తెలంగాణ విద్యుత్‌ సంస్థలు తమకు చెల్లించాల్సిన మొత్తం రూ.5 వేల కోట్లు కాదని.. దరిదాపుగా 11,728 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఇంధన పంపిణీ సంస్థలు వెల్లడించాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు ఆంధ్ర నుంచి.. ఆంధ్ర విద్యుత్‌ సంస్థలకు తెలంగాణ నుంచి కరెంటు సరఫరా అయింది. ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువ మొత్తంలో సరఫరా చేసింది. అందుకుగాను బ్యాలెన్సు చెల్లించాలని డిమాండ్‌ నోటీసులు పంపుతూ వచ్చింది. విద్యుత్‌ సరఫరాలో ఏ మాత్రం జాప్యం జరిగినా హుంకరించిన తెలంగాణ.. బకాయిలు చెల్లింపులో మాత్రం ధిక్కార ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ బకాయిలు కొండలా పేరుకు పోయి.. చివరకు పోలవరం జల విద్యుత్కేంద్రం అంచనా వ్యయాన్ని దాటేసి రూ.5000 కోట్లకు చేరాయి. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా బకాయిల చెల్లింపునకు తెలంగాణ ముందుకు రాకపోవడంతో.. ఆ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు దివాలా తీసినట్లుగా ప్రకటించాలని ఆంధ్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఏకంగా నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించాయి.

jagan 09032019

ఇలాంటి తరుణంలో ఆంధ్ర ప్రదేశ్‌ తమకే రూ.2,406 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు హైదరాబాద్‌లో పేర్కొన్న నేపథ్యంలో ఆంధ్ర సంస్థలు ఆయనకు దీటుగా బదులిచ్చాయి. ఆయన మీడియా సమావేశంలో వెల్లడించినదంతా నిరాధారం, అవాస్తవమని ఆంధ్ర జెన్‌కో ఆర్థిక సలహాదారు, అక్కౌంట్స్‌ చీఫ్‌ కంట్రోలర్‌ ఆదినారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సంస్థల ఖాతా పుస్తకాల ప్రకారమే ఆంధ్రకు రూ.11,728 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. అందులో నుంచి తామివ్వాల్సిన బకాయిలను మినహాయించినా ఇంకా రూ.8,274.23 కోట్లు తమకే బకాయిపడ్డాయని తెలిపారు. తెలంగాణ డిస్కమ్‌లకు సరఫరా చేసిన విద్యుత్‌కు గాను అన్ని సర్దుబాట్లూ పోగా నికరంగా రూ.5,732.40 కోట్లు బకాయి రావలసి ఉందని చెప్పారు. రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రశ్నలు లేవనెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆంధ్రకు తెలంగాణ విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసిన సంగతిని ఆదినారాయణ గుర్తుచేశారు.

jagan 09032019

ఈ బకాయిలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య ఎప్పటికప్పుడు భేటీలు జరుగుతూనే ఉన్నాయని.. ఆంధ్రకు బకాయిలు చెల్లించాలని ఆ సందర్భంగా అంగీకరించి.. తక్షణమే రూ.150 కోట్లు చెల్లించేందుకు సరేనని.. ఇప్పుడు ఆంధ్ర సంస్థలే తమకు బకాయి పడినట్లు ప్రభాకరరావు చెప్పడంపై ఆదినారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేకనే నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను తాము ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు నిజంగా తమకు బకాయిపడకపోతే అవి ఎన్‌సీఎల్‌టీని కాకుండా ఈఆర్‌సీని ఎందుకు ఆశ్రయించాయని నిలదీశారు. కాగా.. దివాలా కేసు ఈ నెల 20వ తేదీన ఎన్‌సీఎల్‌టీలో విచారణకు రానుందని.. బకాయిల చెల్లింపునకు ఆ సందర్భంగా పట్టుబడతామని ఆంధ్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మరి ఈ వివాదంలో, కేసీఆర్ సామంత రాజు అయిన జగన్ గారు, ఎటు వైపు ఉంటారో. ?

