రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర జలవనరులు, ఉపరితల రవాణా, పోర్టుల మంత్రి నితిన్‌ గడ్కరీ, ప్రకాశం జిల్లాలో పోర్ట్ నిర్మాణానికి సంబంధించి, కీలక ప్రకటన చేసారు. విభజన చట్టంలో ఉన్న నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో పోర్టు కుదరదు అని ఇప్పటికే కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, వాడరేవులో పోర్ట్ కు ఓకే అంటూ గడ్కరీ చెప్పారు. దీనికి కోసం, అక్కడ 3 వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే పోర్టు పెడతామని స్వయంగా నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. అంతే కాదు, ఎలాంటి వివాదాలు లేని 3 వేల ఎకరాలు కావాలని, నొక్కి మరీ చెప్పారు. దీని పై రాష్ట్ర ప్రభుత్వానికి రాయాల్సిన లేఖను కూడా సిద్ధం చేశామని తెలిపారు. సాగరమాల ప్రాజెక్టు కింద ఆ ప్రాంతంలో పోర్టు ఆధారిత పారిశామ్రిక అభివృద్ధికి కూడా సహకరిస్తాం అని గడ్కరీ తెలిపారు. కొత్త పోర్టుపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ) ఏర్పాటు చేస్తామని గడ్కరీ ప్రతిపాదించారు.

gadkari 14072018 2

అయితే దీని పై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్వాగాతిసున్నా, భూమి విషయం పై మాత్రం, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఇక్కడ భూమిలో అన్నీ మన ప్రతిపక్ష నేత కబంధ హస్తాలలో ఉన్నాయి. వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు వైఎస్‌ ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వ భూమి సుమారు అయిదు వేల ఎకరాలకు పైగా, అలాగే ప్రైవేటు భూమి 1,825 ఎకరాల భూమిని అప్పగించింది. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఈ ప్రాజెక్టుకు చేసిన భూకేటాయింపు కూడా ఉంది. ఆ భూములు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పరిధిలో ఉన్నాయి. గడ్కరీ ప్రతిపాదిస్తున్న నౌకాశ్రయానికి భూమి ఇవ్వాలంటే.. దీన్నుంచే కేటాయించాలి. ఈడీ పరిధిలోనున్న భూమిని ఇప్పటికిప్పుడు కేటాయించటం సాధ్యం కాకపోవచ్చని ఉన్నతాధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

gadkari 14072018 3

విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక... ఆ భూముల స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ... కేసుల నేపథ్యంలో అది కుదరలేదు. మొత్తానికి... ఎప్పుడో ముగిసిందనుకున్న ‘వాడరేవు’ కథ గడ్కరీ ప్రకటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే.. పోర్టు ఏర్పాటు కోసం ఎలాంటి వివాదంలేని 3వేల ఎకరాలు భూములు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నొక్కి మరీ చెప్తున్న గడ్కరీకి, అక్కడ జగన్ అక్రమాస్తుల కేసులో ఈ భూమి అంతా ఉందని తెలిసే ఇలా ప్రకటన చేసారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అలాంటప్పుడు, కేంద్ర ప్రభుత్వం, జగన్ అక్రమాస్తుల కేసుని ఒక కొలిక్కి తెస్తే, 3 వేల ఎకరాలు ఏమి ఖర్మ, 30 వేల ఎకరాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది.

రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే మహా యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జూలై 14న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు ‘వనం-మనం’ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జూలై 14న కృష్ణా జిల్లా నూజివీడు నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్వయంగా శ్రీకారం చుట్టనున్న ఈ కార్యక్రమం కార్తీక మాసంలో నిర్వహించే ‘వనమహోత్సవం’ వరకూ 127 రోజులపాటు నిరాటంకంగా కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములయ్యేలా చూడాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాలవారీగా మొక్కల నాటే బాధ్యతను మంత్రులతో పాటు ప్రతిఒక్కరూ తీసుకోవాలని చెప్పారు. కోటి మొక్కల సంకల్పానికి అన్ని రకాల మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అందరినీ సంసిద్ధులు చేయాలని చెప్పారు.

