ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగించే కుట్రపై వైకాపా నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఫారం-7 ద్వారా నకిలీ దరఖాస్తులతో ఓట్లు తొలగించే కుట్రకు వైకాపా పాల్పడుతోందని.. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. విజయవాడ తెదేపా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, భాజపాతో చేతులు కలిపి వైకాపా అధ్యక్షుడు జగన్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం కుర్చీ కోసం ఎన్ని అరాచకాలైనా చేయగల సమర్థుడు జగన్‌ అని ఉమ విమర్శించారు. జగన్ కు అధికార పిచ్చి పట్టుకుందని, అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కుట్రలకు పాల్పుడుతోందని అన్నారు.

uma 06032019

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. అందుకే కులాలు, మతాల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కుట్ర చేస్తున్నారని ఉమ దుయ్యబట్టారు. ‘‘అధికారమే పరమావధిగా జగన్‌ మాట్లాడుతున్నారు. ఫారం-7 తానే దరఖాస్తు చేయించానని జగన్‌ ఒప్పుకున్నారు. జగన్‌ ఒప్పుకున్నందున ఈసీ తక్షణమే స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో 24లక్షల ఓట్లు తొలగించి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారు. ఏపీలో 54 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని జగన్‌ కుట్ర పన్నారు. నెల్లూరు సభలో జగన్‌ మాట్లాడిన భాష జుగుప్సాకరం. ఓ అజెండా లేకుండా దిక్కుతోచని స్థితిలో ఆయన మాట్లాడుతున్నారు’’ అని ఉమ ధ్వజమెత్తారు.

uma 06032019

లోటస్ పాండ్ లో కేటీఆర్, జగన్ లు సమావేశమయిన తర్వాతే డేటా చోరీకి ప్లాన్ జరిగిందని దేవినేని తెలిపారు. ఫామ్ 7 దరఖాస్తులను తామే పెట్టామని జగన్ ఒప్పుకున్నారని... ఆయనపై ఎన్నికల సంఘం ఏ1 మద్దుయిగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ వాడుతున్న భాష చాలా నీచంగా ఉందని మండిపడ్డారు. ఎలాంటి అజెండా లేని జగన్... పసలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా ఉందని... రిజర్వ్ బ్యాంకే ఈ విషయాన్ని ప్రకటించిందని చెప్పారు. ఐటీ యాక్టును టీఆర్ఎస్, వైసీపీ దుర్వినియోగం చేస్తుందన్నారు. వైఎస్ జగన్ పదవీ వ్యామోహంతోనే ఏపీపై కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ డైరెక్షన్ లో కేసీఆర్, జగన్ లు పనిచేస్తున్నారని, ఈ ఆటలు తమ దగ్గర సాగవన్నారు. ఇప్పటికైనా ఏపీ డేటా చోరీ విషయంలో అసలు విషయాలను బయటపెట్టాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన డేటా పూర్తి సురక్షితంగా ఉందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్‌, ఆర్టీజీఎస్‌ సీఈవో అహ్మద్‌ బాబు స్పష్టం చేశారు. ఏపీ డేటా చోరీకి గురైందంటూ వస్తున్న వదంతులను తీవ్రంగా ఖండించారు. మంగళవారం వారిద్దరూ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆధార్‌ డేటా చోరీకి గురయ్యే అవకాశం లేదని విజయానంద్‌ స్పష్టం చేశారు. యూఐడీఏఐకి చెందిన సెంట్రల్‌ ఐడెంటిటీ డేటా డిపాజిటరీలో ఆధార్‌ డేటాను భద్రపరుస్తారని ఆయన చెప్పారు. ‘ప్రజాసాధికార సర్వేకు సంబంధించిన డేటా కూడా రాష్ట్రం వద్ద భద్రంగా ఉంది. ఈ డేటాను సంక్షేమ పథకాల అమలు కోసం ఏదైనా ప్రభుత్వ శాఖ కోరితే దానిని నేరుగా కాకుండా వెబ్‌సర్వీస్‌ ద్వారా అందజేస్తాం. దీనివల్ల డేటాను ఆ శాఖ అప్‌లోడ్‌ చేసుకోవడమే తప్ప డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉండదు.

