ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి, రోజు రోజుకీ దారుణంగా తయారు అవుతుంది. ఇప్పటికే ఏపి ప్రజలు అభివృద్ధి అనే మాట మర్చిపోయారు. రోడ్డుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్ధిక పరిస్థితి చెప్పే పనే లేదు. చిత్ర విచిత్రంగా అప్పులు తెస్తూ నెట్టుకుని వస్తున్నారు. ఎప్పటి వరకు ఈ పరిస్థితి ఉంటుందో చెప్పలేం. ఇక పెట్టుబడులు సంగతి సరే సరి. ఉపాధి లేదు , ఉద్యోగాలు లేవు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏది తీసుకున్నా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణాతి దారుణంగా ఫెయిల్ అయ్యింది. దీంతో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ని దించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎలా ఉంటాయో, గత ఎన్నికల్లో ప్రజలు చూసారు. అయితే గత ఎన్నికల్లో మాదిరిగా కులాల మధ్య కుంపట్లు, ప్రాంతాల మధ్య కుంపట్లు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా పెద్దగా వర్క్ అవ్వటం లేదు. అనూహ్యంగా కాపులు కూడా టిడిపి వైపు చూస్తూ ఉండటంతో, దీన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు ఉన్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ ని, టిడిపి అభిమానులను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. ఇందు కోసం కిరాయి మూకలను ఇప్పటికే రంగంలోకి దించారు. జూనియర్ ఎన్టీఆర్ కి, టిడిపికి మధ్య గ్యాప్ ఉంది అనేది సత్యం, అయితే ఇరు వైపులా ఎప్పుడూ బహిరంగంగా అయితే ఈ విషయంలో బయట పడలేదు.

ntr 29112021 2

కావాల్సిన అప్పుడు, ఇద్దరూ కలుస్తూనే ఉంటారు. అయినా ఉన్న ఈ గ్యాప్ ని వాడుకుని, ఇద్దరి మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టటానికి వైసీపీ ప్లాన్ చేసిందని టిడిపి ఆరోపిస్తుంది. నిజమైన జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎవరూ కూడా టిడిపి ఓడిపోయి, వైసీపీ గెలవాలని కోరుకోదని టిడిపి నేతలు అంటున్నారు. మొన్నటి దాకా, సోషల్ మీడియా వేదికగా వికృత క్రీడ ఆడిన వైసిపీ, ఇప్పుడు ఈ క్రీడను కింద లెవల్ కు తీసుకుని వెళ్ళింది. కొంత మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టటం, అలాగే కొంత మంది వైసీపీ ముసుగులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రంగంలోకి దిగి రెచ్చగొడుతున్నారు. నిన్న కుప్పంలో, ఎప్పుడో విడుదలైన జై లవకుశ సినిమాని ఒక సినిమా హాల్ లో వేసుకుని, సియం ఎన్టీఆర్ అంటూ హడావిడి చేయటం, చంద్రబాబుని తిడుతూ స్లోగన్స్ ఇవ్వటం వంటివి చేసి, ఎన్టీఆర్ ఫాన్స్ పైన, టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టే క్రీడకు తెర లేపారు. దీని పైన అటు ఎన్టీఆర్ ఫాన్స్ కానీ, ఇటు టిడిపి కార్యకర్తలు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఆవేశాపడినా, వైసీపీ ట్రాప్ లో పడినట్టే.

ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ డబ్బు కోసం కూడా వెతుక్కుంటున్న ఏపి ప్రభుత్వం, ఈ సారి ఏకంగా అభయ హస్తం పధకానికి చెందిన, మహిళలు దాచుకున్న సొమ్ముని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదల లేదు. వాటి పైన రాష్ట్ర ప్రభుత్వం కన్ను పడింది. అభయ హస్తం పధకం కింద, మహిళలు రోజుకి ఒక రూపాయి పొదుపు చేస్తే, ప్రభుత్వం ఇంకో రూపాయి ఇస్తుంది. ఈ విధంగా మహిళలు పొదుపు చేసిన 365 రూపాయాలు, ప్రభుత్వం ఇచ్చే 365 రూపాయాలు కలిపి, మొత్తంగా ఏడాదికి రూ.730 పొదుపు చేస్తే, ఇలా డబ్బులు దాచుకుంటున్న మహిళలకు, 60 ఏళ్ళు దాటిన తరువాత, నెలకు 700 రూపాయల నుంచి 2300 వరకు పెన్షన్ వచ్చే విధంగా, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పధకాన్ని రూపొందించింది. ముఖ్యంగా వృద్ధ మహిళలకు, అభయం ఇచ్చేందుకు ఈ పధకం రూపొందించారు. ఈ రకంగా పొదుపు చేసుకుంటున్న మహిళలకు, జీవిత భీమా కూడా వర్తించే విధంగా ఎల్‍ఐసీ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని, డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న ఈ మొత్తం, ఎల్‍ఐసీలో నేటి వరకు కూడా రూ.2 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ పధకం గత అనేక ప్రభుత్వాలుగా వస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ సొమ్ము పైన కన్ను పడింది.

lic 29112021 2

మొత్తంగా దాదాపుగా 35 లక్షల మంది మహిళలు ఈ పధకం కింద అర్హులుగా ఉండి, ఈ రోజు వరకు కూడా తమ సొమ్ముని పొదుపు చేసుకుంటున్నారు. 60 ఏళ్ళు దాటిన వారికి 4 లక్షలకు పైగా ఈ రోజుకీ పెన్షన్లు వస్తున్నాయి. అయితే వీరికి సంబంధించిన 2 వేల కోట్లు ఎల్‍ఐసీ వద్ద ఉండటంతో, అప్పుల కోసం బ్యాంకులు చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వానికి, ఇది చూసి, ఇది కూడా తమకు ఇచ్చేయాలని, ఎల్‍ఐసీ కి లేఖ రాసి, తామే ఇక నుంచి ఈ పధకం చూసుకుంటాం అని ప్రభుత్వం కోరటంతో, ఎల్‍ఐసీ ఆ మొత్తం సొమ్ముని ప్రభుత్వానికి బదిలీ చేసింది. దీంతో ఈ అభయ హస్తం పధకం కూడా అయిపోయిందని మహిళలు అంటున్నారు. ఇదే విషయాన్ని తమ మీదకు ఎక్కడ వస్తుందో అని, ఎల్‍ఐసీ ఒక పత్రికా ప్రకటన జారీ చేసి, ఇక నుంచి ఈ పధకంతో తమకు సంబంధం లేదని, మొత్తం ప్రభుత్వం చూసుకోవాలని తేల్చి చెప్పారు. తమకు ఈ పధకంతో సంబంధం లేదని, బహిరంగంగా ప్రకటన జారీ చేసింది. ఇది ఒక రకంగా ప్రభుత్వ పరువు పోయినట్టే అని చెప్పాలి. మరి ఈ పధకం ఏమి అవుతుందో చూడాలి.