 

 

ఏపీలో మహాకుట్రకు నాంది పలికారని, ఒకవేళ ఈ విషయం బయటపడితే ప్రజలు ఛీ కొడతారు అన్న భయం కూడా లేకుండా బరితెగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ డేటాను దొంగిలించి వైసీపీకి ఇవ్వాలనీ, టీడీపీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకోసం వ్యవస్థలను దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరురాష్ట్రాల మధ్య కాకరేపుతున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చౌర్యం వ్యవహారంపై చంద్రబాబు ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. టీడీపీకి ఔట్ సోర్సింగ్ సేవలు అందించాడన్న కారణంతో ఐటీ గ్రిడ్స్ సంస్థ అధినేత అశోక్ కెరీర్ ను నాశనం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అతని కంపెనీపై దాడిచేసి మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు.

returngift 09032019

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘మా డేటాను దొంగిలించే అధికారం ఎవరు ఇచ్చారు? ఇది కుట్ర కాదా? మీ ఇష్టానుసారం వెళ్లడానికి ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా? లేక నియంత పాలన అనుకుంటున్నారా? ఇదంతా ఓవైపు జరుగుతుంటే జగన్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు గవర్నర్ ను కలుస్తారు. అందరూ కలిసి కుట్రను రక్తి కట్టిస్తున్నారు. గవర్నర్ ను కలిశాక బీజేపీ నేతలు సీబీఐ విచారణకు ఆదేశించాలని ఢిల్లీకి వెళ్లారు. సిగ్గులేకుండా తమ చర్యలను వీరంతా సమర్థించుకుంటున్నారు’ అంటూ మండిపడ్డారు. కోడికత్తి కేసు రాష్ట్ర పరిధిలోని అంశం అయినప్పటికీ బలవంతంగా కేంద్రం తీసుకుందని చంద్రబాబు ఆరోపించారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. ఏపీకి ఇవ్వాల్సిన ఆస్తులను తెలంగాణ ఇంకా ఇవ్వలేదన్నారు.

returngift 09032019

రాష్ట్రం విడిపోయాక ఏపీకి చెందిన రూ.5 వేల కోట్ల కరెంటును వాడుకుని బకాయిలు ఇంకా చెల్లించలేదని విమర్శించారు. ‘ఇప్పుడు కేసీఆర్ ఇక్కడకు రాలేడు. వేల కోట్లు పంపిస్తాడు. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు పంపాడని చెబుతున్నారు. నువ్వు(కేసీఆర్) సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెడుతున్నావ్ ఇక్కడ. ఎందుకంటే నీకు ఓ సామంత రాజ్యం కావాలి. నీ సామంత రాజ్యం కోసం ఓ పథకం ప్రకారం జగన్ ను పెట్టుకున్నావ్. ఈయన నాకిచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే అన్నమాట’ అని చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చాలా కేసుల్లో ఏ-1గా ఉన్నాడనీ, ఇంకా ఎన్ని కేసుల్లో ఏ-1 ముద్దాయి కావాలనుకుంటున్నాడో తెలియదని విమర్శించారు. ఆయనకు తోడుగా విజయసాయిరెడ్డి చాలా కేసుల్లో ఏ-2గా ఉన్నారని దుయ్యబట్టారు. ఈ ఏ-1, ఏ-2 వ్యక్తులకు పక్క రాష్ట్రపు పాలకులు, అధికారులు సాయం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అధికారుల వ్యవహారశైలి దొరల దగ్గర పటేళ్లు పనిచేస్తున్నట్లు ఉందన్నారు.

సమగ్ర ప్రాజెక్టు నివేదిక నివేదిక (డీపీఆర్‌) ఇవ్వకుండా, కృష్ణా బోర్డులో చర్చించకుండానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి-పెన్నా అనుసంధానం మొదటిదశను చేపట్టడం పట్ల తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరి నుంచి పెన్నాకు నీటిని మళ్లిస్తున్నందున శ్రీశైలం నుంచి విడుదల చేసే నీటిలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన తాత్కాలిక కేటాయింపు నిష్పత్తిని మార్చాలని కోరింది. ప్రస్తుతం 66 శాతం ఆంధ్రప్రదేశ్‌కు, 34 శాతం తెలంగాణకు ఉంది. దీనిని 2019-20 నీటి సంవత్సరంలో 50 శాతానికి మార్చాలని, బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు దీనిని అమలు చేయాలని కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌ మురళీధర్‌ శుక్రవారం లేఖ రాశారు.

