వైసిపి ఎంపీ రఘురామకృష్ణరాజు తన పార్టీ నేతలపైన రోజుకోకరకంగా విమర్శలు చేస్తూ మీడియాలో హైలైట్ అవుతువుంటారు. అలాగే ఈ రోజు కూడా తమ పార్టీ అధినేత జగన్ పై తన బాణాన్ని సంధించారు. ఈ రోజు జగన్ ఢిల్లీ పర్యటన పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మా ముఖ్య మంత్రి ఇంట్లోనే కూర్చునే పరిపాలన చేస్తారని ఆయన ఎగతాళి చేసారు. జగన్ ప్రధానిని కలవడం పై ఆయన స్పందిస్తూ, తమ మీటింగ్ చాలా సక్సస్ అయిందని అని అంశాల పై తాను విన్నవించానని జగన్ ప్రకటించుకుంటారని రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేసారు. పోలవరం గురించి, ప్రత్యేక హోదా గురించి, మూడు రాజధానుల గురించి, అమరావతి అభివృద్ధి ఇలా అన్నింటి గురించి తాను పియం కు వివరించానని జగన్ చెప్పుకుంటారు చూడండి అంటూ ఆయన మీడియా సమావేశంలో జగన్ పై వ్యంగంగా మాట్లాడారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం జగన్ కేసుల గురించి మాట్లాడటానికి మాత్రమే మా జగన్ గారు ఢిల్లీకి వచ్చారని ఆయన తన దైన స్టయిల్లో జగన్ పై విరుచుకు పడ్డారు. ఆయన పర్సనల్ కేసుల గురించి కాకుండా రాష్ట్రం గురించి మా సియం ఎప్పుడు ఆలోచిస్తారో చూడాలన్నారు.

rrr 03012022 2

అయితే మా సియం బెయిల్ పిటీషన్ ఆలస్యం ఎందుకు అవుతుందో ఆ పై వాడికే తెలియలన్నారు. రాష్రం లో వైసిపి నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, ఏపిలో పన్నుల రూపంలో ఇష్టం వచ్చిన్నట్టు వసూలు చేస్తున్నారని, బాత్రూం మీదకూడా టాక్స్ విదించటం ఎంటంటూ, ఇలాంటివి అన్ని ప్రజల పై ఎంత భారం పడతాయో ప్రభుత్వం ఒక్క సారి ఆలోచించాలని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇలాంటివి అన్ని పెంచి కేవలం సినిమా టికెట్లు ఒక్కటి తగ్గిస్తే సరిపోతుందా అంటూ ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో రఘురామకృష్ణరాజు తన దైన స్టైల్లో చెప్పుకొచ్చారు. ఇక మరో పక్క వివేక కేసు గురించి త్వరలోనే ఒక ప్రముఖుడు అరెస్ట్ అవుతరాని ప్రచారం జరుగుతుందని, అందు కోసం కూడా జగన్ మోహన్ రెడ్డి, ప్రధానిని కలిసి ఉంటారని అన్నారు. అసలు ఇంట్లో కూర్చునే వాడు సియం ఏంటి అంటూ జగన్ మోహన్ రెడ్డి పైన మాట్లాడుతూ, ఇంట్లో నుంచి బయటకు రాని సియం, మన ఏపిలోనే ఉన్నాడని, రఘురామరాజు అన్నారు.

అమరావతి ప్రాంతం పై మరో సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి ప్రాంతాన్ని కార్పొరేషన్ గా మార్చాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సమబందించి, 2019లోనే కార్యాచరణ మొదలై, కార్పొరేషన్ లో కలుపుతారు అనే సమాచారం వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన కార్యాచరణ ప్రభుత్వం మొదలు పెట్టింది. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్, నోటిఫికేషన్ విడుదల చేసారు. రాజధాని ప్రాంతంలో మొత్తం 19 గ్రామాలు కార్పొరేషన్లోకి వెళ్ళనున్నాయి. తుళ్ళూరు మండలంలోని 16 గ్రామాలు, అలాగే మంగళగిరి మండలంలో 3 గ్రామాలు కార్పొరేషన్ లో కలవనున్నాయి. అమరావతి కాపిటల్ సిటీ కార్పొరేషన్ గా, ఈ కార్పొరేషన్ ఆవిర్భవించే అవకాసం ఉంది. దీనికి సంబంధించి, గ్రామ సభలు నిర్వహించాలని ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. తుళ్ళూరు ఎంపీడీవోకి ఈ బాధ్యతలు అప్ప చెప్పుతూ, నోటిఫికేషన్ జారీ చేసారు. మొత్తం ఈ 19 గ్రామాలకు సంబంధించి అనేక చోట్ల కూడా గ్రామ సభలు నిర్వహించి, ప్రజా అభిప్రాయ సేకరణ చేయాలని చెప్పి, నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, ఒక్కసారిగా ప్రజల్లో ఆసక్తి రేగింది. ఒక పక్క మూడు రాజధానుల బిల్లు మళ్ళీ తెస్తాం అంటూ, ఈ నిర్ణయం తీసుకోవటం పై ఆసక్తి నెలకొంది.

