ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఎన్నో పెండింగ్ లో ఉన్నాయి, ఎన్నో సమస్యల పై తెలుగుదేశం పోరాటం చేస్తుంది. అయితే, పోరాటం చేస్తున్న వాటి పై, ప్రజలకు ఉపయోగం ఉన్న వాటి పై కాకుండా, నియోజకవర్గాల పెంపు పై ఆఘమేఘాల మీద, ఈ రోజు కేంద్ర హోంశాఖ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పెంపుపై కేంద్ర హోంశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉన్నట్టు ఉండి, దీని పై కేంద్రం ఎందుకు ముందుకు వెళ్తుంది అనే విషయం పై, ఏపి ప్రభుత్వం ఆరా తీస్తుంది. తెలంగాణాకు లాభం చేకుర్చటానికి, ఇప్పుడు ఏమన్నా చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది.

homeminister 26092018

గతంలో నిలుపుదల చేసిన నియోజకవర్గాల పెంపు పై ప్రక్రియను హోం మంత్రిత్వశాఖ తిరిగి ప్రారంభించింది. ప్రస్తుత రిజర్వేషన్ల వివరాలు తెలపాలని, ఎన్ని నియోజకవర్గాలు ఎస్పీ, ఎస్టీ జనరల్‌ కేటగిరీల్లో ఉన్నాయో చెప్పాలని, ఏ కేటగిరీకి ఎన్ని నియోజకవర్గాలు కేటాయించాలో నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ ఎన్నికల సంఘాన్ని కోరింది. కేంద్ర హోంశాఖ అడిగిన అంశాలపై ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఏ జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయింపు ఉంటుందో చెప్పాలని ఎన్నికల సంఘం కోరింది. దీంతో రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచి హోం మంత్రిత్వశాఖ అభిప్రాయం తీసుకుంది. 2011 జనాభా లెక్కల పూర్తి నివేదిక ఇంకా తయారు కాలేదని, 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవచ్చని రిజిస్ట్రార్‌ జనరల్‌ నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

homeminister 26092018

రిజిస్ట్రార్‌ జనరల్‌ ఇచ్చిన నివేదికను కేంద్ర హోంశాఖ ఎన్నికల సంఘానికి పంపింది. ఇటీవల అధికారులతో ఈ అంశంపై హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గబా సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల దృష్ట్యా పోలవరం ముంపు మండలాలపై కూడా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. పెంచిన నియోజకవర్గాలకు అనుగుణంగానే ఎన్నికలకు వెళ్లాలని హోంశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పెంపుపై హోంశాఖలో అన్ని రకాల కసరత్తులు పూర్తి చేసుకుని, ఎన్నికల సంఘం ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘం ఈ వారంలో కానీ, వచ్చే వారంలోకానీ నివేదిక ఇస్తుందనే అభిప్రాయాన్ని హోంశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబరు 15-20 తేదీలోగా ఎన్నికల సంఘం నుంచి నివేదిక వస్తుందనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఎన్నికల సంఘం నుంచి నివేదిక వస్తే వెనువెంటనే ఈ నిర్ణయాన్ని కేబినెట్‌ ముందుకు తీసుకువెళ్లి రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని హోంశాఖ భావిస్తోంది.

యుద్ధం ఎక్కడో జరుగుతుంటే, పవన్ కళ్యాణ్ ఇక్కడకు వచ్చి కత్తులు తిప్పుతున్నాడు. తెలంగాణాలో 62 మంది బస్సు ప్రమాదంలో చనిపోతే అడ్రస్ లేడు.. తెలంగాణా ఎన్నికల గురించి ఒక్క మాట లేదు.. దేశంలో చర్చనీయంసం అయిన, తెలంగాణాలో జరిగిన పరువు హత్య గురించి అడ్రస్ లేడు.. ఇక్కడ మాత్రం చీమ చిట్టుక్కు మన్నా, మనోడికి రక్తం మరిగిపోతూ ఉంటుంది ఏంటో మరి.. ఎప్పుడు ఆగష్టు 14న, మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ అని ఎదో రిలీజ్ చేసి, గోదావరి జిల్లా నుంచి తాను నివాసం ఉండే హైదరాబాద్ చెక్కేసాడు పవన్. అంతే, ఏమైందో తెలియదు, ఏమైపోయాడో తెలియదు.