శుక్రవారం ఉండవల్లిలోని గ్రీవెన్ హాల్ లో ‘వనం-మనం’ కార్యక్రమంపై అటవీ, పర్యావరణ శాఖ, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 26 శాతంగా వున్న అటవీ విస్తీర్ణాన్ని 2029 నాటికి 50 శాతానికి పెంచడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేలా అధికారులు కార్యాచరణ చేపట్టాలన్నారు. హరితాంధ్రప్రదేశ్ సాకారానికి అవసరమైన నిధుల సమీకరణపైనా దృష్టి పెట్టాల్సిందిగా అధికారులతో అన్నారు. నరేగా నిధులను భారీఎత్తున వినియోగించుకోవచ్చని సూచించారు. రైల్వే లైన్లకు, రహదారులకు ఇరువైపులా చెట్లు పెంచాలన్నారు. ‘అటవీ ప్రాంతంలో పడ్డ ఒక్క చుక్క వర్షం నీరు వృధా కాకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. అటవీప్రాంతం చుట్టూ కందకాలు తవ్వాలని చెప్పారు. చెక్‌డ్యాంలు, రాక్‌ఫిల్ డ్యాంలు పెద్దఎత్తున నిర్మించాలని సూచించారు. అటవీ ప్రాంతంలో నీరు నిల్వ ఉండేలా చూస్తే అడవులు, వన్యప్రాణుల సంరక్షణ జరగడమే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు.

‘నాటే ప్రతి మొక్క చెట్టు అవ్వాలి, పాఠశాలలు సహా వివిధ ప్రాంతాల్లో నాటే మొక్కల వల్ల అందం రావాలి, ఎలాంటి మొక్కలు పెట్టాలి అన్న విషయంలో పూర్తి స్పష్టతతో ముందుకు వెళ్ళాలి. నాటే మొక్కలు పర్యావరణ హితమైనవి. ఆరోగ్యానికి మేలు చేసేవేకాకుండా ఫలాలు ఇచ్చేవి అయుండాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. వృక్ష మిత్రలను నియమించి ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించే లక్ష్యాన్ని ప్రతి ఒక్కరు ప్రతి క్షణం, గుర్తుపెట్టుకొని బాధ్యతతో ఒక యజ్ఞంలా ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. 10 ఏళ్ల పాటు ఏడాదికి 50 కోట్ల మొక్కలు నాటగలిగేతే హరితాంద్ర సాధన పూర్తవుతుంది. ఇందుకోసం నర్సరీల పెంపకానికి ప్రత్యేకంగా ఒక డీఎఫ్ఓ స్థాయి అధికారిని నియమించాలని అధికారులకు సూచించారు.

మొక్కలు పెద్దసంఖ్యలో నాటే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కరిని ప్రకృతికి దగ్గర చేయడమే ఆశయంగా వుండాలని చెప్పారు. చెట్ల పెంపకం కార్యక్రమం, విత్తనాల సేకరణ కార్యక్రమాలు ఏడాది పొడవునా చేపట్టాలని స్పష్టం చేశారు. మన వాతావరణ పరిస్థితులను తట్టుకుని త్వరగా పెరిగే మొక్కలను ఎంచుకోవాలని అన్నారు. ఇందుకోసం ఉద్యాన, అటవీ శాఖలు సంయుక్తంగా పరిశోధనలు చేయాలన్నారు. అమెరికా తరహాలో చెట్ల క్లోనింగ్ పద్దతి ఇక్కడా రావాలని చెప్పారు. అటవీప్రాంతాల్లో నేరేడు, మారేడు, ఉసిరి, వంటి ఔషద గుణాలున్న మొక్కలతో పాటు సీతాఫలం లాంటి పండ్లమొక్కలు విస్తృతంగా నాటాలని సూచించారు. ప్రాంతాలవారీగా మొక్కల పెంపకాన్ని డ్వాక్రా గ్రూపులకు అప్పగించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను వారికే ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి స్కూలు, కాలేజి, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల ప్రాంగణాలు వంటి మొక్కలకు రక్షణ కల్పించతగిన అన్ని చోట్లా తప్పనిసరిగా మొక్కల పెంపకం జరగాలని అన్నారు. జలవనరులకు సమీపంలో చెట్లను పెంచడం ద్వారా నీటి సంరక్షణ కూడా సాధ్యమవుతుందని అన్నారు.

రాష్ట్రంలోని ఐదు పక్షి సంరక్షణ కేంద్రాలను అభివృద్ధి చేయాలని, మడ అడవులను పెద్ద ఎత్తున పెంచడం ద్వారా తీరప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించే వీలుందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలను ఆహ్లాదకరంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రైవేట్ సంస్థల సాయం తీసుకోవాలని సూచించారు. నగరవనాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, నగరవనాల్లో నెమళ్లు, ఆయుర్వేద వనాల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

