ఢిల్లీలో సీఎం చంద్రబాబు దూసుకుపోతున్నారు. ఢిల్లీలో ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌, సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, మాయావతి, అఖిలేష్ యాదవ్ ను వేర్వేరుగా చంద్రబాబు కలిశారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ఫలితాల ముందే ఎన్డీయేతర పక్షాలను చంద్రబాబు ఏకం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు ఢిల్లీ నుంచి లక్నో వెళ్లారు. ఎస్పీ, బీఎస్పీ అధినేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై వీరిద్దరితో చంద్రబాబు చర్చించారు. ఎన్డీయేతర పక్షాలను బలోపేతం చేసేందుకు ఏఏ చర్యలు చేపట్టాలి... ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది.. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఏఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి.. అనే అంశాలపై వీరిద్దరితో చంద్రబాబు చర్చించబోతున్నారు.

delhi 18052019

ఇటీవల రాహుల్‌ను చంద్రబాబు కలిశారు. ఈ భేటీలో రాహుల్‌కు చంద్రబాబు ఓ రిపోర్టు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితిల్లో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం.. లేదా ఆ పార్టీ మద్దతుతో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయనేది రాజకీయ నిపుణులు అంచానా. ఇదే విషయాన్ని చంద్రబాబు, రాహుల్‌కు ఓ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా చంద్రబాబు అంచనా ప్రకారం బీజేపీకి వంద సీట్లు కచ్చితంగా తగ్గిపోతాయని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతుందని చంద్రబాబు తన రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే బీజేపీ కన్నా కాంగ్రెస్‌కు యాభై సీట్లు తక్కువ వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతీయ పార్టీలకు అత్యధిక సీట్లు వస్తాయని ఆయన చెబుతున్నారు. ఏపీలో గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని చంద్రబాబు, రాహుల్‌కు ఇచ్చిన రిపోర్ట్‌లో పేర్కొనట్లు సమాచారం.

 

delhi 18052019

ఎన్డీయేతర కూటమిని బలోపేతం చేసేందుకు ఇంకా.. ఏఏ పార్టీల నేతలతో చర్చలు జరపాలి అనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు చర్చించారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించేందుకు దాదాపు 6రోజుల ముందే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకి బలమైన ప్రత్యామ్నాయం రూపొందించి.. దానిని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. మే 23న ఫలితాల రోజు అంతా ఢిల్లీ చేరుకొని ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని భావిస్తున్నారు. కాగా, యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు అనుభవం బీజేపీయేతర ఫ్రంట్‌ నిర్మాణానికి కలిసొస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, తెలుగుదేశం సహా 17 రాజకీయ పార్టీలు వివిధ అంశాలపై మూడు నాలుగుసార్లు సమావేశమైనందువల్ల వారి మధ్య రాజకీయ ఐక్యత సాధ్యపడే అవకాశాలున్నాయని ఈ వర్గాలు అంటున్నాయి.

మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న, జనసేన పార్టీ గెలుపోటముల పై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్ని సీట్లు గెలుస్తుంది.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటి.. కింగ్ మేకర్ అవుతారా.. ఇలా పలు సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆంధ్రా అక్టోపస్‌గా పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రజారాజ్యం కంటే పవర్ స్టార్‌కు తక్కువ సీట్లే వస్తాయన్న ఆయన.. వెలగపూడిలోని అసెంబ్లీలోకి పవర్ స్టార్ కచ్చితంగా అడుగుపెడతారని వ్యాఖ్యానించారు. కచ్చితమైన మెజార్టీతోనే ప్రభుత్వం వస్తుందని... సమైక్య రాష్ట్రంలో కానీ, రెండు రాష్ట్రాల్లో కానీ తెలుగు ప్రజలు స్పష్టమైన తీర్పునే ఇస్తున్నారన్నారు.