pk 26092018 2

అన్ని పార్టీలో తెలంగాణా ఎన్నికల హడావిడిలో ఉంటే, జగన్, పవన్ మాత్రం, తెలంగాణా ఎన్నికల పై ఒక్క మాట కూడా చెప్పలేదు. ముందుగా సిపిఐ, సిపిఎం పార్టీలు, పవన్ తో కలిసి తెలంగాణా ఎన్నికలకు వెళ్దాం అనుకున్నారు. సిపిఐ మొదట్లోనే, మనోడు కెసిఆర్ తొత్తు అని గ్రహించి, ఒక నమస్కారం పెట్టి బయటకు వచ్చింది. ఇక సిపిఎం పార్టీ మాత్రం, పవన్ తో కలిసి వెళ్తాం అంటూ ప్రకటించింది. ఎన్ని రోజులకి పవన్ అప్పాయింట్మెంట్ దొరక్క పోవటంతో, వారికి కూడా సినిమా అర్ధమైంది. కెసిఆర్ తో పోరాటం చెయ్యటానికి, పవన్ సిద్ధంగా లేరనుకుంటా అని సిపిఎం కూడా చెప్పేసింది. ఇంత గోల జరుగుతున్నా, మనోడు ఒక ట్వీట్ కూడా లేదు.. ఇంతకీ అసలు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో అంటూ, సొంత సినిమా ఫాన్స్ కి కూడా ఆలోచన మొదలైంది.

pk 26092018 3

ఎప్పటిలాగే ఎన్నికల ముందు హడావిడే ఇదంతా అని అందరూ అనుకుంటున్న టైంలో, మనోడు అజ్ఞాతం వీడి బయటకు వచ్చాడు. రావటంతోనే జ్ఞాన గుళికలు వదిలాడు. దెందులూరు మీటింగ్ లో మాట్లాడుతూ, 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరికీ భయపడని చంద్రబాబుని, జగన్ నుంచి కాపాడింది పవనే అంట.. ఇక చింతమనేని అయితే ఆకు రౌడీ అంటూ పదే పదే సంభోదించాడు పవన్. 16 ఏళ్ళ అప్పుడే రౌడీలను కొట్టే వాడినని చెప్పాడు. 19 ఏళ్ల వయస్సులో సాయుధ పోరాటానికి సిద్ధపడ్డా అని, ఇలాంటి వాళ్ళు ఉంటే నక్సల్స్ చంపక ఏమి చేస్తారు అంటూ, వింతగా స్పందించాడు. చూస్తా ఉంటే చింతమనేని నుంచి నాలుగు తన్నులు తింటే, ఇది కులాల మధ్య గొడవగా చెయ్యటానికి పవన్ వచ్చినట్టు ఉన్నాడు. తెలుగుదేశం నాయకులు ఈ ఉచ్చులో పడకుండా, అతన్ని అలాగే వదిలెయ్యాలి. ఈ ట్రాప్ లో పడకూడదు..

మీరు 8వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణుల‌య్యారా? 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు యువ‌తులా? అయితే మీలాంటి వారి కోసం ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తోంది ఫ్లెక్స్‌ట్రానిక్స్ సంస్థ‌. నెల్లూరు జిల్లా త‌డ స‌మీప శ్రీసిటిలో ఏర్పాటు అవుతున్న ఫ్లెక్స్ ట్రానిక్స్ సంస్థ మొబైల్ ఫోన్స్,సర్క్యూట్ బోర్డ్ తదితర ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తోంది. సంస్థ‌లో 1100వ‌ర‌కూ ఉన్న ఉద్యోగాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ టెక్నాల‌జీ అకాడ‌మీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే జాబ్ మేళా ద్వారా ఎంపిక చేయ‌నున్నారు. 8వ త‌ర‌గ‌తి పాసై..18 నుంచి 23 ఏళ్ల మ‌ధ్య‌ వ‌య‌స్సు ఉన్న యువతులు అర్హుల‌ని సంస్థ ప్ర‌తినిధులు ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ అర్హ‌త‌లు ఉన్న‌వారు త‌మ విద్యార్హ‌త‌,ధ్రువ‌ప్ర‌తాల‌తో శ్రీసిటీ ఫైర్‌స్టేష‌న్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ ట్ర‌స్ట్ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌లో అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని తెలిపారు.

