నెల్లూరు పార్లమెంట్‌ నుంచి గాని, ఒంగోలు నుంచి కగాని పోటీ చేయడానికి ఇష్టం లేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ అధిష్ఠానానికి తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఈ ప్రభావం కావలి నియోజకవర్గంపై పడింది. కావలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని బీఎంఆర్‌ నిర్ణయించుకున్నారు. అధిష్ఠానం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నెల్లూరు, లేదా ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి మాగుంట శ్రీనివాసులురెడ్డిని బరిలోకి దించాలని అధిష్ఠానం ఆలోచించింది. నెల్లూరు పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాలని బీఎంఆర్‌తో సహా నెల్లూరు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులంతా మాగుంటను కోరారు. ఒకవేళ ఆయన నెల్లూరు నుంచి ఇష్టపడకపోయినా, ఒంగోలు నుంచి పోటీకి సిద్ధపడాలని అధిష్ఠానం కోరింది. అయితే రెండు చోట్ల నుంచి పోటీ చేయడం తనకు ఇష్టం లేదని గురువారం మాగుంట అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం.

magunta 08032019

వైసీపీలో చేరుతారా..? మాగుంట వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోటీకి విముఖత చూపడంతో ఆ ప్రచారాని బలం చేకూరింది. మాగుంట నిర్ణయంతో టీడీపీలో రెండు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థి అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ఒంగోలు నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులను ముందే ఊహించిన అధినాయకత్వం బీఎంఆర్‌ను ఒంగోలు నుంచి బరిలోకి దించే అవకాశాలను పరిశీలించి సిద్ధం చేసుకుంది. కొద్ది రోజులకు ముందు జరిగిన ఒంగోలు సెగ్మెంట్‌ సమీక్షలో ఎక్కువ మంది బీఎంఆర్‌ను ఎంపీ అభ్యర్థిగా పంపాలని కోరారు. మాగుంట పోటీకి విముఖత చూపడంతో బీఎంఆర్‌ను ఒంగోలుకు పంపడం పార్టీక అనివార్యం అవుతుందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

magunta 08032019

కావలికి ఎవరు..? ఇదే జరిగితే కావలి అభ్యర్థి ఎవరవుతారు అనే అంశం ప్రధాన చర్చగా మారింది. కావలి టీడీపీ కార్యకర్తల్లో అత్యధికులు బీఎంఆర్‌నే కోరుకొంటున్నారు. బీద కుటుంబం సైతం కావలి నియోజకవర్గాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో బీఎంఆర్‌ ఒంగోలు ఎంపీగా వెళ్లాల్సి వస్తే కావలి నుంచి బీద కుటుంబం నుంచే మరెవరైనా పోటీ చేస్తారా...!? లేక కొత్త వ్యక్తి తెరపైకి వస్తారా..!? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మాగుంట నిర్ణయం కావలి టీడీ పీలో కలకలం రేపింది. ఒకవేళ బీఎంఆర్‌ కావలి అసెంబ్లీకే పోటీ చేసే పక్షంలో ఎంపీ స్థానానికి ఇప్పటికే పరిశీలనలో ఉన్న బొమ్మిరెడ్డి, విష్ణు, మెట్టుకూరు, లేదా మరో కొత్త వ్యక్తో ఎవరో ఒకరు పార్లమెంట్‌ బరిలోకి దిగనున్నారు.

 

 

నెల్లూరు గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్ ‌రెడ్డి గురువారం అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌లో హల్‌చల్‌ చేశారు. పోలీసులపై తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు. ‘నా ప్రొటోకాల్‌ మీకు తెలుసా’ అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారన్న ఆగ్రహంతో అర్ధరాత్రి దౌర్జాన్యానికి పాల్పడ్డారు. సర్వే చేస్తున్నారన్న అనుమానంతో బెంగళూరుకు చెందిన కొందరు యువకులపై స్థానిక వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఐదో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వైకాపా కార్యకర్తలపై కేసునమోదైంది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దీంతో వారిని విడుదల చేయాలని గ్రామీణ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అర్ధరాత్రి పార్టీ కార్యకర్తలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారు.

nellore 08032019 1

జిల్లాలోని వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు హల్‌చల్ చేశారు. సీఐలో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని బెదిరించారు. ఎస్పీని డీజీని పిలువు అంటూ ధౌర్జన్యంగా వ్యవహరించారు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో గంట పాటు ఉద్రిక్తత నెలకొంది. నేతాజీనగర్‌లో సాధికారత సర్వేకు వెళ్లిన నలుగురిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై వేదాయపాలెం పోలీసులు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. నిందితులకు వైద్య పరీక్షలు అనంతరం కోర్టులో హాజరుపరాల్సి ఉంటుంది. అయితే తమ పార్టీకి చెందిన కార్యకర్తలను ఎందుకు కోర్టులో హాజరుపర్చలేదని శ్రీధర్‌రెడ్డి చిందులు తొక్కారు. డీజీ కంటే తన ప్రొటొకాల్ ఎక్కువ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుల ప్రవర్తనపై పోలీసులు మండిపడుతున్నారు. డ్యూటీ చేస్తున్న సీఐ, ఇతర అధికారులను బెదిరించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితాకు అనుసంధానం చేసిన ‘ఆధార్‌’ డేటా’ను తొలగించాలనే ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఓటర్ల జాబితా సవరణకు ఏ రకమైన సాఫ్ట్‌వేర్‌ ను వినియోగిస్తున్నారో వివరిస్తూ కౌంటర్‌ వేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కొడాలి శ్రీనివాస్‌ గత ఏడాది హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. డూప్లికేట్‌ ఓటర్లను తొలగించేందుకు ఈసీ ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిందనీ, దాని ఆధారంగా తెలంగాణలో 27 లక్షలు, ఏపీలో 19 లక్షల ఓట్లను తొలగించారనీ పిటిషనర్‌ తరఫు న్యాయవాది అర్జున్‌రెడ్డి కోర్టుకు విన్నవించారు.

