రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ అడ్డగోలుగా వ్యవహరిస్తుందనే వార్తలు గత వారం రోజులుగా వస్తున్నాయి. అయితే నిన్న విశాఖలో కొత్త రకమైన మాయాజాలానికి ఆర్వో వ్యవహరించిన తీరు ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. జీవీఎంసి ఉప ఎన్నికల్లో 31 డివిజన్ కాంగ్రెస్ అభ్యర్ధిగా బిపిన్ కుమార్ జైన్ అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేసారు. ఈ నెల 5వ తేదీన ఆర్వో బిపిన్ కుమార్ జైన్ ని కాంగ్రెస్ అభ్యర్ధిగా ధృవీకరించారు. అయితే, నిన్న గడవు లోగా అతను కాంగ్రెస్ అభ్యర్ధిగా, కాంగ్రెస్ పార్టీ బీ-ఫారం ఇవ్వక పోవటంతో, అతన్ని నిన్న మధ్యానం 3.30 గంటలకు స్వతంత్ర అభ్యర్ధిగా డిక్లేర్ చేసారు. అయితే మధ్యానం 3.30 తరువాత, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చక్రం తిప్పి, అక్కడ 31వ వార్డులో అప్పటికే అయుదు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా నామినేషన్ వేసిన వారు అందరూ కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఎందుకు ఇలా చేసారో తెలియదు. అయితే స్వతంత్ర అభ్యర్ధి అని బిపిన్ కుమార్ జైన్ కు బీరువా గుర్తును కేటాయించిన ఆర్వో, సాయంత్రం 6.30కు రిలీజ్ చేసిన లిస్టులో, బిపిన్ కుమార్ జైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అని, ఆయనకు ఫ్యాన్ గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల నిబంధనలు ప్రకారం 3.30 తరువాత, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అభ్యర్ధిని, వైఎస్ఆర్ కాంగ్రస్ అభ్యర్ధిగా ప్రకటిస్తూ చేయటం నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి వ్యవహారం అయితే ఎక్కడా చోటు చేసుకోదు కానీ, ఈ వింతలు, మాయలు అన్నీ ఆంధ్రప్రదేశ్ లో అయితే చోటు చేసుకుంటాయి. అధికార పార్టీ నేతలు, ఆర్వో పై ఒత్తిడి తెచ్చి, బిపిన్ కుమార్ జైన్ అనే వ్యక్తిని , ఇండిపెండెంట్ అభ్యర్ధి అని బీరువా గుర్తు కూడా ఇచ్చి, తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అని ఫ్యాన్ గుర్తు ఇచ్చారు. అంటే బిపిన్ కుమార్ జైన్ ఈ నెల 5వ తేదీన కాంగ్రెస్ అభ్యర్ధిగా, నిన్న మధ్యానం 3.30 గంటల వరకు కాంగ్రెస్ బీ-ఫారం ఇవ్వక పోవటం, స్వతంత్ర అభ్యర్ధిగా మారి, చివరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చక్రం తిప్పటంతో, సాయంత్రం 6.30కు అదే బిపిన్ కుమార్ జైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అయ్యారు. ఈ వింత పరిస్థితి చూసి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఆందోళనకు పిలుపు ఇచ్చాయి. ఇంకా ఎన్ని ఎన్ని వింతలు చూడాలో.