ఈ రోజు హైకోర్టులో, ఏపి ప్రభుత్వానికి, ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు హైకోర్టులో ఎయిడెడ్ స్కూల్స్ తో పాటు, కాలేజీలకు సంబంధించి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపివేస్తాం అంటూ, ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న బెదిరింపులతో పాటుగా, స్కూల్స్ ని అప్పగించాలని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల పై, ఈ రోజు విచారణ జరిగింది. దాదాపుగా, ఈ అంశం పై 25 పిటీషన్లు, ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఈ కేసులు మొత్తం కూడా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ధర్మాసనం, ఈ రోజు ఈ అన్ని కేసులు పై విచారణ చేసింది. ఈ విచారణ సందర్భంగా, హైకోర్టులో కేసులు విచారణ జరుగుతున్నా కూడా, ఎయిడెడ్ స్కూల్స్ ని వెంటనే యాజమాన్యాలు తమకు అప్పగించాలని, వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని అని చెప్పి, న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, శ్రీవిజయ్, సుబ్బారావులు ఈ అంశం పై హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. విల్లింగ్‌ ఇవ్వలేదని, అంగీకారం తెలపలేదని, ఎయిడెడ్ స్కూల్స్ లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపటానికి వీలు లేదని చెప్పి, స్పష్టమైన ఆదేశాలను హైకోర్టు ఇచ్చింది. అదే విధంగా హైకోర్టులో కేసులు ఉన్నంత వరకు ఎయిడెడ్ స్కూల్స్ పై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

hc 04102021 2

ఈ రెండు అంశాల పై కూడా తాము ఎటువంటి చర్యలు తీసుకోబోమని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను హైకోర్ట్ రికార్డు చేసింది. దీంతో పాటుగా, ఎయిడెడ్ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, వాటి పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తో పాటుగా, రీజినల్ జాయింట్ డైరెక్టర్లకు, జిల్లా విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, హైకోర్టు సూచించింది. ఈ నెల 22వ తేదీలోపు కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పి, ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ కేసు విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. విద్యా శాఖకు సంబందించిన అంశం కాబట్టి, దీని ప్రాధాన్యత క్రమంలో వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని కూడా, హైకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి, ఈ కేసు తేలే వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విజయవాడలో ఏడు దశాబ్దాల చరిత్ర ఉన్న, మాంటిసోరీ స్కూల్, ఇదే అంశం పై మూతపడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయం పై,అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఒకప్పటి సినీ హీరో మోహన్ బాబు, ముక్కుసూటిగా మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అనే పేరు ఉంది. గతంలో చంద్రబాబు సియంగా ఉన్న సమయంలో, కొడుకులు ఇద్దరితో కలిసి, అలాగే తన విద్యాసంస్థల విద్యార్ధులతో కలిసి, రోడ్డు మీద పడుకుని, రోడ్డు మీదే నిరసన తెలిపారు. అప్పట్లో ఫీజ్ రీయింబర్స్మెంట్ డబ్బులు రావటం, కొద్దిగా లేట్ అయితేనే, ఇంతలా హడావిడి చేసారు మోహన్ బాబు. తరువాత మోహన్ బాబు పెర్ఫార్మన్స్ నచ్చి, జగన్ మోహన్ రెడ్డి పిలిచి, వైసీపీ కండువా మెడలో కప్పారు. తరువాత జగన్ మోహన్ రెడ్డికి ప్రచారం కూడా చేసారు. మోహాన్ బాబు కోరుకున్నట్టే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇంకేముంది, తన విద్యా సంస్థలకు తిరుగు లేదని అనుకున్నారు. అంతే కాదు మోహన్ బాబుకు పదవులు కూడా ఇస్తారనే ప్రచారం జరిగింది. రెండున్నరేళ్ళ తరువాత పదవులు సంగతి పక్కన పెడితే, తన విద్యా సంస్థలకు రావాల్సిన బకయాలు కూడా మోహన్ బాబు అడగలేని పరిస్థితి చంద్రబాబు ఉన్నప్పుడు కొంచెం లేట్ అయితేనే, రోడ్డు మీద పడి ఫ్యామిలీ ఫ్యామిలీ ఆందోళన చేసి, ఇప్పుడు జగన్ రెడ్డి ఇవ్వకపోతే మాత్రం, మోహన్ బాబు అడిగే ధైర్యం చేయలేక పోతున్నారు. ముక్కుసూటిగా మాట్లాడుతారనే పేరున్న మోహన్ బాబు, పాపం ఇప్పుడు జగన్ ని అడగాలి అంటే భయపడుతున్నారు.

