ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి వచ్చి కేవలం రెండున్నర ఏళ్ళు మాత్రమే అయ్యింది. అయితే మొన్న క్యాబినెట్ సమావేశంలో, ఎన్నికలకు రెడీ అవ్వాలి అంటూ చెప్పటం అందరినీ ఆశ్చర్యానికి కలిగించింది. ఇక జనల్లోనే ఉండాలి, నేను జనంలోనే ఉంటాను అంటూ జగన్ చెప్పటం, కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన అంశం. అయితే జగన్ ముందస్తుకు వెళ్తారని, కొంత ప్రాచారం ఇప్పటికే జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే, అప్పుడే ఎన్నికల సర్వేలు కూడా మొదలు పెట్టారు. ఈ సర్వే చేసింది కూడా, వైసీపీకి అనుకూలంగా ఉండే సంస్థే. అయితే ఇందులో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా 46 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది మంత్రుల పైన తీవ్ర వ్యతిరేకత ఉందట. అంటే వీళ్ళు కచ్చితంగా పోతారని ఆ సర్వే చెప్తుంది. అంటే ఇక ఊగిసలాడే వారు కూడా ఉంటారు. వారి సంగతి చెప్పలేదు. ఇక దాదాపుగా 12 మంది మంత్రుల పైన తీవ్ర వ్యతిరేకత ఉందట. అయితే ఇందులో రెడ్డి సామాజిక వర్గ మంత్రులు అయితే ఎవరూ లేకపోవటం, కొంత ఆశ్చర్యాన్ని కలిగించే అంశం అనే చెప్పాలి. అయితే ఇక్కడ చాలా ఆసక్తికర అంశాలు ఉన్నాయి. మాకు 80 శాతం పంచాయతీల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వచ్చాయని, వైసీపీ నేతలు బాగా డబ్బా కొడుతున్న విషయం తెలిసిందే.

survey 01102021 2

ఆ ఎన్నికలు ఎలా జరిగాయో అందరూ చూసారు. అయితే ఈ సర్వే ప్రకారం, వైసిపి ఓటింగ్ బాగా తగ్గిపోయింది. అదే విధంగా టిడిపి ఓటింగ్ పెరిగింది. 2019 తో పోలిస్తే వైసీపీకి 3.5% , జనసేన 1.53% ఓటింగ్ తగ్గిపోతే, తెలుగుదేశం పార్టీకి మాత్రం 3.5% ఓటింగ్ పెరిగింది. అలాగే తెలుగుదేశం , వైసీపీకి ఉన్న గ్యాప్ 3% మాత్రమే. కానీ జనసేనకి 4% ఓటింగ్ వుందని సర్వే చెప్పింది. అయితే ఇంకా డిసైడ్ చేసుకోని న్యూట్రల్ ఓటర్ 4.75% ఉన్నారని చెప్పింది. ఇంకో ఇంట్రస్టింగ్ పాయింట్ .. జులై ఎండింగ్ వచ్చిన వీరి సర్వేతో పోలిస్తే .. ఈ రోజొచ్చిన సర్వేలో వైసీపీ ఇంకా బాగా పడిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సింది, జులై ఎండ్ లోపు 20 వేలు + శాంపిల్ తీసుకుంటే, ఆగస్ట్ & సెప్టెంబర్ లో 40 వేలు + శాంపిల్ తీసుకున్నారు. అంటే వైసీపీ రోజు రోజుకీ పడిపోతుందనుకొవాలి. ఈ సర్వే శాంపిల్ సైజ్ 68,200 అంటే మంచి సైజే అన్నట్టు. అలాగే వీరు సర్వే చేసిన పాయింట్స్ .. ఇసుక ,మధ్యం, డెవలప్ మెంట్ , ఇండస్ట్రీస్ , మహిళా రక్షణ , నిరుద్యోగ , రైతుకూలి , భవన నిర్మాణ కార్మికులు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్, ప్రభుత్వం పై రోజు రోజుకీ వ్యతిరేక పెరుగుతుంది కానీ తగ్గదు. తమకు అనుకూలమైన సంస్థే ఈ విధంగా సర్వే ఇచ్చింది అంటే, వైసీపీ పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తుంది. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూములను అదే విధంగా, మద్యం పై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా ఎస్క్రో చేసి, రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్‌డీసీ ద్వారా, ఆరు బ్యాంకుల కన్సార్టియం నుంచి 25 వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని రావటానికి, ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అంగీకారం కూడా కుదిరింది. అయితే ఇప్పటికే ఈ విషయంలో రూ.21,500 కోట్ల రుణం తీసుకున్న తరువాత ఇది బయటకు తెలియటంతో, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని, ఇప్పటికే ఎఫ్ఆర్బియం పరిమితికి మించి అప్పులు చేసారని, ఇదే విధంగా అప్పులు చేయటం, కార్పోరేషన్ల ద్వారా తీసుకుని వచ్చే రుణాల పై కూడా తమకు లెక్కలు చెప్పాలని చెప్పి, కాగ్ ఆదేశించింది. బ్యాంకులు నుంచి, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల పై కూడా తమకు లెక్కలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ నేపధ్యంలోనే ఏపి ప్రభుత్వం ఈ లెక్కలు సరిగ్గా ఇవ్వకపోయినా, ఇటీవల కాలంలో ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏపీఎస్‌డీసీ ద్వారా, ఇప్పటికే రూ.21,500 కోట్లను అప్పుగా తీసుకున్న ఏపి ప్రభుత్వం, మరో 3500 కోట్ల అప్పు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

