చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా,జస్టిస్ ఎన్వీ రమణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ, తన సొంత గ్రామంలో పర్యటన కోసం వచ్చారు. ఈ సందర్భంగా నిన్న ఆయనకు ఘన స్వగతం లభించింది. మరో పక్క, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరుపున, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు టీ పార్టీ ఇస్తున్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో ఈ టీ పార్టీ ఇస్తున్నారు. అనూహ్యంగా ఈ టీ పార్టీకి, జగన్ మోహన్ రెడ్డి కూడా వస్తున్నారు. అయితే టీ పార్టీ కంటే ముందే, జగన్, ఎన్వీ రమణ అపాయింట్మెంట్ కోరారు. దీంతో జస్టిస్ ఎన్వీ రమణ బస చేసిన నోవోటెల్ హోటల్ కు, జగన్ మరి కొద్ది సేపట్లో వెళ్లనున్నారు. మర్యాదపూర్వకంగానే చీఫ్ జస్టిస్ తో, జగన్ భేటీ అవుతున్నారని సిఏంఓ వర్గాలు తెలిపాయి. జగన్ మోహన్ రెడ్డి, జస్టిస్ ఎన్వీ రమణ టార్గెట్ గా చేసిన ప్రయత్నం, దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ కాకుండా ఆపటం కోసం, అప్పట్లో అప్పటి చీఫ్ జస్టిస్ కు లేఖలు కూడా రాసారు. ఇప్పుడు ఇలా వెళ్ళి కలవటం, దేవుడి స్క్రిప్ట్ అనే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ పబ్బం అనే తేడా లేకుండా జేసీబీలు పని చేస్తున్నాయి. కృష్ణా జిల్లా నందిగామలోని సియం రోడ్డు విస్తరణ పేరిట, అక్రమ కట్టడాల నెపంతో అపార్ట్ మెంట్ సెల్లార్లు, అలాగే అపార్ట్ మెంట్లలో కొంత భాగాన్ని ఉదయం నుంచే జేసీబీలతో కొట్టటం మొదలు పెట్టారు. ఈ చర్యతో అక్కడ ప్రజలు నిరసన తెలుపుతున్నారు. ఉదయం నుంచి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, భవనాలు కొట్టేస్తున్నారని, అధికారుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునిసిపల్ అధికారులు వచ్చి అక్రమ కట్టడం పేరిట కూల్చేస్తున్నారని, నోటీసులు కూడా ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే, ఈ కూల్చివేతకు నిరసనగా, వారి వారి భవనాల ముందు కూర్చుని నిరసన తెలుపుతున్నారు. కూల్చివేతలను అడ్డుకున్నారు. అయితే అక్కడ ఉన్న మహిళలకు మహిళా పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు ఒక వలయంగా ఏర్పడటంతో, కూల్చివేతలు తిరిగి ప్రారంభం అయ్యాయి. రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమంగా కట్టిన వాటిని కూల్చివేస్తున్నాం అని అధికారులు చెప్తూ ఉండగా, అక్కడ ప్రజలు మాత్రం దానికి అభ్యంతరం చెప్తున్నారు. తాము భావనలు నిర్మించుకున్న సమయంలో, అప్పుడు పర్మిషన్ ఇచ్చారని, ఇప్పుడు వచ్చి కూల్చివేస్తున్నారని. ఆ రోజు అధికారులు ఏమి చేసారని ప్రశ్నిస్తున్నారు. ఉద్రిక్తతల మధ్యే ఈ కూల్చివెతలు సాగుతున్నాయి.

అశోక్‍గజపతిపై వైసిపి ప్రభుత్వం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రామతీర్ధం ఘటనలో ఆయన పైన కేసు నమోదు చేసారు. అయితే కేసు పెట్టి ఒక్క రోజు గడవక ముందే సెక్షన్ 41ఏ కింద అశోక్‍గజపతి రాజుకి నోటిసులు ఇచ్చారు. తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్ట్ కు రావాలని పోలీసులు అశోక్ గజపతిరాజుకు నోటీసుల్లో తెలిపారు. మరో పక్క, అశోక్ గజపతి రాజు, తమ పైన పెట్టిన అక్రమ కేసు పైన హైకోర్టులో పిటీషన్ వేసారు. కేసు కొట్టేయాలని కోరారు. అయితే ఈ కేసుని హైకోర్టు, సోమవారం విచారణ చేయనుంది. ఇక సంఘటన జరిగిన వివరాలు ఒకసారి చూస్తూ, రెండు రోజుల క్రిందట విజయనగరం రామతీర్థం బొడికొండపై తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపనకు శిలాఫలకం పైన ఆలయ కమిటీ చైర్మన్‍గా ఉన్న అశోక్‍గజపతిరాజునుపేర లేక పోవడం పై అశోక్‍గజపతి రాజుకు , వైసిపి మంత్రి వెల్లంపల్లికు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కనీసం శంకుస్థాపనలో ప్రొటోకాల్ బోర్డుపై కూడా తన పేరు కనిపించ లేదని ఆయన తప్పు బట్టారు, ప్రొటోకాల్ ప్రకారం బోర్డుపై తన పేరు లేదని అశోక్ గజపతిరాజు దాన్ని తొలగించేందుకు ప్రయత్నించగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