mohanbabu jagan 04102021 2

ఈ సందర్భంలోనే, నిన్న మోహన్ బాబు, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఏబిఎన్ లో వచ్చిన ప్రోగ్రాంలో, తన మనసులో భావాలు పంచుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై నేరుగా ఆరోపణలు చేయటానికి వెనకడుగు వేసినా, తాను చెప్పాలి అనుకున్నది మాత్రం చెప్పారు. తన విద్యాసంస్థలను ఆర్ధికంగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. విద్యా సంస్థల విషయంలో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంది వాస్తవమే అని అన్నారు. ఆర్ధిక సమస్యలు కుంగిపోవటం లేదు కానీ, ఆ పరిస్థితి తీసుకొచ్చిన వారి పై మాత్రం ఆలోచిస్తున్నానని అన్నారు. అలాగే తాను ఏమి వైసీపీ పార్టీలో లేనని, ఎన్నికల్లో ప్రచారం చేసానని, గతంలో చంద్రబాబుకి చేసాం, ఇప్పుడు జగన్ కు చేద్దాం అని అనుకున్నా అని, రాజకీయాల్లోకి రాను అంటూ దండం పెట్టారు. తాను ఏది ఆశించలేదని, పదవులు ఎవరికి ఇచ్చుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం అని అన్నారు. అయితే జగన్ ను మాత్రం డైరెక్ట్ గా అనే ధైర్యం లేక, కొంత మంది ఐఏఎస్ ల వైఖరి వల్లే, ఈ రోజు ఈ పరిస్థితి అంటూ, మోహన్ బాబు చెప్పాలి అనుకున్నది చెప్పేసి, జగన్ పేరు చెప్పటానికి మాత్రం భయపడ్డారు.

2019 ఎన్నికల తరువాత, చాలా కొద్ది రోజులుకే పవన్ కళ్యాణ్, బీజేపీకి దగ్గర అయ్యారు. అధికారికంగా పొత్తు కూడా కుదుర్చుకున్నారు. సహజంగా ఎన్నికలు అయిన వెంటనే, పొత్తులు అధికారం పంచుకోవటానికి వాడుకుంటూ ఉంటారు కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ కి కానీ, బీజేపీకి కానీ చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేదు. మరి ఇద్దరూ ఎందుకు, అప్పుడే కలిసారు అనేది వారికే తెలియాలి. పోనీ కలిసిన తరువాత, ఇద్దరూ కలిసి ఒక రాజకీయ శక్తిగా ఎదిగారా అంటే, ఎవరి దారి వారిది అనే చెప్పాలి. హైదారబాద్ జీహెచ్ఎంసి ఎన్నికల్లో అయితే పవన్ కళ్యాణ్ ని తీసి పడేసారు. దీంతో అప్పట్లో పవన్ అలిగినా, కేంద్ర పెద్దలు మళ్ళీ ప్యాచ్ అప్ చేయటంతో, ఏదో అలా అలా నడుస్తూ వచ్చారు. తిరుపతి ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా, ఓట్లు వచ్చింది లేదు. తరువాత బీజేపీ కానీ, జనసేన కానీ ఎవరి కార్యక్రమాలు వారు చేసుకున్నారు కానీ, కలిసి చేసింది అయితే లేదు. ఇక గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ పై, వైసీపీ నేతలు విరుచుకు పడుతున్నా, తమ మిత్ర పక్షాన్ని అంటారా అని బీజేపీ నేతలు పట్టించుకుంది లేదు. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నిక వచ్చింది. నాలుగు రోజులు క్రితం, ఈ బద్వేల్ ఎన్నిక పై, సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ కలిసి, మంగళగిరి జనసేన ఆఫీస్ లో సమావేశం అయ్యారు.

