వైసీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ అనధికార ఒప్పందానికి వచ్చాయా? ఎన్నికల ముగిసిన తర్వాత పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయా? ఇందుకోసం ముందుగానే స్నేహ పూర్వక పోటీ చేస్తాయా అంటే, అవును అనే సమాధానం వస్తుంది. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పనులతో, ఇది క్లియర్ గా అర్ధమవుతూ ఉండగా, ఢిల్లీలో విజయసాయి రెడ్డి చేసిన చర్చల గురించి, మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగా, బీజేపీకి కనీసం 15 సీట్లు త్యాగం చెయ్యాలని అమిత్ షా నిర్ణయంతో, జగన్ అంగీకరించినట్టు సమాచారం. 15 చోట్ల లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ వ్యూహంలో భాగంగానే, కొన్ని స్థానాల్లో బలమైన నాయకులను తప్పించి, బలహీన నేతలను ఇన్‌చార్జులుగా నియమిస్తున్నాడు జగన్.

jagan 04102018

నాలుగేళ్లుగా గుంటూరు-2 స్థానంలో వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న బలమైన నాయకుడు లేళ్ల అప్పిరెడ్డిని జగన్‌ ఆకస్మికంగా తప్పించారు. ఇటీవలే పార్టీలో చేరిన ఏసురత్నానికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఈయనెవరో వైసీపీ కార్యకర్తలకు కూడా తెలియదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోసమే ఈ మార్పు జరిగిందని, గుంటూరు-2లో ఆయన గెలుపు అవకాశాలు పెంచడం కోసమే అప్పిరెడ్డిని తప్పించారని పేర్కొంటున్నారు. ఇదొక్కటే కాదు. సుమారు పదిహేను శాసనసభ, మూడు నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి వైసీపీ సహకరించేలా అంతర్గత ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఎంపీ స్థానాల్లో సిట్టింగ్‌లతో పాటు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు ఉంటారని చెబుతున్నారు. ఆ ఇద్దరూ కన్నాతో కలిసి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన వారే కావడం గమనార్హం.

jagan 04102018

కేసుల విషయంలో సహకరిస్తామన్న హామీ కారణంగానే జగన్‌ ఇలాంటి త్యాగాలకు సిద్ధపడుతున్నారని.. కొందరు బీజేపీ నేతలు పోటీ చేసే ప్రాంతాల్లో బలహీన నేతలను నిలపాలన్న డిమాండ్‌కు అంగీకరించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇంకోవైపు.. జగన్‌ ఆకస్మికంగా ఇన్‌చార్జులను మార్చడంపై వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌ స్థానంలో విడదల రజనీని ఇన్‌చార్జిగా నియమించడంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నెత్తిన పాలుపోసినట్లుయిందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. మైలవరం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన జోగి రమేశ్‌ను కాదని.. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్‌ను నియమించారు. విజయవాడ తూర్పులో నాలుగేళ్లు ఇన్‌చార్జిగా ఉన్న భవకుమార్‌ను తప్పించి, కొద్దినెలల క్రితం పార్టీలో చేరిన యలమంచిలి రవికి బాధ్యత అప్పగించారు. ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణను విజయవాడ సెంట్రల్‌ నుంచి అక్కడకు వెళ్లాలని సూచించారు. ఇవన్నీ కేవలం, బీజేపీని గెలిపించటానికి, జగన్ చేసే ప్రయత్నాల అని, ఈ సీట్లు జగన్, బీజేపీకి సహాయం చేస్తారని తెలుస్తుంది.

నిన్న నిజామాబాద్ లో జరిగిన మీటింగ్ లో, కెసిఆర్, చంద్రబాబు పై ఎలాంటి పదజాలం ఉపయోగించారో అందరూ చూసారు. ఒకింత ఆశ్చర్యపోయారు కూడా. అసలు చంద్రబాబు, నేను తెలంగాణాలో ప్రచారానికి కూడా రాను అని తేల్చి చెప్పితే, కెసిఆర్ మాత్రం తన పాలన పై కాకుండా, చంద్రబాబుని బూచిగా చూపించి ఎన్నికలకు వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. అయితే, నిన్న కెసిఆర్ అలా రెచ్చిపోటానికి కారణం, నిన్న టిడిపి సమన్వయ కమిటీ మీటింగ్ లో, కెసిఆర్ పై చర్చ జరగటం, కెసిఆర్ - మోడీ కుమ్మక్కు గురించి మాట్లాడటం, అవి మీడియాలో పెద్ద ఎత్తన రావటంతో, కెసిఆర్ అది తట్టుకోలేక పోయినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నెమ్మదిగా తన పై గురి పెడతాడని గ్రహించిన కెసిఆర్, ముందుగానే చంద్రబాబు పై ఎదురు దాడి చేసారు.