telangana 09032019

‘‘ఆంధ్రప్రదేశ్‌ ఏకపక్షంగా గోదావరి-పెన్నా అనుసంధానం మొదటి దశ చేపట్టింది. గోదావరి నదిపై చింతలపూడి నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద హరిశ్చంద్రాపురానికి, అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ కుడికాలువ కింద 9.61 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, లక్ష ఎకరాల గ్యాప్‌ ఆయకట్టుకు నీరివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 73 టీఎంసీల నీటిని మళ్లించడం దీని లక్ష్యం. ఈ పథకానికి రూ. 6,020.15 కోట్లతో ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది ఏపీ పునర్విభజన తర్వాత చేపట్టింది కాబట్టి ఎంత నీటిని మళ్లించేది కృష్ణా బోర్డు పరిశీలించాల్సి ఉంది. బోర్డుతోపాటు జలసంఘానికి, అపెక్స్‌ కౌన్సిల్‌కు ఏపీ డీపీఆర్‌ను అందజేయడం తప్పనిసరి. బోర్డు తక్షణం జోక్యం చేసుకోవాలి. "

telangana 09032019

"దీంతోపాటు కృష్ణా జలాల్లో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక వాటాలో మార్పు చేసి రెండు రాష్ట్రాలకు 50 శాతం చొప్పున కేటాయించాలి. గోదావరి నుంచి పెన్నాకు నీటిని మళ్లిస్తున్నందున ప్రస్తుతం మళ్లిస్తున్న కృష్ణా నీటితో అవసరం లేదు. 2015లో రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటా తాత్కాలికంగా నిర్ణయమైనప్పుడు తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నీటి సంవత్సరం నుంచి నీటి వాటాను చెరో సగం చొప్పున మార్చాలి’’ అని తెలంగాణ కృష్ణా బోర్డును కోరింది.

19.02.2019: భారత ఎన్నికల అధికారికి అందజేసేందుకు విజయసాయి రెడ్డి ఒక వినతిని తయారు చేశారు. ఆ వినతి ద్వారా తెలుగు దేశం పార్టీని, మంత్రులను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అధికారులను మరియు ప్రభుత్వానికి, పార్టీకి సేవలు అందిస్తున్న వారిని టార్గెట్ చేస్తూ వినతిని తయారు చేశారు. ఈ వినతితో పాటు కొన్ని అనుబంధాలను కూడా జతపరిచారు. వాటిలో మొదటి పత్రం....‘‘టాకింగ్ పాయింట్స్ ఆన్ సేవామిత్ర, రోల్ ప్లేయర్స్, మోడస్ ఆపరేండి, అఫెన్సెస్ ఇన్వాల్వ్ డ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఐటి గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సోదాలలో చేయవలసిన ఫోకస్ పాయింట్స్ ’’ అనే హెడ్డింగ్ లతో అనుబంధ పత్రం తయారు చేశారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో...- ఒక ఎఫ్ ఐఆర్ రిజిస్టర్ చేయించాలి, మరియు స్టోలెన్ డేటా పేరుతో సర్వర్లు సీజ్ చేయాలి - ఐటి గ్రిడ్,బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ డైరెక్టర్ల మరియు రాష్ట్ర మంత్రుల, అధికారుల, సెల్ ఫోన్లు, ఇ-మెయిల్స్, సీజ్ చేయాలి. - సేవామిత్ర అప్లికేషన్ పనిచేయకుండా ఆపాలి - సేవామిత్ర టాప్ లెవల్ ఆర్గనైజర్లను గుర్తించాలి. - కోర్టు ద్వారా సిబిఐ విచారణ అడగాలి - జరిగే ప్రక్రియ మొత్తాన్ని నేషనల్ మీడియాకు ఎక్స్ పోజ్ చేయాలి - సిఈవో, ఉడాయ్ కు(ఆధార్ చట్టం ప్రకారం) ప్రత్యేక లేఖను, కేసు రిజిస్టర్ చేయమని పంపాలి. ఐటి గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో సోదాల సమయంలో ఫోకస్ పాయింట్స్: 1.ఆధార్ డేటా బేస్, ఎలక్షన్ కమిషన్ డేటా(కలర్ ఫొటోలతో కూడిన ఓటర్లు అని), వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులు డేటా మొత్తం వీరి దగ్గర ఉందని ఎస్టాబ్లిష్ చేయాలి. 2.వివిధ రకాలైన డేటా వాడటం కోసం సాఫ్ట్ వేర్ వాళ్లే క్రియేటెడ్ చేశారని ఎస్టాబ్లిష్ చేయాలి 3.సేవామిత్ర యాప్ కొరకు ఈ డేటా వాడారని ఎస్టాబ్లిష్ చేయాలి. మరియు సర్వర్లను డేటాను సీజ్ చేయడంతోపాటు సేవామిత్ర యాప్ ను పనిచేయకుండా ఆపాలి. 4.ఓటర్లను తొలగించడానికి ప్రత్యేకంగా జాబితా తయారు చేశారని ఎస్టాబ్లిష్ చేయాలి. 5.తెలుగుదేశం పార్టీలోని కొందరికి, మరియు ప్రభుత్వానికి, పై జాబితాను ఐటి గ్రిడ్స్ పంపినట్లుగా ఎస్టాబ్లిష్ చేయాలి. 6.ఐటి గ్రిడ్స్ (అశోక్ దేకవరం ముఖ్యంగా), మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్యులు, నారా లోకేష్, ఇతర అధికారుల మధ్య కాల్ డిటైల్స్ ,ఇ-మెయిల్స్, మెసేజ్ లు, చాట్, వివో ఐపి కాల్స్ (వాయిస్ వోవర్ ఇంటర్ నెట్ ప్రొటోకాల్ )కాల్స్ ద్వారా వీరి మధ్య కమ్యూనికేషన్స్ నడిచినట్లు ఎస్టాబ్లిష్ చేయాలి. 7.ఈ లెటర్ కు అనుబంధంగా సేవామిత్ర స్క్రీన్ షాట్ ను, అశోక్-లోకేష్-రాజేశ్ ఇతరుల ఫొటోలతో పాటుగా కొన్ని ఇతర పేపర్లను జతపరిచారు.