pk 03102021 2

తిరుపతి మీకు ఇచ్చాం కాబట్టి, బద్వేల్ మాకు ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ అడిగినట్టు వార్తలు వచ్చాయి. గతంలో టిడిపి తరుపున పోటీ చేసి, ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్న ఒక వ్యక్తిని కూడా జనసేన సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో కానీ, నిన్న పవన్ పుట్టపర్తి మీటింగ్ లో, తాము సంప్రదాయనికి గౌరవం ఇస్తూ, బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయటం లేదని అన్నారు. మరి తిరుపతి ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేసారో తెలియదు. సరే ఇది బీజేపీ-జనసేన కలిసి తీసుకున్న నిర్ణయం అని అందరూ అనుకున్నారు. అయితే ఈ రోజు సోము వీర్రాజు మాట్లాడుతూ, బద్వేలు ఉపఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. దీని పై సీఎం రమేశ్, ఆదినారాయణరెడ్డి, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి సమీక్ష చేసారు. బద్వేలు ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఒక పక్క పవన్ వద్దు అంటుంటే, సోము వీర్రాజు పోటీ చేస్తాం అని చెప్పటం పై, అసలు వీరి ఇద్దరికీ పొత్తు ఉందా లేదా అనే విషయం ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు ఇద్దరూ ఎందుకు పొత్తులో ఉన్నారో కూడా అర్ధం కాని పరిస్థితి.

రాష్ట్రానికి సంబంధించిన డ్ర-గ్స్ గుజరాత్ పోర్టు లో పట్టుబడటం మొదలు, వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏ2 విజయసాయిరెడ్డి తన పార్టీ వారికి కూడా కనిపించకుండా తిరుగుతున్నాడని, ఈనేపథ్యంలో డ్ర-గ్స్ వ్యవహారంలో విజయసాయితో పాటు, అతని అల్లుడి ప్రమేయం కూడా ఉందని తమకు అనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి అల్లుడికి రాష్ట్రానికి సంబంధించిన పోర్టుల్లో వాటాలున్నాయని, కాబట్టే పోర్టుల ద్వారా డ్ర-గ్స్ సరఫరా జరుగుతోందని, ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర బిగ్ బాసేనని వెంకన్న తేల్చిచెప్పారు. ప్రజలతోపాటు, అన్ని పార్టీల వారు రాష్ట్రం కేంద్రంగా సాగుతున్న మాదకద్రవ్యాలపై చర్చించుకుంటుంటే, బిగ్ బాస్ గానీ , విజయసాయిరెడ్డి గానీ ఎందుకు ఈ వ్యవహారంపై నోరెత్తడం లేదని బుద్దా ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ఎక్కడున్నాడో బిగ్ బాస్ కే తెలుసునని, వారిద్దరి మధ్యన ఉన్న అనుబంధం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ వ్యవహారానికి, విజయసాయిరెడ్డికి సంబంధం లేకపోతే, ప్రతిపక్షాల వ్యాఖ్యలపై ఆయనెందుకు స్పందించడం లేదన్నారు? లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఎలా దోపిడీ చేయాలో వివరిస్తూ, గతంలో మాస్టర్ ప్లాన్లు వేసిన విజయసాయిరెడ్డికి డ్ర-గ్స్ వ్యవహారంతో సంబంధం లేదంటే ఎవరూనమ్మరన్నారు. పోలీసులు తక్షణమే డ్రగ్స్ దందాలో విజయసాయిరెడ్డిని విచారించాలని, వారం పాటు కస్టడీలో ఉంచైనాసరే వాస్తవాలు రాబట్టాలని వెంకన్న డిమాండ్ చేశారు. అయినదానికీ, కానిదానికీ ప్రశ్నించేవారిపై, ప్రతిపక్షాలపై ఎస్టీ ఎస్సీ కేసులుపెట్టే పోలీసులు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న డ్ర-గ్స్ దందాలో ప్రమేయమున్న విజయసాయిని ఎందుకు అరెస్ట్ చేయరని టీడీపీ నేత ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలను ఉద్దేశించి, ఇష్టమొచ్చినట్లు మొరిగే కుక్కలన్నింటినీ, టీడీపీ ప్రభుత్వం వచ్చాక కుక్కల వ్యాన్ ఎక్కించి, ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేరుస్తామని వెంకన్నహెచ్చరించారు. రూ.43 వేల కోట్ల సొమ్ము ఈడీ ద్వారా జప్తుకాబడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విజయసాయి, నీతి, నిజాయితీ గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. గతంలో విశాఖ కేంద్రంగా జరిగిన అనేక భూదందాలు, ఆక్రమణలు, ప్రభుత్వ భూముల స్వాహాకు సంబంధించిన వ్యవహారాల్లో విజయసాయి రెడ్డే ప్రధాన వ్యక్తిగా వ్యవహరించాడన్నారు. రాష్ట్రంలో బిగ్ బాస్ సాగిస్తున్నఇసుక దందా, డ్ర-గ్స్ మాఫియా, లిక్కర్ మాఫియా వంటి వాటన్నింటికీ సలహాలు, సూచనలు ఇచ్చేదే విజయసాయిరెడ్డని, అలాంటివ్యక్తి డ్ర-గ్స్ వ్యవహారం బయట పడగానే ఎక్కడికి పోయాడన్నారు. ఏం జరిగినా తుర్రుమంటూ ట్వీట్లుపెట్టే విజయసాయి, రాష్ట్రాన్ని కబళిస్తున్న డ్రగ్స్ర్ రాకెట్ పై ఎందుకు ఒక్కసారి కూడా స్పందించలేదన్నారు?

