గత రెండు మూడు రోజులుగా, సిబిఐ మాజీ జేడీ కొత్త పార్టీ పెడుతున్నారని, దాని పేరు వందేమాతరం అని, జనధ్వని అని, ఇలా అనేక వార్తలు వచ్చాయి. కొత్త పార్టీ ప్రకటన ఈ రోజు ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టటం లేదని, పాత పార్టీలోనే, కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. ఆయాన లోక్‌సత్తా పార్టీలో చేరి, లోక్‌సత్తా అధినేత కానున్నట్లు తెలిసింది. కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకుని లోక్‌సత్తాలో అధ్యక్ష పదవి స్వీకరించబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ప్రియదర్శిని హాల్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

jd 26112018

ఏపిలో పర్యటన తరువాత, కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. జనధ్వని అనే పేరును కూడా పరిశీలించారు. అయితే కొత్త పార్టీ ఏర్పాటు చేయడం కంటే, లోక్‌సత్తా వంటి పార్టీలో చేరి దాన్ని నడిపించడం మేలనే భావనకు తాజాగా వచ్చారు. దీనిపై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణతో సంప్రదింపులు జరిపారు. భావజాలం, ప్రజాసమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. జేడీతో పాటు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వారు లోక్‌సత్తాలో చేరి కలిసి నడుస్తారు. లోక్‌సత్తా అధినేతకు సలహాలు, సంప్రదింపుల బాధ్యతలో జేపీ ఉంటారు.

jd 26112018

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఎంట్రీ ఇస్తాను, ఇక్కడ రైతులని ఉద్దరిస్తాను అంటున్న లక్ష్మీనారయణ, హైదరాబాద్ లో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఎంట్రీ గురించి చెప్తారంట. మన ఖర్మ కాకపొతే, ఇప్పటికే ఒకడు ప్రతి గురువారం ఉదయం హైదరాబాద్ పోయి, అక్కడ రెండు రోజులు రెస్ట్ తీసుకుని, ఇక్కడకు వచ్చి రాజకీయం చేస్తాడు. ఇంకొకడు, నాలుగు రోజులు ఇక్కడ తిరిగి, మళ్ళీ హైదరాబాద్ పోయి, అక్కడ ఓ 10 రోజులు ఫార్మ్ హౌస్ లో పడుకుని, మళ్ళీ ఇక్కడకు వచ్చి రాజకీయం చేస్తాడు. వీళ్ళకు తోడు, ఇంకో ఆంధ్రాభాదీ, లక్ష్మీనారాయాణ వస్తున్నారు. ఆ ప్రకటన చేసేది ఏ విజయవాడలోనో, తిరుపతిలోనో, వైజాగ్ లోనో చెయ్యొచ్చు కదా సార్. ఏదేమైనా 2009లో చంద్రబాబుని దెబ్బ తియ్యటానికి లోక్‌సత్తా, చిరంజీవి పార్టీలను పెట్టి ఎలా ప్రజలను కన్ఫ్యూజ్ చేసారో, ఇప్పుడు లోక్‌సత్తా రీలోడెడ్, ప్రజారాజ్యం రీలోడెడ్ తో ప్రజలను బకరాలను చేసి, చంద్రబాబుని తప్పించటానికి మళ్ళీ అన్ని వైపుల నుంచి తరుముకొస్తున్నారు.

ప్రతిపక్షాలని ప్రత్యర్దులని ఎదుర్కునే విషయంలో, మోడీకి ఏమాత్రం తీసిపోవటం లేదు కేసీఆర్. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ, ప్రత్యర్ధుల పై విరుచుకు పడుతున్నారు. అక్కడ మోడీ తన చేతిలో ఉన్న అన్ని వ్యవస్థలని ఖునీ చేస్తుంటే, ఆయన శిష్యుడు, కేసీఆర్ కూడా, ఇక్కడ అదే పని చేస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ తో పాటు గజ్వేల్ లో పోటీ పడుతున్న, కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆమరణదీక్షకు దిగారు. పోలీస్, ఎన్నికల అధికారుల తీరుపై వంటేరు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల అండతో అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని, పోలీసులు తనను వెంబడిస్తున్నారని తెలిపారు.

kcr 25112018 2

పోలీసుల అండతో టీఆర్‌ఎస్‌ డబ్బు, మద్యం పంచుతోందని ఆరోపించారు. తన కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని... తమను ఎక్కడికక్కడ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రెచ్చిపోతున్నారని... వారి ఒత్తిడిని తట్టుకోలేకే దీక్షకు దిగానని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి ప్రాణ త్యాగానికి కూడా తను సిద్ధమేనని అన్నారు. అవసరమైనే ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు. ప్రతాపరెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

kcr 25112018 3

ఆయన్ను ఈడ్చుకుని తీసుకు వెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసారు. దీంతో గజ్వేల్‌ నియోజకవర్గంలో వంటేరు ప్రతాపరెడ్డి అనుచరులు అందోళనకు దిగారు. స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో వీరు ఆందోళన చేపట్టడంతో పోలీసులు వారు అదుపుచేసే పనిలో ఉన్నారు. మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షను భగ్నం చేయటానికి నిరసనగా ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. దీంతో భారీ ఎత్తున బలగాలను మోహరించారు.

