కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల మధ్య మరోసారి అభిప్రాయభేదాలు భగ్గుమన్నాయి. ముగ్గురు సభ్యుల్లో ఒకరైన అశోక్‌ లవాసా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సమావేశాలకు గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ప్రచార సభల్లో నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతోపాటు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలపై కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసిన అంశంలో ఈసీ క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయంలోనూ ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈవిషయమై ఆయన మే4న కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోడాకు లేఖ కూడా రాశారు.

ec 18052019

క్లీన్‌ చిట్‌ ఇచ్చే సమయంలో తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, మైనారిటీ నిర్ణయాలకు ప్రాధాన్యం దక్కడం లేదని అశోక్‌ ఆరోపించారు. ఈసీ ఆదేశాల్లో మైనారిటీ నిర్ణయాలనూ జత చేయాలని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసినప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులను ఈసీ సీరియస్‌గా తీసుకోలేదని, ఈ విషయంపై ఆయన మనస్తాపం చెందారని అశోక్‌ సన్నిహితులు మీడియాకు తెలిపారు. అరోడా, మరో సభ్యుడు సుశీల్‌ చంద్ర తీసుకుంటున్న నిర్ణయాలతో ఆయన బలవంతంగా సమావేశాలకు దూరంగా ఉండాల్సివస్తోందని వారు తెలిపారు. ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మీదా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ec 18052019

దీనిపైనా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కనీసం ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అభ్యర్థులను వారించడం వంటివి కూడా ఈసీ చేయలేదని సన్నిహితుల ముందు అశోక్‌ వాపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అశోక్‌..అరోడాకు ఎన్ని సందేశాలు పంపినా వాటికి ఆయన సమాధానం ఇవ్వలేదని, దీంతో మనస్తాపం చెంది అశోక్‌ ఈసీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. ఇప్పటికే అన్ని రాజ్యాంగ సంస్థలు, మోడీ, అమిత్ షా నాయకత్వంలో నాశనం అయ్యాయని, దేశమంతా ఆందోళన చెందుతున్న వేళ, ఇప్పుడు ఏకంగా ఎన్నికల కమిషన్ లో కూడా విభేదాలు రావటం చూస్తే, ప్రజలు సరైన నిర్ణయం తీసుకోకపొతే, ఈ దేశాన్ని ఇక ఆ దేవుడే రక్షించాలి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఐదేళ్ల పదవీ కాలంలో మొట్టమొదటి సారిగా మీడియా సమావేశం నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మోదీతో పాటు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు. అయితే మీడియా కొన్ని ప్రశ్నల్ని ప్రధాని నరేంద్రమోదీకి సంధించగా ‘‘సమాధానం ఇవ్వాల్సిన అవసరం మోదీకి లేదు’’ అని అమిత్ షా సమాధానమిచ్చారు. గాడ్సే దేశభక్తుడంటూ సాధ్వీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘ఒక వేళ ఈ ఎన్నికల్లో ప్రగ్యా సింగ్ ఎంపీగా గెలిస్తే, బీజేపీ ఆమెను పార్టీలో కొనసాగిస్తుందా లేదంటే తొలగిస్తారా?’ అని ప్రముఖ హిందీ ఛానల్ ఆజ్ తక్ ప్రధాన మంత్రికి ఓ ప్రశ్న వేసింది.

shah 18052019

అయితే మీడియా సమావేశం ప్రారంభం నుంచి మౌనంగా మోదీ.. ఆజ్ తక్ వేసిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. ఇంతలో అమిత్ షా కలుగ జేసుకొని ‘‘పార్టీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఆమె దానికి సమాధానం చెప్పిన వెంటనే క్రమశిక్షణా కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది’’ అని సమాధానం చెప్పారు. అంతే కాకుండా పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమయంలో జరుగుతున్న హింస, బజేపీపై మమత బెనర్జీ చేస్తున్న ఆరోపణలు, రాఫెల్‌పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, ఇతరులు బీజేపీపై చేస్తున్న ఆరోపణల గురించి మీడియా మోదీని ప్రశ్నించింది. అయినప్పటికీ మోదీ వీటికి సమాధానం చెప్పలేదు. దాదాపుగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షానే అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

గడచిన ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్కసారి కూడా ప్రెస్‌ మీట్‌లో పాల్గొనలేదు. ఈ విషయంపై రాహుల్‌ పదేపదే ఆయనపై దాడి చేశారు కూడా! ఎందుకు మీడియాకు మొహం చాటేస్తున్నారని విపక్ష నేతలు కూడా ఆయనను నిలదీసినా మోదీ పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచార సమయంలో మాత్రం తన షరతుల మేరకు కొన్ని ప్రధాన మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన ప్రెస్‌మీట్‌ పాల్గొంటారని ఎవ్వరూ ఊహించలేదు. నిజానికిది అమిత్‌షా ఎప్పుడూ నిర్వహించే మీడియా సమావేశంగా మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు.