ఉత్తరాంధ్ర కేంద్రంగా సాగే అన్నివ్యవహారాలు,దోపిడీల్లో విజయసాయిరెడ్డి ప్రమేయం స్పష్టంగా ఉందన్న బుద్దా, ఆ ప్రాంతానికి చెందిన మంత్రులెవరూ ఆయనకు వ్యతిరేకంగా నోరుతెరిచే పరిస్థితి లేదన్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువగా నివసించేది బడుగు, బలహీన వర్గాల వారేనని, వారిని భయపెట్టి తన పబ్బం గడుపుకుంటూ తన ఆస్తులు పెంచుకుంటున్న విజయసాయిరెడ్డి, తన అవినీతిని ప్రశ్నిస్తున్న టీడీపీపై నిందలేయడం విచిత్రంగా ఉందన్నారు. విజయసాయిరెడ్డి తన గురించి, తన దోపిడీ, అవినీతి మర్చిపోయి, చంద్రబాబు నాయుడు,లోకేశ్ లపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని బుద్ధా మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పోయాక, విజయసాయి అవినీతి, దోపిడీపై విచారణకు ఆదేశిస్తే, ఒక్క సీబీఐ తప్ప ఏ సంస్థా కూడా అతని అక్రమార్జన గుట్టుమట్లను తేల్చలేదని వెంకన్న స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విజయసాయి అక్రమార్జన, అవినీతి వ్యవహారాలను నిగ్గుతేలుస్తామని, అవన్నీ బయటపడితే, విజయసాయిరెడ్డి దోచిన డబ్బుకు శిక్ష లేయాలంటే చట్టాల్లో ఇప్పుడున్న శిక్షలుకూడా సరిపోవన్నా రు. ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరనే వాస్తవాన్ని విజయసాయి, బిగ్ బాస్ లు గుర్తుంచుకుంటే మంచిదని వెంకన్న హితవు పలికారు. వారు దోచిన సొమ్ముని రాష్ట్ర బడ్జెట్లో పెడితే, ఏపీలో ఇళ్లులేని పేదలందరికీ ఇళ్లు ఇవ్వ వచ్చని, రోడ్లన్నీ బాగు చేయవచ్చని, ఉచితంగా పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని వెంకన్న పేర్కొన్నారు. వందల తరాలకు సరిపడేలా ప్రజల సొమ్ముని ఏ1, ఏ2లు లూఠీ చేశారన్నారు. ఆఖరికి రాష్ట్ర యువత తను నాశనంచేసి, కోట్లు కొల్లగొట్టడానికి ఏపీని డ్ర-గ్స్ కు అడ్డాగా కూడా మార్చారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, ఉత్తరాంధ్ర కేంద్రంగా విజయసాయి సాగించిన భూఆక్రమణలన్నింటిపై విచారణ జరిపించి, ఎవరి భూములు వారికి ఇప్పించే తీరుతామని వెంకన్న తేల్చిచెప్పారు. ఇప్పటికైనా ఏ1 , ఏ2లు మారి, వారు దోచినదాన్ని పేదల కోసం పంచితే, కొంతలో కొంతైనా వారి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయని బుద్దా హితవు పలికారు. ఇప్పటికైనా దోపిడీమాని, ఈప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో, రోజులు లెక్కబెట్టుకుంటూ గడిపితే మంచిదన్నారు. పవన్ కల్యాణ్ ను పోసానితో తిట్టించిన ప్రభుత్వ వైఖరిని తాము తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు. బూతులు మాట్లాడితే హీరోలు అవుతామని వైసీపీ వారు భావిస్తున్నారని, వారికంటే నీచంగా బూతులు మాట్లాడే వారు చాలామందే ఉన్నారన్నారు.

Advertisements

Latest Articles

Most Read