ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ‘ఆంధ్రులు నిబద్ధత లేనివారు’ అంటూ రాష్ట్ర ప్రజలను కించపరుస్తూ మాట్లాడిన ఆడియో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. శనివారం లీకైన ఆయన సంభాషణలపై ప్రజలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ ఆడియోతో వైసీపీ కుట్రలు, ఆ పార్టీ నేతల నైజం బట్టబయలైందని అంటున్నారు. బీజేపీతో లాలూచీ రాజకీయాలు బయటపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎన్నికల కోసం పూర్తిగా సిద్ధమయ్యాక మోదీ తాను చూసుకుంటానని అంటున్నారని.. అయినా ఆయన్ను నమ్మడానికి వీల్లేదని, అదే నిజమైతే జగన్‌ ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు?’ అనడం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రుల నిబద్ధత అంటే ఏంటో చూపిస్తామని చెబుతున్నారు. విజయసాయి వ్యాఖ్యలతో వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా తెలుస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రజలకున్న నిబద్ధత, ఆంధ్ర ప్రజలకు లేదని కించపర్చడం, ఆంధ్రా యువతకు ఐక్యూ లేదని చెప్పడంపై మండిపడుతున్నారు.

game 27032019

నమ్మకం లేనప్పుడు ఓట్లు ఎందుకడుగుతారు? నిబద్ధత లేని ప్రజలను ఓట్లెలా అడుగుతారు? కేసీఆర్‌తో జత చేరిన జగన్‌, విజయసాయిరెడ్డిలు ఇక్కడ తిని తెలంగాణ మాట, పాట పాడుతున్నారు. వాళ్లు తెలంగాణలోనే పోటీ చేసుకుంటే సరిపోతుంది.... వైసీపీ నిజస్వరూపం బయటపడింది... వైసీపీ నిజరూపం బయటపడింది. విజయసాయిరెడ్డి ఆంధ్రా ప్రజలను కించపరుస్తూ మాట్లాడడం దారుణం. ఆంధ్రావాసులపై ఇప్పటికే పలుసార్లు నమ్మకం లేదంటూ జగన్‌ ప్రకటించారు. ఇలాంటి నాయకులు ఆంధ్రాకు అవసరమా.... మోదీకి సపోర్ట్‌ అని అర్థమైంది... ఎట్టి పరిస్థితుల్లోను బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని వైసీపీ చెబుతుంటే నిజమేనేమో అనుకున్నా. విజయసాయిరెడ్డి ఆడియోతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. ముస్లిం, మైనారిటీలు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి ఓట్లు వేయం. విజయసాయిరెడ్డి ఆంధ్రులకు కృతజ్ఞత లేదని మాట్లాడడాన్ని బట్టి చూస్తే ప్రజలపై ఆయనెంత కక్షకట్టారో అర్థమవుతోంది.

game 27032019

ఆంధ్రులకు చిత్తశుద్ధి లేదంటే నీకూ లేనట్లేగా... ఆంధ్రులకు కృతజ్ఞత, చిత్తశుద్ధి లేదని విజయసాయిరెడ్డి అనడం సిగ్గుచేటు. ఆంధ్రులంటే అతను కూడా వస్తాడన్న విషయాన్ని మర్చిపోయాడేమో..? విజయసాయిరెడ్డికి సిగ్గు లేకపోవచ్చునేమో కానీ మాకైతే ఉన్నాయి. ఎన్నికలకు ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే పొరపాటున అధికారం వస్తే.. కేసీఆర్‌ దగ్గర, మోదీ కాళ్ల దగ్గర రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు.... రాష్ట్రానికి శకునిలా మారాడు.... రాష్ట్రానికి విజయసాయిరెడ్డి శకునిలా దాపురించాడు. ఆడియో లీకులతో బీజేపీతో ఉన్న లాలూచీ బయట పడింది. ఆయన వాడిన భాష ఆమోదయోగ్యం కాదు. వీరికి ఆంధ్రప్రజల పట్ల కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు. కేసుల మాఫియే ప్రధాన అజెండా అని తేలిపోయింది. పరోక్షంగా వైసీపీ ఓటమిని అంగీకరించినట్లే.