ఫిబ్రవరి 22న ఏం జరిగింది..? విజయసాయి రెడ్డి ఫిబ్రవరి 19న తయారుచేసిన వినతిపత్రాన్ని భారత ఎన్నికల సంఘం అధికారులను కలిసి అనుబంద పత్రాలతో సహా అందించారు. ఈ లేఖ 37722.2.2019 గా నమోదైంది. ఈ లేఖలో తెలుగుదేశం పార్టీ, ముఖ్యులు,సర్వీస్ ప్రొవైడర్లు,అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కోరడంతోపాటు ఐపిసి 120 బి, 379,188 మరియు సెక్షన్ 77 ఆప్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖతో పాటు ‘‘టాకింగ్ పాయింట్స్ ఆన్ సేవామిత్ర’’ పేరుతో ఉన్న ఆ పత్రాన్ని కూడా అనుబంధంగా ఇచ్చారు. పైన పేర్కొన్న విధంగా కేసు బుక్ చేయడానికి ఎన్నికల సంఘం ముందుకు రాక పోవడంతో కుట్రను హైదరాబాద్ నుంచి అమలు చేయడానికి పథకం పన్నారు. 23.02.2019 సాయంత్రం 4.30గం: ఫిబ్రవరి 23న ఐటి గ్రిడ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లోని ఆఫీసుపై సాయంత్రం 4.30గంటలకు తెలంగాణ సైబరాబాద్ పోలీసులు దాడిచేసి అనాధరైజ్డ్ గా ఉద్యోగులను భయభ్రాంతులను చేసి రోజువారీ విధులకు ఆటంకం కలిగించారు. కొంత డేటాను కొన్ని కంప్యూటర్లను, హార్డ్ డిస్క్ లను తమతో తీసుకు పోయారు.సాయంత్రం 7.00గం కు ఏసిపి మాదాపూర్ తోసహా మరి కొంతమంది పోలీసులు ఐటి గ్రిడ్స్ కార్యాలయంలో ప్రవేశించి అశోక్ తో సహా ఇతరుల స్టేట్ మెంట్లను తీసుకుని కొన్ని విలువైన పత్రాలను డేటాను కంప్యూటర్లను ఎటువంటి పంచనామా లేకుండా బలవంతంగా తీసుకెళ్లారు. ఐటి గ్రిడ్స్ కార్యాలయంలోని సర్వర్లను ఇతర పరికరాలను మొత్తం పోలీసులు వారితో పాటు వచ్చిన ఇతరులు తమ స్వాధీనంలో ఉంచుకున్నారు.ఈ ప్రక్రియ 24వ తేది వరకు కొనసాగింది.

