శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తిత్లి తుపాను అతలాకుతలం చేసిన నేపధ్యంలో ఆ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన సహాయ పునరావాస చర్యలు, చంద్రబాబు కష్టం పట్ల ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ మూడు రోజుల క్రిందట సంతృప్తి వ్యక్తం చేస్తూ, చంద్రబాబుని అభినందించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు ముందు చూపును ప్రదర్శించి సహాయ, పునరావాస కార్యక్రమాల నిర్వహణలో అధికార యంత్రాంగంతో చురుకుగా పనిచేయించారని అభినందించారు. ఈ మేరకు గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అభినందన లేఖ రాసిన సంగతి తెలిసిందే.

pk 21102018 2

అయితే ఇప్పుడు ఇదే పాపం పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందిగా మారింది. స్పెషల్ ఫ్లైట్లలో తిరిగి, గోదావరి వచ్చి, కారులో కవాతు చేసి, ఆరు రోజుల తరువాత శ్రీకాకుళం వచ్చి, ఇంకా కరెంటు ఎందుకు ఇవ్వలేదు, అదెందుకు అవ్వలేదు, ఇది ఎందుకు చెయ్యలేదు అంటూ, పవన్ కొడుతున్న ఫోజులు చూస్తున్నాం. నిన్నటితో ఆ కాల్ షీట్లు అయిపోయాయి అనుకోండి, అది వేరే విషయం. అయితే, నేను ఇన్ని తిట్లు తిడుతుంటే, ఇప్పుడు గవర్నర్, చంద్రబాబుని పొగడటం ఏంటి అంతో పవన్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుని ఎవరూ పొగడకూడదని, తనలా అనవసరంగా తిట్టాలి అనే సంకేతాలు ఇస్తున్నారు.

pk 21102018 3

గవర్నర్ విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ "చంద్రబాబు ఏం మేజిక్ చేశారో కానీ గవర్నర్ గారు కూడా సహాయక చర్యలు బాగున్నాయని పొగిడారని ఎద్దేవా చేశారు. సీఎంకు, గవర్నర్‌కు పడదని, కానీ అదే గవర్నర్‌తో పొగిడించుకున్నారని చెప్పారు". మరో పక్క రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లోని అధికారులని కూడా పవన్ ఎద్దేవా చేసారు. తుఫాను ముందు రోజు, చంద్రబాబుతో పాటు, రియల్ టైం గవర్నెన్స్ లోని అధికారులు పని చేసారు. తుఫాను హెచ్చరికల కేంద్రం ఒరిస్సాలో తీరం దాటుతుంది అని చెప్తే, కాదు శ్రీకాకుళంలోనే తీరం దాటుతుంది అని కచ్చితంగా రియల్ టైం గవర్నెన్స్ ఉద్యోగులు చెప్పి, ముందే ప్రజలను అప్రమత్తం చేసారు. అయితే వీరిని కూడా పవన్ ఎద్దేవా చేస్తున్నారు. అన్నీ ల్యాప్‌టాప్‌లలో తెలుసుకునే ముఖ్యమంత్రికి టిట్లీ తుఫాను గురించి తెలియదా అని ప్రశ్నించారు. ఇదండీ పవన్ కళ్యాణ్ తెలివి..

వైసీపీ నేత ఇంటి ఆవరణలోని గడ్డివాములో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించగా పెయింట్స్ బకెట్స్ లో పెట్టి గడ్డివాములో దాచిన నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామంలోని వైసీపీ నేత అనంతరెడ్డికి చెందిన నివాసంలోని పెరటిలో వున్న గడ్డివాములో నాలుగు నాటు బాంబులు లభ్యమయ్యాయి. క్లూస్ టీమ్, బాంబ్ స్వ్కాడ్ సహకారంతో పోలీసులు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ బాంబులు నివాసపు ఆవరణలో దాచి పెట్టి వుంచటానికి గల కారణాలేమిటి?

ycp 21102018 2

ఫ్యాక్షన్ గొడవలా? లేక రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుండే బాంబులను దాచి వుంచారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టుగా సీఐ తెలిపారు. పక్కా సమాచారంతో అనంతరెడ్డి పొలాల్లో తనిఖీలు చేపట్టామనీ, ఈ సందర్భంగా ఓ ప్లాస్టిక్ పెయింట్ డబ్బాలో దాచిన నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నామని సీఐ రాజగోపాల్ నాయుడు తెలిపారు. గత నాలుగు రోజులుగా అనంతరెడ్డి ఊరిలో లేడనీ, ఆయనపై పాత కేసులు చాలా ఉన్నాయని వెల్లడించారు. ప్రత్యర్థులను హతమార్చడానికే అనంతరెడ్డి ఈ బాంబులను దాచిపెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాంబులు బయటపడ్డ నేపథ్యంలో పోలీసులు అనంతరెడ్డి కోసం గాలింపును ముమ్మరం చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, రూ.1200 కోట్ల తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం ఇంకో లేఖ రాశారు. ఈ నెల 13న ప్రధానికి, 15న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి తాను లేఖలు రాసినా స్పందన లేకపోవడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ సాయం ప్రకటించాలని నేను పదే పదే విజ్ఞప్తి చేసినా మీ కార్యాలయం నుంచి కనీస స్పందన లేకపోవడం, పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్రం ఎలాంటి బృందాన్ని పంపించకపోవడం విచారకరమని చంద్రబాబు ఆ లేఖలో రాసారు.

