన సంగతి కూడా తెలిసిందే. అందుకే తెలంగాణాలో ఎన్నికల యుద్ధం జరుగుతున్నా, ఇక్కడకు వచ్చి కత్తులు తిప్పుతున్నాడు పవన్.

దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతలు గాంధీజీ, లాల్‌బహుదూర్‌ శాస్త్రి జన్మించిన రోజున ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలోని ప్రజావేదిక హాలులో ‘యువనేస్తం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 13 జిల్లాల నుంచి వచ్చిన 400 మంది లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా, ఒక యువకుడు చంద్రబాబుని ఉద్దేశించి, మీరు యువకుడిగా ఉండగా, ఏమని అవుదామని అనుకున్నారు అంటూ, ప్రశ్న అడిగాడు. దానికి చంద్రబాబు సమాధనం చెప్పారు.

cbn 02102018 2

నేటి తరం యువతకు తమ భవిష్యత్తుపై ఓ ఆలోచన ఉండాలని, దాన్ని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలి. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు, ఎంఏ చేసేటప్పుడు అనుకున్నాను. ఏం చేద్దామని ఆలోచించాను. ఐఏఎస్ చేద్దామనుకున్నాను. ఐఏఎస్ చేయాలంటే కష్టపడాలి. ఇప్పట్లో మనం ఐఏఎస్ అవుతామో లేదో రిస్క్ అవుతుందని ఆలోచించి... నెక్ట్స్ నాకు 72లో ఎలక్షన్స్ వచ్చాయి. బెటర్ టూ కంటెస్ట్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అయిన తరువాత మంత్రి అవుదాం. ఐఏఎస్ ఆఫీసర్లను మనమే కంట్రోల్ చేయవచ్చని ఆలోచించాను" అన్నారు. చంద్రబాబు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ, తాను యువకుడిగా ఉండగా ఉన్న ఆలోచనలు పంచుకుంటుంటే, ఆడిటోరియం చప్పట్లు, నవ్వులతో దద్దరిల్లింది.

cbn 02102018 3

ఈ కార్యక్రమం గురించి చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలోనే యువతరం ఎక్కువగా ఉన్న దేశం మనదేనని తెలిపారు. అర్హులైన యువత ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే వారి ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించి పథకాన్ని వర్తింపచేస్తారని తెలిపారు. ఈ పథకానికి 6.15లక్షల మంది నమోదు చేసుకోగా... వెరిఫికేషన్‌ తర్వాత సుమారు 2.15లక్షల మంది అర్హత సాధించినట్లు తెలిపారు. వీరి బ్యాంక్‌ అకౌంట్‌కు ప్రయోగాత్మకంగా నిన్ననే రూపాయి జమ చేశామని.. మిగిలిన రూ.999 రేపు జమ అవుతుందని చెప్పారు. గతంలో ఇలాంటి పథకాలు కొన్నిచోట్ల ప్రారంభించినా విఫలమయ్యాయని.. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పకడ్బందీగా ఈ పథకాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read