ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చే అవకాశముందని మరో సర్వే స్పష్టం చేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తూ.. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో తమ నెట్‌వర్క్‌ ఉన్న ‘కార్పొరేట్‌ చాణక్య’ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. టీడీపీ 98 నుంచి 101 స్థానాలు గెలుచుకుంటుందని.. వైసీపీ 71 స్థానాల వద్ద ఆగిపోతుందని అంచనా వేసింది. జనసేనకు 3 స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది. ఫిబ్రవరి 14 - ఏప్రిల్‌ 3వ తేదీ మధ్య ఈ సంస్థ ప్రజాభిప్రాయం సేకరించింది. నియోజకవర్గానికి 4వేల నుంచి ఐదు వేల మంది ఓటర్లను ప్రశ్నించింది. ఓటరు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాడని.. ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే టీడీపీ 110 స్థానాలకుపైగా గెలుచుకోవచ్చునని ‘కార్పొరేట్‌ చాణక్య’ అంచనా వేసింది. సర్వేలో భాగంగా ప్రభుత్వ పథకాలపై ప్రశ్నించగా.. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని 53.8 శాతం మంది చెప్పినట్లు వెల్లడించింది.

game 27032019

ఇక నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఎవరు కావాలని కోరుకుంటున్నారని అడగ్గా.. అత్యధికులు చంద్రబాబుకే మద్దతు తెలిపారు. 48.3 శాతం మంది మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని చెప్పగా.. 41.1 శాతం మంది జగన్‌ కావాలని అభిప్రాయపడ్డారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సీఎం కావాలని కేవలం 6.4 శాతం మంది కోరుకోవడం గమనార్హం. మూడు నెలల కిందటి దాకా స్థానికంగా అభ్యర్థుల మధ్య ‘నువ్వా - నేనా’ అనే పోటీ నెలకొంది. ఇప్పుడు... అత్యధిక ఓటర్లు ఈ ఎన్నికలను చూసే దృక్కోణం మారిపోయింది. స్థానిక అంశాలు, అభ్యర్థులకంటే... ‘రాష్ట్రం - అభివృద్ధి’ అనేదే ఎన్నికల అజెండాగా మారింది. దీనిని అత్యధికులు ‘చంద్రబాబు వర్సెస్‌ జగన్‌’ మధ్య పోరుగా చూస్తున్నారు. తెలుగుదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పలుచోట్ల స్థానిక నేతలపై ఉన్న వ్యతిరేకత. అదేసమయంలో చంద్రబాబుపై ఉన్న సానుకూలత దీనిని తటస్థం చేస్తోంది.

game 27032019

అభ్యర్థుల ఎంపికలో టీడీపీ ఆచితూచి వ్యవహరించింది. 43 శాతం సిట్టింగ్‌లను మార్చడంతో ‘స్థానిక అభ్యర్థులపై వ్యతిరేకత’ను బాగా తగ్గించుకోగలిగింది.ముస్లిం మైనారిటీల్లో టీడీపీకి ఆదరణ పెరిగింది. గతంతో పోల్చితే సుమారు 15 శాతం మంది అదనంగా ‘సైకిల్‌’ వైపు చూస్తున్నారు. వైసీపీతో బీజేపీ కుమ్మకైందని నమ్మడం దీనికి ప్రధాన కారణం. గతంతో పోల్చితే ఎస్సీల్లో 5 నుంచి 8 శాతం ఓటర్లు అదనంగా టీడీపీ వైపు చూస్తున్నారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీల ఓటును జనసేన చీల్చుతోంది. మొదటి నుంచీ కాంగ్రె్‌సకు మద్దతుదారులుగా ఉండి తర్వాత వైసీపీకి బదిలీ అయిన ఎస్సీ మాల ఓటు మీద జనసేన ప్రభావం ఉంది. ఈ వర్గం వారు జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నారని సర్వేలో తేలింది. ‘మాస్‌ లీడర్‌’ను అనుసరించే వారి ఓటు పవన్‌, జగన్‌ మధ్య చీలిపోతోంది. గతంలో... ఈ వర్గం ఓట్లు అత్యధికం జగన్‌కే పడ్డాయి. వెరసి, పవన్‌ దూరం కావడంవల్ల టీడీపీకి నష్టం జరుగుతుందన్న అంచనాలో నిజం లేదు.