rtgs 06022019

డేటా చోరీకి ఎవరైనా ప్రయత్నిస్తే మాకు తక్షణమే సమాచారం వస్తుంది. ప్రతినెలా డేటా భద్రతను పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఏపీ సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ ద్వారా రాష్ట్రానికి సంబంధించి డేటా భద్రతను పర్యవేక్షిస్తున్నాం’ అని వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు తమ సంక్షేమ పథకాల అమలును ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తాయని, అలాంటి సమయంలో ఆ శాఖలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఆయా సంస్థలతో పంచుకుంటే ఆ సంస్థలు నివేదికలు సిద్ధం చేస్తాయని విజయానంద్‌ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు మాత్రమే ప్రభుత్వం జన్మభూమి సభల్లో విడుదల చేస్తుందని ఆర్టీజీఎస్‌ సీఈవో అహ్మద్‌బాబు తెలిపారు. ప్రజాసాధికార సర్వేలో సేకరించిన డేటా, ఆధార్‌ ద్వారా వచ్చిన డేటా ఎక్కడా లీకయ్యే అవకాశం లేదని చెప్పారు. ‘సంక్షేమ పథకాల నిర్వహణ కోసం వివిధ శాఖలకు డేటాను ఎన్‌క్రిప్టెడ్‌ ఫామ్‌లో పంపుతాం. ఆ శాఖకు సంబంధించిన ఒక ఆథరైజ్డ్‌ అధికారికి మాత్రమే ఆ డేటాను డీక్రిప్ట్‌ చేసే కోడ్‌ ఇస్తాం. 2016 ఆధార్‌ చట్టం ప్రకారం.. వ్యక్తుల ఆధార్‌ నంబర్‌ను కూడా ప్రభుత్వశాఖలకు తెలియనివ్వకూడదు. అందుకే ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్‌ నంబర్‌కు 28 అంకెలతో కూడిన ఒక వర్చువల్‌ ఐడీ క్రియేట్‌ చేశాం. సంక్షేమ పథకాలు అమలుచేసే శాఖలకు కేవలం ఆ ఐడీ మాత్రమే ఇస్తున్నాం’ అని అహ్మద్‌బాబు తెలిపారు.

rtgs 06022019

మంత్రివర్గ సమావేశంలోనూ ఈ పరిణామాలపై విజయానంద్‌ మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ఎవరో చోరీ చేశారన్న ఆరోపణలు పచ్చి అబద్ధం. ప్రభుత్వంలో ఏది రహస్యంగా ఉండాలో ఆ సమాచారం అంతా నూటికి నూరు శాతం పకడ్బందీగా ర క్షణలో ఉంది. ఆ డేటా అంతా క్లౌడ్‌లో ఉంది. దానిని ఎవరూ తీసుకోలేరు. ఈ డేటా సంరక్షణకు ప్రత్యేకంగా కోర్‌ డేటా అథారటీని నెలకొల్పాం. డేటా చౌర్యం జరగకుండా చూడటానికి సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ను సచివాలయంలో ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం రహస్యం కాదు. వాటిని ప్రతి గ్రామంలో బహిరంగంగా ప్రదర్శిస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల సమాచారం ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి. లబ్ధిదారుని ఆధార్‌ నంబర్‌ మరొకరికి తెలిసినా ఏం నష్టం లేదు. ఆ లబ్ధిదారుని వేలిముద్ర పడితే తప్ప అతని ఆధార్‌ ఖాతాలోకి వెళ్లలేరు. మేం ప్రతి శాఖకు లబ్ధిదారుల జాబితా అందచేశాం. అవేవీ రహస్యం కాదు. ఆ వివరాలు తెలుసుకోవడం డేటా చౌర్యం కిందకు రాదు’ అని ఆయన తేల్చిచెప్పారు.

 

 

ఏపీ ప్రభుత్వ డాటా చోరీకి గురయిందని.. ఆ ప్రభుత్వానికే తెలియకుండా.. సొంతంగా కేసు నమోదు చేసేసుకుని.. ఏకంగా ఆ ప్రభుత్వంపైనే కేసు పెడతామనే వాదన వినిపిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో.. ప్రజల వ్యక్తిగత సమాచారం.. మొత్తం... విదేశాలకు తరలిపోయింది. అదీ కూడా స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. దీనికి సంబంధించి ఓ ప్రత్యేకమైన మిషన్ నడిచింది. ఇప్పుడి.. తెలంగాణతో పాటు... తమ రాష్ట్ర డేటా విషయంలో కేటీఆర్ చేస్తున్న హడావుడిని దగ్గరగా చూస్తున్న ఏపీ ప్రజల్లోనూ... ఆసక్తి రేకెత్తిస్తోంది. "కాల్‌ క్యాంపైన్‌ మిషన్‌" తో ప్రజల వ్యక్తిగత సమాచారం లీక్..! తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కన్నా ఆరు నెలల ముందే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ఇందులో కేటీఆర్ కీలక బాధ్యతలు నిర్వహించారు. బాధ్యతల్లో తెర ముందే కాదు.. తెర వెనుక ప్రచార వ్యూహం కూడా ఉంది. అందులో భాగంగా.. "కాల్‌ క్యాంపైన్‌ మిషన్‌" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో... వాలంటీర్లను ప్రవాస తెలంగాణ టీఆరఎస్ సానుభూతి పరులను ఇందు కోసం ఎక్కువగా వినియోగించుకున్నారు. వారితో ప్రత్యేకంగా టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించి... తెలంగాణ ప్రజల డేటా మొత్తం...టీఆర్ఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నామని... అందులో నుంచి సమాచారం తీసుకుని... "కాల్‌ క్యాంపైన్‌ మిషన్‌" లో భాగంగా ప్రజలకు ఫోన్లు చేసి.. ఓట్లు అభ్యర్థించాలని కోరారు.