lagada 18052019

ఇక జేడీ.లక్ష్మీనారాయణ రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి అన్నారు. ఆయన భవిష్యతేంటో ఆదివారం చెబుతానన్నారు. లోకేష్ గురించి అడగగా, ఆ విషయం కూడా ఆదివారం చెప్తానంటూ తప్పించుకున్నారు. తనకు టీడీపీతో కంటే వైఎస్ కుటుంబంతోనే ఎక్కువ అనుబంధం ఉందన్నారు. వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు వెళ్లి నివాళులర్పించి జగన్ కలిశానన్నారు. తనకు ఏ పార్టీతో శత్రుత్వం లేదని ముగించారు. తన ఫలితాలను బట్టి ఎవరూ బెట్టింగ్‌లు కాయొద్దని సూచించారు. తన సర్వేను సవాల్‌తో చెప్పడం లేదన్నారు. ఫలానా పార్టీ గెలుస్తుందని బల్ల గుద్ది చెప్పడం లేదని చెప్పారు. కేవలం అంచనా మాత్రమే చెబతున్నానని స్పష్టంచేశారు. తెలంగాణలో తన ఫలితం ఎందుకు ఫెయిలైందో త్వరలో చెబుతానన్నారు.

lagada 18052019

ఆంధ్రప్రదేశ్‌‌ ప్రజలు మళ్లీ సైకిలే ఎక్కారనిలగడపాటి రాజగోపాల్ స్పష్టంచేశారు. ఇక తెలంగాణ ప్రజలైతే మళ్లీ కారే ఎక్కారని చెప్పారు. ఇది ‘నా టీమ్ అందించిన సర్వే’ కాదన్నారు. కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెబుతున్నానని పేర్కొన్నారు. నెల రోజుల నుంచి అమెరికాలో ఉంటున్నానని ఇక్కడేం జరుగుతుందో తనకు తెలియదన్నారు. నిన్న సాయంత్రమే ఏపీకి వచ్చినట్లు తెలిపారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఆదివారం తిరుపతిలో వెల్లడిస్తామని చెప్పారు. ఏపీలో మూడు పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయన్నారు. 90-99 శాతం మంది ప్రజలు ఈ మూడు పార్టీలకే ఓట్లేశారన్నారు. ఈ మూడు పార్టీల్లో ఒకరే విజేతగా నిలుస్తారన్నారు. మరొకరు ప్రతిపక్షంలో ఉంటారన్నారు. ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్న కలిసి కట్టుగా రాష్ట్రాభివృద్ధికి పాటు పడాలని విజ్ఞప్తి చేశారు.

వీవీప్యాట్‌ల ఆద్యుడు చంద్రబాబేనని మాజీ ఎన్నికల కమిషనర్లు నవీన్‌ చావ్లా, ఎస్‌వై ఖురేషి అన్నారు. ఐఐసీలో "భారత్‌లో ఎన్నికల విధానం కూడా జవాబుదారీతనం" అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, విశ్రాంత న్యాయమూర్తి మదన్ లోకూర్, మాజీ ఎన్నికల కమిషనర్లు నవీన్‌ చావ్లా, ఎస్‌వై ఖురేషి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై నవీన్‌ చావ్లా, ఎస్‌వై ఖురేషిలు ప్రశంసలు కురిపించారు. ఎన్నికల సంస్కరణలకు చంద్రబాబు ఎంతో సహకరించారని కొనియాడారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపు పెంపు, ఈవీఎంలపై చంద్రబాబు లేవనెత్తిన అంశాలకు మద్దతు ప్రకటించారు.

ex ec 18052019

డిజిటల్ కరెన్సీ ద్వారా ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2016, నవంబర్ 8న తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ఎన్నికల్లో గెలుపోటముల కన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.‘భారత్ లో ఎన్నికల విధానం-జవాబుదారీతనం’ అనే అంశంపై ఢిల్లీలోని ఐఐసీలో ఈరోజు జరిగిన సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్నికల్లో సామాన్యులు పోటీ చేసే పరిస్థితి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను గత 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాననీ, ప్రస్తుత పరిస్థితికి తాను సిగ్గుపడుతున్నానని చంద్రబాబు అన్నారు.