అమరావతి ఏకైక రాజధాని ధ్యేయంగా, అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అంటూ, పాదయాత్ర చేస్తూ అమరావతి నుంచి తిరుమల వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాలు దాటి, అమరావతి రైతుల పాదయత్ర నెల్లూరు జిల్లా వరకు చేరుకుంది. తుఫానులో కూడా రైతుల పాదయాత్ర సాగుతుంది. రైతుల పాదయాత్రకు అనూహ్య మద్దతు ప్రజల నుంచి వస్తుంది. నెల్లూరు లాంటి చోట అమరావతికి మద్దతు ఉండదు అని అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడ కూడా ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకుంది. మళ్ళీ పెడతాం అని చెప్తున్నా, ఏమి జరుగుతుందో చూడాలి. ఇక నెల్లూరులో ప్రజల నుంచే కాదు, వైసీపీ నేతల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. తమ ప్రభుత్వం పై వ్యతిరేకత తమ మీదకు రాకుండా కొంత మంది నేతలు జాగ్రత్త పడుతున్నారు. తాజాగా నెల్లూరులో పాదయాత్ర చేస్తూ, నిన్న రాత్రి అమరావతి రైతులు బస చేసిన శిబిరానికి వచ్చి, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతు పలికారు. రైతులకు సంఘీభావం తెలిపారు. మీకు ఏ అవసరం వచ్చినా చెప్పాలని కోరారు. అయితే అమరావతి రైతులు జై అమరావతి అనే నినాదం చేయాలన కోరగా, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వద్దని వారించారు. ఏది ఏమైనా, ప్రభుత్వం మీద వ్యతిరేకత తమ మీద పడకుండా, కొంత మంది ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరణకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాల ఉపసంహరణకు సంబంధించి, ఏవైతే అసెంబ్లీలో ఆమోదించిందో, అవే హైకోర్టులో అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. ఈ రోజు దాని పైన, హైకోర్టులో విచారణలో జరిగింది. రైతుల తరుపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్, అలాగే మరో సీనియర్ న్యాయవాది ఆదినారయణ రావు వాదనలు వినిపించగా, ప్రభుత్వం వైపు నుంచి అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. వాడీ వేడిగా ఈ రోజు వాదనలు కొనసాగాయి. అయితే ఈ బిల్లులు ఉపసంహరణ సందర్భంగా శాసనసభలో పెట్టిన ఈ బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి కానీ పేర్కొన్న అంశాలను ఈ సందర్భంగా పిటీషనర్ తరుపున న్యాయవాది వాదించారు. మూడు రాజధానులు కొనసాగిస్తామని, కేవలం టెక్నికల్ కారణాల వల్లే, మూడు రాజధానులు బిల్లులు ఉపసంహరించుకుంటున్నామని శాసనసభ వేదికగా మంత్రి, ముఖ్యమంత్రి చెప్పారని, బిల్లులు కూడా అదే విషయాన్ని పొందు పరిచారని కోర్టుకు తెలిపారు. అటువంటి అప్పుడు, ఏదైతే మేము మాస్టర్ ప్లాన్ అమలులో ఉంది కాబట్టి, అమరావతి రాజధాని అని చెప్తున్నా కూడా, మూడు రాజధానులు మళ్ళీ తీసుకుని వస్తాం అని చెప్తున్నప్పుడు, ఈ పిటీషన్లు నిర్వీర్యం కావు, ఈ పిటీషన్ల పై విచారణ కొనసాగించాలని శ్యాం దివాన్ వాదనలు వినిపించారు.

hc 29112021 2

అయితే ఈ నేపధ్యంలో హైకోర్టు, ఒక కీలక పాయింట్ లేవనెత్తింది. రాష్ట్ర అభివృద్ధికి హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు అడ్డుగా ఉన్నాయనే భావన ప్రజల్లోకి వెళ్తుంది అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే దీనికి న్యాయవాదులు స్పందిస్తూ, ఎక్కడ అభివృద్ధికి అడ్డు వస్తుందో వాటి మీద మాత్రమే స్టేటస్ కో ఎత్తి వేయాలని, రాజధాని కార్యాలయాల తరిలింపు విషయంలో మాత్రం ఉత్తర్వులు అలాగే ఉంచాలని కోరారు. ఈ నేపధ్యంలో హైకోర్టు జోక్యం చేసుకుని, బిల్లులు గవర్నర్ వద్ద ఉన్నాయి కాబట్టి, గవర్నర్ వద్ద సంతకం చేసి, గజిట్ నోటిఫికేషన్ వచ్చిన తరువాత దీని పై మరింత చర్చిద్దాం అని హైకోర్టు అభిప్రాయ పడింది. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అంశాల పై మధ్యంతర ఉత్తర్వులు తొలగిస్తున్నాం అని, కానీ కార్యాలయాల తరలింపు పై మాత్రం స్టేటస్ కో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ వద్ద నుంచి గజిట్ నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఈ కేసు విచారణ మళ్ళీ చేపడతాం అని చెప్తూ, కేసుని వచ్చే నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఒక కీలక వ్యాఖ్య కూడా చేసింది. మూడు రాజధానులు బిల్లు తెచ్చినప్పుడు కానీ, ఉపసంహరణ అప్పుడు కానీ, రెండు సార్లు, కేవలం ఒక్క రోజులో హడావిడిగా క్యాబినెట్, అసెంబ్లీలో ఆమోదం పొందాయని, ఎక్కడ చర్చ జరిగిందని కూడా ప్రశ్నించింది.

Advertisements

Latest Articles

Most Read