debts 01102021 2

కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వద్దని, మౌఖికంగా ఆదేశించటం, కార్పోరేషన్ల ద్వారా అప్పులు ఇవ్వద్దు అని తేల్చి చెప్పటంతో, బ్యాంకులు వెనకడుగు వేసాయి. ఈ నేపధ్యంలోనే, మద్యం పై ఆదాయం ఎస్క్రో చేయటం, అలాగే విశాఖలో ఉండే రూ.1,600 కోట్ల భూములు మీకు తాకట్టు పెడతాం అని చెప్పి, అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం అంగీకారానికి వచ్చినా, మిగతా అప్పు రాలేదు. అయితే మిగత 3500 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి చేయటంతో, విశాఖలో ఉండే భూములు తాకట్టు పెడతాం అని చెప్పిన భూములు, తమ పేరిన రిజిస్టర్ చేయాలని కోరటంతో, గత నెల 28 వ తేదీన, విజయవాడలో ఉన్న గాంధీ నగర్ రిజిస్టర్ కార్యాలయంలో, తాకట్టు రిజిస్టర్ చేసారు. విశాఖలో అత్యంత విలువైన 13 భూములను, రూ.1,600 కోట్ల కోసం ఏపి ప్రభుత్వం తాకట్టు పెట్టిసింది.

ఈ మధ్య కాలంలో వైఎస్ విజయమ్మ, అదే విధంగా ఆమె కుమార్తె షర్మిల, ఇద్దరి పై గతంలో నమోదు అయిన కేసులు విషయంలో, వాళ్ళు కోర్టుకు వెళ్ళిన వార్తలు హైలైట్ అయ్యాయి. గతంలో ఒకే రాజు షర్మిల, విజయమ్మ, ఒక కేసు పై వెళ్ళగా, జగన్ తన అక్రమస్తుల కేసులో కోర్టుకు వెళ్ళిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు జగన్ కు ఊరట లభించలేదు కానీ, మరో కేసులో మాత్రం, షర్మిల విజయమ్మకు మాత్రం ఊరట లభించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా, 2012లో జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన కొత్తలో ఉన్న రోజులు అవి. అప్పట్లో జగన్ వర్గం ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు వెళ్ళిన రోజులు అవి. ఆ సందర్భంగా 2012లో జరిగిన పరకాల ఉపఎన్నికలలో పాల్గునటానికి, వైఎస్‌ షర్మిల, వైఎస్‌ విజయమ్మ, అప్పట్లో జగన్ కు అనుకూలంగా ఉండే మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల్ సందర్భంగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అంటూ షర్మిల, వైఎస్‌ విజయమ్మ, కొండా సురేఖ దంపతుల పై కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న, ప్రజాప్రతినిధుల కోర్టులో, వీరి పై కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి, అంటే దాదపుగా పదేళ్లుగా ఈ కేసు సాగుతూనే ఉంది.