 

రోజా పేరు వినగానే ఒకప్పుడు వెండి తెరమీద ఆమె రూపం గుర్తుకొచ్చేది. ఇప్పుడు మాత్రం ఆమె వ్యవహారశైలి గుర్తుకొస్తోంది. సినీతారగా ప్రేక్షకులను అలరించిన రోజా, రాజకీయ నాయకురాలిగా మాత్రం వివాదాలతో ప్రజలను హడలెత్తిస్తున్నారు. ఆమె ఎక్కడుంటే అక్కడ ఒక వివాదం భగ్గుమంటుంది. అసెంబ్లీలో అనేక వివాదాలు, ఆందోళనలతో వార్తల్లోకెక్కిన రోజా, నగరి సమస్యలపై మాత్రం అసెంబ్లీలో పోరాడలేదనే విమర్శలను మూటగట్టుకున్నారు. తనను గెలిపించిన నగరి ప్రజల సమస్యల పరిష్కారం కన్నా ఎక్కువగా ఆమె అధికార పార్టీ నేతలపై తిట్ల దండకానికే ప్రాధాన్యం ఇస్తారనే అపప్రధను మోయాల్సివస్తోంది. నియోజకవర్గంలో అడుగుపెట్టిన ప్రతిసారీ ఆమె ఏదో ఒక వివాదానికి కేంద్రం అవుతున్నారు. బూతులు, తిట్లు, బెదిరింపుల వ్యవహారశైలితో ప్రశాంత నగరి ప్రాంతాన్ని ఉద్రిక్త నగరిగా మార్చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రోజా కేంద్రంగా నడిచిన వివాదాలు ఇవీ..
నగరి గంగమ్మ రోడ్డుపాలు

game 27032019

2014లో నగరి గంగజాతర సందర్భంగా ఎమ్మెల్యే రోజా వ్యవహరించిన తీరు అప్పట్లో తీవ్ర వివాదం అయింది. 2014 సెప్టెంబరులో నగరి గంగ జాతర జరిగింది. జాతరలో ఎమ్మెల్యే హోదాలో తొలి హారతి తనకే ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. నిజానికి సంప్రదాయం ప్రకారం గ్రామపెద్దకే తొలి హారతి ఇస్తారు. ఆమె డిమాండ్‌ను నిర్వాహకులు తిరస్కరించారు. దీంతో ఆమె వైసీపీకి చెందిన తన మద్దతుదారులను పోగేసుకుని జాతరను అడ్డుకున్నారు. 2017లో పుత్తూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఓ సమావేశం సందర్భంగా ప్రోటోకాల్‌ పాటించలేదంటూ ఆరోపిస్తూ రోజా కార్యాలయం వెలుపల ఽబైఠాయించారు. వైసీపీ కార్యకర్తలతో కలసి ధర్నా చేపట్టారు. ఒక పోలీసు అధికారి సమూహంలో నిలబడి ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా, ఆయన మీద ఆమె విరుచుకుపడ్డారు. దూరంగా నిలబడి ఆయన మాట్లాడడాన్ని అధిక్షేపిస్తూ, ‘ నేనేం ఎస్సీ కాదు, అంటరానిదాని లాగా దూరంగా నిలుచుని మాట్లాడతావేం’ అన్నారు. ఈ వ్యాఖ్య సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రోజా పట్ల నగరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా దళిత సంఘాలు విరుచుకుపడ్డాయి. రోజా వ్యాఖ్యల వల్ల వైసీపీ కూడా అప్రతిష్టను మోయాల్సి వచ్చింది.

game 27032019

నగరిలో వందలాది జనం మధ్యే ఎమ్మెల్యే రోజా ఓ పోలీసు అధికారిపై బూతు పురాణం విప్పారు. 2018లో నగరిలో ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలో వైసీపీ కార్యకర్త ఒకరు మృతి చెందారు. అక్కడికి సమీపంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రోజా అనుచరులను వెంటేసుకుని ప్రమాదస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు కూడా తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. అక్కడి పోలీసు అధికారిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషణలకు దిగారు. చివరికి రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీలో కూడా రోజా వ్యవహార శైలి వివాదాస్పదమే. అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన స్పీకరును కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలతో నొప్పించారు. సాటి మహిళా ఎమ్మెల్యే పట్ల కూడా అసభ్యంగా వ్యవహరించి అపకీర్తిపాలయ్యారు. ఈ పరిణామంతో రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచీ సస్పెండ్‌ చేస్తూ స్పీకరు ఆదేశాలిచ్చారు.

 

ఓట్ల పండుగకు ఏపీకి వెళ్లే బస్సులు సజావుగా చేరుతాయా? సొంతూర్లకు సకాలంలో వెళ్లి ఓటు వేయాలని ఆశపడుతున్న ఆంధ్రా ఓటర్ల కల నెరవేరుతుందా అంటే అనుమానమేనని పలువురు ఏపీ ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి వెళ్లే బస్సులను ఏదో ఓ సాకుతో ఆపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నెల 11న ఏపీలో ఓటు వేసేందుకు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా నుంచి లక్షలాది మంది సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 10లక్షల మంది తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరిలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నారు.