‘‘పదిరోజుల్లో మీ అంతుచూస్తా!’’ అంటూ కడప జిల్లా కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రారెడ్డి రామచంద్రయ్య కాలనీవాసులపై చిర్రుబుర్రులాడారు. ఆయన శనివారం నియోజకవర్గ పరిధిలో ఉన్న కడపలోని 15, 16 డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య కాలనీలో స్థానిక నాయకుడు రామచంద్రయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులు ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన హామీలను పట్టించుకోలేదన్నారు. దీంతో రవీంద్రారెడ్డి ఆగ్రహంతో రెచ్చిపోయారు. ‘నా ప్రచారాన్ని అడ్డుకుంటారా.. మీ అంతుచూస్తా. పది రోజుల్లో మీ కఽథ తేలుస్తా’ అంటూ ఊగిపోయారు. కాగా, తర్వాత ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి తనయుడు చైతన్యరెడ్డి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

game 27032019

ఇది ఇలా ఉంటే, వైసీపీ నేతల్లో అసహనం తీవ్రస్థాయికి చేరుతోంది. తమ పార్టీలో చేరాలని బెదిరింపులకు దిగుతున్నా రు. అందుకు అంగీకరించ ని వారిపై దౌర్జన్యాలకు ది గుతున్నారు. ఇంటిపై రాళ్లతో మూకుమ్మడి దాడు లు చేయడమే గాక ఇంట్లో ఉన్న మహిళలపై దుర్భాషలాడిన ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుంబళబీడులో జరిగింది. గ్రామానికి చెందిన ఓంకార్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు శేఖర్‌తో పాటు మరో 50 మంది శుక్రవారం అర్ధరాత్రి ఓంకార్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. టీడీపీకి సపోర్ట్‌ చేయవద్దని హెచ్చరించారు. ఎన్నికల్లో వైసీపీకే మద్దతు తెలపాలని డిమాండ్‌ చేశారు.

game 27032019

తాను టీడీపీ తరపునే పనిచేస్తానని ఓంకార్‌రెడ్డి స్పష్టంచేశారు. దీంతో కక్ష పెంచుకున్న వైసీపీ నాయకులు.. ఓంకార్‌రెడ్డిపై ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. బాధితుడు పోలీసులకు ఫోన్‌ చేయగా.. ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శనివారం ఉదయం ఓంకార్‌రెడ్డి వైసీపీ నాయకులపై ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గ్రామపెద్దలు కలగజేసుకుని పరిస్థితిని శాంతింపజేశారు. ఇరు వర్గాల పరస్పర అంగీకారంతో కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ తెలిపారు.

 

రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో అనూహ్య రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రయోగం వైసీపీ వర్గాలకు చెమట పట్టిస్తోంది. తొలుత ఆషామాషీగా తీసుకున్న ఆ పార్టీ నేతలు ఇపుడిపుడే చంద్రబాబు వ్యూహంలోని పదును, లోతు చూస్తున్నారు. అక్కడ ఇతర నినాదాలకు తోడు సామాజికవర్గమూ కీలకం కావడంతో ఆ దిశగా చంద్రబాబు పాచిక విసిరారు. అలా చిత్తూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రంగప్రవేశం చేయడంతో ప్రతిపక్ష పార్టీ అంచనాలు తారుమారవుతున్నాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం రాయలసీమలో బలిజ సామాజికవర్గానికి అనధికారిక రిజర్వుడు స్థానం వంటిది. నియోజకవర్గం ఏర్పడింది మొదలు తొలి రెండు ఎన్నికలు, చివరి ఎన్నికలు తప్పితే మిగిలిన అన్ని సార్లూ బలిజ వర్గానికి చెందిన వారే ఎంపీలుగా గెలిచారు. 1962 నుంచీ 2009 వరకూ ఇదే సాంప్రదాయం కొనసాగింది.

ప్రధాన పార్టీలు ఈ వర్గానికి చెందిన వారికే టికెట్లు కేటాయించేవి. గత ఎన్నికల్లో వైసీపీ ఈ సాంప్రదా యాన్ని పాటించలేదు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చింది. టీడీపీ కూడా అనివార్యంగా బీజేపీ పొత్తు వల్ల ఆ పార్టీ సూచించిన దగ్గుబాటి పురందేశ్వరిని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె కమ్మ సామాజికవర్గానికి చెందినదనే అంశం పక్కన పెడితే టీడీపీ వర్గాలు ఆమె రాకను జీర్ణించుకోలేదు. దాంతో పలుచోట్ల సహాయ నిరాకరణ ఎదురైంది. ఫలితంగా బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పరాజయం పాలైంది. వైసీపీ అభ్యర్థి సునాయాసంగా గెలిచారు. ఆ పార్టీ తాజా ఎన్నికల్లో కూడా అతనికే టికెట్‌ కేటాయించింది. ఇక్కడే టీడీపీ అధినేత తనదైన శైలిలో రాజకీయం నడిపారు. రెడ్డి సామాజికవర్గం నుంచీ లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి సోదరుడు శ్రీనివాసులురెడ్డికి టికెట్‌ ఇస్తారని అందరూ భావించగా అందరి అంచనాలనూ తారుమారు చేసిన చంద్రబాబు బలిజ వర్గానికి చెందిన సత్యప్రభను అభ్యర్థిగా నిలిపారు.

