నిన్న ప్రకటించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్ లో, ఆంధ్రప్రదేశ్ కు ఫస్ట్ ర్యాంక్ రావటం వెనుక, కొన్ని రాష్ట్రాలు ఆశ్చర్యపోయాయి. దీనికి కారణం, చివరి వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 3 వ స్థానంలో ఉండటం. కాని చివరకు, ఫస్ట్ ర్యాంక్ సాధించింది. దీని వెనుక, చంద్రబాబు అనే బ్రాండ్ మీద ఉండే నమ్మకం, భరోసా ఉంది. అవును, మీరు చదివింది నిజం. మనకు మొదటి ర్యాంకు రావటానికి, ఇదే కారణం. చివరి వరకు సాగిన ఉత్కంఠ భరిత పోటీలో మన రాష్ట్రానికే విజయం వరించింది. గత ఏడాది ఏపీ, తెలంగాణ రెండూ సమానమైన మార్కులతో అగ్రస్థానాన్ని పంచుకోగా... ఈసారి తెలంగాణను నవ్యాంధ్ర వెనక్కి నెట్టింది..

eodb 11072018 2

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌- డీఐపీపీ, ప్రపంచబ్యాంకు కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా తీసుకొస్తున్న వాణిజ్య సంస్కరణలను గత మూడేళ్లుగా మదింపుచేస్తూ వస్తున్నాయి. ప్రభుత్వాల పరిధిలోని వివిధ నియంత్రణ సంస్థల పనితీరును సంస్కరించి మరింత వేగంగా, సమర్థంగా, పారదర్శకంగా సేవలు అందించేలా చేయడమే ఈ కసరత్తు ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన సంస్కరణల సంఖ్యను గత మూడేళ్లలో 285 నుంచి 372కి పెంచారు. కార్మికులు, పర్యావరణం, అనుమతుల మంజూరు, సింగిల్‌విండో విధానం, నిర్మాణ అనుమతుల మంజూరు, కాంట్రాక్ట్‌ల అమలు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌, క్షేత్రస్థాయిపరిశీలన విభాగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలను ప్రధానంగా ర్యాంకింగ్‌లకు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సంస్కరణల్లో ఎన్నింటిని అమలుచేశామన్న విషయాలను రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పిస్తున్నాయి.

eodb 11072018 3

ఇలా సంస్కరణలు అమలు విషయంలో, మన రాష్ట్రానికి 99.73 స్కోర్ రాగా, తెలంగాణా కు 100 శాతం వచ్చింది. అయితే, ఈ సారి మాత్రం, ర్యాంకింగ్స్ విషయంలో కేవలం సంస్కరణలనే పరిగణలోకి తీసుకోలేదు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఉపయోగించుకున్న కంపెనీల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుని, ఈసారి ర్యాంకులు ప్రకటించారు. ర్యాంకులకోసం ఈసారి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవడంవల్ల ప్రభుత్వ సంస్కరణలు వాస్తవంగా అమలవుతున్నాయా? లేదా? అన్న విషయం తెలిసి వచ్చినట్లు డీఐపీపీ కార్యదర్శి పేర్కొన్నారు. దేశంలో సుమారు 50వేల మందితో ముఖాముఖి మాట్లాడించి ఆయా ప్రభుత్వాల తీరుపై అభిప్రాయాలు సేకరించింది. 23 రాష్ట్రాల్లో సుమారు 5వేల మందికిపైగా ప్రైవేటు సెక్టార్‌ వినియోగదారులు, ఇంజినీర్లు, లాయర్లు, ఎలక్ట్రిక్‌ కాంట్రాక్టర్ల ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకొంది. ఇలా వివిధ కంపెనీలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 86.50 స్కోర్ రాగా, తెలంగాణాకు, 83.95 స్కోర్ మాత్రమే వచ్చింది. అందుకే, ఫైనల్ రిజల్ట్ లో మనం ఫస్ట్ వచ్చాం. కంపెనీలు మన రాష్ట్రం పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాయి, చంద్రబాబు ఏ రకంగా కోఆపరేట్ చేస్తున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. నాకు ఎవరో రష్యాలో చెప్పారు, మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే కమిషన్ ఇవ్వాలి అని చెప్పే పవన్ కళ్యాణ్ గారికి, ఈ రిపోర్ట్ అంకితం.

మార్చ్ 2018 వరకు, పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబు పరిపాలన మీద ఏ అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ ఏ సమస్య లేవనెత్తినా, చంద్రబాబు ఆ సమస్య పరిష్కారం చేసే వారు. పవన్ కళ్యాణ్ తనని కలిసిన సందర్భంలో, పవన్ కు కారు దాక వచ్చి, చంద్రబాబు దింపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన గౌరవం. ఇదే సందర్భంలో, చంద్రబాబు కేంద్రంతో పోరాటం మొదలు పెట్టారు. కేంద్రంలో మంత్రులను, క్యాబినెట్ నుంచి బయటకు రప్పించారు.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు.. నరేంద్ర మోడీ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు.. ఒక పక్క జగన్, తన కేసుల కోసం బీజేపీకి లొంగిపోయిన టైంలో, పవన్ కళ్యాణ్ కేంద్రం పై పోరాటంలో కలిసి వస్తారని, చంద్రబాబు భావించారు. ఎందుకంటే, అప్పటి దాక, పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం పై నిరసన గళం వినిపించారు. అందుకే, పవన్ కళ్యాణ్, కూడా తనతో కలిసి, రాష్ట్రం కోసం, మోడీతో పోరాడతారని చంద్రబాబు అనుకున్నారు..

