ఆంధ్రప్రదేశ్ లో నూతన సంవత్సరం, జనవరి ఒకటో తారీఖున, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు మరోసారి నిరాశ ఎదురైంది. గత నెలలో ఒకటో తేదీనే పెన్షన్లు వేసి మురిపించిన ప్రభుత్వం, ఆ తరువాత మళ్ళీ పాత విధానానికే ఈ ఏడాది వచ్చింది. గత నెల కంటే ముందు, ప్రతి నెల 15వ తేదీ వరకు పెన్షన్లు వేస్తూనే ఉన్నారు. ఈ నెలలో మాత్రం, పెన్షన్లు ఒకటో తేదీన వస్తాయని పెన్షనర్లు ఎదురు చూస్తుంటే, ఈ రోజు సాయంత్రం వరకు వారికి నిరాశే ఎదురైంది. ఉద్యోగ విరమణ చేసిన తరువాత, ఆ వచ్చే పెన్షన్ తోనే, గడిపే పెన్షనర్లు, కుటుంబ అవసరాల కోసం, ఆరోగ్య అవసరాల కోసం వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వారికి పెన్షన్లు రాక పోవటంతో, రాష్ట్రంలో ఉండే నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఒక్కసారిగా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ రోజు బ్యాంక్ ఎకౌంటులు పరిశీలించిన పెన్షనర్లు, పెన్షన్ లు పడక పోవటంతో, వారు అంతా కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో పాటుగా, ఉద్యోగస్తులకు కూడా, దాదాపుగా సగం మందికి, ఇప్పటికీ సాయంత్రం వరకు సగం మందికి జీతాలు పడలేదు. సాయంత్రం వరకు పెన్షన్లు పడలేదని, పెన్షనర్ల సంఘం నేతలు, అలాగే చాలా మందికి ఇంకా జీతాలు కూడా పడలేదు అంటూ, ఉద్యోగ సంఘ నేతలు కూడా వివరించారు.

buggana 01012022 2

అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి తలకిందులు కావటం వల్లే, ఎకౌంటులో డబ్బులు లేక పోవటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు పడలేదని చెప్తున్నారు. అయితే రేపు ఆదివారం సెలవు కావటంతో, ఇక సోమవారం వరకు కూడా, పెన్షన్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే జీతాలు సర్దుబాటు అవుతాయి కానీ, పెన్షనర్లకు మాత్రం, ఈ నెల కూడా లేట్ అయ్యే అవకాసం ఉందని చెప్తున్నారు. కేవలం ఒక నెల మురిపించి ఫస్ట్ తారీఖు ఇచ్చారని, ఇప్పుడు మళ్ళీ, ఈ నెల నిరాశలోకి నేట్టేసారని అన్నారు. ఒక వైపు పీఆర్సీ కోసం, తమ ఇతర డిమాండ్ల కోసం ఆందోళన చేపట్టిన ఉద్యోగులు, చీఫ్ సెక్రటరీ హామీతో ఆందోళన విరమించారు. అయితే చట్టబద్ధంగా ఒకటో తారీఖు ఇవ్వాల్సిన జీతాలు కూడా, రాకపోవటంతో, ఇప్పుడు ఉద్యోగులు కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తలకిందులు అవ్వటంతో, జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేక పోతున్నాం అని, ఆదుకోవాలి అంటూ, ఈ మధ్య వైసీపీ ఎంపీలు కూడా, పార్లమెంట్ లో చెప్పిన విషయం అందరూ చూసారు.

ఇటీవల కాలంలో, ఆంధ్రప్రదేశ్ రాజాకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన వంగవీటి రాధా పై రెక్కీకి సంబంధించి, ఆయన్ను పరామర్శించేందుకు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కొద్ది సేపటి క్రితం, గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. విజయవాడ క్లబ్ కు సమీపంలో ఉన్న ఫాం హౌస్ లో ఉంటున్న రాధాను, ఆయన తల్లి రత్న కుమారి, వీరి ఇరువురినీ కూడా ఆయన పరామర్శించారు. రెక్కీకి సంబంధించిన వివరాలు ఏమిటి, అసలు ఎలా అనుమానం వచ్చింది, సిసి టీవీ ఫూటేజ్ లో ఉన్న కార్ల వివరాలు ఏంటి, ఎలా గుర్తించగలిగారు అనే అంశం గురించి, పోలీసుల విచారణ ఎలా జరుగుతుంది, గన్ మెన్ల అంశం పై కూడా, వీటి అన్నిటి పైన కూడా, చంద్రబాబు ఆరా తీసారు. అనంతరం చంద్రబాబు బయటకు వచ్చి, మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. రాధా పై రెక్కీకి సంబంధించి, దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, అయితే ఈ దర్యాప్తు పూర్తి పారదర్శకంగా ఉండాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. రాధా రెక్కీకి సంబంధించి దర్యాప్తు వివరాలు, రాధా ఇచ్చిన సమాచారం తీసుకుని, ప్రభుత్వం తన వద్ద ఉన్న ఆధారాలు బయట పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. అసలు ఈ రెక్కీ ఎవరు చేసారు, ఎందుకు చేసారు ?