press 18052019

తీరా మొదలయ్యే సమయానికి అకస్మాత్తుగా మోదీ కూడా వచ్చి కూర్చున్నారు. ఆయన ఈ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు తప్పితే విలేఖరుల నుంచి ఎలాంటి ప్రశ్నలకూ ఆస్కారమివ్వలేదు. ప్రతీ ప్రశ్ననూ అమిత్‌ షాకే మళ్లించారు. ‘బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ. మా పార్టీ అధ్యక్షుడే ప్రధానం. ఆయనే బదులిస్తారు. నేను క్రమశిక్షణ గల సైనికుడిని’’ అని దాటవేశారు. ప్రారంభంలో మాత్రం తాను చెప్పదల్చుకున్నది చెప్పేశారు. తొలిసారి మీడియా ముందుకు వచ్చిన మోదీ.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వ్యవహరించిన తీరుపై రాహుల్ సెటైర్స్ వేశారు. ప్రశ్నలన్నింటినీ మోదీ అమిత్ షాకు ఫార్వర్డ్ చేశారు. ఈసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్ మీకు అవకాశమివ్వాలంటూ రాహుల్ సెటైర్. ప్రచార పర్వానికి తెరపడే ఆఖరి గంటలో మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

press 18052019

ఐదేళ్ల కాలంలో ఇదే మోదీకి తొలి మీడియా సమావేశం. దీంతో తాను ఎదుర్కోబోయే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెబుతారోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే మోదీ అంత రిస్క్ తీసుకోలేదు. విలేఖరులు ప్రశ్నలడిగిన ప్రతిసారి మోదీ అమిత్ షా వైపు చూడటం ఆశ్చర్యపరిచింది. మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా బాగా జరిగిందంటూ రాహుల్ సెటైర్స్ వేశారు. ఈసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీకు మాట్లాడే అవకాశన్ని అమిత్ షా ఇవ్వాలని కోరుకుంటున్నానని రాహుల్ ఎద్దేవా చేశారు.

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలం ఎన్‌ఆర్‌ కమ్మపల్లెలో గురువారం అర్థరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రీపోలింగ్‌ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ఇద్దరు రామచంద్రాపురం మండలంలో ఓటుకు నోటు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డి సాయంత్రం ఎన్‌ఆర్‌కమ్మపల్లెకు వెళ్లారు. ఇది గమనించిన గ్రామస్థులు మోహిత్‌రెడ్డిని అడ్డుకున్నారు. చీపుర్లు, చేటలు చేతపట్టి నిరసన తెలిపారు. దీనిపై మోహిత్‌రెడ్డి తమ మద్దతుదారులకు సమాచారం అందించడంతో పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితో పాటు పెద్దసంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఎన్‌ఆర్‌కమ్మపల్లెకు చేరుకున్నారు.

chevireddy 17052019

ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి పులి వర్తి నాని కూడా గ్రామస్థులకు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపినా పరిస్థితి అదుపులోకి రాలేదు. డీఐజీ క్రాంతిరాణా టాటా ఓవైపు, ఎస్పీ అన్బురాజన్‌ మరోవైపు ఇరు వర్గాల నాయకులతో మాట్లాడి పరిస్థితిని కొంతవరకు అదుపులోకి తెచ్చారు. అయితే వైసీపీ కార్యకర్తలు తిరిగి ఆందోళనకు దిగడంతో పాటు తిరుపతి వెస్ట్‌ డీఎస్పీపై చేయి చేసుకోవడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. అనంతరం చెవిరెడ్డిని, నానిని అరెస్టు చేశారు. చెవిరెడ్డిని రేణిగుంట పోలీసుస్టేషన్‌కు. నానిని గాజుల మండ్యం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనలతో ఎన్‌ఆర్‌కమ్మపల్లె గ్రామస్థులు, దళితవాడ ప్రజలు తీవ్ర భాయాందోళనకు గురయ్యారు.

chevireddy 17052019

పల్లెల్లో చిచ్చురేపుతున్న వైసీపీ నేతలపై దుమ్మెత్తి పోశారు. ఓటమి భయంతోనే చెవిరెడ్డి రీపోలింగ్‌కు ఆదేశాలు తెచ్చారని గ్రామస్థులు ఆరోపించారు. అరెస్టు చేసిన ఇద్దరు అభ్యర్థులను అర్థరాత్రి తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. టీడీపీ అభ్యర్థి నాని గాజులమండ్యం పోలీస్‌ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ చెవిరెడ్డి కుమారుడు రౌడీషీటర్లతో ఎన్‌ఆర్‌ కమ్మపల్లెకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నాడని తెలిసి తానూ ఆ గ్రామానికి వెళ్లగా పోలీసులు అక్రమంగా తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read