వైసీపీ బిజెపి తెరాస ఒక్కటే అని ఇప్పటికే చెప్తుంటే నమ్మని వారు, ఈ వార్తా చూసైనా నమ్ముతారేమో. ఇప్పటికే జగన్, పవన్, మేము తెలంగాణాలో పోటీ చెయ్యటం లేదు అంటూ చేతులు ఎత్తేసారు. దీనికి కారణం లేకపోలేదు. ఎలాగూ, అక్కడ ఉన్న జగన్, పవన్ వర్గం, ఓట్లు వేసేది తెరాస పార్టీకే. అందుకే అనవసరంగా ఓట్లు చీల్చటం ఎందుకని, వాళ్ళు పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే, వీళ్ళు, ఇప్పుడు బహిరంగంగా కేసీఆర్ కు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ గెలిస్తే, మనకు ఆంధ్రాలో వైసీపీ పార్టీకి అనుకూలం అని చెప్తున్నారు.

ktr 25112018

శనివారం అందరం కలిసి కేటీఆర్ కు మద్దతు తెలుపుదాం అంటూ హైదరాబాద్ లో వైసీపీ కార్యకర్తలకు వాట్స్ అప్ మెసేజ్ వెళ్ళింది. దీని ప్రకారం, కేటీఆర్ సమక్షంలో అందరూ కలిసి సమావేశం అయ్యారు. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా కూకట్‌పల్లిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్ సింగిల్‌గా వస్తున్నారని సమావేశంలో ప్రసంగించిన వైసీపీ నేతలు చెప్పారు. అంతేకాదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఫొటోలను బ్యానర్లపై ముద్రించడాన్ని కూడా వారు తప్పుబట్టారు.

ktr 25112018

p style="text-align: justify;">వైఎస్ బొమ్మ పెట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. వైఎస్ అవినీతిపరుడని కాంగ్రెస్ వాళ్లు ఆరోపించారని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు, రాహుల్ ప్రచారానికి వస్తామంటున్నారని.. ముందు వైఎస్‌పై వాళ్లిద్దరూ అభిప్రాయం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు జై కేసీఆర్, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్‌తో పాటు వైసీపీ నేతలు కూడా కష్టపడి మహాకూటమిని ఓడించాలని సమావేశంలో ప్రసంగించిన వైసీపీ నేతలు పిలుపునిచ్చారు.

మొన్న రేవంత్ రెడ్డి మీద ఐటి రైడ్ లు చేసి, వెయ్య కోట్లు అని ప్రెస్ కి లీక్ ఇచ్చారు... అలాగే సియం రమేష్ పై దాడులు చేసి, నాలుగు వేల కోట్లు అని లీక్ ఇచ్చారు... తీరా చూస్తే అక్కడ ఏమి లేదని, ఊపుకుంటూ వెళ్లారు. నిన్న సుజనా పై కూడా, 6 వేల కోట్ల అంటూ ప్రెస్ నోట్ ఇచ్చింది ఈడీ. అయితే మొన్నటి వరకు పత్రికల్లో 300 కోట్లు బ్యాంక్ లోన్ కట్టలేదు అని వచ్చిన వార్తలు కాస్తా, 6 వేల కోట్లు అయిపోయాయి. అయినా, ఇక్కడ కరప్షన్ కేసు కాదు. వ్యపారంలో వచ్చే సివిల్ కేసు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోకుండా, ఏ కంపనీ నడవదు. అప్పులు లేకుండా వ్యాపారం చేసిన వారు ఎవరైనా ఉన్నారా ? మోడీ ప్రియ సన్నిహితులు అయిన అంబానీ, ఆదానీ కూడా అప్పులు తీసుకుని వ్యాపారాలు చేసే వారే. అప్పులు తీర్చకపోతే బ్యాంకు లు జప్తు చేసుకొని అప్పులు జమ చేసుకుంటాయి. సుజనా విషయంలో, అసలు ఏ బ్యాంక్ కంప్లైంట్ ఇచ్చిందో, ఇప్పటి వరకు ఈడీ చెప్పలేదు. ఇవన్నీ చెప్పకుండా 6 వేల కోట్లు ఎగవేత పై దర్యాప్తు జరుపుతున్నాం అంది. ఇది పట్టుకుని సాక్షి, హడావిడి చేస్తుంది. దీని పై సుజనా చౌదరి ఈ రోజు మీడియాతో తన వివరణ ఇచ్చారు.

