ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో రాష్ట్రంలోని రైతు రుణ మాఫీ లబ్దిదారులు ముఖాముఖి కార్యక్రమం 'రైతునేస్తం' పథకాన్ని మరో నెలరోజుల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వేసవికాలం పూర్తయిన వెంటనే రాష్ట్రంలోకి వచ్చే నెల 1వ తేదీ నుండి రుతుపవనాలు ప్రవేశిస్తాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేయడంతో రైతు నేస్తం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం అయ్యే అవకాశాలున్నట్లు తెలిసింది. వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల అభిప్రాయాను కూడా తీసుకొని వాటిని కూడా రైతు నేస్తం పథకంలో చేర్చాలని ముఖ్యమంత్రి తన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని రైతు రుణమాఫీ ద్వారా లబ్దిపొందిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేరుగా మాట్లాడేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీనిని ఆరు నెలల క్రితమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ప్రణాళికలు సిద్దం చేసినప్పటికీ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాలన్న సందేహం రావడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు.

farmers 21052018 2

మరోవైపు ఎన్నికల హడావిడి నెమ్మదిగా ప్రారంభమవుతున్న తరుణంలో ఇటువంటి కార్యక్రామాన్ని ఇప్పుడైనా ప్రారంభిస్తే.. రైతు రుణ మాఫీలోని లోపాలు సవరించేందుకు వీలుంటుందని సిఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులు దస్త్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అయితే గతంలో రైతు నేస్తం కార్యక్రమం పై సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి అంగీకరించిన నేపథ్యంలో వర్షా కాలం ప్రారంభానికి ముందే 'రైతు నేస్తం' పథకాన్ని ప్రారంభించడం సముచితంగా ఉంటుందని సీఎం కార్యాలయ ఉన్నతాధికారుల నిర్ణయించుకున్నారు. దీంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు శరవేగంతో పూర్తి చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరులోనే రైతునేస్తం ను కూడా పెద్ద ఎత్తున నిర్వ హించాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

farmers 21052018 3

ఈ పథకంలోని లబ్దిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి రైతులు సమస్యలు, ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ, ఎరువుల పంపిణీ, విత్తన పంపిణీ, సేద్యపు అలవాట్లు, పద్ధతులు, వ్యవసాయ రంగంలో అత్యాధునిక పద్ధతులను ప్రవేశపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు, దిగుబడులు పెంపు, వ్యవసాయ మార్కెట్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాష్ట్రంలో బ్యాంకులు రైతులకు అందిస్తున్న రుణాల వివరాలు, వడ్డీరేట్లు, ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే రుణాల వివరాలు, అనధికార రుణదాతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని, వ్యవసాయశాఖ అధికారుల వ్యవహార శైలి, ఎరువుల కంపెనీల పనితీరు, మార్కెట్లో నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువుల పంపిణీ విషయంలో రైతుల అభిప్రాయాలు, ఫిర్యాదులు, సలహాలు, సూచను, పంట పోలాకు విద్యుత్ సరఫరా, విద్యుత్ శాఖ అధికారుల పనితీరు, ట్రాన్స్ఫామ్స్ ఏర్పాటు, పంపు సెట్ల మరమ్మత్తులు వంటి సమస్యల పరిష్కారానికి సంబంధించిన అర్జీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా స్వీకరించనున్నారు.