kcr 04102018 2

కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నడుస్తున్నారన్న చర్చ టిడిపి సమన్వయ కమిటీ మీటింగ్ లో జరిగింది. తెరాసకి తెదేపా స్నేహహస్తం చాచినా కేసీఆర్‌ తోసిపుచ్చారని, దాని వెనుక మోదీ హస్తం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘మనం తెరాసని శత్రు పార్టీగా చూడలేదు. మనమంతా కలసి ఉంటే దక్షిణాదిలో బలమైన శక్తులుగా మారడంతో పాటు, మన హక్కుల్ని సాధించుకోగలమని భావించాం. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సఖ్యతగా ఉంటే బాగుంటుందన్న ప్రతిపాదన మేమే ముందుకు తెచ్చాం. తెలంగాణలో తెదేపా, తెరాస కలిస్తే రాజకీయంగా తిరుగుండదు. అలాంటి వాతావరణం ఉండాలని కోరుకున్న మమ్మల్ని కేసీఆర్‌ వద్దనుకున్నారు. భవిష్యత్తులో మోదీకి దగ్గరగా ఉండాలన్నది ఆయన భావన’’ అని ఒక మంత్రి వెల్లడించారు. భాజపా, వైకాపా, జనసేన కలసి కుట్ర పన్నుతున్నాయని, అజాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు తప్పవని, తెదేపాని దెబ్బతీసేందుకే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న చర్చ జరిగింది.

kcr 04102018 3

తెలంగాణ ఏసీబీనే ఓటుకి నోటు కేసు దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు తెలుస్తోందని సమావేశంలో ఒక మంత్రి పేర్కొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఏపీలోనూ ఇదే తరహా దాడులకు అవకాశం లేకపోలేదని మరో మంత్రి అన్నారు. సీఎంతో పాటు మంత్రులనూ టార్గెట్‌ చేసేలా కేంద్రం కుట్రలు పన్నుతోందన్న ప్రచారం జరుగుతోందని మరో మంత్రి పేర్కొన్నట్టు సమాచారం. తెలంగాణలో తెరాసకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడటాన్ని కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారన్న మరో మంత్రి వ్యాఖ్యానించారు. ఏపీలో తెదేపాకి వ్యతిరేకంగా జగన్‌-పవన్‌ను కలిపేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తారన్న ప్రచారం తెలంగాణలో జరుగుతోందని ఆయన తెలిపారు. అన్ని రకాల కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలను ఎదుర్కోవాలని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాజకీయంగా ఎదురయ్యే అన్ని సవాళ్లను అధిగమించి ప్రజాబలంతో ఎన్నికలకు వెళ్దామని ఆయన తెలిపారు.

4.5 ఏళ్ళు అయినా, తన పాలన పై చెప్పుకో లేక, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పై కెసిఆర్, చాలా దివాలోకోరు భాష మాట్లాడుతూ, రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. అయితే, చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యల పై తెలుగుదేశం పార్టీ మాత్రం, ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు. దీనికి కారణం లేకపోలేదు. కెసిఆర్ తన పరిపాలన మీద చెప్పుకోవటానికి ఏమి లేదు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలకి వస్తే తరిమి తరిమి కొడుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు స్పందిస్తే, ఈ ఎన్నికలను మళ్ళీ తెలంగాణా - ఆంధ్రా భావోద్వేగం రగిలించి లబ్ది పొందటానికి కెసిఆర్ రెడీగా ఉన్నారు. అందుకే చంద్రబాబు నేను ప్రచారం కూడా చెయ్యను అని చెప్పారు. ఈ తరుణంలో కెసిఆర్ ఈ రోజు, చంద్రబాబుని రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు.

kcrt 03102018 2

తెలుగుదేశం ఈ ట్రాప్ లో పడకుండా, తెలంగాణాలో జరిగే ఎన్నికలు, కెసిఆర్ 4.5 ఏళ్ళ పరిపాలన పైనే జరగాలని, ఆంధ్రా - తెలంగాణా పై కాదని, జాగ్రత్తగా స్పందించింది. కేసీఆర్ నిజామాబాద్ సభలో వాడిన భాష అభ్యంతరకరమని ఏపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదరావు అన్నారు. ఎన్నికలు వస్తే కేసీఆర్ ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందేనని, ఇదంతా ఊహించిందేనని ఆయన అన్నారు. నిజామాబాద్‌లో జరిగిన సభలో కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన కేసీఆర్ ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టి సెంటిమెంట్‌తో లబ్దిపొందేందుకు చూస్తున్నారని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల కాలంలో ఏం చేసిందీ... ప్రజలు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తీర్పు ఇస్తారని డొక్కా పేర్కొన్నారు.

