దివంగత నేత రాజశేఖరరెడ్డి కుటుంబంలో అన్న చెల్లిల్ల మధ్య పోరు రోజు రోజుకి తారా స్థాయికి చేరుకుంటుంది. తాజాగా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, ఇడుపులపాయలో వారిరువురి మధ్య జరిగిన గొడవే ఇందుకు నిదర్సనం. ఆస్తి పంపకాల విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరుగుతున్నట్లు తెలుస్తుంది . అయితే జగన్ మాత్రం, తన ధోరణిలో తను ఉంటూ, షర్మిలకు మాత్రం, ఆస్తి ఇచ్చేది లేదని తెగేసి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇక తల్లి విజయమ్మ కూడా అటు కొడుక్కి, ఇటు కూతురికి చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ అన్న చెల్లిల్ల మధ్య గొడవ ఆంధ్రప్రదేశ్ భవిషత్తు రాజకీయాలపై ప్రభావం చూపబోతందా అనే చర్చ జరుగుతుంది. రాజశేఖరరెడ్డి లాగానే షర్మిల కూడా అనుకున్నది సాధించే మనస్తత్వం అని షర్మిల సన్నిహితులు చెప్తున్నారు. ఇక జగన్ మనస్తత్వం గురించి అందరికి తెలిసిందే. అయితే జగన్ ని డీ కొట్టాలి అంటే షర్మిలకు ప్రస్తుతం ఉన్న కుటుంబ అండ ఒక్కటే సరిపోదు. ఎందుకంటే జగన్ ఇప్పుడు ఆర్ధికంగాను, అధికారంలోనూ బలంగా ఉన్నారు. అయతే ప్రస్తుతం జగన్ నుంచి ఆస్తి తెచ్చుకోవటానికి, షర్మిల సన్నిహితులు ఆమెకు ఒక కీలకమైన విషయం చెప్పారని, ఆ దిశగానే ఆమె అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే షర్మిల తెలంగాణాలో రాజకీయ పార్టీ పెట్టారు. రాజకీయంగా పార్టీని నడపటం అంటే చాలా కష్టమైన పని. ఇప్పటికే షర్మిల ఆర్ధిక కష్టాలు ఎదుర్కుంటున్నారు. మరో పక్క జగన్ మాత్రం, షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వటం లేదు. దీంతో జగన్ ని దారిలోకి తెచ్చుకోవాలి అంటే, జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెడితే కాని అది సాధ్యం కాదని, షర్మిల సన్నిహితులు చెప్పటంతో, షర్మిల ఇప్పుడు ఆ దిశలో కూడా ఆలోచిస్తుందని అంటున్నారు. తెలంగాణా రాజకీయాల్లో ఉన్న షర్మిల, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు కూడా చూస్తున్నారు అనే లీక్‌లు ఇచ్చి, జగన్ ని దారిలోకి తెచ్చుకోవాలి, అప్పటికీ లొంగక పోతే, ఏపిలో షర్మిల ఎంటర్ అవ్వాలని, వ్యూహంగా చెప్తున్నారు. ఈ ప్రతిపాదనకు షర్మిల సై అంటారో లేదో తెలియదు కానీ, ఇది తేలక పొతే మాత్రం, చివరకు కోర్టు మెట్లు ఎక్కినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇప్పటికే జగన్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. షర్మిల కనుక బయట పడితే, జగన్ కు రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు తప్పవు. మరో పక్క, వైఎస్ కుటుంబ అభిమానులు మాత్రం, ఈ పరిణామాలతో ఆవేదన చెందుతున్నారు.