వారంలో ప్రతీ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే సోమవారం నిర్వహించడానికి ఆదే రోజు రాష్ట్రవ్యాప్తంగా ‘ఫిర్యాదుల స్వీకరణ' కార్యక్రమాన్ని ఎప్పటి నుండో నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం నిర్వహిస్తేనే బాగుంటుందని ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కార్యక్రమం పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు విధివిధానాలు రూపొందించి, పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ప్రతీ శనివారం ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకూ రైతునేస్తం కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రణాళికలో పొందుపరిచారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన రైతులను ఒక్కొక్క వారం ఒక్కొక్క మండలం, లేదా జిల్లాకు చెందిన 150నుండి 200మంది రైతులు రైతు నేస్తంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్ర వ్యవసాయశాఖ నుండి రైతు రుణమాఫీ లబ్దిదారుల వివరాలను సేకరించి, రైతుల ఆధార్, మొబైల్ ఫోన్ నెంబరు ఆధారంగా ముఖ్యమంత్రితో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి రైతులను ఎంపిక చేస్తారు. శనివారం రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొ నేందుకు ఎంపిక చేయబడిన రైతుల వివరాలను ఆయా జిల్లా వ్యవసా యశాఖ, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతులను రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయాధికారి వెల్లడించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నారు. అలాగే రైతునేస్తం కార్యక్రమంలో సిఎం చంద్రబాబునాయుడుతో పాటు వ్యవసాయశాఖమంత్రి, ఆశాఖ ఉన్నతాధికారులు కూడా సమావేశంలో ఉండేలా దస్త్రంలో మార్పులు చేస్తున్నారు. రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకునే విధానాన్ని రైతునేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశాలున్నాయి. అలాగే భవిష్యత్తులో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టబోయే మరిన్ని నూతన విధివిధానాలను కూడా ఇదే వేదిక పై నుండి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఎస్సీ ఎసీబీసీ వర్గాలకు చెందిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపై వారి అభిప్రాయాలు ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలపై ప్రత్యేక అధికారిని కూడా నియమించే వీలున్నట్లు తెలుస్తోంది. రైతు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వం మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధికి తాము నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కు ఆదేశాలిచ్చారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో సిఎం ఆర్థికాభివృద్ధి, సులభతర వ్యాపార నిర్వహణ, ఎలపీజీ కేటాయింపులు, విద్యుదీకరణ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక అంశాలపై చర్చించారు. వాటి పురోగతిపై తాజాగా సిఎం ఆదివారం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సిఎస్ దినేష్ కుమార్ పలు పథకాల్లో సాధించిన పురోగతిని సిఎంకు వివరించారు. అనంతరం సిఎస్ ఇంధన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు తదితర శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు.

3 phase 21052018 2

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లోని నక్సల్స్ ప్రభావిత మారుమూల గ్రామాల్లో నిరంతరంగా 3ఫేజ్ విద్యుత్తు సరఫరా చేసే ప్రాజెక్టు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని సిఎస్ వెల్లడించారు. 3ఫేజ్ విద్యుత్తుతో ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలా పాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగు తాయన్నారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని 4972 గ్రామాల్లో ప్రస్తుతం 341 గ్రామాలకే 3 ఫేజ్ కరెంట్ అందుతోందని, ఇంధన, ఐఆండ్ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఐటిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె విజయానంద్ వివరించారు.

3 phase 21052018 3

మిగిలిన 4631 గ్రామాలకు 3ఫేజ్ విద్యుత్తును అందించాలంటే 347 కోట్లు ఖర్చవుతుందన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు 3ఫేజ్ కరెంటివ్వడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్ అదనపు ఐజి ఏబీ వెంకటేశ్వరరావు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు కూడా సిఎంకు సూచించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు ప్రస్తుతం నీరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నప్పటికీ అత్యధిక ఇళ్లకు 3 ఫేజ్ కరెంట్ అందడం లేదని, సింగిల్ ఫేజ్ మాత్రమే సరఫరా అవుతోంది. ఆయా గ్రామాలకు 3ఫేజ్ కరెంటిస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పుకునే అవకాశం వుంటుందని సిఎస్ ముఖ్యమంత్రికి వివరించారు. ఫలితంగా 6 జిల్లాల్లోని 4972 గ్రామాల్లో ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన పెరిగి ప్రజల జీనవ ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ఖర్చు అనేది పెద్ద విషయంకాదు, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, తదితర సౌకర్యాలు కల్పించాలని చంద్రబాబు అన్నారు...