ఫలిస్తున్న చంద్రబాబు వ్యూహం.. తమ గెలుపునకు తిరుగులేదన్న ధీమాతో ఇతర సెగ్మెంట్లలో సర్దుబాట్లతో కాలక్షేపం చేస్తూండిన వైసీపీ నేతలు చంద్రబాబు వ్యూహంతో ఇపుడు చెమట చిందించాల్సివస్తోంది. రాజంపేట నియోజకవర్గంలోని రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో బలిజ సామాజికవర్గం ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే సంఖ్యలో వున్నారు. మిగిలిన తంబళ్ళపల్లె సెగ్మెంట్లో కూడా వారి సంఖ్య ఓ మోస్తరుగానే వుంది. ఆ వర్గంలో మెజారిటీ ఓటర్ల మద్దతు ఇదివరకూ టీడీపీకే వుండేది. తాజా ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీకి దిగడంతో ఈ వర్గం ఓట్లన్నీ జనసేనకు మళ్లుతాయని వైసీపీ నేతలు భావించారు. దానివల్ల టీడీపీ ఓట్లు చీలి తాము లబ్ధి పొందుతామని ఆశపడ్డారు.అయితే బలిజ సామాజికవర్గానికే చెందిన సత్యప్రభ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా తెర మీదకు రావడంతో వారి ఆశలకు గండి పడినట్టవుతోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తున్న సీనియర్‌ కార్యకర్తలు, నాయకులు రాజంపేట పార్లమెంటు స్థానంలో టీడీపీకి ఇంతటి అనుకూలత గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానిస్తున్నారు. వీటన్నింటి నేపధ్యంలో రెడ్డి, ఎస్సీ, ముస్లిం మైనారిటీ వర్గాల ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని, బలిజ వర్గం ఓట్లు చీలిపోయి తమకు అనుకూలిస్తుందని భావిస్తూ వచ్చిన వైసీపీ నేతలు ఇపుడు మారుతున్న సమీకరణలతో ఆందోళన చెందుతున్నారు. గెలుపోటములు ఎలా వున్నా చంద్రబాబు పదునైన వ్యూహం ప్రత్యర్థుల ధీమాను పటాపంచలు చేసిందనేది మాత్రం నిస్సందేహం.

వైసీపీలో ఎక్కువ సీట్లు నేరచరితులకే ఇచ్చారంటూ ఇతర రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నారు. వారి నామినేషన్ పత్రాలను పరిశీలిస్తే అవి ఆరోపణలు కాదని తెలుస్తుంది. అధినేత వైఎస్ జగన్ తనపై 31కేసులున్నాయని తన నామినేషన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయనపై ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. నేరస్తులకు మనం పిల్లనే ఇవ్వమని, అలాంటిది సీఎం పదవి ఎందుకు కట్టబెడతామని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేసులున్న అభ్యర్థులు కేవలం వైసీపీలోనే కాదు అనేక పార్టీల్లో ఉన్నారన్నది వారి నామినేషన్ అఫిడవిట్లే చెబుతున్నాయి. అయితే ఓ వైసీపీ అభ్యర్థి అయితే అధినేత జగన్‌నే మించిపోయి కేసుల విషయంలో అగ్రస్థానంలో నిలిచారు.

game 27032019

అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 32 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఆయనపై 1985 నుంచి 2019 వరకు ఈ కేసులు నమోదయ్యాయి. 1987లో ఆయనపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. హత్యలు, దాడులు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, తుపాకులు, బాంబులతో దాడులు చేయడం, ఆస్తులను నష్టపరచడం వంటి నేరాల కింద ఆయనపై కేసులున్నాయి. అత్యధికంగా యల్లనూరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో కొన్ని కేసులను న్యాయస్థానాలు కొట్టివేసినట్లు నామినేషన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

game 27032019

ఇక ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన రోడ్ షోలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌పై విమర్శలు గుప్పించారు. ఇటీవలే టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన ఆమంచిని లక్ష్యం చేసుకొని బాబు విమర్శలు ఎక్కుబెట్టారు. వైసీపీలో 95 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 12 మంది ఎంపీ అభ్యర్థులకు నేరచరిత్ర ఉందని బాబు తెలిపారు. ఆ పార్టీ అధినేత జగన్‌పై 31 కేసులుంటే.. ఇక్కడి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై 29 కేసులు ఉన్నాయి. ఈయన జగన్ మోహన్ రెడ్డితో పోటీ పడుతున్నారని బాబు ఎద్దేవా చేశారు. ఆమంచి తమ్ముడు స్వాములుపై ఉన్న 14 కేసులు, బంధువులపై ఉన్న 30 కేసులను కలుపుకుంటే మొత్తం 70కిపైగా కేసులున్నాయన్నారు.

Advertisements

Latest Articles

Most Read