ex ec 18052019

ఎన్నికల్లో ధనప్రవాహం భారీగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం వెంటనే రూ.2,000, రూ.500 నోట్లను తెచ్చిందని విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా ఉద్యోగులు చివరివరకూ వేయడం లేదనీ, తమ డిమాండ్ కు తగ్గ డబ్బులు ఇస్తే సంబంధిత అభ్యర్థికే ఓటును ఇచ్చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న తాను కీలక సూచనలు చేశానని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. డిజిటల్ కరెన్సీకి మళ్లాల్సిందిగా సూచించానన్నారు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు అనే విషయం పై రోజు రోజుకీ టెన్షన్ పెరిగి పోతుంది. ఎవరి ధీమా వారు చెప్తున్నారు. అయితే మే 19 వరకు సర్వే ఫలితాలు ప్రకటించకూడదు అనే నిభందనలు ఉండటంతో, సర్వేలు కూడా బయటకు రాని పరిస్థితి. అయితే, ఆంధ్ర ఆక్టోప‌స్ గా పేరున్న లగడపాటి, తెలంగాణాలో ఫెయిల్ అయినా, ఆయన పై అంచనాలు మాత్రం తగ్గ లేదు. ఒక్క లాగడపాటే కాదు, తెలంగాణా విషయంలో అందరి అంచనాలు తప్పాయి. అయితే ఈసారి ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారో అనే విషయం పై నోరు విప్పారు. శనివారం సాయంత్రం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డైరెక్ట్ గా చెప్పకుండా, ఏపి ఎన్నిక‌ల ఫ‌లితాల పైన చెప్ప‌క‌నే చెప్పేసారు. తెలంగాణ ఎన్నిక‌ల పైన త‌న జ్యోస్యం ఎందుకు విఫ‌ల‌మైందో కూడా చెబుతానంటున్నారు.

lagadapati 180522019

ఆంధ్రప్రదేశ్‌లో హంగ్‌ అసెంబ్లీ వచ్చే అవకాశం లేదని.. కచ్చితమైన మెజార్టీతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తెలుగు ప్రజలు ఎప్పుడూ స్పష్టమైన తీర్పే ఇచ్చారని, తెలుగు ప్రజలు ఎప్పుడూ గజిబిజిగా తీర్పు ఇవ్వలేదన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా కేంద్రంతోనూ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉన్నందున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయోనని ఉత్కంఠతో ఎదరుచూస్తున్నారని చెప్పారు. రాజధాని నిర్మాణం, చేపట్టిన ప్రాజెక్టులు.. కేంద్రం, రాష్ట్ర సహకారంతోనే సాధ్యమన్న ప్రత్యేక దృష్టితో ప్రజలు చూస్తున్నారన్నారు.

lagadapati 180522019

‘‘ఈ నెల 23న స్పష్టంగా ఫలితాలు తెలుస్తాయి. రేపు చివరి దశ ఎన్నికల తర్వాత అనేక ఎగ్జిట్‌పోల్స్‌, సర్వేలు ప్రజల ముందుకు రాబోతున్నాయి. నేను విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో అక్కడి ప్రవాసాంధ్రులతో మాట్లాడా. వారు కూడా మనకంటే ఎక్కువ ఆసక్తితో రాష్ట్రంలోని ఫలితాలపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మనం కోరుకోకుండానే రాష్ట్రం ఏర్పడింది.. రాజధాని, నిధులు లేవు. ఆనాడు పాండవులు ఖాండవ వనాన్నిఇంద్రప్రస్థగా మార్చుకున్నారు. అలనాటి మయసభలాంటి అసెంబ్లీ భవనం అమరావతిలో రాబోతోంది. అందరూ అసూయపడేలా మన రాజధాన అభివృద్ధిలోకి వస్తుంది. మన రాజధాని కోసం రైతులు త్యాగం చేశారు. ప్రతి ఒక్కరూ రాజధానిపైఆసక్తితో చూస్తున్నారు’’ అన్నారు. ‘‘తెలంగాణ మిగులు బడ్జెట్‌ వున్న ప్రాంతం. అందుకే అక్కడి ప్రజలు కారు ఎన్నుకున్నారు. ఏపీ లోటు బడ్జెట్‌ ప్రాంతం గనక ప్రజలకు సైకిల్‌ మార్గమైంది. ఇరు ప్రాంత ప్రజలు వారి ఆలోచనలకు అనుగుణంగా కావాల్సిన వాహనం ఎక్కారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీలో అడుగు పెడతారు. మెగస్టార్‌ చిరంజీవికంటే కొద్దిగా తక్కువగానే ఉంటారు’’ అని అభిప్రాయపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read