ఇప్పటికే ఫారం-7 తో రచ్చ రాచ్చ చేస్తున్న జగన, ఇప్పుడు ఏపిలోని, తెలంగాణా బోర్డర్ ఊళ్ళు టార్గెట్ గా, కేసీఆర్ తో కలిసి, మరో ఓటు స్కాంకు తెర లేపారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త వివాదం ప్రారంభమైంది. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం, పద్దాపురం గ్రామంలో తెలంగాణ సహా ఇతర ప్రాంతాలకు చెందినవారి ఓట్లను చేర్చారంటూ స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీరులపాడు తాహశీల్దారు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లాల్లో తెలంగాణకు సంబంధించిన ఓటర్లను ఏపీలో చేర్చడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వాళ్ళు ఎవరూ మా ఊరిలోనే లేరని, వీళ్ళు ఎవరూ అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

tg votes 07032019 2

దీనికి సంబంధించి గురువారం ఉదయం పెద్దాపురం గ్రామంలో తెలంగాణకు సంబంధించిన 70 ఓట్లను చేర్చారు. వారంతా టీఆర్ఎస్, వైసీపీ సానుభూతిపరులని.. ఆ గ్రామం టీడీపీ నేతలు ఎమ్మార్వో దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ విషయం తన దృష్టికి రాలేదని ఎమ్మార్వో చెప్పడంతో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఎమ్మార్వో, బూత్ లెవెల్ అధికారులకు తెలియకుండా ఈ ఓట్లు ఎలా చేర్చారని ప్రశ్నించారు. పైగా తెలంగాణ ఆధార్ కార్డు ఉన్నప్పుడు, ఏపీ ఓటర్ల జాబితాలో ఈ ఓట్లు ఎలా వచ్చాయని నిలదీయడంతో అధికార్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే తెలంగాణా బోర్డర్ ఊళ్ళు టార్గెట్ గా, మరో కొత్త కుట్రకు తెర లేపారని, తెలుస్తుంది.

tg votes 07032019 3

మరో పక్క ఫారం-7 పై చంద్రబాబు మాట్లాడారు. దుష్టశక్తులన్నీ ఏకమై కుట్రల మీద కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘తప్పులు చేయడానికి ఫారం-7 వాడటం నేరం. వాటిని దుర్వినియోగం చేశామని వైకాపా అధ్యక్షుడు జగనే అంగీకరించారు. ఓట్లుపోయిన వాళ్లంతా ఆయన్ని నిలదీయాలి. ఏకంగా 13 లక్షల ఫారం-7లను పంపించారు. బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచే ఈ కుట్ర జరిగింది. ఓటర్ల జాబితాలో పేరుందో లేదో సరిచూసుకోవాలి’ అని చెప్పారు. ‘తెదేపా గెలిస్తే తమ ఆటలు సాగవనేదే వారి భయం. నేనెప్పుడూ నేరాలకు పాల్పడను. నేరగాళ్ల అరాచకాలను సహించను. పిచ్చి పిచ్చి ఆటలాడితే సహించేది లేదు’ అని స్పష్టంచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని వైసీపీ కుట్ర పన్నడం వాస్తవమేనని స్పష్టమైంది. ఇప్పటివరకు పోలీసులు నమోదుచేసిన కేసులను పరిశీలిస్తే 2,81,000 అసలైన ఓట్లను తొలగించాలని ఫామ్‌-7 దరఖాస్తులు రాగా.. అందులో 95 శాతం వైసీపీ పెట్టిన దరఖాస్తులే కావడం గమనార్హం. బూత్‌ స్థాయి నాయకుల పేరిట.. ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఏ సంబంధం లేని బూత్‌ స్థాయి నేతలు ఇప్పుడు పోలీసు కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇతరుల ఓటుహక్కు తొలగించేందుకు కుట్ర చేయడంతోపాటు తమ సమయం వృథా చేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్కడికక్కడ పోలీసులకు ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో తమ కళ్ల ముందు కనిపించే వారి ఓట్లు తొలగించాలని ఫిర్యాదు చేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు.

