ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, సరిగ్గా సగం సమయం పూర్తి చేసుకుంది. రెండున్నరేళ్ళు పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. సహజంగా ఏ ప్రభుత్వానికైనా, మూడున్నరేళ్ళు తరువాత ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత మొదలు అవుతుంది. అది ఎన్నికల నాటికి ఎక్కువ అవుతుంది. ఆ శాతం ఎంత వరకు, ప్రతిపక్షం తమ వైపు తిప్పుకుంటుంది అనే దాన్ని బట్టి, ఎన్నికల ఫలితాలు ఉంటాయి. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం, రెండున్నరేళ్ళకే భారీ ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సర్వేలు ఇదే చెప్తున్నాయి. ముఖ్యంగా ప్రజల జీవితాలు దుర్భాలం అయిపోయాయి. నవరత్నాలు అనేవి, కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. చాలా మంది లబ్దిదారులకు అందటం లేదు. ఇక పెంచిన చార్జీలు, పెట్రోల్ రెట్లు, ఇంటి పన్నులతో, సామాన్యుడు సతమతం అవుతున్నాడు. మరో పక్క అభివృద్ధి అనేది సున్నా. ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగం రాలేదు. ఇక రోడ్డుల సంగతి సరే సరి. రాష్ట్రంలో ఆడ పిల్లలకు భద్రత లేదు. ఇళ్ళలోకి వచ్చి మరీ కొడుతున్నారు. పార్టీ ఆఫీస్ లకు రక్షణ లేదు, ప్రతిపక్ష నాయకులకు రక్షణ లేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వాయించి వాయించి పడేస్తున్నారు. వీటి అన్నిటి నేపధ్యంలోనే, జగన్ పరిపాలన పై ప్రజలు వ్యతిరేక భావంతో ఉన్నారు.

cbn 25122021 2

2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ 50% ఉంది. 151 సీట్లు వచ్చాయి. అలాగే టిడిపి ఓటు షేర్ 40 శాతం ఉంది. 23 సీట్లు వచ్చాయి. అంటే ఇద్దరి మధ్య ఓటు షేర్ తేడా 10 శాతం ఉంది. అయితే తాజాగా సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఒక ప్రముఖ సర్వేలో వైసిపీని ఇబ్బంది పెట్టేలా సర్వే రిపోర్ట్ ఉన్నాయి. ఆ సర్వే ఆత్మసాక్షి అనే సంస్థ చేసింది. ఈ సంస్థ పై ప్రజల్లో విశ్వసనీయత కూడా ఉంది. ఇప్పుడు తాజా సర్వే ప్రకారం, వైసీపీ ఓట్ల శాతం 46.5% పడిపోగా , టిడిపి ఓట్ల శాతం 43.5 శాతానికి పెరిగింది. అంటే పది శాతం తేడా నుంచి 3 శాతానికి గ్యాప్ పడిపోయింది. ఈ సర్వే శాంపిల్ కూడా 68,200 మందిది కావటంతో, సర్వే పరిణామం కూడా పెద్దదే అని చెప్పుకోవచ్చు. అదీ కాక ఈ సర్వే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జరిగింది. ఈ మధ్య కాలంలో అనేక అంశాలు తెర పైకి వచ్చాయి. సహజంగా ముడున్నరేళ్ళ తరువాత ఉండే వ్యతిరేకత జగన్ కు ఇప్పుడే వచ్చింది. ఇప్పటికైనా అనవసర విషయాల పైన కాకుండా, ప్రజలకు ఉపయోగ పడే విషయాల పైన దృష్టి పెడితే అందరికీ మంచిది మరి.

బీజేపీ నేత, సినీ నటి మాధవీ లత, ఈ రోజు పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. ఆమె పెట్టిన వీడియో మెసేజ్ ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఈ రోజు దేశ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగానే, రాజకీయ పార్టీ నేతలు కూడా శుభాకాంక్షాలు చెప్తున్నారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యణ్ కూడా ఒక ట్వీట్ చేసారు. ఆ ట్వీట్లో, యేసు క్రీస్తు జన్మదినం, మొత్తం మానవాళికే పర్వ దినం అంటూ ఉండటం పై, బీజేపీ నేత మాధవీ లత అభ్యంతరం చెప్పారు. మొత్తం మానవాళికే పర్వ దినం అని చెప్పటం పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మొత్తం మానవాళికే దేవుడు కాదని, ఇది తెలుసుకోవాలని అన్నారు. ఇదే భ్రమ అందరికీ ఉందని, ఇది హిందూ సమాజం మొత్తం కూడా తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు. రెండు రోజుల క్రితం పవన్ విడుదల చేసిన వీడియోలో కానీ, ఈ ట్వీట్లో కానీ, పవన్ వాడిన భాష అభ్యంతరకరంగా ఉన్నాయని, ఇవి మత మార్పిడులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమె అభ్యంతరం తెలిపారు. హిందువులు ఎవరూ కూడా క్రిస్మస్ జరుపుకోరని అన్నారు. ఒక హిందువుగా, పవన్ పోస్ట్ పట్ల విచారణ వ్యక్తం చేస్తున్నాం అని అన్నారు. పవన్ ట్విట్టర్ మైంటైన్ చేసే వాళ్ళు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఘాటుగా మాట్లాడారు.