kcrt 03102018 3

ప్రజలు ఏం తీర్పు ఇస్తారో.. దానిపై దృష్టి పెట్టాలని.. తన వైఫల్యాలను పక్క రాష్ట్రంపై ఆపాదించి, చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని, అది ఓటమిని అంగీకరించడమేనని ఆయన అన్నారు. 7 మండలాలను చంద్రబాబు గుంజుకున్నారని కేసీఆర్ తిట్టడం సరికాదని, 7 మండలాలు ఏపీలో కలపాలని కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చేసిందని డొక్కా మాణిక్యవరప్రసాదరావు చెప్పారు. ఆ సమయంలో కేసీఆర్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. విభజన సమయంలో అప్పులు ఏపీకి ఇచ్చి, తెలంగాణకు ఆస్తులు ఇచ్చారని అప్పుడు ఆంధ్రా ప్రజలు ఏం మాట్లాడలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా.. వైఫల్యాలను చంద్రబాబుపైకి నెట్టడం సరికాదని ఆయన అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు తగిన విధంగా బుద్ది చెబుతారని మాణిక్య వరప్రసాదరావు అన్నారు.

తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, భాజపాలకు వ్యతిరేకంగా క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించారు. భావసారూప్యంగల పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తేవాలని, ఆంధ్రప్రదేశ్‌తో మొదలు పెట్టి వరుసగా ఆయా రాష్ట్రాల్లో భారీ సభలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. బుధవారం ఉండవల్లిలోని ప్రజా వేదికలో జరగాల్సిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వాయిదా పడిన తర్వాత ఆయన మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. కేంద్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెదేపా ఎలాంటి పాత్ర పోషించాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. చంద్రబాబు ప్రధాని కావాలంటూ మంత్రులు ఎక్కడా వ్యాఖ్యలు చేయవద్దని సీఎం స్పష్టంచేశారు.

cbn 04102018

‘‘బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ శక్తులను కూ డగట్టడంలో కీలకపాత్ర పోషిద్దాం. కొన్ని పార్టీలు ఎన్నికల ముందు బయటకు రావచ్చు. కొన్ని ఎన్నికల తర్వాత బయటపడవచ్చు. శరద్‌పవార్‌ ఎన్నికల ముందు కలిసి రాకపోవచ్చు. నవీన్‌ పట్నాయక్‌ వంటి వారు ప్రస్తుతం బీజేపీతో సఖ్యతతో ఉన్నారు. తర్వాత ఏం చేస్తారో చూడాలి. అందరినీ సమన్వయపర్చడానికి ప్రయత్నం చేస్తా. ఎన్నికల తర్వాత దేశ ప్రధాని ఎవరో మనం నిర్ణయిద్దాం. కానీ, మనకు ప్రధాని పదవి అవస రం లేదు. నాకు ఈ రాష్ట్రమే ముఖ్యం. నేను ఇక్కడ నుంచి ఎక్కడికీ వెళ్లను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో భాజపా, మోదీలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావాలి. దేశ ప్రయోజనాల కోసం మనం కేంద్రంలో కీలక పాత్ర పోషించాలి’’ అని చంద్రబాబు తెలిపారు.

cbn 04102018

‘‘మేం ప్రధాని పదవిని కోరుకోవడం లేదు. దేశాన్ని పరిపాలించాలన్న కోరిక ఎంతమాత్రం లేదు. దేశంలో ప్రధాని ఎవరుండాలన్నది మేం నిర్ణయించాలనుకున్నాం. 2019లో తెదేపా నిర్ణయాత్మక శక్తిగా అవతరించనుంది. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అప్రజాస్వామిక చర్యల వల్ల దేశ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమకు నచ్చినవారికి మేలు చేసేందుకు, కొన్ని కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం మోదీ ఎంత దూరమైనా వెళ్లి దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తారని అర్ధమవుతోంది. దేశ రాజకీయాల్లో చంద్రబాబుకి ఉన్న అనుభవం, పరిచయాల్ని దేశానికి ఒక మంచి ప్రభుత్వం అందించేలా ఉపయోగించాలని, పాత మిత్రులు, లౌకికవాదులు, ప్రజాస్వామిక శక్తుల్ని ఒక తాటిపైకి తేవాలని నిర్ణయించాం. వివిధ పార్టీలను కూడగట్టి సభలు, సమావేశాలు నిర్వహించిన అనుభవం తెదేపాకి ఉంది. మోదీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం రాష్ట్రంలో మేం చేస్తున్న పోరాటాన్ని జాతీయ స్థాయికి విస్తరించాలని సమావేశంలో నిర్ణయించాం’’ అని ఒక సీనియర్‌ మంత్రి వివరించారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read