sharmila 01102021 2

అయితే ఎట్టకేలకు, ఈ కేసులో నిన్న ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. గురువారం నాడు, ఈ కేసు పై తీర్పు ఇస్తూ, వైఎస్‌ షర్మిల, వైఎస్‌ విజయమ్మ, కొండా సురేఖ దంపతులు కు ఊరట ఇస్తూ, ఈ కేసుని కొట్టేస్తూ, కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో, వీరికి ఊరట లభించింది. దాదాపుగా పదేళ్లుగా నలుగుతన్న ఈ కేసులో, పలుమార్లు, వీరు కోర్టుకు కూడా వెళ్ళాల్సి వచ్చింది. నిన్న తుది తీర్పు సందర్భంగా, షర్మిల, విజయమ్మ, కొండా సురేఖ, మురళిసహా ఏడుగురు కోర్టుకు వచ్చారు. అయితే వీరికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. మరి దీని పై ఎలక్షన్ కమిషన్ అపీల్ కు వెళ్తుందో లేదో తెలియదు కానీ, ఇలాంటి కేసులు విషయంలో, శిక్షలు పడటం అయితే చాలా అరుదు. అప్పటి రాజకీయ అవసరాల కోసం కేసులు పెట్టి, కోర్టు ముందు సరైన ఆధారాలు చూపించకుండా, తరువాత వచ్చే వారు చేయటంతో, ఇలాంటి కేసులు నిలబడటం అనేది దాదాపుగా జరగదు. ఇది ఇలా ఉంటే, షర్మిల పార్టీ పెట్టిన తరువాత, ఈ కేసు పై ఊరట లభించటంతో, వైఎస్ఆర్టిపి శ్రేణులు కోర్టు వద్ద హడావిడి చేసారు.

సుప్రీం కోర్టులో ఈ రోజు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు, దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం కావటం, దేశ వ్యాప్తంగా, మన రాష్ట్రంతో సహా జరుగుతున్న విషయం కావటంతో, ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్నటు వంటి అధికారులు, అదే విధంగా పోలీసు వ్యవస్థ పని తీరు పై, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, నిప్పులు చెరిగారు. అధికార పార్టీ అండతో చెలరేగిపోయే అధికారులు, అదే విధంగా అరాచకత్వానికి పాల్పడే పోలీసులు పై ఉక్కుపాదం మోపే విధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారనే చెప్పవచ్చు. అధికారులు, పోలీస్ వ్యవస్థ పని తీరు పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఈ అధికారులు, అదే విధంగా పోలీసుల అతి ప్రవర్తన పైన, ఆగ్రహం వ్యక్తం చేసారు. వీరి పైన దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వస్తున్న, ఫిర్యాదులను పరిష్కరించటానికి, అన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్ లతో, వారి నేతృత్వంలో ఒక స్థాయి సంఘం ఏర్పాటు చేయాలన్న ఆలోచన తనకు ఉన్నట్టుగా, జస్టిస్ ఎన్వీ రమణ తన ఆలోచనను బయట పెట్టారు. ప్రస్తుతానికి ఈ స్థాయి సంఘం ఏర్పాటుకు సబందించిన ఉత్తర్వులు జారీ చేయకపోయినా, భవిష్యత్తులో, ఒక స్థాయి సంఘం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్టు చెప్పారు.

nvr 01102021 2

అధికార పార్టీ అండతో చెలరేగిపోతున్న అధికారులు, పోలీసులు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారు, అధికార పార్టీ అండ చూసుకుని సామాన్యుల పైన ప్రతాపం చూపించే పోలీసుల పైన చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వ్యాఖ్యలు, ఈ రోజు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తావించారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ఏడీజీపీ గుర్జిందర్ పాల్ సింగ్ కేసుకు సంబందించిన కేసు విచారణ సందర్భంగా, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేసారు. భవిష్యత్తులో స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. అయితే అధికార పార్టీ అండ చూసుకుని రెచ్చిపోయే అధికారులు, పోలీస్ ఆఫీసర్లకు న్యాయ వ్యవస్థ రక్షణగా ఉండదనే విషయం గుర్తు పెట్టుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి అధికారులు, వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇలాంటి వారికి కోర్టుల్లో రక్షణ ఉండదని అన్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ధోరణి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు హైకోర్ట్, ఈ విషయం పై ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read