ప్రజల నాడి తెలుసుకోవడంలో ఎగ్జిట్‌ పోల్స్‌ విఫలమయ్యాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై ఆయన స్పందించారు. వాస్తవాలకు విరుద్ధంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఉన్నాయని, గతంలోనూ తప్పులు ఇచ్చాయని వ్యాఖ్యానించారు. ఏపీలో తెదేపా ప్రభుత్వం ఏర్పడడంలో ఎలాంటి అనుమానమూ లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో భాజపాయేతర పార్టీలు ఎక్కువ సీట్లు సాధిస్తాయనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలనే డిమాండ్‌ నుంచి తాము వెనక్కి తగ్గేదిలేదని స్పష్టంచేశారు. వీవీప్యాట్లు, ఈవీఎం ఓట్లలో తేడా ఉంటే అన్ని వీవీప్యాట్లు లెక్కించాల్సిందేనని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

exit polls cbn 20052019

మరో పక్క ఎగ్జిట్‌ పోల్స్‌ పై అందరూ విశ్లేషణ ప్రారంభించారు. గతంలో ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికీ, వాస్తవ ఫలితాలకు మధ్య చాలా తేడా కనిపించింది. ఈ నేపథ్యంలో 1998-2014 మధ్య జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? వాస్తవ ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం. 1998 ఎన్నికల్లో వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్.. అవుట్ లుక్/ఏసీ నీల్సన్ సర్వే బీజేపీకి 238 సీట్లు, కాంగ్రెస్‌కు 149 సీట్లు వస్తాయని అంచనా వేసింది. డీఆర్ఎస్ సర్వే బీజేపీకి 249 సీట్లు, కాంగ్రెస్‌కు 155 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇండియా టుడే/సీఎస్‌డీఎస్ బీజేపీకి 214 సీట్లు, కాంగ్రెస్‌కు 164 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ వాస్తవంగా బీజేపీకి 252, కాంగ్రెస్‌కు 166 సీట్లు వచ్చాయి. 1999 ఎన్నికల్లో బీజేపీకి 336, కాంగ్రెస్‌కు 146 స్థానాలు వస్తాయని ఇండియాటుడే/ఇన్‌సైట్ సర్వే చెప్పగా, అవుట్‌లుక్/సీఎంఎస్ సర్వేలో బీజేపీకి 329, కాంగ్రెస్‌కు 145 స్థానాలు వస్తాయని చెప్పింది. హెచ్‌టీ-ఏసీ నీల్సన్ సర్వేలో బీజేపీకి 300, కాంగ్రెస్‌కు 146 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కానీ వాస్తవంగా బీజేపీకి 296, కాంగ్రెస్‌కు 134 సీట్లు వచ్చాయి.

exit polls cbn 20052019

2004లో బీజేపీకి 290 సీట్లు, కాంగ్రెస్‌కు 169 స్థానాలు వస్తాయని ఔట్‌లుక్-ఎండీఆర్ఏ సర్వే పేర్కొనగా, స్టార్-సీఓటర్ బీజేపీకి 275 స్థానాలు, కాంగ్రెస్‌కు 186 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కానీ వాస్తవ ఫలితాలు మాత్రం మరోలా వచ్చాయి. బీజేపీకి 189, కాంగ్రెస్‌కు 222 స్థానాలు వచ్చాయి. 2009 ఎన్నికల్లో బీజేపీకి 197, కాంగ్రెస్‌కు 199 స్థానాలు వస్తాయని స్టార్ న్యూస్/ఏసీ నీల్సన్ చెప్పగా, టైమ్స్ నౌ బీజపీకి 183, కాంగ్రెస్‌కు 198 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. హెడ్‌లైన్స్ టుడే బీజేపీకి 180 సీట్లు, కాంగ్రెస్‌కు 191 సీట్లు వస్తాయని చెప్పింది. కానీ వాస్తవంగా బీజేపీకి 159 సీట్లు, కాంగ్రెస్‌కు 262 స్థానాలు వచ్చాయి. 2014లో బీజేపీకి 281 సీట్లు, కాంగ్రెస్ 97 సీట్లు వస్తాయని ఏబీపీ నీల్సన్ సర్వే చెప్పగా, టైమ్స్ నౌ-ఓఆర్‌జీ సర్వే బీజేపీకి 249, కాంగ్రెస్‌కు 148 సీట్లు సొంతం చేసుకుంటుందని చెప్పింది. ఇండియా టీవీ-సీ ఓటర్ సర్వే బీజేపీకి 289 సీట్లు, కాంగ్రెస్‌కు 101 సీట్లు వస్తాయని తేల్చింది. ఎన్‌డీటీవీ బీజేపీకి 279 సీట్లు, కాంగ్రెస్‌కు 103 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ అధికారిక ఫలితాల్లో మాత్రం బీజేపీకి 336, కాంగ్రెస్‌కు 59 సీట్లు వచ్చాయి.