radha 01012021 21

వాళ్ళలో ఉన్న ఉద్దేశాలు కూడా ప్రభుత్వం విచారణ చేసి బయట పెట్టాలని అన్నారు. ఈ రెక్కీ ఎలా జరిగింది, తదితర వివరాలని రాధాని అడిగి తెలుసుకున్నా అని, అధైర్య పడవద్దు అని, ధైర్యంగా ఉండాలని రాధాకు, ఆమె తల్లికి కూడా చెప్పినట్టు చంద్రబాబు చెప్పారు. అయితే రాధా రెక్కీకి సంబంధించి, తన వద్ద ఉన్న వివరాలను, రాధా చంద్రబాబుకి చెప్పినట్టు తెలిసింది. ప్రధానంగా తన పై రెక్కీకి సంబంధించి, ఏమి జరిగింది, ఆ రోజు వంశీ, నాని రావటం, ఆ తరువాత గుడ్లవల్లేరులో జరిగిన మొత్తం అంశాన్ని కూడా రాధా వివరించారు. తరువాత తనకు ఇచ్చిన గన్ మెన్ల వివరాలు కూడా రాధా చంద్రబాబుకి చెప్పారు. ఇప్పటికే చంద్రబాబు రెండు రోజుల క్రితం రాధాతో ఫోన్ లో మాట్లాడారు. రెండు రోజుల నుంచి, టిడిపి నాయకులు రాధా ఇంటికి వెళ్లి కలిసారు. ఈ రోజు చంద్రబాబు, పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రోగ్రాం అనంతరం, చంద్రబాబు తాడేపల్లిలో ఉన్న రాధా నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఇప్పటికీ ఈ విషయం వెనుక, ఎవరు ఉన్నారు అనేది పోలీసులు మాత్రం బయట పెట్టలేదు.

ఈ రోజు గుంటూరు జిల్లా పత్తిపాడులో, పెన్షన్ కార్యక్రమంలో పాల్గున్న జగన్ మోహన్ రెడ్డి, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా సినిమా రంగాన్ని టార్గెట్ చేస్తూ, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినీ పరిశ్రమకు సంబంధించి, వినోదాన్ని పేదలకు అందించేందుకు టికెట్లు ధరలు తగ్గించామని, ఇది కూడా తప్పు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, పరోక్షంగా సినీ పరిశ్రమ పెద్దల పై సంచలన వ్యాఖ్యలు చేసారు. టికెట్ల తగ్గింపు వ్యవహారం మూలంగా ఎటువంటి భారం సినీ పరిశ్రమ పైన, ధియేటర్ల్ పైన పడుతుందనేది మాత్రం, ఆయన పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా 83 ధియేటర్లను సీజ్ చేసింది. వీటిలో 22 ధియేటర్లకు లైసెన్స్ లేదని ప్రభుత్వం చెప్తుంది. 25 ధియేటర్లకు ఫైన్ వేశామని, ఆ ఫైన్ కట్టే వరకు అది తీయటానికి వీలు లేదని చెప్పింది. మొత్తంగా చూసుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా 1100 ధియేటర్లు దాదాపుగా 130 ధియేటర్లు ఇప్పటికే మూసివేసారు. సినీ పరిశ్రమ ముదలైనప్పటి నుంచి, ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ ఇలాంటి సంక్షోభాన్ని సినీ పరిశ్రమ చూడలేదు. ఒక వైపు అటు సినీ పరిశ్రమ నుంచి, ఇటు విపక్షాల నుంచి అటు సాధారణ ప్రజలు, అభిమానుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురు అవుతున్నా కూడా, ప్రభుత్వం ఒప్పుకోలేదు.

jagan 01012022 2

పైగా ఈ రోజు సినీ పరిశ్రమనే నిందిస్తున్నారు. ఇప్పటికే హీరో నాని, హీరో సిద్ధార్ద్ బహిరంగంగా వచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టారు. అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం, సినిమా టికెట్ రేట్లను పెంచమని అనే వాళ్ళు అందరూ, ఆంటీ పూర్ అంటే, పేదవాళ్ళ వ్యతిరేకులు అంటూ, సినీ పరిశ్రమలో టికెట్ల ధరలు పెంచమని అడిగే వారందరికీ కౌంటర్ ఇచ్చారు. తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ, పేదవాళ్ళకు తక్కువ ధరలకే సినిమా చూపించటం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ధియేటర్లలో పని చేసేది అంతా పేదవాళ్ళే ఉంటారు. సుమారుగా ఒక్కో ధియేటర్ లో, 20 నుంచి 25 మంది ఆధార పడి ఉంటారు. మొత్తం 1100 ధియేటర్లలో ఎంత మంది ఎఫెక్ట్ అవుతారు, అలాగే పరోక్షంగా ఆధార పడిన వారు, సినీ పరిశ్రమ ఇలా వీళ్ళ గురించి మాత్రం పట్టించుకోలేదు. ఎవరిని టార్గెట్ గా చేసుకుని జగన్ ఈ వ్యాఖ్యలు చేసారో తెలియదు కానీ, సినీ వర్గాలు ఎలా స్పందిస్తారో చూడాలి.