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వద్ద ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. దిల్లీ నుంచి విశాఖ వస్తోన్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బిర్లా నగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి నాలుగు బోగీలకు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు రైలు నుంచి దిగారు. వీరిలో 36 మంది శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగతో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

train 21052018 2

ప్యాంట్రీ కారుకు ముందున్న బోగీలో షార్ట్‌సర్య్కూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అనంతరం మంటలు బి-5, బి-6, బి-7 బోగీలకు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ట్రైన్ విశాఖపట్నం వస్తుండగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్ వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పక్క బోగీలకు కూడా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్టేషన్‌కు సమీపంలోనే ట్రైన్‌ను నిలిపివేయడంతో ప్రయాణికులను దింపివేసి ట్రైన్‌ను ఖాళీ చేయించారు.

train 21052018 3

ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో రైలు బిర్లానగర్‌ స్టేషన్‌ వద్ద ఆగి ఉంది. అదే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ప్రయాణికులు వెనువెంటనే రైలు నుంచి దిగారు. సిగ్నల్‌ ఇచ్చి ఉంటే రైలు అక్కడి నుంచి కదిలేదని.. ఆ సమయంలో కదులుతున్న రైల్లోంచి దూకాల్సి వచ్చేదని ప్రయాణికులు చెబుతున్నారు. రైలు ఆగి ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు.వెంటనే ఫైరింజన్లు అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది ఏకే గంగూలీ ఆదివారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరి మధ్యలో నిర్మిస్తున్న డయాఫ్రమ్‌ వాల్‌, గోదావరిని మళ్లించడానికి నిర్మిస్తున్న స్పిల్‌ వే, కాఫర్‌ డ్యామ్‌లు, గేట్ల తయారీ కేంద్రాన్ని చూశారు. ఆయన వెంట రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, రాజ్యసభ సభ్యుడు, హైకోర్టు న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్‌, జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. పరిశీలన అనంతరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ వి.శ్రీధర్‌, ఎస్‌ఈ వి.ఎస్‌.రమేష్‌బాబు తదితరులతో గంగూలీ సుదీర్ఘంగా చర్చించారు. అధికారుల నుంచి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒడిశా అభ్యంతరాలపై కోర్టుకు సమర్పించాల్సిన పత్రాలను అందజేయాల్సిందిగా గంగూలీ ఇంజినీర్లను ఆదేశించారు.

polavaram 21052018 2

మరో పక్క పోలవరం ప్రాజెక్ట్ కి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలతో సహా డిజైన్ల ఆమోదం, రీయింబర్స్‌మెంట్‌ విషయంలో కేంద్రం కావాలని ఆలస్యం చేస్తుంది. 2019 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుగా కేంద్రం నిధులు విడుదల చేసినా.. ప్రధాని మోదీకి గానీ, బీజేపీకిగానీ ఎలాంటి క్రెడిట్‌ దక్కదనే నిశ్చితాభిప్రాయానికి కేంద్రంలోని పెద్దలు వచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే... పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన నిధులను రీయింబర్స్‌మెంట్‌ చేయడంలో సవాలక్ష అడ్డంకులను సృష్టిస్తోందని జల వనరుల శాఖ ఉన్నతాధికారవర్గాలు వివరిస్తున్నాయి.

polavaram 21052018 3

పోలవరం 2013-14 తుది అంచనాలు రూ. 58,319.06 కోట్లకూ కేంద్ర జల సంఘం ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా ఈ తుది అంచనాలపైనా ఎలాంటి నిర్ణయామూ తీసుకోలేదు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పనులకు సంబంధించిన డిజైన్లపైనా కేంద్ర జలసంఘం ఆమోదం తెలపకుండా నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తోంది. ఎక్కడా ఎలాంటి తప్పూ కనిపించకపోవడంతో.. గతంలో వేసిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ వేస్తూ కేంద్రం కాలయాపన చేస్తోంది. వీటన్నింటిపైనా కేంద్రంతో మాట్లాడేందుకు జల వనరుల శాఖ సిద్ధమైంది. వారంలో ఢిల్లీకి వెళ్లి చర్చలు జరపాలని నిర్ణయించింది. అవసరం అయితే, పోలవరం పై కూడా మరో పోరాటానికి సిద్ధం అంటూ చంద్రబాబు చెప్పారు. ఇంత జరుగుతున్నా, రాష్ట్రంలో ప్రతిపక్షాలు, మేము సియం అయిపోతున్నాం అని చెప్పే పవన్, జగన్ మాత్రం, పోలవరం పై ఒక్కటంటే ఒక్క మాట కూడా కేంద్రాన్ని అనటం లేదు..

Advertisements

Latest Articles

Most Read