cbn letter 21102018 2

‘రూ.1200 కోట్ల తక్షణ సహాయం అందించాల్సిందిగా కోరుతూ ఈ నెల 13న మీకు నిదేదిక అందజేశాం. తుపాను నష్టం ప్రాథమిక అంచనాలు రూ.3,435.29 కోట్లుగా పేర్కొంటూ ఈ నెల 15న కేంద్ర హోం మంత్రికి, హోం శాఖ కార్యదర్శికి నివేదికలు ఇచ్చాం. తక్షణ సాయం ప్రకటించాలని నేను పదే పదే విజ్ఞప్తి చేసినా మీ కార్యాలయం నుంచి కనీస స్పందన లేకపోవడం, పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్రం ఎలాంటి బృందాన్ని పంపించకపోవడం విచారకరం. కేంద్రం ఇప్పటికైనా స్పందించి యుద్ధ ప్రాతిపదికన తక్షణ సహాయం ప్రకటించాల్సిన అవసరం ఉంది. తుపాను వల్ల దెబ్బతిన్న 2.25 లక్షల కుటుంబాలకు సహాయ, పునరావాస కార్యక్రమాలు అమలు చేసేందుకు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు రూ.1,200 కోట్ల తక్షణ సాయం ప్రకటించాల్సిందిగా మరోసారి కోరుతున్నాను’’ అని ఆ లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

cbn letter 21102018 3

‘‘తుపాను బీభత్సానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 1,802 గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 16 మంది చనిపోయారు. అపార పంట నష్టం జరిగింది. కొబ్బరి, జీడి మామిడి తోటలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా తుపాను దెబ్బకు మరో 20 సంవత్సరాలు వెనక్కు వెళ్లిపోయింది. నాటి ప్రకృతి బీభత్సాన్ని తలుచుకుని జిల్లా ప్రజలు ఇప్పటికీ ఉలిక్కి పడుతున్నారు. గత పది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తోంది’’ అని సీఎం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాల వారీగా ప్రాథమిక నష్టం అంచనాలు, సహాయ పునరావస కార్యక్రమాల వివరాలను ప్రధానికి రాసిన లేఖలో పొందుపరిచారు. ఈ నెల 22 నాటికి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాల సేకరణ పూర్తవుతుందన్నారు. ‘‘నేను నా మంత్రి వర్గ సహచరులు 15 మందితో కలసి వారం రోజులు తుపాను ప్రభావిత ప్రాంతంలోనే మకాం వేసి సహాయ, పునరావాస కార్యక్రమాల్ని పర్యవేక్షించాను. ఇప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో వచ్చే నెల నుండి రేషన్ దుకాణాల ద్వారా రూపాయికే కిలో రాగులు, జొన్నలు సరఫరా చేయ్యనుంది రాష్ట్ర ప్రభుత్వం. పేదలకు పౌష్టిక విలువలు ఎక్కువుగా లభ్యమయ్యే చిరుధాన్యాలను ప్రభుత్వం కారుచౌకగా అందించాలని నిర్ణయించింది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులు, జొన్నలను కేజీ రూపాయికే పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం అయింది. వచ్చే నెల నుంచి జిల్లాలోని అన్ని చౌక డిపోల్లో తెల్లకార్డుదారులకు ప్రయోగాత్మకంగా అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. 150 టన్నుల రాగులు, మరో 150 టన్నుల జొన్నలను జిల్లాలోని 16 సివిల్‌ సప్లై స్టాక్‌ గొడౌన్లకు పంపిణీ చేశారు.

ration 21102018 2

అయితే వీటి పంపిణీలో ఓ నిబంధన విధించింది. 2కేజీలు రాగులు, జొన్నలు తీసుకుంటే కార్డుదారునికి 2కేజీల బియ్యన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. జిల్లాలో 2217 చౌకడిపోలున్నాయి. దాదాపు 11లక్షల 10వేల మందికి పైగా తెల్లకార్డుదారులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి నెల రూపాయికే కేజీ బియ్యం పంపిణీ చేస్తున్నది. ఇంటిలోని జనాభకు అనుగుణంగా 15 నుంచి 25 కేజీల చొప్పున బియ్యం అందిస్తుంది. అయితే రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ మంది జొన్నలు, రాగులు తినడం ఆనవాయితీ. రాగిసంకటి, జొన్న రొట్టెలను అక్కడి ప్రజలు ఎక్కువుగా తింటారు. ప్రస్తుతం వీటి ధర మార్కెట్‌లో ఎక్కువుగా ఉండడంతో వీటిని కారుచౌకగా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ration 21102018 3

ప్రస్తుతం నాణ్యత కలిగిన రాగులు కేజీ రూ.25 పలుకుతుంది. ఆదే రెండో రకమైతే రూ.15 నుంచి రూ.20 వరకు ఉన్నాయి. ఇక జొన్నలు మొదటి రకం కేజీ రూ.20 ఉండగా.. రెండో రకం రూ.15 నుంచి రూ 18 మధ్య ఉంది. ఈ ధరలు పేదలకు భారం కావడంతో బియ్యాన్ని తగ్గించి వాటి స్థానంలో రాగులు, జొన్నలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దీన్ని నవంబర్‌ నెల నుంచి అమలు చేసేందుకు సిద్ధమైంది. వినియోగాన్ని బట్టి డిసెంబర్‌, జనవరి నుంచి బియ్యాన్ని తగ్గించి వీటిని ఎక్కువ మొత్తంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు వీటి వినియోగం వల్ల అరోగ్యానికి కలిగే ఉపయోగాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కూడా నిర్ణయించింది.

Advertisements

Latest Articles

Most Read