రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఒక ముఖ్యమంత్రి కలవడం ఇది తొలిసారి అని సీఎం చంద్రబాబు అన్నారు. కొద్దిసేపటి క్రితం సీఈవో ద్వివేదిని కలిసిన చంద్రబాబు ఎన్నికల సంఘం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖను ద్వివేదికి చంద్రబాబు అందజేశారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డలో డబ్బులు వెదజల్లుతున్నా పట్టించుకోలేదని ఎన్నికల కమిషన్‌పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలను ఖండిస్తున్నామని, తమకు ఈవీఎంలపై నమ్మకం లేదని, వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని ఈసీని కోరామని తెలిపారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఓట్లను కౌంట్‌ చేయడానికి 6 రోజులు పడుతుందని సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఈసీపై మండిపడ్డారు.

ec 10042019 1

డేటా చోరీ కేసులో ఐపీ అడ్రస్‌లు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో 25 లక్షలు ఓట్లు తీసేస్తే సారీ చెప్పి వదిలేశారని విమర్శించారు. దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్నారు. ఈసీ పరిధిలో లేకున్నా అధికారులను బదిలీ చేశారని, ఎలాంటి కంప్లయింట్‌ లేకపోయినా కడప ఎస్పీని బదిలీ చేశారని దుయ్యబట్టారు. సీఎస్‌ను ఏకపక్షంగా బదిలీ చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలపై ఏకపక్షంగా ఐటీ దాడులు చేశారని, వైసీపీలో అవినీతిపరులు లేరా? ఎందుకు దాడులు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణలో రూ.8 కోట్లు పట్టుబడినా చర్యలు లేవని చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ec 10042019 1

టీడీపీ అభ్యర్థులు, నేతలు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా... అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్న స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఫారం - 7 దరఖాస్తులు చేసినవారిపై చర్యలు తీసుకోవడంలో ఈసీ విఫలమైందన్నారు. వైసీపీ ఎప్పుడు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం వెంటనే స్పందిస్తోందని.. ప్రతిపక్ష నాయకుడి నిరాధారణ ఆరోపణలకు ప్రాధాన్యమిస్తోందని బాబు విమర్శించారు. తరువాత సీఈవో బ్లాక్‌ ఎదుట ఆయన కొద్ది సేపు నిరసనకు దిగారు. నిరసనతో ఈసీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

 

 

రఫేల్‌ అంశంపై సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. రఫేల్‌ తీర్పును పునః సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రివ్యూ పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్‌ ఆధారంగా కేసు విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. విచారణ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. రఫేల్‌ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ గతేడాది డిసెంబరు 14న సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.

rafael 10042019

ఆ సమయంలో ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే ఈ తీర్పుపై మరోసారి సమీక్ష జరపాలని కోరుతూ ప్రశాంత్‌ భూషణ్‌, అరుణ్‌ శౌరీ, యశ్వంత్‌ సిన్హా న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉండగా రఫేల్‌ ఒప్పందానికి సంబంధించి కొన్ని కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి. వీటిని ది హిందూ పత్రిక ప్రచురించగా ఆ పత్రాలను రివ్యూ పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. ఈ పత్రాల ప్రాతిపదికన విచారణ జరపాలని కోరారు. అయితే దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. రక్షణశాఖ నుంచి ఆ పత్రాలను దొంగలించి వాటి ఫొటో కాపీలను కోర్టుకు ఇచ్చారని, వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది.

rafael 10042019

అలా అక్రమ మార్గంలో తీసుకొచ్చిన పత్రాల ఆధారంగా తీర్పును రివ్యూ చేయడం సరికాదని పేర్కొంది. వాదోపవాదాలు విన్న అనంతరం కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్‌ ఆధారంగా రివ్యూ పిటిషన్లపై విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది. త్వరలోనే విచారణ తేదీని ఖరారుచేస్తామని వెల్లడించింది.

ఓట్ల పండగకు సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్న ప్రజలకు ప్రైవేటు ట్రావెల్స్‌ ఊహించని షాకిచ్చింది. పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలివున్న దశలో 10వ తేదీన వెళ్లాల్సిన 125 సర్వీసులను ట్రావెల్స్‌ రద్దు చేసింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోగా రిజర్వ్‌ చేసుకున్న వారి డబ్బులు వాపసు చేస్తామని వాట్సాప్‌ గ్రూప్‌లో తాపీగా వెల్లడించింది. ఈ బస్సులన్నీ 100 శాతం రిజర్వ్‌ అయినవే! దీంతో టికెట్లు రిజర్వ్‌ చేసుకున్న దాదాపు 5వేల మంది ఓటేసేందుకు ఎలా వెళ్లాలి దేవుడా? అంటూ తలలు పట్టుకుంటున్నారు. కాగా.. మరో ట్రావెల్స్‌ ఏజెన్సీకి చెందిన 10 సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఏపీ-తెలంగాణల్లో బస్సులు నడిపే లైసెన్స్‌ లేదని, ఆ ట్రావెల్స్‌ కేవలం ఏపీలోనే సర్వీసులు నడుపుకోవాలని తెలంగాణ ఆర్టీఏ ఆదేశించడంతో ట్రావెల్స్‌ యాజమాన్యం ఆ బస్సులను రద్దు చేసింది. దీంతో సకాలంలో ఏపీకి వచ్చి ఓటేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆంధ్రా ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.