ktr 06032019 1

50కుపైగా దేశాలకు చేరిన తెలంగాణ ప్రజల డేటా..? తెలంగాణ రాష్ట్ర సమితి.. తరపున పని చేయడానికి దాదాపుగా యాభై దేశాల్లో... తెలంగాణ ప్రజలు ఆసక్తి చూపించారని.. ఎన్నికల సమయంలో...టీఆర్ఎస్ వర్గాలు గొప్పగా చెప్పుకున్నాయి .ఆ ఉద్దేశం ఈ "కాల్‌ క్యాంపైన్‌ మిషన్‌". ఈ లెక్కన.. తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం... యాభైకిపైగా దేశాలకు చేరిపోయిందని తెలుస్తోంది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఏమిటంటే.. యాప్‌లో ఉన్న తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని.. దానికి తగ్గట్లుగా.. మిషన్ ను నిర్వహించాలనే సూచనలు ఉన్నాయి. అంటే.. ఫోన్ నెంబర్లు సహా.. ప్రజల వ్యక్తిగత సమాచారం.. దేశాలు దాటిపోయినట్లేనన్న విమర్శలు వస్తున్నాయి. ఎక్కడా సీక్రెసీ లేదు.. అంతా బహిరంగమే..! పోస్టర్లేశారు..! వాట్సాప్ స్టేటస్‌లు పెట్టారు..! ఇంకా ఎంత చేయాలంటే.. అంత చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం... అయిన ప్రజల వివరాలు.. ప్రభుత్వ లబ్దిదారుల వివరాలు... టీఆర్ఎస్ భవన్ నుంచి యాప్‌లో అప్ లోడ్ చేశారని నేరుగా పోస్టర్లేసి మరీ.. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. అసలు ప్రజల సమాచారం.. పార్టీ ఆఫీసు నుంచి ఎలా అప్ లోడ్ చేశారు. వారికి సమాచారం ఎలా వచ్చందన్నది.. అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో చెరపడానికి.. చెరిపేయడానికి వీల్లేని సాక్ష్యాలు ఉన్నాయి. యాప్‌లో అప్‌లోడ్ చేసి సమాచారాన్ని టీడీపీ యాప్ పై కేసు పెట్టిన తర్వాత కనిపించకుండా చేశారు. కానీ.. అప్ లోడింగ్.. డౌన్ లోడింగ్ వ్యవహారాలు డిలీట్ చేయలేరు. పాత వీడియో కాన్ఫరెన్సుల క్లిప్ లు డిలీట్ చేయలేరు. దానికి సంబంధించి వీడియోలు పోస్టర్లు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ktr 06032019 1