flex 26092018

అక్టోబ‌ర్ 1వ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని, ఎంపికైన వారిని మొబైల్ లైన్ అసెంబ్లీ ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌లో నియ‌మిస్తార‌ని ప్ర‌క‌టించారు. రెండు నెల‌ల్లో 3 వేల మందికి ఫ్లెక్స్ ట్రానిక్స్ సంస్థ‌లో ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు. ఉద్యోగ అర్హ‌త‌లు, మ‌రిన్ని వివ‌రాల‌కు స‌తీష్ 9849696824 సంప్ర‌దించ‌వ‌చ్చు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థాపించే సంస్థ‌ల‌కు ఏపీ యువ‌త‌కే ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించే ల‌క్ష్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ టెక్నాల‌జీ సంస్థ ప‌నిచేస్తోంది. ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన కంపెనీ ఫ్లెక్స్ ట్రానిక్స్ (Flextronics) సుమారుగా రూ.585 కోట్లు పెట్టుబడితో శ్రీసిటిలో త‌న కార్య‌క‌లాపాలు ప్రారంభించబోతుంది. 30 కి పైగా దేశాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు క‌ల్పించిన ఫ్లెక్స్ ట్రానిక్స్ ఏపీలో సుమారుగా 6,600 మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నుంది.

flex 26092018

ఐటీ, ఎల‌క్ర్టానిక్స్ శాఖ‌ల‌ను చూస్తున్న మంత్రి లోకేష్ ఏడాదిన్న‌ర క్రితం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అప్పుడే ఎలక్ట్రానిక్స్ రంగంలో 2 లక్షల ఉద్యోగాల కల్పించాల‌ని, ఏపీని ఐటీ, ఎల‌క్ర్టానిక్స్ రంగాల్లో నెంబ‌ర్‌వ‌న్‌గా తీర్చిదిద్దాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మ‌న దేశంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి న‌గ‌రాల‌లో ప‌ర్య‌టించారు. అక్క‌డ క‌ల్పించిన సౌక‌ర్యాలు.. వ‌చ్చిన కంపెనీల‌ను ప‌రిశీలించారు. ఓ ప్ర‌ణాళిక రూపొందించుకున్నారు. అమెరికా, దావోస్, తాజాగా చైనా దేశాల్లో పర్యటించి.. ఏపీ ఇస్తున్న రాయితీలు, కంపెనీల స్థాప‌న‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌ను మంత్రి నారా లోకేష్ వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ఐటీ, ఎల‌క్ర్టానిక్స్‌ పాలసీ, రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల గురించి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించారు. మ‌రోవైపు కంపెనీలు ఏపీలో సంస్థ‌లు స్థాపించేలా ఒప్పిస్తున్నారు.

ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన ఫ్లెక్స్ ట్రానిక్స్ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావ‌డంలో మంత్రి లోకేష్ కృషి కీల‌క‌మైంది. బెంగ‌ళూరు,తిరుపతిలో ఫ్లెక్స్ ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులతో పలుమార్లు సమావేశం అయ్యి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితుల గురించి వివరించారు. మంత్రి లోకేష్ అప్ప‌గించిన బాధ్య‌త‌లలో భాగంగా ఎలక్ట్రానిక్స్ టీం నిత్య‌మూ ఫ్లెక్స్ ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులతో టచ్ లో ఉండి కంపెనీని తీసుకురాగ‌లిగారు. ఫ్లెక్స్‌ట్రానిక్స్‌తోపాటు దీని స‌ప్ల‌య‌ర్స్ కంపెనీలు కూడా ఏపీకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. అవి కూడా వ‌స్తే వేల‌సంఖ్య‌లో యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తాయి.