buggana 07032019 1

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రానికి 355 కేసులు నమోదైనట్లు తెలిసింది. ఇందులో 239 కేసుల్లో సూత్రధారులెవరో తేలింది. మరిన్ని కేసుల్లో చనిపోయిన వారి పేరుతో ఫిర్యాదులు వచ్చాయి. అప్‌లోడ్‌ చేసిన ఐపీ అడ్ర్‌సల ఆధారంగా బాధ్యులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకూ 13 జిల్లాల్లో 2,300కి పైగా ఐపీ అడ్ర్‌సలను పసిగట్టినట్లు సమాచారం. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ అప్‌లోడ్‌ చేసిన ఫామ్‌-7లే అధికంగా ఉండగా ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం టీడీపీ నుంచి ఎక్కువగా వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వాటితో పోలిస్తే తెలుగుదేశం వాటా 3 శాతమే. రెండు శాతం ఫిర్యాదులు పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు చేసినట్లు తెలిసింది. మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నుంచి అప్‌లోడ్‌ అయిన దరఖాస్తులు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని సీ డాక్‌ ద్వారా తీసుకుని పకడ్బందీగా దర్యాప్తు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది.

buggana 07032019 1

డోన్‌ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వేల సంఖ్యలో ఫామ్‌-7 దరఖాస్తులు పెట్టి అడ్డంగా బుక్కయ్యారని తెలిసింది. తన నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓటర్ల జాబితాను సేకరించి.. వేల సంఖ్యలో ఓట్లు తొలగింపునకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. పలు నెట్‌ సెంటర్ల నుంచి ఫామ్‌-7 దరఖాస్తులు అప్‌లోడ్‌ అయ్యాయి. ఆయా సెంటర్ల నిర్వాహకులను పోలీసులు విచారించారు. ఈ పనిచేయాలని ఎవరు చెప్పారు.. ఇలా చేసినందుకు ఎంత డబ్బు ఇచ్చిందీ వారు వెల్లడించినట్లు తెలిసింది. ఇందులో ఎక్కువగా ఒక బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి (కేఈ కుటుంబం నుంచి) టీడీపీ తరపున బరిలో నిలవనున్నారు. దాంతో ఆ వర్గం ఓటర్లను వైసీపీ టార్గెట్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

 

తెలుగుదేశం పార్టీని దోషిగా చూపిద్దాం అనుకుని, ఇప్పుడు డేటా చౌర్యం రగడలో టీఆర్‌ఎస్‌ అడ్డంగా ఇరుక్కుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డేటా చోరీకి గురైందని సొంతంగా కేసు నమోదు చేసుకుని.. ఏకంగా ఆ ప్రభుత్వం పైన కేసు కూడా పెడతామని బెదిరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే తరహా సమాచారాన్ని అక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి స్థాయిలో వాడుకున్నాయని.. వాళ్లకు తప్పు కానిది ఇక్కడ తప్పు ఎలా అయిందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం 50 దేశాలకు తరలిపోయిందని వారు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో కూడా దీనిపై విమర్శలు, ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ మిషన్‌ కాల్‌క్యాంపెయిన్‌ పేరుతో ఒక ప్రాజెక్టును కేటీఆరే ముందుండి నడిపించారని సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

trsmission 07032019 2

దీనికి సంబంధించి పలు స్ర్కీన్‌షాట్లు ఒక వీడియో వైరల్‌ అవుతున్నాయి. అందులో ఒక వ్యక్తి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ మిషన్‌ డాట్‌ కామ్‌లో మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన లబ్ధిదారుల డేటా అప్‌లోడ్‌ చేయడం జరిగిందని.. అందులో ఫోన్‌ నంబర్లు కూడా ఉంటాయని.. ఆ లబ్ధిదారులకు ఫోన్‌ చేసి టీఆర్‌ఎ్‌సకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని వివరిస్తున్న దృశ్యాలున్నాయి. ‘టీఆర్‌ఎస్‌ మిషన్‌ కాల్‌ క్యాంపెయిన్‌’ అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ఆ యాప్‌కు సంబంధించిన పలు స్ర్కీన్‌ షాట్లు కూడా కనిపిస్తున్నాయి. ఒక స్ర్కీన్‌ షాట్‌లో.. ‘ఆసరా’ లబ్ధిదారు అయిన ఒక మహిళ పేరు, ఫోన్‌ నంబర్‌, నియోజకవర్గం, చిరునామా ఉండడం గమనార్హం.