pk 11072018 2

కాని, ఏమైందో తెలియదు, అమిత్ షా ఏమి మ్యాజిక్ చేసారో తెలియదు, రాత్రికి రాత్రి పవన్ కళ్యాణ్ ప్లేట్ మార్చేసారు. మోడీ లాంటి బలవంతుడిని, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎదుర్కుంటుంటే, పవన్ కళ్యాణ్ మోడీ పక్కన చేరారు. అప్పటి నుంచి, కేంద్రం పై పోరాటం చేసే విషయంలో చంద్రబాబుని బలహీన పరిచే ప్రయత్నం చేసారు. నేషనల్ మీడియాకు ఎక్కి, చంద్రబాబు చేస్తుంది అంతా మోసం అని, ప్రత్యేక హోదా అవసరం లేదని, డబ్బులు ఇస్తే చాలని అన్నారు. మోడీ అంటే ఆదర్శం అంటూ, చంద్రబాబు మోసగాడని జాతీయ మీడియాలో విమర్శలు చేసారు. అప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ పై, చంద్రబాబు పై, అకారణంతో విరుచుకుపడుతున్నారు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అంటూ, కాకమ్మ కబ్రులు చెప్తూ, చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు.

pk 11072018 3

అయితే, ఈ విమర్శలను తెలుగుదేశం పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్, ఒక పావుగా మారారని, ఆయనే తెలుసుకుంటారని, పవన్ అడిగిన దానికి సమాధానం చెప్పండి కాని, విమర్శలు చెయ్యవద్దు అంటూ చంద్రబాబు కూడా ఆదేశాలు ఇచ్చారు. లోకేష్ కూడా, ప్రతి సందర్భంలో, పవన్ కళ్యాణ్ గారూ అంటూ మర్యాద ఇచ్చి, పవన్ చేసే ప్రతి ఆరోపణకు, ట్విట్టర్ ద్వారా ఆధారాలతో సహా పోస్ట్ చేస్తూ వచ్చారు. అయితే, గత రెండు మూడు రోజులుగా, పవన్ కళ్యాణ్ మరీ వ్యక్తిగత దాడి చేస్తున్నారు. చంద్రబాబుని హేళన చేస్తూ, లోకేష్ ని ఎగతాళి చేస్తూ, ఒక పార్టీ అధినేతగా కాకుండా, రోడ్ సైడ్ మనుషులులాగా ప్రవర్తిస్తున్నారు. దీంతో, ఇక తెలుగుదేశం పార్టీ, పవన్ విషయంలో వ్యూహం మార్చింది. ఇన్నాళ్ళు, చూసి చూడనట్టు వదిలేసిన పవన్ విషయంలో, ఇక నుంచి దీటుగా బదులు ఇవ్వటానికి రెడీ అయ్యింది. పవన్ కళ్యాణ్ ను అలాగే వదిలేస్తే, మనం ఎదో తప్పు చేసాం, అందుకే స్పందిచటం లేదు అని ప్రజలు అనుకుంటారని, పవన్ చేసే ప్రతి విమర్శకు, ధీటుగా సమాధనం ఇవ్వాలని, తెలుగుదేశం అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. వైకాపాపై ఏ స్థాయి విమర్శలు చేస్తున్నామో అదే స్థాయిలో జనసేనపై విరుచుకుపడాలని అధిష్ఠానం నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

నాడు 2 రూపాయలకు కిలో బియ్యం దగ్గర నుంచి, నేటి 5 రూపాయల భోజనం దాకా... ఇది తెలుగుదేశం పేద ప్రజలకు కల్పించే ఆహార బధ్రత... ఇది ఎన్టీఆర్ కు ఇచ్చే నిజమైన, ఘన నివాళి. పేదవాడికి కూడు, గూడు, బట్ట కోసం, ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. అప్పట్లో జొన్న అన్నం తినే పేద కుటుంబాలకి, వరి అన్నం తినాలని, పేదలకు ఆహార బద్రత ఉండాలని, కిలో బియ్యం, రెండు రూపాయలకే ఇచ్చి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఎన్టీఆర్ కు ఘనమైన నివాళిగా, 5 రూపాయలకే భోజనం పెడుతుంది ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో అన్న క్యాంటీన్‌ల ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెడుతుంది చంద్రబాబు ప్రభుత్వం.

