గడపకీ గడపకీ మన ప్రభుత్వం అని వైకాపా నేతలు వెళ్తుంటే, సమస్యలపై జనం నిలదీస్తున్నారు. దీంతో చాలా మంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే కార్య‌క్ర‌మానికి దూరం అవుతూ వ‌చ్చారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కీ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లు వైకాపా నేత‌ల్ని నిర్బంధించ‌కుండా, నిల‌దీయ‌కుండా పోలీసుల సాయంతో త‌ప్పించుకునేవారు. ఇది నిన్నా మొన్న‌టివ‌ర‌కూ వైసీపీ నేత‌ల్ని ప్రజలే త‌రిమికొట్టే సంఘ‌ట‌న‌లు ఏపీలో క‌నిపించేవి. ఇటీవ‌ల వైసీపీ కార్యకర్తలే, వైసీపీ ఎమ్మెల్యేలని త‌ర‌ముతున్న వ‌ర‌స సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణని వైసీపీ నేత‌లే చెప్పుల‌తో త‌రిమి త‌రిమి కొట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం నిర్వ‌హిస్తున్న మాజీ మంత్రి శంకరనారాయణను అడ్డుకున్న వైకాపా కేడ‌ర్‌, చెప్పుల‌తో కొట్టి నిర‌స‌న తెల‌ప‌డంతో అక్క‌డ్నించి పోలీసుల సాయంతో జారుకున్నారు. సోమందేపల్లి మండలం ఈదలబలాపురం పరిధి రేణుకానగర్‌లో ప‌ర్య‌టించిన‌ శంకరనారాయణను వైకాపా నేత‌లు అడ్డుకుని నిర‌స‌న తెలిపారు. అభివృద్ధి లేదంటూ నిల‌దీశారు. ఎమ్మెల్యే శంకరనారాయణ పోలీసుల సాయంతో గ్రామంలోకి వెళ్లేందుకు యత్నించ‌డంతో వైకాపా నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చెప్పులు విసిరి శంకరనారాయణని వెళ్ల‌గొట్టారు.  పోలీసుల సాయంతో అక్క‌డి నుంచి ప‌రారైన మాజీ మంత్రి శంక‌ర‌నారాయ‌ణ‌, దీని వెనుక‌ వైసీపీకే చెందిన  నాగభూషణ్ రెడ్డి ఉన్నారని అనుమానిస్తున్నారు. వైసీపీ నాయకుడు నాగభూష‌ణం రెడ్డిని ఆయ‌న అనుచ‌రుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైకాపా ప్ర‌భుత్వం పూర్తిగా పాల‌న గాలికొదిలేసింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మండువేస‌విలో అకాల‌వ‌ర్షాల‌తో రైతాంగం అత‌లాకుత‌ల‌మైపోయింది. ప‌రామ‌ర్శించేందుకు మ‌న‌సు రాని ప్ర‌భుత్వం తీరుపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పంట‌లు నేల‌కొరిగి అన్న‌దాత‌లు ల‌బోదిబోమంటుంటే స‌ర్కారు ఆదుకుంటామ‌నే కంటితుడుపు ప్ర‌క‌ట‌న కూడా ఇవ్వ‌క‌పోవ‌డంపై జ‌నం మండిప‌డుతున్నారు. ఐదు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. చెప్పిన‌ట్టే రాష్ట్ర‌మంతా భారీ నుంచి అతి భారీవ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర్షాల ముప్పు ఉంద‌ని ప్ర‌జ‌ల్ని, రైతుల్ని హెచ్చ‌రించాల్సిన ప్ర‌భుత్వ యంత్రాంగం చేష్ట‌లుడిగి  చూస్తోంది. పంట‌లు పోయి రైత‌న్న‌లు ల‌బోదిబోమంటుంటే, ఏపీ మంత్రులు ర‌జ‌నీకాంత్‌ని తిట్టే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వానికి హాజ‌రైన ర‌జ‌నీకాంత్ చంద్ర‌బాబు పాల‌నాద‌క్ష‌త‌ని ప్ర‌శంసించ‌డ‌మే ఆయ‌న చేసిన నేరం అన్న‌ట్టు వైసీపీలో మంత్రులు, స‌ల‌హాదారులు, ఎమ్మెల్యేలు నోటికొచ్చిన బూతుల‌తో ర‌జ‌నీకాంత్‌ని తిడుతూ కాలం గ‌డుపుతున్నారు. ఇదే స‌మ‌యంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా అకాల వర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ ప్రకటించినా ప్ర‌భుత్వం ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయ‌లేదు. భారీవ‌ర్షాల‌కు పంట‌లు పోయినా క‌నీసం ఎంత న‌ష్టం జ‌రిగిందో ప‌రిశీలించే ప్ర‌య‌త్నం చేయ‌ని ప్ర‌భుత్వం తీరుపై అన్న‌దాత‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు.