ముసుగులో గుద్దులాట లేదు.. ఓపెన్ గా, ప్రజల ముందే, మీడియా సాక్షిగా, బీజేపీలో అత్యంత శక్తి వంతుడు, ఆర్ఎస్ఎస్ లో పట్టు ఉన్న, కేంద్ర మంత్రి, నితిన్ గడ్కరీ ముందే చంద్రబాబు కుండ బద్దలు కొట్టేసారు. విశాఖ బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాలులో జరిగిన జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో గడ్కరీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బీజేపీతో, తెలుగుదేశం పార్టీ దూరానికి కారణాలను వెల్లడించారు. విభజన హామీలు అమలు చేయకపోవడమే బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య దూరానికి కారణమని చెప్పారు. విభజన హామీలు నెరవేరిస్తే ఇబ్బందులు ఏముంటాయని చంద్రబాబు ప్రశ్నించారు.

gadkari 13072018 2

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విభజన హామీలన్నింటిని కేంద్రం నెరవేరుస్తామని చెబుతోంది కానీ, ఎంత సమయంలో వాటిని అమలు చేస్తారనేది ముఖ్యమని అన్నారు. ఈ హామీలను ఐదేళ్లలో కాకుండా పదేళ్లలో అమలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించేందుకు అంతా ఐక్యంగా ఉండాలని, విభజన సమస్యలను అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రతి రూపాయికీ కేంద్రానికి లెక్కలు చెప్పేందుకు తాము సిద్ధమని అన్నారు. ‘పోలవరం’ ఖర్చు మొత్తాన్ని భరిస్తామన్న నితిన్ గడ్కరీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించారు.

gadkari 13072018 3

పోలవరం ప్రాజెక్టులో సహాయ, పునరావాసం ఎంతో ముఖ్యమన్నారు. నూరు శాతం పారదర్శకంగా నిర్మాణం చేపడతామని హామీ ఇస్తున్నట్టు చెప్పారు. గోదావరి జలాలతో కర్ణాటక, తమిళనాడు సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమని సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించేందుకు అంతా ఐక్యంగా ఉండాలన్నారు. విభజన సమస్యలను అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు సీఎం చెప్పారు. ఆరు వరుసల రహదారుల దిశగా గడ్కరీ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. వివిధ రహదారులను అభివృద్ధి చేయాలని గడ్కరీని కోరారు.

రాష్టవ్య్రాప్తంగా రైతుబజార్లలోని వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీకి ఆస్ట్రేలియాకు చెందిన ఎక్స్‌పర్ట్ 365 అనే సంస్థ ముందుకొచ్చింది. శుక్రవారం ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయమై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఆర్గానిక్ వేస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా కేవలం 31 గంటల్లోనే కూరగాయల వ్యర్థాల నుంచి కంపోస్టు ఎరువులు తయారు చేసే వీలు కలుగుతుంది. 300 కిలోల పళ్లు, కూరగాయలు, ఇతర వ్యర్థాలతో 50కిలోల సేంద్రియ ఎరువులు తయారు చేసే సామర్థ్యం ఉంది. ఈనెల 18న పైలెట్ ప్రాజెక్టుగా గుంటూరు, విజయవాడ రైతుబజార్లలో ఈ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు.

australi 14072018 2

ఒక్కో ప్లాంట్ వారానికి రెండుటన్నుల వ్యర్థాలను కంపోస్టుగా మారుస్తుంది. ‘చంద్రన్న రైతు సమృద్ధి’ పేరుతో అందుబాటు ధరలో ఆర్గానిక్ కంపోస్టును రైతులకు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ వేస్ట్ మేనేజిమెంట్ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరో పక్క, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన కూరగాయలు, పండ్లు రైతులే నేరుగా మార్కెట్‌లో అమ్ముకునేందుకు 75 శాతం సబ్సిడీపై వాహనాలను ప్రభుత్వం అందిస్తోంది. శుక్రవారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఈ రథాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉద్యానవన పంటల పెంపకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

australi 14072018 3

రాష్ట్రంలోని కోటి ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు లక్ష్యంగా చెప్పారు. సేంద్రియ ఎరువులతో పంటలు పండించటం వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు, ఆదాయం పొందాలన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘానికి రెండు వాహనాలను అందించారు. ఈ వాహనాల్లో సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, పండ్లు నిల్వచేస్తారు. వీటిని పరిశీలించిన ముఖ్యమంత్రి ఉద్యానవన పంటలలో సేంద్రియ వ్యవసాయానికి మంచి ప్రోత్సాహకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. సబ్సిడీపై ఈ వాహనాలను ప్రభుత్వం అందజేయటం వల్ల ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌లో అమ్ముకో గలుగుతున్నామని, మార్కెట్ ధరకంటే అదనపుధర వస్తోందని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కార్యదర్శి బి రాజశేఖర్, ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read