anna 11072018 2

ఈ రోజు, రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్ లు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పురపాలకశాఖ మంత్రి పీ నారాయణ మీడియాతో మాట్లడారు. బుధవారం నుంచి అన్న క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన శుచిరుచి కల్గిన భోజనాన్ని ఐదు రూపాయలకే అందించబోతున్నామన్నారు. రాష్ట్రం మొత్తంపై 100 మున్సిపార్టీల్లో 203 క్యాంటీన్లను ప్రారంభించనుండగా తొలి విడతగా అధిక జనాభా కల్గిన 25 మున్సిపాల్టీల్లో 100 క్యాంటీన్లను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని, మిగిలినవి ఆగస్టు 15వ తేదీ ప్రారంభిస్తామన్నారు. ఇందులో భాగంగా విజయవాడ విద్యాధరపురంలో నిర్మితమైన అన్ని క్యాంటీన్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. మొత్తం 203 క్యాంటీన్లను ఏక రూపంలో కార్పొరేట్ హంగులతో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ఫుడ్ కోర్ట్సు మదిరిగా అదే స్థాయిలో అంతర్గత డిజైన్లు, ఇంటర్నెట్‌తో కంప్యూటర్ సదుపాయం, ఎలక్ట్రానిక్ టోకెన్ విధానం, సీసీ కెమెరాలు లబ్ధిదారుల ముఖాలు గుర్తించే పరిజ్ఞానం, టీవీలు వీటి ప్రత్యేకత. ఈ క్యాంటీన్‌లో 50 కి.మీ పరిధిలో సరఫరా చేసేలా ఆధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్ ఉంటుంది.

anna 11072018 3

ఇక మెనూ విషయానికొస్తే ఉదయం అల్పాహారం మూడు ఇడ్లీ లేదా పూరి, 25 గ్రాము ఉప్మా, పొంగలి, మధ్యాహ్నం, రాత్రి 400 గ్రాముల అన్నం, 100 గ్రాముల కూర, 120 గ్రాముల పప్పు లేదా సాంబారు, 75 గ్రాముల పెరుగు పచ్చడి ఉంటుంది. రోజు ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 12.30 గంటల నుండి 3 గంటల వరకు భోజనం, రాత్రి 7.30 గంటల నుండి 9 గంటల వరకు భోజనం. ప్రతి ఆదివారం శెలవు దినం. ఇతర ఆరురోజుల్లో ఏదో ఒక రోజు స్పెషల్ రైస్. ఇదిలా ఉండగా అన్న క్యాంటీన్‌ల ద్వారా అల్పాహారం, భోజనం అందించే బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్ స్వీకరించింది. ప్రతి రోజూ మూడుపుటలా కల్సి కనీసం 2 లక్షల, 15వేల మంది ఉంటారని ఓ ప్రాథమిక అంచనా. ఇందుకు కోసం ప్రభుత్వం రోజుకు రూ. 75 చెల్లిస్తుంది. ఇందులో లబ్ధిదారు రూ. 15 చెల్లిస్తుండగా మిగిలిన రూ. 58లను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తున్నది.

రాష్ట్రంలో వెనుకబడిన, కరవు జిల్లాల అభివృద్ధికి నిధులిచ్చి ఆదుకుంటామంటూ ఇచ్చిన హామీని కేంద్రం విస్మరించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈ రోజు అనంతపురం నగరంలో ధర్మ పోరాట దీక్ష చేపట్టింది. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. అధికార పార్టీకి చెందిన 19 మంది ఎంపీలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, మండలి విప్ పయ్యావుల కేశవ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, తరలి వచ్చారు.

modi 11072018 2

ఈ సందర్భంగా మంత్రి కాలవ శ్రీనివాసులు విలేఖరులతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు ఇచ్చిన నిధుల్ని వెనక్కు తీసుకుంటోందని, ఈ విధానాన్ని ధర్మ పోరాట దీక్షలో ఎండగడతామని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చకుండా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అలాగే వెనుకబడిన 9 జిల్లాల్లో రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలను ఆదుకుంటామని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు.

modi 11072018 3

అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, ఆ ప్రాంతాల్లో వసతులు పెంచడానికి ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిందన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో పాటు ఆ రాష్ట్రాల మధ్య విస్తరించిన వెనుకబడిన బుందేల్‌ఖండ్‌కు ఇస్తున్న నిధుల తరహాలో ఏపీకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌కు రూ.3,506 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.3,760 కోట్లు, బుందేల్‌ఖండ్‌కు రూ.2,266 కోట్లు ప్రకటించిందని, ఈ లెక్కన సుమారు రూ.7000 కోట్ల పైచిలుకు నిధుల్ని ప్రకటించి ఇస్తోందన్నారు. ఈ క్రమంలో అక్కడి ప్రజలకు తలసరి సాయంగా రూ.4,250 ఇస్తుండగా, ఏపీలో కేవలం రూ.450 కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకపోవడంతో పాటు కడప ఉక్కు, విశాఖకు రైల్వే జోన్, ప్రాజెక్టులకు నిధులు వంటి వాటిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంపై పక్షపాతం చూపుతోందన్నారు. 350 కోట్లు, మన ఖాతాలో వేసి, మళ్ళీ వెనక్కు తీసుకుంటాం దారుణం అంటున్నారు. ఇప్పటికైనా, మోడీ మేల్కొని, మనకు రావాల్సిన హక్కులు మనకు ఇవ్వాలని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read