యువ‌నేస్తం అందిస్తోన్న స్నేహ‌హ‌స్తం అందుకుంటోంది ల‌క్ష‌లాది యువ‌త‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో నిరుద్యోగుల భ‌విత‌కు భ‌ద్ర‌త క‌ల్పించే భృతి ఇచ్చేందుకు ఉద్దేశించి.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ముఖ్య‌మంత్రి యువ‌నేస్తం ప‌థ‌కానికి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఈ నెల 14న ముఖ్య‌మంత్రి యువ‌నేస్తం వెబ్‌సైట్‌ని సీఎం చంద్ర‌బాబు ఆవిష్క‌రించారు. 12 రోజులు ముగిసేస‌రికి ఈ వెబ్‌సైట్‌కి ఏకంగా 3,69,864 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఆన్‌లైన్‌లో పార‌ద‌ర్శ‌క‌మైన ఎంపిక వ్య‌వ‌స్థ ద్వారా 1,00,004 మంది అర్హులుగా గుర్తింపు పొందారు. అర్హులైన వారికి అక్టోబ‌ర్ 2 నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాల‌కే రూ.1000 న‌గ‌దు జ‌మ కానుంది.

bruti 26092018

ముఖ్య‌మంత్రి యువ‌నేస్తం పేరుతో ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప‌థ‌కం ద్వారా నెల నెలా రూ.1000 నిరుద్యోగ భృతి ఇవ్వ‌డం కాదు. భృతితో యువ‌త‌కు ఆర్థికంగా చేయూత‌నిస్తూ, మ‌రోవైపు శిక్ష‌ణ ద్వారా నిపుణులుగా తీర్చిదిద్ది మెరుగైన ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించే బృహ‌త్త‌ర ల‌క్ష్యంతో ఈ ప‌థ‌కం రూపొందించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల్లోంచి వ‌చ్చిన ఓ అద్భుత‌మైన ప‌థ‌కం యువ‌నేస్తం. క్రీడ‌లు, యువ‌జ‌న స‌ర్వీసుల‌ శాఖా మంత్రి కొల్లు ర‌వీంద్ర త‌న శాఖ ద్వారా ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో కృషి చేశారు. మ‌రోవైపు ఐటీ, పంచాయ‌తీరాజ్‌శాఖా మంత్రి నారా లోకేష్‌..ఈ ప‌థ‌కం ప్ర‌భుత్వానికి ఎంతో పేరుప్ర‌తిష్ఠ‌లు తీసుకురావాల‌ని, ఏపీ యువ‌త భ‌విత‌కు భ‌రోసా ఇచ్చే ప‌థ‌కానికి ఏ ఒక్క అడ్డంకీ ఎదురుకాకూడ‌ద‌ని రెండు నెల‌ల్లో 36 స‌మీక్ష స‌మావేశాలు నిర్వ‌హించారు.

bruti 26092018

ఆద‌ర్శం ఈ 9731 మంది... భృతితో చేయూత‌, మ‌రోవైపు ఉద్యోగార్థులుగా తీర్చ‌దిద్దేలా శిక్ష‌ణ ఇచ్చే యువ‌నేస్తం ప‌థ‌కానికి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. రెండు వారాలు పూర్తి కాక ముందే 3 ల‌క్ష‌ల‌కు పైగా ద‌ర‌ఖాస్తులొచ్చాయి. 1 ల‌క్ష‌కు పైగా అర్హులుగా గుర్తించారు. అర్హులైన వారిలో 9731 మంది తాము స్వచ్ఛందంగా భృతిని వదులుకొని .. నిరుపేద నిరుద్యోగుల‌కు దీనిని అందివ్వాల‌ని కోరుకున్నారు. ముఖ్య‌మంత్రి యువ‌నేస్తం వెబ్‌సైట్‌లో లాగిన్ ఇబ్బందులు, ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల‌పై ఇప్ప‌టివ‌ర‌కూ 48,817 ఫిర్యాదులు రాగా 7324 ఫిర్యాదులను ఇప్పటికే పరిష్కరించారు.ఇప్పటి వరకూ ఒక సంక్షేమ కార్యక్రమం కోసం దరఖాస్తు దగ్గర నుండి భృతి చెల్లింపు వరకూ ఎవరి ప్రమేయం లేకుండా పూర్తిగా పారదర్శకంగా ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించడంలో లోకేష్ కీలకపాత్ర పోషించారు.

Advertisements

Latest Articles

Most Read