ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి జగన్ పుట్టినరోజు అని వైసిపి నేతలు చేసిన ఖర్చు హడావిడి అంతా ఇంతా కాదు. దాదాపు నెల రోజుల ముందు నుంచే జగనన్న స్వర్నో త్సవాలు పేరుతో తెగ హడావిడి చేసారు. ఇక మంత్రి రోజా హడావిడి అయితే అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆవిడ డాన్సులే. ముఖ్యమంత్రి పుట్టినరోజు అయితే ప్రజల సొమ్ము ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలా అని కూడా అని జనం అభిప్రాయ పడుతున్నారు. అయితే నిన్న జగన్ పుట్టిన రోజు సందర్భంగా పవిత్ర నది  గోదావరిలో వైకాపా నేతల అసభ్య డ్యాన్సులు వేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వైకాపా నేతలు  గోదావరి నది మధ్య పంటుపై జగన్మోహన్రెడ్డి  బర్త్ డే  వేడుకలు  జరిపినట్టు అక్కడ స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి గోదావరి పంటుపై ప్రమాదకరంగా డ్యాన్సులు వేసారని, ఎంతో  పవిత్రంగా భావించే  గోదావరి తల్లిని  అపవిత్ర పరిచారని హిందూ సంఘాల మండిపడుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా సక్రమంగా జీతాలు ఇవ్వలేక ఏడుస్తూన్న రాష్ట్రం, కోట్ల రూపాయల యాడ్స్ ఇస్తోందంటూ కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్లో ఆవేదన వెలిబుచ్చారు. రాజ్యసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై మాట్లాడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రిచేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని రాష్ట్రం దేశంలోని ఒకే ఒక్క ఆంధ్రప్రదేశ్ యేనని, అలాగే రోజూ తన సొంత పత్రికకు కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తున్నదీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కావడంతో ఆ రాష్ట్రం ఏపీయేనని అందరూ ధ్రువీకరించుకున్నారు.  దేశంలో పలు రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది నిజమేనని, అయితే ఒక రాష్ర్ట ప్రభుత్వ విధానాల కారణంగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.''నేను ఆ రాష్ట్రం పేరు చెప్పదలుచుకోలేదు. కానీ, ఆ రాష్ట్రం తన ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది. కొన్ని నెలలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించడం లేదనే వార్తలను చూస్తున్నాం. ఆ సర్కారు వద్ద వున్న డబ్బు అంతా యాడ్స్ ఇవ్వడానికి వెచ్చించి ఉండొచ్చు'' అని చాలా వ్యంగ్యంగా ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. ఏపీ ఆర్థిక అరాచకాలకు అండగా నిలుస్తూ వస్తున్న కేంద్రం, రాష్ట్రం పేరు చెప్పకుండానే ఏపీ దుస్థితిని మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చేలా చేశారు.

ఆస్కార్ అవార్డు తెచ్చుకోవాలని మోజు..కానీ రాదు. అందుకే బద్దం భాస్కర్ అనబడే బ్రహ్మానందం తనపేరు భాస్కర్ పేరుతో తానే అవార్డు నెలకొల్పుకుని ఆస్కార్ రేంజులో తనకు తానే ఇచ్చుకుంటాడు. సేమ్ టు సేమ్ ఇలాగే ఏపీ ప్రభుత్వ సలహాదారుడు తమ కార్యక్రమాలను నిర్వహించే విశాఖకి చెందిన వీరేందర్ అలియాస్ వీరుమామతో జీనియస్ అనే అవార్డు ఇప్పించుకుని గిన్నిస్ అని ప్రచారం చేసుకుంటున్నారు. గతంలోనూ ఈ వీరుమామ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ అవార్డు ఇచ్చి పారేశాడు. తనకు ఈవెంట్ మేనేజ్మెంట్ కాంట్రాక్టు ఇస్తే చాలు. ఏ అవార్డు ఇచ్చేయమన్నా నిమిషాల్లో ఇచ్చేస్తాడు మీరు మామా. అయితే తాను ఇప్పుడు గిన్నిస్ అవార్డుని సజ్జలకి అందజేయడానికి వచ్చినట్టు బెండపూడి యాక్సెంట్లో ఇంగ్లీషు మాట్లాడటం, తన వేషభాషలు మార్చడం వీరుమామకి ఈవెంట్ తో పెట్టిన విద్య. ప్రతీరోజూ వేలాది మంది నుంచి స్వచ్ఛందంగా రక్తం సేకరిస్తూ, అవసరమైన వారికి రక్తం అందిస్తూ లక్షలాది ప్రాణాలు కాపాడిన ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు, చిరంజీవి బ్లడ్ బ్యాంకు, రోటరీ, రెడ్ క్రాస్ వంటి స్వచ్ఛంద బ్లడ్ బ్యాంకులు కూడా ఈ రేంజులో ఏనాడూ ప్రచారం చేసుకోలేదు. ఏ ఒక్కరోజూ బలవంతంగా జగన్ కోసం సేకరించినట్టు రక్తదానం బెదిరించి చేయించలేదు

తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు ఈ మద్య వరుస పర్యటనలతో బిజీగా ఉంటున్నారు. ఆయన ప్రతి పర్యటనకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది, ఆయన మీటింగులకి ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు.  అటు కర్నూల్ ,ఇటు గోదావరి జిల్లాల్లో  చంద్రబాబుకి జనం బ్రహ్మరధం పట్టారు. ఇటు ఆంద్ర లోనే కాకుండా అటు తెలంగాణా లో కూడా టిడిపి తన సత్తా చూపెడుతోంది. దీనికి ఉదాహరణ నిన్న చంద్రబాబు ఖమ్మం జిల్లా పర్యటనే . ఇలా అన్నీ ప్రాంతాల్లో  చంద్రబాబు కి వస్తున్న విశేష స్పందన చూసి తెలుగు తమ్ముళ్ళు మంచి జోష్ లో ఉన్నారు. ఇదే ఊపుతో చంద్రబాబు మళ్ళీ ఈ రోజు విజయనగరంలో  పర్యటించనున్నారు. నిన్న ఖమ్మం జిల్లా  పర్యటన ముగిసిన తరువాత  అర్ధరాత్రి చంద్రబాబు ఆయన నివాసం ఉండవల్లికి చేరుకున్నారు.  చంద్రబాబు ఈ రోజు  ఉదయం 10 కి  గన్నవరం ఎయిర్ పోర్ట్ లో బయలుదేరి వైజాగ్ కు చేరుకోనున్నారు. అక్కడనుంచి  ర్యాలీగా రోడ్డు మార్గంలో సాయంత్రానికి రాజాం కు వెళ్లనున్నారు. ఆ తరువాత రాజాంలో చంద్రబాబు రోడ్ షో ఉంది,ఆ తరువాత  బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.  రాత్రికి రాజాంలో జరిగే  క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు  పాల్గొంటారు. 3 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ రోజు రాత్రికి చంద్రబాబు రాజాంలో బస చేస్తారు.

Advertisements

Latest Articles

Most Read