bus 10042019

గురువారం (11వ తేదీ) ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కోసం హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల్లోని ఆంధ్రా ప్రజలు టీఎస్‌ ఆర్టీసీ, ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లోనూ సీట్లను రిజర్వ్‌ చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఏపీకి నడిచే ఆరెంజ్‌, మార్నింగ్‌ స్టార్‌, దివాకర్‌, వీరభద్ర వంటి ట్రావెల్స్‌తో పాటు కావేరి ట్రావెల్స్‌లోనూ టికెట్లు బుక్‌ చేసుకున్నారు. అయితే కావేరి ట్రావెల్స్‌ ఒకేసారి 125 బస్సులను రద్దు చేయడంతో ఇప్పుడు వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాగా.. తెలంగాణలో బస్సులు రద్దవుతున్న నేపథ్యంలో ఏపీఎ్‌సఆర్‌టీసీ అప్రమత్తమైంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి ఈ నెల 10, 11 తేదీల్లో ఏపీకి సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

 

bus 10042019

సరిపడా డ్రైవర్లు లేని కారణంగానే 10న ఏపీకి వెళ్లాల్సిన 125 బస్సులను రద్దు చేసినట్లు కావేరి సంస్థ చెబుతోంది. ఏపీలో పోలింగ్‌కు ఒక రోజు మాత్రమే ఉండడంతో అందుబాటులో ఉన్న బస్సుల్లో టికెట్ల చార్జీలు.. విమాన చార్జీలను తలపిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి విశాఖకు ఏసీ స్లీపర్‌ బస్సులో చార్జీ రూ.3700 వరకు ఉండగా.. విమాన చార్జీ రూ.5వేల వరకే ఉంది. బస్సు దొరక్కపోతే రైలులోనైనా వెళ్లొచ్చన్న వారికి వెయిటింగ్‌ లిస్ట్‌ నిరాశే మిగుల్చుతోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి.. సంక్రాంతి సందడిని తలపిస్తోంది. ఏపీలో ఎన్నికల కోసం తాము 48 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణమధ్యరైల్వే చెబుతున్నప్పటికీ అవి సరిపోవడం లేదు.

కేంద్రం పెడుతున్న ఇబ్బందులు, విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఈసీ ఆడటం, తెలుగుదేశం నేతలను కారాడుతున్న ఐటి అధికారులు, ఐటి దాడులు, ఇలా అన్ని రకాలుగా ఎన్నికాల ఒక్క రోజు ముందు కూడా, ఇబ్బంది పెడుతున్న వైఖరికి నిరసనగా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. చంద్రబాబు కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయానికి వెళ్లనున్నారు. సీఈవోను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో అధికారుల బదిలీలు, ఐటీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు సీఎం చంద్రబాబు నిన్న రాత్రి లేఖ రాసారు. అయితే ఆ లేఖను నేడు సీఈవోకు కూడా అందజేయనున్నారు. సీఈవో నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే ఈసీ కార్యాలయం దగ్గరే ధర్నా చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

dharna 10042019

మరో పక్క, నిన్న రాత్రి కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. ఈసీ తీరు దుర్మార్గంగా ఉందని తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ అడుగులు వేస్తోందని మండిపడ్డారు. పోలీసు పరిశీలకులుగా ఉన్న కె.కె.శర్మను బదిలీచేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థులు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు చేస్తున్నారని, ఇది దారుణమని అన్నారు. టీడీపీ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని అన్నారు. వైసీపీ ఎప్పుడు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం వెంటనే స్పందిస్తోందని ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. పోలీసు అధికారుల బదిలీ విషయంలో ఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. నిజానిజాలు నిర్ధారించుకోకుండా చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈసీ తీరును 66 మంది రిటైర్డ్‌ అఖిల భారత సర్వీసు అధికారులు తప్పుపట్టారని, అంత మంది అధికారులు రాష్ట్రపతికి లేఖ రాసే పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read