‘‘30ఏళ్ల క్రితం నేను రెండు కంపెనీలు స్థాపించాను. సుజనా యూనివర్స్‌ల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, సుజన మెటల్ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌లను స్థాపించాను. సుమారు 11 సంవత్సరాల క్రితం ఒక కంపెనీ నుంచి విడిపోయి మూడో కంపెనీ వచ్చింది. గత 29 సంవత్సరాల నుంచి ఈ కంపెనీల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయి, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఉంటాయి. వెస్ట్రన్‌ కంపెనీలో నేను డైరెక్టర్‌ను కాను. మా మిత్రులు డైరెక్టర్లు. ఈడీ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పన్ను రిటర్నులు కూడా ఫైల్‌ చేస్తున్నాం. 2015 వరకు కూడా ఆ కంపెనీలు వడ్డీలు చెల్లించాము. మొన్న అధికారులు వచ్చినా నేను పట్టించుకోలేదు. ఇదేదో సాధారణ తనిఖీలుగా భావించాను. వీళ్లు ఇంత దారుణంగా వాంగ్మూలం ఇచ్చాక అసలు వివరాలేంటో అని తెలుసుకున్నాను. నాలుగైదు ఏళ్ల నుంచి స్టీలు, విద్యుత్తు రంగాలు కష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ అప్పు తీసుకోవడం అనేది నేరం ఏమీ కాదు. బ్యాంకులు ఉన్నవే అప్పులు ఇవ్వడానికి. చెల్లించిన పన్నులు, పవర్‌ బిల్లులు, బ్యాంకులకు చెల్లించిన వడ్డీల మొత్తాన్ని చూస్తే ఇప్పుడున్న బకాయిల కంటే ఎక్కువే వస్తుంది. ఈడీ కొత్తగా కనుగొంది ఏమీలేదు. బ్యాలెన్స్‌ షీట్‌లో ఉన్న మొత్తాన్ని వారు పేర్కొన్నారు.’’

‘‘గత తొమ్మిది నెలల నుంచి అనేక జాయింట్‌ లెండర్స్‌ మీటింగ్‌లు జరుగుతున్నాయి. పరిష్కార ప్రక్రియ జరుగుతోంది. ప్రమోటెడ్‌ డైరెక్టర్‌గా నేను, శ్రీనివాస్‌రాజు ఉన్నాం. కంపెనీలకు 20 ప్రదేశాల్లో ప్లాంట్లు ఉన్నాయి. బ్యాలెన్స్‌ షీట్స్‌ అన్నాక లాభనష్టాలు రెండూ ఉంటాయి. కేవలం లాభాలే ఉండవు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, సెయిల్‌ వంటి సంస్థలే నష్టాల్లోకి వెళ్లాయి. ఎందుకు..? 29ఏళ్లు నా కంపెనీలు సక్రమంగానే ఆడిట్‌ నిర్వహించాను. డమ్మి కంపెనీలు అంటే ఏంటో నాకు తెలియదు. ఆయా కంపెనీలతో నాకేంటి సంబంధం..? 2010 తర్వాత నేను నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌గా మారిపోయాను. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా మా కంపెనీ నుంచి తీసుకోలేదు.. వాడుకోలేదు. మా కంపెనీలు తప్పు చేశాయని నేను అంగీకరించను. కార్ల వివరాలు కూడా ఇస్తాను. సెబీ, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఎటువంటి సమస్యలు లేవు. ఎటువంటి సమాచారం కావాలన్నా మా కంపెనీలకు వెళ్లండి.. అక్కడ మా డైరెక్టర్లు ఉన్నారు. ఈడీ విషయం కూడా కనుక్కొని మీకు సమాచారం ఇస్తాను. సమన్ల విషయంలో పొరబాటు జరిగిందని ఈడీ అధికారులు నాతో అన్నారు.’’

‘‘నా కంపెనీల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరగలేదు. ఇది సివిల్‌ వివాదం. మా కంపెనీల్లో మూడు కంపెనీలు మాత్రమే ఎన్‌పీఏలు అయ్యాయి. సుజనా గ్రూప్‌ కింద మూడు కంపెనీలు మాత్రమే ఉన్నాయి. మా డైరెక్టర్లకు నేను ఎప్పుడూ ఈ-మెయిల్స్‌లో సూచనలు చేయలేదు. బ్యాలెన్స్‌ షీట్‌లో ఉన్న రూ.5,700 కోట్లు అని ఒక్కరోజులో తేల్చేశారు. 2009 తర్వాత నాపై ఆరోపణలు మొదలయ్యాయి. నేను పోటీలోకి దిగాక నాపై ఆరోపణలు చేశారు. నేను మంత్రి అయ్యాక ఆరోపణలు చేశారు. ఇదంతా ఒక క్రమపద్ధతిలో చేస్తున్నారు.’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, రేవంత్ కాని, సియం రమేష్ కాని, సుజనా కాని, ఈ సోదాలు, కేసుల పై ప్రతి విషయం వివరంగా వచ్చి ప్రెస్ కి చెప్పారు. మరి ఏనాడైనా, జగన్ తన ఆస్తుల గురించి, కేసుల గురించి, ఇలా వివరణ ఇచ్చాడా ? ఇక్కడే తెలిసిపోతుంది ఎవరు ఏంటో. ఎవరు తప్పు చేసినా, అనుభవిస్తారు. ఎంత లేట్ అయినా, సరే అనుభవించే వెళ్తారు.

Advertisements

Latest Articles

Most Read