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే అంచనాలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల రీత్యా రాష్ట్ర ప్రజలు మరోసారి తెదేపా వైపే మొగ్గుచూపినట్టు తమ సర్వేలో తేలినట్టు వెల్లడించారు. పవన్‌ రాకతో ఈసారి ఏపీలో త్రిముఖ పోరు నెలకొందన్న ఆయన.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మరోసారి తెదేపా అధికారంలోకి రావాలని అక్కడి ప్రజలు భావించారని విశ్లేషించారు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి చెప్పిన అంచనాలు తలకిందులైన విషయాన్ని విలేకర్లు ప్రస్తావించగా.. ఈ నెల 23 తర్వాత తన విశ్వసనీయత పెరుగుతుందని ధీమా వ్యక్తంచేశారు.

lagadapati 19052019

ఇదే కాదు, ఏకంగా తన సర్వే పై సంచలన ప్రకటన చేసారు. ఈ సారి తన సర్వే అంచనాలు తప్పితే మళ్లీ సర్వే చేసి చెప్పనని లగడపాటి స్పష్టంచేశారు. ‘‘జనవరి నుంచి ఎన్నికల పోలింగ్‌ జరిగిన తర్వాత కూడా ఇంచుమించు 110 నుంచి 120 స్థానాల వరకు వివిధ దశల్లో ప్రజల నాడి తెలుసుకుంటూ వచ్చాం. మహిళలు, మగవాళ్లు, యువకులు ఓటు ఎటువేశారనేది అంచనాలు వేసి శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించాం. సుమారు 1200 సాంపిల్స్‌ చేస్తే పారదర్శకంగా ఉంటుందని, ఫలితాలకు దగ్గరగా ఉంటాయన్న ఉద్దేశంతో చేశాం. ఏపీలో 13 జిల్లాల్లో ఈ నాలుగైదు నెలల్లో సుమారు లక్షా 50వేల మందిని సర్వేచేసి నాడి పసిగట్టాం." అని అన్నారు.

lagadapati 19052019

తెలంగాణలో అంచనాలు ఎందుకు ఫెయిలయ్యాయి? ‘‘ఈ ఫలితాలు వచ్చిన రోజు నా సర్వేను బేరీజు వేసుకున్నాక చెప్తా. నాపై విశ్వసనీయత పెరుగుతుంది. ఈ ఫలితాలపై లోతుగా అధ్యయనం చేశాం. అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. మా అంచనాలకు ఏమాత్రం తేడా లేకుండా లోతైన అధ్యయనం చేశాం. 15ఏళ్ల నుంచి సర్వే చేస్తున్నాం. తెలంగాణ విషయంలో ఒకేసారి ఎందుకు తప్పింది? ఎందుకు తేడా వచ్చిందనేది ఆ రోజు తెలియజేస్తా. నేను ఈ రోజు చెప్పిందే వాస్తవం. నా పేరుతో ఏవైనా సర్వేలు సర్క్యులేట్‌ అయితే నాకు సంబంధంలేదు. నేను నేరుగా మీడియా ముందుకు వచ్చి చెబితేనే అదినేను చెప్పినట్టు. మీడియాలో కథనాలు రాసినా, సోషల్‌మీడియాలో వచ్చినా నమ్మొద్దు. నా వాయిస్‌ లేకపోతే నాకు సంబంధించింది కాదు. " అని లగడపాటి చెప్పుకొచ్చారు.