కేటీఆర్ చేసిన తప్పును.. టీడీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారా..? టీడీపీ యాప్‌లో ప్రభుత్వ సమాచారం ఉందో లేదో తెలియదు. కానీ ఆ పార్టీకి చెందిన 60 లక్షల మంది సభ్యుల సమాచారం ఉంది. సర్వే నివేదికలు ఉన్నాయి. సర్వేల పేరుతో టీడీపీ నేతలు మూడు కోట్ల మందికి రీచ్ అయ్యారు. ఆ వివరాలు ఉన్నాయి. అంత వరకూ తెలుసు. ఆధార్ డేటా లీకేజీ అని మొదట కేటీఆర్ ఆ తర్వాత పోలీసులు ప్రకటనలు చేశారు. కానీ.. అది అసాధ్యం అని నిపుణులు తేల్చారు. ఏపీ ప్రభుత్వం కూడా.. సాంకేతిక వివరాలతో మొత్తం వివరణ ఇచ్చింది. కానీ. .ఇప్పుడు.. తెలంగాణ ప్రభుత్వ డేటాను.. చోరీ చేసినట్లుగా...పరోక్షంగా కేటీఆర్ .. టీఆర్ఎస్ అంగీకరించినట్లుగా ఉన్న వీడియోలు, టీఆర్ఎస్ వ్యవహారాలు బయటకు వచ్చాయి. మరి దీనికి కేటీఎం ఏం చెబుతారు..? ఆయన ప్రెస్‌మీట్‌లో చెప్పినట్లు.. తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం.. లీక్ చేయడం.. తీవ్రమైన నేరమా..? కాదా..? దీనిపై ఆయన బాధ్యత తీసుకుంటారా..? శకునం చెప్పే బల్లి కుడితిలో పడటం అంటే ఇదేనేమో..?.

 

2004-09 మధ్య రౌడీయిజంతో రాష్ట్రానికి అప్రదిష్ట వచ్చిందని, ఆ ఐదేళ్లలో ఫ్యాక్షనిస్టులు పేట్రేగిపోయారని, ప్రస్తుతం రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. వైసీపీ నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, ‘ఆంబోతులను కట్టడి ఎలా చేయాలో నాకు తెలుసు’ అని ఆయన అన్నారు. బుధవారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓట్ల తొలగింపు కుట్రలో ఏ-1 నిందితుడు జగన్ అన్నారు. ఫారమ్ 7 దుర్వినియోగం వైసీపీకి సిగ్గుచేటని, ఫారమ్-7 దుర్వినియోగం చేశామని జగనే ఒప్పుకున్నాడని, ఫారమ్-7 దరఖాస్తులు 13లక్షలు పంపుతారా..? అని ప్రశ్నించారు.

cbn tele 06032019

అలాగే బెంగళూరు, హైదరాబాద్ నుంచే ఫారమ్ 7 కుట్రలు జరిగాయని, ఓట్లు పోయిన వాళ్లంతా జగన్‌ను నిలదీయడమేగాక ఓటు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలన్నారు. తప్పులు చేయడం, శిక్షలు అనుభవించడం జగన్‌కు అలవాటేనని, జగన్ వల్ల ఎందరో కేసుల్లో చిక్కుకున్నారని, జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తప్పులు చేసేవాళ్లు, నేరగాళ్లకే వైసీపీలో చోటు లభిస్తుందని, వైసీపీలో ఉంటే ఎవరైనా తప్పులు చేయాల్సిందేనన్నారు. నేరాలు, ఘోరాలు చేసే ఆలోచనలు వైసీపీ చేస్తోందని, అభివృద్ధి, సంక్షేమం ఆలోచనలు టీడీపీ చేస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఓట్లు గల్లంతైన వారంతా జగన్‌ను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.

cbn tele 06032019

‘ఓట్ల తొలగింపు, కుల రాజకీయాలు, ఎన్టీఆర్‌ విగ్రహాల ధ్వంసం వంటి తప్పుడు పనులకు వైసీపీ పాల్పడుతోంది. అంతటితో ఆగకుండా పొరుగు రాష్ట్రం నుంచి మనపై కుట్రలకు తెగబడ్డారు. జగన్‌ అరాచకాలు శ్రుతిమించాయి. ఓటమి భయంతోనే ఈ కుట్రలు, అరాచకాలకు పాల్పడుతున్నారు. అహంకారం నెత్తికెక్కి టీఆర్‌ఎస్‌ విపరీత చేష్టలకు పాల్పడుతోంది. వాళ్లకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. హద్దులు దాటుతున్నారు. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోం’ అని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్న టీఆర్‌ఎస్‌, వైసీపీ, బీజేపీల తప్పుడు విధానాలను ఎండగట్టాలని.. వీళ్ల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని టీడీపీ శ్రేణులకు పిలుపిచ్చారు. ‘కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. ఆంధ్రను సామంత రాజ్యం చేసుకోవాలనేదే కేసీఆర్‌ కుట్ర. జగన్‌ను లొంగదీసుకుని దాడులకు తెగబడ్డారు. కేసీఆర్‌కు ఆయన సామంతరాజుగా మారారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌.. ముగ్గురూ ఉమ్మడి ప్రచారం చేయండి. ప్రజలే మీ అరాచకాలకు తగిన బుద్ధి చెబుతారు’ అని స్పష్టం చేశారు.

Advertisements

Latest Articles

Most Read