notice 24122021 2

వారి మధ్య తీవ్ర తోపులాట జరిగింది .ఈ తోపులాటలో అశోక్‍గజపతిరాజు అస్వస్థతకు గురిఅవ్వటంతో అక్కడ కొద్ది సేపు టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల్లోనే శంకుస్థాపనను,మంత్రులు బొత్స, వెల్లంపల్లి పూర్తి చేసారు. మంత్రి వెల్లంపల్లి కనీసం కొబ్బరికాయ కూడా కొట్ట నివ్వలేదని అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రభుత్వం కార్యక్రమం కాదని, 400 ఏళ్ల క్రితం మా పూర్వీకులు నిర్మించిన ఆలయం ఇది అని, ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీని వీళ్ళు కాలరాసారని, దీని గురించి ఆలయ ధర్మకర్తగా ఈవోకి నా అభిప్రాయం చెప్పానని ఆయన మీడియాతో చెప్పారు. తనకు కనీస మర్యాద ఇవ్వలేడం లేదని, ఆలయం కోసం విరాళంగా ఇచ్చిన నా చెక్కు స్వీకరించలేదని, కావాలనే వైసిపి రాజకీయం చేస్తున్నారని, ఈ రాష్ట్రంలో న్యాయం ఉందా అనే అనుమానం కలుగుతోందని, ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్నా ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని, ఈ ప్రభుత్వం ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తుందని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటన పైన, అనూహ్యంగా అశోక్ గజపతి రాజు గారి పైన కేసు పెట్టటం, నోటీసులు ఇవ్వటం జరిగింది.

ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం రాజకీయంగా బలమైన కుటుంబం. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత కూడా అందరూ ఒకే తాటి పైన ఉన్నారు. చివరకు జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో కూడా, కుటుంబం మొత్తం బాసటగా నిలిచింది. జగన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, ఆయనకు రాజకీయంగా కూడా 2019 వరకు అండగా ఉన్నారు. 2019 గెలుపు తరువాత, కుటుంబంలో విబేధాలు వచ్చాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అందుకు తగ్గట్టుగానే, షర్మిల కొత్త పార్టీ పెట్టటం, సాక్షి టీవీని బహిరంగంగా తిట్టటం, అలాగే సజ్జల పైన చేసిన కామెంట్స్, ఇవన్నీ చూస్తే, కుటుంబంలో విబేధాలు నిజమే అని తేలింది. అంతే కాదు, షర్మిల ఏకంగా ఏబిఎన్ ఆర్కే తో ఇంటర్వ్యూ లో కూర్చోవటంతో , విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం అవుతుంది. అలాగే షర్మిల ఆస్తి తగాదాల గురించి కూడా ప్రస్తావించారు. అయితే గత వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా, కుటుంబంలో రాజీ కుదిరిందనే ప్రచారం జరిగింది. దీంతో అప్పట్లో, షర్మిల, జగన్, విజయమ్మ కలిసి వచ్చి, సమాధి దగ్గర నివాళులు అర్పించారు. అంతా బాగానే ఉందని వైఎస్ అభిమానులు సంతోషిస్తున్న సమయంలో, మళ్ళీ క్రిస్మస్ సందర్భంగా, పులివెందులలోనే విబేధాలు బయట పడ్డాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

punlvendula 25122021 2

ప్రతి క్రిస్మస్ కు, వైఎస్ కుటుంబం మొత్తం పులివెందులలో కలిసి, పండుగ చేసుకుంటారు. ఈ సారి కూడా అలాగే, మొత్తం పులివెందుల వెళ్లారు. అయితే షర్మిల గురువారం వచ్చి, గురువారం రాత్రే తిరిగి వెళ్ళిపోయరనే వార్తలు వచ్చాయి. వైఎస్ సమాధి వద్దకు ఎవరికి వారు విడి విడిగా వెళ్లి నివాళులు అర్పించారు. తరువాత షర్మిల వెళ్ళిపోవటంతో అందరూ షాక్ అయ్యారు. గురువారం రాత్రి ఏదో జరిగి ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ రోజు క్రిస్మస్ పండుగ రోజున, వేడుకల్లో షర్మిల కనిపించలేదు. ఈ రోజు మాత్రం విజయమ్మ, జగన్ పక్కనే ఉండి, కేకు కూడా తినిపించారు. అయితే షర్మిల విషయంలో మాత్రం, విబేధాలు కొనసాగుతున్నట్టు అర్ధం అవుతుంది. వైఎస్ వర్ధంతి సందర్భంగా చేసిన రాజీ ఫలించలేదని తెలుస్తుంది. ఇంత పెద్ద రాజకీయ కుటుంబంలో, విబేధాలు రావటంతో, వైఎస్ అభిమానులు కూడా బాధ పడుతున్నారు. మరో పక్క టిడిపి మాత్రం, సొంత వాళ్ళకే జగన్ న్యాయం చేయకుండా, చెల్లిని, తల్లిని ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలు చేస్తుంది. కుటుంబ వ్యవహారం కాదని, ముగ్గురూ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టే మాట్లాడుతున్నాం అని, జగన్ మనస్తత్వం గురించి చెప్తున్నామని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read