25.02.2019: సైబరాబాద్ కమిషనర్ ప్రెస్ మీట్: కొంతమంది పత్రికా విలేకర్లు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సజ్జనార్ ) ను కలవగా, తనకు విజయసాయి రెడ్డి ద్వారా కంప్లయింట్ వచ్చిందని, దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ, సేవామిత్ర యాప్, ఐటి గ్రిడ్స్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డేటా పై విచారణ చేస్తున్నామని ఇంకా ఎఫ్ ఐఆర్ రిజిస్టర్ చేయలేదని, తమ పోలీసులు ఆ సంస్థ కార్యాలయంలో విచారణ చేస్తున్నారని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్(తెలంగాణ) చెప్పిన విషయాలను టైమ్స్ ఆప్ ఇండియాలో 26.02.2019న ప్రచురించింది. 02.03.2019(అర్ధరాత్రి 12.15 గం): మార్చి 2న అర్ధరాత్రి 12.15 ని.లకు తుమ్మల లోకేశ్వర రెడ్డి ( వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువు, తెలంగాణ నివాసి) ద్వారా సైబరాబాద్ పోలీసులు విజయసాయి రెడ్డి లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూ వచ్చిన వినతి మేరకు ఎఫ్ ఐఆర్ నెం: 174/2019 కింద నమోదు చేశారు. విజయసాయి రెడ్డి లేఖలో చెప్పిన అంశాల ప్రకారమే ఈ ఫిర్యాదు ఉండటం గమనార్హం. 03.03.2019 (సాయంత్రం 6.30గం):మార్చి 3 సాయంత్రం 6.30గంటలకు హైకోర్టు అశోక్ పిటిషన్ పై విచారించి ఆర్డర్ ఇస్యూ చేసింది. తెలంగాణ పోలీసులు తెల్లకాగితాలపై వీఆర్ వో లతో సంతకాలు చేయించడం, వాళ్ల అధెంటిసిటికి, వాళ్ల ఎంక్వైరీపైన తీవ్ర అనుమానాలు హైకోర్ట్ వ్యక్తం చేసింది. 03.03.2019 సాయంత్రం 7.00గం: ఎఫ్ ఐఆర్ నెం. 1492019 ఎస్ ఆర్ నగర్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. 19.2.2019నాటి విజయసాయి రెడ్డి లేఖలోని అంశాలతో పాటు హైకోర్టు వాదనల్లో వచ్చిన అంశాలను కలిపి జి. దశరథరామిరెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ యూత్ వింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ) ఇచ్చిన ఫిర్యాదు ద్వారా కేసు రిజిస్టర్ చేశారు. 04.03.2019 (ఉదయం 11.గం): సైబరాబాద్ పోలీస్ కమిషనర్(విసి సజ్జనార్) ప్రెస్ మీట్ లో ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో ఎక్కడా కూడా 23.2.2019 ఇల్లీగల్ రెయిడ్స్ గురించిగాని, 23న స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు,ఇతర పత్రాల గురించి ప్రస్తావించకుండా, ప్రెస్ నోట్ ఇచ్చారు. ఇదే ప్రెస్ నోట్ లో 19.2.2019న విజయసాయి రెడ్డి వినతిపత్రంలో కోరిన విధంగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్ నోట్ లో ఉడయ్ కి, ఎన్నికల సంఘానికి, ఇతరులనుంచి వివరాలు రాబట్టబోతున్నామని, అవసరమైతే ఎవరినైనా, ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తామని చెప్పారు.(ప్రతి ఛానల్ కు ఇండివిడ్యువల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు). ఈ ప్రెస్ నోట్ లో 04.03.2019నాటికి ఆంధ్రప్రదేశ్ లో అక్రమ ఓటర్ల తొలగింపుపై 45-50 క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయిన విషయం తనకు తెలుసునని ప్రస్తావించారు. 07.03.2019 సాయంత్రం సిట్ ఛీఫ్ ప్రెస్ మీట్: మార్చి 7న సిట్ ఛీఫ్ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఐటి గ్రిడ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ లో 23.2.2019న సోదాలు చేసినట్లుగా అంగీకరించారు. 08.03.2019 ఢిల్లీ వెళ్లి ఏపి బిజెపి నేతల వినతి: ఏపి బిజెపి నేతలు ఢిల్లీ వెళ్లి భారత ఎన్నికల సంఘం అధికారులకు వినతి. విజయ సాయి రెడ్డి ఫిబ్రవరి 19 వినతి అంశాలనే అందులో ప్రస్తావించారు.

Advertisements

Latest Articles

Most Read