న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో అవ‌కాశాలని వాడుకుని ఎన్నిరోజులు త‌ప్పించుకుని తిరుగుతున్నా వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో సీఎం జ‌గ‌న్ రెడ్డి చెప్పిన మ‌రో క‌న్ను అయిన అవినాష్ రెడ్డి అరెస్టు త‌ప్ప‌దు. అవినాష్ రెడ్డి బ‌ర‌స్ట్ అయితే అది ఏకంగా ముఖ్య దంప‌తుల వ‌ద్ద‌కే వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో అధికారం అండ‌గా నాలుగేళ్ల‌లో చెల‌రేగిపోయిన సీఎం బంధువులంతా తెలివిగా సైడ‌యిపోతున్నారు. ఇటు టిడిపి తిరుగులేని విజ‌యం వైపు స‌మీక‌ర‌ణాలు మారుతుండ‌డంతో ఇప్పుడు చేసిన త‌ప్పులే త‌మ‌ని వెంటాడుతాయ‌ని భ‌య‌ప‌డుతూ సైడ్ అయిపోతున్నారు. ముఖ్య‌నేత‌కి అన్నీ తామైన‌టువంటి సాయిరెడ్డి లాంటి వాళ్లే మౌనం దాల్చేశారు. తాజాగా జ‌గ‌న్ రెడ్డికి ద‌గ్గ‌ర బంధువు బాలినేని శ్రీనివాస‌రెడ్డి కూడా త‌ప్ప‌కుంటూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నాలుగేళ్ల అధికారంలో సీఎం జ‌గ‌న్ రెడ్డి కంటే ఎక్కువ‌గా అరాచ‌కాలు, క‌బ్జాలు చేసి సాయిరెడ్డికి ధీటుగా బాలినేని చేశాడు. అటువంటి బాలినేని త‌మ పార్టీ ఓడిపోబోతోంద‌ని, అధినేతకి జైలు వెళ్లేలా ఉన్నాడ‌ని త‌ల‌చి ముందుగానే సేఫ్ జోన్ వెతుక్కునే ప‌నిలో ఉన్నాడ‌ని ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

చేతిలో అధికారం ఉంది. కేంద్రస‌ర్కారు ఆశీస్సులు ఉన్నాయి. ఏపీలో ప్ర‌జాస్వామ్యానికి పాత‌రేసినా, రాజ్యాంగాన్ని ఖూనీ చేసినా ప‌ట్టించుకునే నాథుడే లేడు. ఇంత‌టి అరాచ‌క వైకాపాలోనూ అభ‌ద్ర‌తాభావం ఉంద‌ని తేలిపోయింది. విప‌క్షాల‌పైనా, అవినీతిని నిల‌దీసే మీడియాపైనా, ప్ర‌శ్నించే ప్ర‌జ‌ల‌పైనా ఇప్ప‌టివ‌ర‌కూ దాడులు చేస్తూ వ‌చ్చిన వైకాపా...ఇప్పుడు కొత్త ట్రెండ్ ఎటాక్స్ మొద‌లు పెట్టేసింది. వైకాపా పాల‌న‌ని, నేత‌ల‌ని ఏమ‌న‌క‌పోయినా..చంద్ర‌బాబుని ప్ర‌శంసించార‌నే ఏకైక కార‌ణంతో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పై ఒంటికాలుమీద లేస్తున్నారు వైకాపా బూతుకేయులు. ర‌జ‌నీకాంత్ ఏపీలో విధ్వంస పాల‌న ఊసెత్త‌లేదు. రాష్ట్రం అప్పులు గురించి ప్ర‌స్తావించ‌లేదు. ప్ర‌జ‌లు క‌ష్టాల ప‌డుతున్నార‌ని ప్ర‌భుత్వాన్ని ఎత్తి చూప‌లేదు. త‌న మిత్రుడైన చంద్ర‌బాబు ఒక రాజ‌కీయ నేత‌గా చేసిన కృషిని ప్ర‌శంసించారు. దీనిపై వైకాపా ఎందుకు ఉలికిప‌డిందో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. త‌మిళ‌నాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ర‌జ‌నీకాంత్ ని ద్వేషించే వాళ్లుండ‌రు. ఆయ‌న కూడా ఎప్పుడూ ఏ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌రు. ఇప్పుడు కూడా ఆయ‌న త‌న మిత్రుడైన చంద్ర‌బాబు ప‌నితీరుని కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌తో చెప్పారు. ఇందులో వైకాపాకి జ‌రిగిన ఘోర‌మేంటో తెలియ‌దు, న‌ష్టం ఏమిటో అర్థంకాలేదు. గుట్కాలు న‌ములుతూ నానా చెత్త వాగిపోయాడు గుడివాడ నాని. ఇంకా రోజా, నోరు కూడా తిర‌గ‌ని దేవినేని అవినాష్, మ‌హాసాధ్వి ల‌క్ష్మీపార్వ‌తి కూడా ర‌జ‌నీకాంత్‌ని తిడుతూ మీడియాకెక్కారు. వీరికితోడు వైకాపా పేటీఎం కార్మికులు ఫేక్ పోస్టులతో చెల‌రేగిపోతున్నారు. బ‌స్ కండ‌క్ట‌ర్‌గా ర‌జ‌ని ఉన్న‌ప్పుడు ప్ర‌యాణికుల చిల్ల‌ర నొక్కేశాడ‌ని, సిల్క్ స్మిత ఆత్మ‌హ‌త్య చేసుకున్న కేసులో చంద్ర‌బాబు కాపాడార‌ని..అందుకే ఇలా చంద్ర‌బాబుని ప్ర‌శంసిస్తున్నార‌ని విషం చిమ్ముతున్నారు. ఇదంతా చూసిన రాజ‌కీయ ప‌రిశీల‌కులు ర‌జ‌నీకాంత్ ఏపీ గురించి ఒక్క మాట మాట్లాడ‌క‌పోయినా, వైకాపా ఊసెత్త‌క‌పోయినా..ఇంత‌లా విరుచుకుప‌డుతున్నారంటే..ఏ స్థాయిలో పార్టీలో అభ‌ద్ర‌తాభావం పెరిగిపోయిందో అర్థం అవుతోంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇదంతా ఓట‌మి భ‌యం, జైలు భ‌యం అని విడ‌మ‌రిచి మ‌రీ చెబుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read