amaravati 03012022 2

ప్రస్తుతం రాజధానిలో అమరావతి కొనసాగాలని చెప్పి, రాజధాని రైతులు గత రెండేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగే సమయంలో, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా, పోలీసులు సహాయం కూడా తీసుకోవాలని చెప్పి, నోటిఫికేషన్ లో పొందు పోరచటం విశేషం. శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని, గ్రామ సభల కార్యక్రమాన్ని పూర్తి చేసి, పూర్తి స్థాయిలో నివేదికను అందచేయాలని, కలెక్టర్, తుళ్ళూరు ఎంపీడీవోని ఆదేశించారు. ఆ మేరకు తుళ్ళూరు ఎంపీడీవో కార్యాలయానికి కూడా సంబంధిత నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది వారు త్వరలోనే ఈ నోటిఫికేషన్ కు సంబంధించి, కార్యాచరణ ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు. మొత్తం ఈ గ్రామ సభలు నిర్వహించి, ప్రభుత్వానికి ఈ నివేదిక పంపిస్తామని చెప్తున్నారు. గతంలో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా, ఈ కారణంగానే నిర్వహించలేదని, ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయం పై కోర్టుకు కూడా చెప్పింది. దీంతో, ఇప్పుడు ఈ నిర్ణయం పై ఆసక్తి నెలకొంది.

జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు, వైఎస్ షర్మిల ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ మధ్య కాలంలో మీడియాలో వస్తున్న వార్తల పై, విలేఖరులు షర్మిలను ప్రశ్నించగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో మీరు పార్టీ పెడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి, దీని పై మీ స్పందన ఏమిటి అని విలేఖరులు అడగగా, షర్మిల స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టకూడడు అని ఏమైనా ఉందా ? రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడడు అని రూల్ ఏమి లేదు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మేం ఒక మార్గాన్ని ఎంచుకుని, అందులో వెళ్తున్నాం అని చెప్తూనే, ఏపిలో పార్టీ పెట్టకూడదని ఏమి లేదు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 19 లేదా 20 నుంచి పాదయాత్ర మళ్ళీ ప్రారంభం అవుతుందని అన్నారు. అయితే షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డికి, షర్మిలకు మధ్య తీవ్ర అవాంతరం ఏర్పడింది అనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. అప్పట్లో షర్మిలను ఏపిలో పార్టీ పెట్టారా అని అడిగితే, ఏపిలో మా అన్న, రాజన్న రాజ్యం తెచ్చాడు అంటూ చెప్పిన షర్మిల, ఇప్పుడు మాత్రం, ఏ పార్టీ ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నించటంతో, మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అని తేలినట్టు అయ్యింది.

sharmila 03012022 2

వారం రోజుల క్రితం ఏబిఎన్ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో ఈ విషయం బయట పెట్టి సంచలనానికి తెర లేపారు. క్రిస్మస్ సందర్భంగా, వైఎస్ కుటుంబం మట్టం పులివెందుల వెళ్ళింది. అక్కడ షర్మిలకు, జగన్ కు మధ్య ఆస్తి పంపకాల విషయంలో, తీవ్ర విబేధాలు చెలరేగినట్టు వార్తలు వచ్చాయి. జగన్, తాను ఆస్తి ఇవ్వను అని తేల్చి చెప్పటంతో, షర్మిల అక్కడ నుంచి కోపంగా వచ్చేస్తూ, నువ్వు నా ఆస్తి ఎలా ఇవ్వవో చూస్తాను అని చాలంజ్ చేసి వచ్చినట్టు ఆ రోజు వార్తలు వచ్చాయి. అయితే జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అంటే, ఆర్ధిక బలంతో, అధికార బలంతో కాకుండా, వేరే మార్గంలో వెళ్ళాలని షర్మిల నిర్ణయం తీసుకున్నట్టు, అందులో భాగంగానే జగన్ పై విమర్శలు ఎక్కు పెడుతూ, షర్మిల ఏపిలో పార్టీ పెడుతున్నారని వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఏదో గాలి వార్తలు అని అందరూ కొట్టి పారేశారు. అయితే ఈ రోజు షర్మిల మాట్లాడుతూ, ఏపిలో ఎందుకు పార్టీ పెట్టకూడదు, ఏమైనా రూల్ ఉందా అని ప్రశ్నించటంతో, అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

గ్రీవెన్స్ సెల్‍లో  జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేసారు. తాడిపత్రిలోని ప్రభుత్వ భూములను కొందరు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని  జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్‍కు ఫిర్యాదు చేసారు.  ఈ భూ ఆక్రమణ దందా అంతా రెవెన్యూ అధికారుల సహకారంతో నే జరిగిందని  ఆయన ఆరోపించారు. గతంలో మున్సిపాలిటీకి ధారాదత్తం చేసిన భూములను రిజిస్టర్ చేసుకోవడంపై జేసీ మండి పడ్డారు.దీని గురించి  గ్రీవెన్స్ సెల్‍లో  జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేయగా కలెక్టర్  విచారణకు 15 రోజుల గడువు కోరారు. ఈ  15 రోజుల తర్వాత దీని పై  ప్రభుత్వం స్పందించక పోతే  ప్రత్యక్ష ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ భూ ఆక్రమణల్లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి హస్తం కూడా ఉందని జేసీ ఆరోపించారు.

Advertisements

Latest Articles

Most Read