 

trsmission 07032019 3

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన ‘టీఆర్‌ఎస్‌మిషన్‌’ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించారు. వెబ్‌సైట్‌ కూడా ప్రస్తుతం పనిచేయ డం లేదు. ఐటీ గ్రిడ్స్‌ డేటా చౌర్యం కేసు బయటికి రావడంతో.. ముందస్తుగానే వాటిని తొలగించారనే విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం బయట పెట్టిన విషయం గ్రహించి టీఆర్ఎస్ ఎదురు దాడి మొదలు పెట్టింది. అసలు ఈ యాప్ కు మా పార్టీకి సంబంధం లేదు అంటూ, స్టేట్మెంట్ లు ఇస్తున్నారు. అయితే తెలుగుదేశం మరిన్ని ఆధారలు విడుదల చేసింది, టీఆర్ఎస్ మిషన్ యాప్, కేసీఆర్ కుమార్తె, కవిత రిలీజ్ చేసిన ఫోటో, దానికి సంబంధించి అప్పుడు వచ్చిన పేపర్ కటింగ్స్ బయట పెట్టింది టిడిపి.. ఒక తప్పు చేసి, ఆ తప్పు కప్పిపుచ్చుకోవటానికి, కేటీఆర్ ఆడుతున్న వరుస డ్రామాలను, తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ఎక్ష్పొజ్ చేస్తూ వస్తుంది. మరి ఈ ఫోటోల పై కేటీఆర్ , టీఆర్ఎస్ ఏమంటారో చూడాలి...

వేడి అందుకుంటోంది. వేగం పెరిగింది. రాజకీయ పక్షాలు అభ్యర్ధుల జాబితాను సిద్ధంచేస్తున్నాయి. అధినేతలు సైతం తమ సహజశైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పాదయాత్రలో ఒకరు అభ్యర్ధుల ఎంపికను దాదాపుగా పూర్తిచేస్తే, మరొకరు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల ఎంపికను చేపట్టారు. గెలుపుగుర్రాలుగా భావించేవారిని మాత్రమే రెండు పక్షాలు అభ్యర్ధులుగా ఎంచుకుంటున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ వస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా, వన్ టూ వన్ చర్చల్లో భాగంగా ముఖ్యమంత్రి ఆయా నేతలకు భరోసా ఇస్తున్నారు. వారివారి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు.

cbnphone 07032019

అయితే నిన్న కొంచెం భిన్నంగా చంద్రబాబు వ్యవహరించారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవటం కోసం, అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. రోజూ నిర్వహించే టెలి కాన్ఫరెన్స్‌లో భాగంగా బుధవారం ఉదయం చాట్రాయికి చెందిన టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మందపాటి బసవారెడ్డికి సీఎం ఫోన్‌చేసి పార్టీ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో బసవారెడ్డి మాట్లాడుతూ పింఛన్ల రెట్టింపు, పసుపు, కుంకుమ, అన్నదాత సుఖీభవ మొదలైన పథకాల అమలుతో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నాయకత్వంలో వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు.

cbnphone 07032019

చాట్రాయి మండలంలో పోతనపల్లి, బూరగ్గూడెం, పర్వ తాపురం గ్రామాలు ఒకప్పుడు కాంగ్రెస్‌కు, ఇప్పుడు వైసీపీకి ఏకపక్షంగా ఉన్నాయని, ఈ గ్రామాల వల్ల మండలంలో టీడీపీకి మెజారిటీ రావడం లేదని, ఈసారి ఆ పరిస్థితి లేదని తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బసవారెడ్డి చాలా అర్థవంతంగా మాట్లా డారని కితాబునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల పార్టీకి మేలు జరగాలంటే స్థానిక నాయకత్వం సమర్థవంతంగా పనిచేసి, ఓటుబ్యాంకును గణనీయంగా పెంచాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలని, అనేక కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉన్న వర్గాలను దగ్గర చేసుకోవాలని కోరారు.

 

Advertisements

Latest Articles

Most Read