hc 08032019 1

కేంద్ర ఎన్నికల సంఘం, ఉభయ రాష్ర్టాల ఎన్నికల కమిషన్లు పౌరులను తప్పుదారి పట్టించాయని, పెద్ద ఎత్తున అర్హులైన ఓటర్లను తొలగించారని ఆయన కోర్టుకు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ‘సమగ్ర కుటుంబ సర్వే’ ఏపీలో ‘స్మార్ట్‌ పల్స్‌ సర్వే’ పేరిట ప్రజల నుంచి వివరాలు సేకరించారనీ, ఈ సర్వేలో ఆధార్‌ సంఖ్య, ఓటరు గుర్తింపు కార్డు, ఇంటి చిరునామా, ఫోన్‌ నెంబర్‌, పాన్‌ కార్డు వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి వాటిని స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌ (ఎస్‌ఆర్‌డీహచ్‌) వద్ద భద్రపర్చారని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఈ డేటాను ఓటరు జాబితా రూపకల్పన నిమిత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చినట్లు తెలిపారు. ఆధార్‌ సంఖ్యను కేవలం సబ్సిడీ పథకాలకే వర్తింపచేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందనీ, కానీ ప్రజల నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే ఆధార్‌ సమాచారాన్ని ప్రభుత్వాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చాయని పిటిషనర్‌ పేర్కొన్నారు.

hc 08032019 1

ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం... ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన సమాచారాన్ని ఎన్నికల సంఘంతో పంచుకుంటే తప్పేంటనీ, దాని ప్రభావం ఓటరు జాబితా రూపకల్పనపై ఎలా పడుతుందని ప్రశ్నించింది. ఈసీ తరఫు న్యాయవాది వాదిస్తూ... జాబితాలో తొలగింపులు, చేర్పులు వంటివి ఈఆర్‌వో చూస్తారన్నారు. ఈసీ వద్దనున్న డేటాను చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా... ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తితో పంచుకునే ప్రసక్తే లేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కులాలు, వర్గాల వారీగా ఓటర్ల జాబితాలో పేర్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలతోపాటు ఓటర్ల చేర్పులు, తొలగింపులు, ఈఆర్‌ఓకు ఉన్న అధికారాలు, ఓటర్ల జాబితాను రూపొందించడానికి అనుసరిస్తున్న సాంకేతిక విధానం తదితరాలతో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.

 

 

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైకాపా, తెరాస, భాజపా కుట్రలు పన్నుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఏపీ యువత ఉపాధికి గండికొట్టేందుకే ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. వైకాపాకి అధ్యక్షుడు కేసీఆర్‌ అని.. వైకాపా, తెరాసకు సంయుక్త వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ ఉన్నారని ఎద్దేవాచేశారు. జగన్‌ను తెరాసకు డమ్మీగా చేశారని విమర్శించారు. ఆంధ్రాపై నిలువెల్లా ద్వేషంతో కేసీఆర్‌ కుటుంబం ఉందని, దీనికి ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే రుజువని స్పష్టంచేశారు. తెలుగుతల్లిని అవమానించిన కేసీఆర్‌తో జగన్‌కు దోస్తీ ఏంటని ప్రశ్నించారు. ముందు కేసీఆర్‌ పెట్టుబడి పెడతారు.. తరువాత జగన్ కప్పం కడతారంటూ విమర్శించారు. ఈ మేరకు పార్టీ నేతలతో శుక్రవారం సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

lotus 08032019

నిస్సిగ్గుగా వైకాపా దొంగ పనులు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. తెరాసకి డబ్బులు బాగా చేరాయని, అందుకే వైకాపాకి కేసీఆర్‌ ఎదురు పెట్టుబడులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెదేపా అభ్యర్థులను బెదిరించే భాజపా నీచ కుట్రలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారని సీఎం అన్నారు. తెదేపా సమాచారం చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైందని, ఓట్ల తొలగింపు కుట్ర లోగుట్టును ఛేదిస్తామని స్పష్టంచేశారు. ఈ 10 రోజుల్లోనే రాష్ట్రానికి 45వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్ఠ కోసం తాను కష్టపడుతుంటే, అప్రతిష్ఠ తెచ్చేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు.

lotus 08032019

వైకాపాకు మహిళలే బుద్ధి చెప్పాలి.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల్లో ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం పెంచామని పేర్కొన్నారు. ప్రతి డ్వాక్రా మహిళ ఖాతాలో ఈ రోజే రూ.3,500 జమ చేసుకునే వీలు కల్పించామని, బోగస్ చెక్కులని అన్న వైకాపాకు మహిళలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ 3రోజులు అన్నిచోట్లా ర్యాలీలు, సభలు నిర్వహించాలన్నారు. దొంగలను నమ్మం అని మహిళలంతా సంకల్పం చేయాలన్నారు.

Advertisements

Latest Articles

Most Read