ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కొద్ది సేపటి క్రితం, రాష్ట ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. ఇటీవల రాయలసీమలోని, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో కురసిన భారీ వర్షాలు, వచ్చిన వరదల కారణంగా ప్రజలు నష్టపోయిన తీరుని వివరిస్తూ, ప్రజలకు సహాయం చేయాలని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులను, ప్రజలను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. వరదలతో, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం బాగా ఎక్కువ జరిగిందని, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పంటలు దెబ్బ తినటం, ఇల్లు కొట్టుకుపోవటం ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయాలు కూడా చంద్రబాబు అందులో పేర్కొన్నారు. అన్నమయ్య డ్యాంకి గండి పడటం, వాగాలు పొంగి పొర్లటంతో, వరద వచ్చి, కింద గ్రామాలు అన్నీ కొట్టుకుపోయాయని, రహదారులు కూడా దెబ్బతిన్న విషయాన్ని చంద్రబాబు తన లేఖలో తెలిపారు. ఈ వరదల వల్ల ప్రజల జీవనం దుర్భాలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సహాయం అందటం లేదని, దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చంద్రబాబు వివరించారు. ప్రకృతి వైపరిత్యాల సంస్థ మార్గదర్శిక సూత్రాలు మేరకు, ప్రతి ఒక్కరికీ సహాయం అందించాలని చంద్రబాబు లేఖలో కోరారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇల్లు కోల్పోయిన వారికి వెంటనే గృహ నిర్మాణం చేపట్టాలని కూడా ఆయన డిమాండ్ చేసారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు కూడా ఈ సహాయం కొనసాగాలని కోరారు. అలాగే పంట నష్ట పరిహారం కూడా పెంచాలని చంద్రబాబు విజ్ఞప్తి చేసారు. ముఖ్యంగా వరద వల్ల పొలాల్లో ఇసుక మేట వేసుకుని పోయిందని, వాళ్ళు తిరిగి వ్యవసాయం కొనసాగించాలి అంటే చాలా శ్రమతో కూడిన పరిస్థితి కాబట్టి, వారిని ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. అయితే ఈ సందర్భంలో చంద్రబాబు ఒక కీలక విషయం ప్రస్తావించారు. ప్రభుత్వం అందించిన లెక్కలు ప్రకారం, మొత్తం రూ. 6054.29 కోట్లు నష్టం జరిగిందని చెప్పారని, అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 35 కోట్లు విడుదల చేసిందని, రాష్ట్ర విపత్తు సహాయ నిధికి సంబంధించిన రూ. 1,100 కోట్లు ఉన్నాయని చెప్పారని, ఆ నిధులు ఏమయయ్యి అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఆ నిధులు మల్లించటం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.