జనవరి 1న సంతోషంగా ఉండాల్సిన యువతీయువకులు, జగన్మోహన్ రెడ్డి వారికి చేసిన మోసంతో బాధపడుతున్నారని, పాదయాత్ర సమయంలో ప్రతిఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన వ్యక్తి, తన పాలనలో మూడు జనవరి నెలలు పోయినా ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా, 10వేల ఉద్యోగాలతో ఫేక్ క్యాలెండర్ ప్రకటించి, నిరుద్యోగు లు, యువత ఆశలను నీరుగార్చాడని తెలుగుయువత రాష్ట్రప్రధాన కార్యదర్శి కిలారు నాగ శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! "నిరుద్యోగులకు ఏటేటా జాబ్ క్యాలెండర్ తో ఉద్యోగాలు ఇస్తానని నమ్మించిన జగన్మోహన్ రెడ్డి వారిని నిలువునా వంచించాడు. పాదయాత్ర సమయంలో ఏటా జాబ్ క్యాలెండర్ హామీతో పాటు, మెగాడీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇస్తానని చెప్పాడు. కానీ ఏ ఒక్కహామీని కూడా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నెరవేర్చ లేదు. యువతను మోసగిస్తూ, ఫేక్ క్యాలెండర్ విడుదల చేశాడు. దానిపై రాష్ట్రంలోని యువతీయువకులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బెంబేలె త్తిన ముఖ్యమంత్రి, పోలీసుల సాయంతో వారి ఆగ్రహాన్ని చల్లార్చాడు. యువత ఆగ్రహానికి జడిసి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు కూడా రాలేక పోయాడు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో యువతకు డీఎస్సీద్వారా కేవలం 17వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని ప్రతి పక్షనేతగా ఉన్నప్పుడు జగన్, తాను అధికారంలోకివస్తే, లక్షల ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహిస్తానన్నాడు. మూడేళ్ల పాలన పూర్తయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క డీఎస్సీని, ఒక్కటంటే ఒక్క జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయలేక పోయాడు. రాష్ట్రంలో 14వేలకు పైగా పోలీస్ ఖాళీలు ఉంటే, వాటిభర్తీ గురించి కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. హోం మంత్రి సుచరిత కూడా పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14లక్షల మంది యువతీ యువకులు పోలీస్ ఉద్యోగాలకోసం శిక్షణ పొందుతున్నారు . ఆఖరికి కో-వి-డ్ సమయంలో కూడా కోచింగ్ సెంటర్లలోనే ఉండి లక్షలురూపాయలు వెచ్చించి ఇప్పటికీ శిక్షణ పొందుతూనే ఉన్నారు. రాష్ట్రంలోని యువతీయువకులను ఉద్యోగాలపేరుతో ఈ ముఖ్యమంత్రి మాయమాటలతో వంచిస్తున్నాడు.

టీడీపీప్రభుత్వంలో చంద్రబాబునాయుడిగారి హాయాంలో 5లక్షల ఉద్యోగాలు ఇచ్చారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డే అసెంబ్లీలో చెప్పారు. వాటితో పాటు దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యేలా చేసిన చంద్రబాబు గారు, వాటిద్వారా 34లక్షల ఉద్యోగాలు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఆ పెట్టుబడులు, ఉద్యోగాలు అన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. ఉద్యోగాలు అంటే ఈ ముఖ్యమంత్రి తన పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్న వాలంటీర్, సచివాలయ ఉద్యోగాలు అనుకుంటున్నాడు. ఆ ఉద్యోగాలతో ఆయన్ని నమ్ముకున్నవారి కడుపులే నిండటం లేదనే వాస్తవాన్ని ఎంతత్వరగా గ్రహిస్తే అంతమంచిది. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు, నోటిఫికేష న్ల పేరుతో యువతను మోసగించడాన్ని వారి ప్రతినిధిగా తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తనహా మీలను నిలబెట్టుకుంటాడని ఇప్పటివరకు మూడేళ్లపాటు ఎదురు చూశాం. కానీ ఈముఖ్యమంత్రి చేసిన మోసంతో ఆయన్ని నమ్మే పరిస్థితులు లేవు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని మోసగించిన జగన్మోహన్ రెడ్డి, గతంలో చంద్ర బాబునాయుడు గారు నిరుద్యోగ యువతకు ఇచ్చిన రూ.2వేల నిరుద్యోగ భృతిని కూడా నిలిపి వేశాడు. అంతటితో ఆగకుండా యువతకోసం టీడీపీప్రభుత్వం ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లను, స్టడీ సర్కిళ్లనుకూడా మూసేయించాడు. చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా వారిజీవితాల్లో జగన్మోహన్ రెడ్డి చీకట్లు నింపాడు.

Advertisements

Latest Articles

Most Read