సార్వత్రిక సమరంలో చివరి అధ్యాయం ముగియక ముందే.. ఎన్డీయేకు షాక్‌ తగులుతోంది. ప్రధానమంత్రి మోదీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్స్ 370, 35A ఆర్టికల్స్‌ని రద్దు చేస్తామన్న బీజేపీ హామీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారాయన. కామన్ మినిమం ప్రోగ్రామ్‌ ఉంటేనే కొత్త ప్రభుత్వంలో కొనసాగుతామని నితీశ్ స్పష్టంచేశారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కొన్నాళ్లుగా చంద్రబాబుతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే తటస్థ పార్టీలతోను చర్చలు జరుపుతున్న ఏపీ ముఖ్యమంత్రి.. మోదీకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్న ఆయన.. మంత్రాంగం ముమ్మరం చేశారు. రాహుల్‌తో, శరద్‌ పవార్‌తో సమావేశం అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఈ మధ్యాహ్నం కీలక చర్చలు జరగనున్నాయి.

modishah 19052019

మరో పక్క, జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశ భక్తుడంటూ భాజపా నాయకురాలు ప్రజ్ఞా ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలను బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ఈ వ్యాఖ్యలు ఖండించతగ్గవి. ఇటువంటి తీరును మేము సమర్థించం. మహాత్మా గాంధీ జాతిపిత. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారో, లేక ఇతర ఏ చర్యలు తీసుకుంటారన్నది భాజపా అంతర్గత విషయం. ఇటువంటి వాటిని మనం ఉపేక్షించకూడదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల ప్రజ్ఞా మాట్లాడుతూ... ‘గాడ్సే ఓ దేశభక్తుడు.. ఆయనను కొందరు ఉగ్రవాది అని అంటున్నారు. అటువంటి వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు’ అని వ్యాఖ్యానించారు.

modishah 19052019

ఇది ఇలా ఉంటే, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్‌ నితీష్ కుమార్‌పై మాజీ సీఎం రబ్రీదేవి విరుచుకుపడ్డారు. గాడ్సే దేశభక్తుడంటూ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆయనను (నితీష్) బాధించి ఉంటే వెంటనే మౌనం విడిచిపెట్టి బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని రబ్రీదేవి డిమాండ్ చేశారు. 'నితీష్‌కు ప్రగ్యా వ్యాఖ్యలు నిజంగానే బాధపెట్టి ఉంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. బీహార్‌లో బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలి' అని ఆమె ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. మోదీ మరోసారి ప్రధాని అవుతారా? లేదంటే యూపీఏ గెలుస్తుందా? అనేది మరో మూడు రోజుల్లో తేలనుంది. ఐతే కౌంటింగ్‌కు ముందు జాతీయ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీ వ్యతిరేక పక్షాలతో వరుస భేటీలు జరుపుతూ హాట్‌టాపిక్‌గా మారారు. ఈ క్రమంలో బీజేపీ నేత విష్ణకుమార్‌ రాజు ఢిల్లీలోని ఏపీభవన్‌లో చంద్రబాబును కలిశారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని..మర్యాాదపూర్వకంగానే సీఎంను కలిసేందుకు వచ్చానని ఆయన చెప్పారు.

vishnu 19052019

అసలే బీజేపీ, టీడీపీ ఉప్పు నిప్పులా ఉన్నాయి. ఇరు పార్టీల మధ్య నిత్యం మాటల యుద్దం జరుగుతుంది. దీనికి తోడు బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు విపక్ష నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబును విష్షు కలవడం హాట్‌టాపిక్‌గా మారింది. తమతో కలవాల్సిందిగా విష్ణుకుమార్‌తో బీజేపీ పెద్దలు రాయబారం పంపారా? లేదంటే విష్ణుకుమార్ రాజే టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారా? అని ఏపీలో జోరుగా జరుగుతున్నాయి.

vishnu 19052019

మరోవైపు ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ నేత శరద్ పవార్, లోక్‌తంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశమయ్యారు. ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. ఎన్డీయే కూటమి మ్యాజిక్ మార్క్ చేరకుంటే ప్రభుత్వ ఏర్పాటులో తటస్థ పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలన్నింటికీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read