bjp 25122021 2

అయితే ఆమె వ్యాఖ్యల పై జనసేన కార్యకర్తలు మండి పడుతున్నారు. ఇది ఇలా ఉంటే, ఒక పక్క బీజేపీతో పొత్తులో ఉండగానే, జనసేన అధినేత పైనే, ఇలా బహిరంగంగా, హిందూ అజెండా మోసే బీజేపీ నేత, ఇలా చెప్పటం గమనించాల్సిన అంశం. ఒక పక్క మత మార్పిడుల పైన, ఇప్పటికే ఏపిలో పోరాటం చేస్తున్నామని, ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఇలా మానవాళి మొత్తానికి అని వాడటం ఏమిటి అనేది ఆమె ప్రధాన ఆరోపణ. పవన్ లాంటి వ్యక్తులు, ఇలా చేస్తే, ఇది మత మార్పిడులను ప్రోత్సహించటమే అని అంటున్నారు. అయితే, మాధవీ లత అనేక సందర్భాల్లో, తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పే వారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసినా, ఆమె అవి ఖండించి పవన్ కు మద్దతుగా ఉండే వారు. అలాంటి మాధవీ లత, అందరూ పెట్టినట్టే, విషెస్ చెప్తూ పెట్టిన ట్వీట్ పైన కూడా, ఇంతలా రియాక్ట్ అవ్వటానికి కారణం ఏమిటో అర్ధం కావటం లేదు. రాజకీయంగా రెండు పార్టీలు, పొత్తులో ఉండగా ఇలాంటి మాటలు మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగుస్తుంది.

ఏడాది క్రితం గుడివాడలో గడ్డం గ్యాంగ్ ఆగడాలు అంటూ, కొన్ని కధనాలు ప్రసారం అయిన విషయం అందరికీ తెలిసిందే. ఒక మంత్రి అనుచర గణం అయిన ఈ గడ్డం గ్యాంగ్, చేసిన అరాచకాలు అప్పట్లో, ప్రచురితం అయ్యాయి. అయితే ఇప్పుడు మళ్ళీ గడ్డం గ్యాంగ్ ఆగడాలు బయటకు వస్తున్నాయి. ఒక వైశ్య సామాజికవర్గంకు చెందిన కుటుంబాన్ని, ఈ గడ్డం గ్యాంగ్ టార్గెట్ చేసింది. గడ్డం గ్యాంగ్ అనుచరులు, ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసినట్టు వర్తలు వస్తున్నాయి. తమకు సాయంత్రం లోగా కోటి రూపాయాలు డబ్బు చెల్లించకపోతే కనుక, శాల్తీ ని లేపెస్తాం అంటూ హెచ్చరించారని కధనాలు వస్తున్నాయి. ఈ గ్యాంగ్ బెదిరింపులతో, ఆ కుటుంబం భయపడి పోతుంది. బెరిదిపోయిన వీరు, దూర ప్రాంతానికి వెళ్లి, మీడియాకు సమాచారం అందించారు. గడ్డం గ్యాంగ్ ఆగడాల నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. ఈ విషయం మీడియాలో రావటంతో, ఇప్పుడు ఇది చర్చనీయంసం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే, ఈ గడ్డం గ్యాంగ్ దగ్గర ఒక వ్యాపారి అప్పు తీసుకున్నాడు. వీళ్ళ వేధింపులు తట్టుకోలేక చనిపోయారు. అప్పటి నుంచి ఆయన కుమారుడుని వేధిస్తున్నారు. కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నారు. అయితే కోటి రూపాయల తీసుకోలేదని, ఏ ఆధారాలు లేకుండా కోటి కట్టమని బెదిరిస్తున్నారని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ కధనాలు అన్నీ మీడియాలో వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ హోం శాఖ నుంచి ఒక నోటీస్, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు వెళ్ళింది. అయితే ఈ నోటీస్ లో, మోస్ట్ అర్జెంట్ అనే పదం హైలైట్ చేసి ఉంది. అంటే ఇది చాలా ముఖ్యమైన అంశం అని, దీని పైన వెంటనే ఆక్ట్ చేయాలని ఆ నోటీస్ ఉద్దేశం. ఈ నెల 21న విడుదల అయిన ఈ నోటీస్, ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇవన్నీ సహజంగా వచ్చే నోటీసులే కదా, ఇందులో వింత ఏముంది , ఏదో అర్జెంట్ మ్యాటర్ అయి ఉంటుంది అనుకుంటున్నారా ? అక్కడే పప్పులో కాలు వేసారు. ఈ అర్జెంట్ మేటర్ ఏ స్పెషల్ స్టేటస్ గురించి పోరాటమో, లేక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించో, లేక రైతుల గురించో, మహిళల భద్రత గురించో, నిరుద్యోగ సమస్య గురించో కాదు. ఈ అర్జెంట్ మ్యాటర్ సినిమా ధియేటర్ల తనిఖీ గురించి. సినిమా ధియేటర్లను తనిఖీ చేయాలని, అన్నీ రూల్స్ ప్రకారం నడుస్తున్నాయో లేదో చూడాలని, రిపోర్ట్ మొత్తం తయారు చేసి, 29వ తేదీ లోపు తమకు పంపాలని, ఇది అతి ముఖ్యమైన అర్జెంట్ మెసేజ్ అని, మన హోం శాఖ ఇచ్చిన ఆదేశాలు ఇవి. ప్రభుత్వ ప్రయారిటీ ఏమిటో ఇక్కడే తెలుస్తుంది కదా ? ఇప్పుడీ మెమో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Advertisements

Latest Articles

Most Read