game 27032019

ఇప్పటికే దాదాపు అన్ని బస్సుల్లో 90శాతం రిజర్వేషన్లు అయిపోయినట్లు సమాచారం. ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, తమ అనుచరగణంతో జనాలను తరలించేందుకు ప్రైవేటు బస్సులను కూడా ఏర్పాటు చేశారు. కేవలం ఓటు వేయాలనే ఆసక్తితోనే వారంతా ఆంధ్రాకు వెళ్తుండటంతో.. ఎన్నికల తేదీకి ఒక్క రోజు ముందు.. అంటే ఏప్రిల్‌ 10వ తేదీ మధ్యాహ్నమే వారంతా ఏపీకి బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. అయితే, వారంతా సకాలంలో ఏపీకి వెళ్లి ఓటేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

game 27032019

రవాణా శాఖ అధికారులను అడ్డం పెట్టుకుని ఏపీ వెళ్లే ప్రైవేటు బస్సులను అడ్డుకునే అవకాశం ఉందని ఆంధ్రా ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్మిట్‌ లేదని, ఫిట్‌నెస్‌ లేదని, నిబంధనలు పాటించడం లేదని.. ఇలా ఏదో ఒక సాకుతో బస్సులను మధ్యలోనే ఆపివేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో వీలైనంత ముందుగానే సొంతూర్లకు చేరుకునేందుకు ఏపీ ఓటర్లు ప్లాన్‌ మార్చుకుంటున్నారు. ఒకవేళ ప్రైవేటు బస్సులను మధ్యలోనే అడ్డుకుంటే.. సకాలంలో వెళ్లి ఓటేసేలా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు.

గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి అత్యంత సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రతిదానికి డ బ్బులు లేవని నాయకులు, కార్యకర్తల ము ఖంమీదే చెప్పేస్తుండటంతో ఆపార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. చివరకు ప్రచా రంలో పాల్గొనే యువకులకు కూడా రోజువారీ ఖర్చులకు ఇవ్వకపోతుండటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ అ ధికారంలోకి వస్తుందన్న ఆశతో, గురజాలలో గెలవాలన్న తాపత్రయంతో మొదట్లో ముందు వెనుక చూడకుండా ఖర్చుచేసిన నాయకులు కూడా అభ్యర్థి పరిస్థితి చూసి ఆశ్చర్యపోతున్నారు. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఇరువురు నేతలు తర్వాత ఇస్తారులే అన్న భరోసాతో ఖర్చుచేసిన సొమ్ము కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనపడకపోవటంతో కొద్దిరోజులుగా అంటీముట్టనట్లుగా ఉంటున్నారు.

game 27032019

మొన్న పిడుగురాళ్ల వచ్చిన ఆ పార్టీ అధి నేత జగన్‌ కూడా అసహనం వ్యక్తం చేసిన ట్లు చెప్పుకుంటున్నారు. నమ్మి సీటు ఇస్తే డబ్బులు లేవని చేతులెత్తేయటం ఏమిటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ వ్యూహకర్త పీకే ఇచ్చిన సర్వేపైనా కాసుకు జగన్‌ క్లాస్‌ తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. వైసీపీ అభ్యర్థుల గెలుపు ఓటములపై ఆ పార్టీ తాజాగా సర్వే చేయించింది.ఈ సర్వేలో గురజాల వైసీపీ అభ్యర్థి, టీడీపీ అభ్యర్థిమధ్య సుమారు 15వేల ఓట్ల గ్యాప్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈవిషయంపై జగన్‌ తీవ్రంగా మండిపడ్డట్లు చెబుతున్నారు.ఎన్నిక సమీపించే కొద్ది గ్యాప్‌ తగ్గాల్సిందిపోయి పెరగటం ఏమిటని నిలదీసినట్లు తెలుస్తుంది.

game 27032019

అధినేత పిడుగురాళ్ల పర్యటన అంతా అసహనంతోనే సాగినట్లు చెబుతున్నారు.ఈ పరిణామాల తర్వాత మహేష్‌రెడ్డి మరింత ఫ్రస్ట్రేషన్‌కు లోనై.. ఆప్రభావం నాయకులపై చూపుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇదిలాఉంటే ఆ పార్టీలో ముదిరిపాకాన పడ్డ గ్రూపుల వ్యవహారాలు కూడా మహేష్‌కు తలనొప్పిగా మారాయి. ఒకరు దగ్గరకు వస్తే మరొకరు దూరమయ్యే పరిస్థితి ఉండటం ఆయనను చికాకు గురిచేస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తెరవెనుక మం త్రాంగం సాగించేందుకు ఆయన తండ్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కాసు కృష్ణారెడ్డి కూడా రంగంలోకి దిగారని చెబుతున్నారు. కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులకు కాసు కృష్ణారెడ్డి ఫోన్‌ చేయటం చర్చనీయాంశమయింది.
ఒకప్రక్క మహేష్‌రెడ్డి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకపోవటంతో దయనీయంగా మారిన వైసీపీ పరిస్థితి గ్రూపులతో మరింత దారుణంగా దిగజారుతోంది.

Advertisements

Latest Articles

Most Read