రాజకీయాల్లో కావల్సింది వయస్సు కాదని, పరిణితి అవసరమని, ఆ పరిణితి ముఖ్యమంత్రి చంద్రబాబులో పుష్కలంగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. శనివారం విజయవాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడు తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు వయస్సు పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 60ఏళ్లు దాటినవారు పాలించడానికి పనికిరారని పవన్ అనటం సరి కాదని, 65 ఏళ్ల వయస్సులోనే సీఎం చంద్రబాబు 2817కి.మీ. పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. శారీరకంగా, మానసికంగా చంద్రబాబు చాల ఫిట్‌గా ఉన్నారని పవన్ లాగా తీరుపతి కొండకి వెళ్లి 80 సార్లు కుదేలైన వ్యక్తి కాదని, చంద్రబాబు సత్తా ఏమిటో ప్రజలకు తెలుసన్నారు.
రాజకీయాల్లో ప్రజా సమస్యలపై సకాలంలో స్పందించే గుణం ఉండాలని, ఆ గుణం, 40సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందని, కాబట్టే అభివృద్ధి చేయగలరేనే నమ్మకంతో ఓట్లేసి ఎన్నుకున్నారని తెలిపారు. చంద్రబాబు వయస్సు గురించి మాట్లాడే పవన్ 64ఏళ్ల కేసీఆర్, 68ఏళ్ల ప్రధాని మోడీ వయస్సును అడిగే దమ్ముందా అని ప్రశ్నించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 72ఏళ్లని, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 63ఏళ్లని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్! 72ఏళ్లని, రష్యా అధ్యక్షుడు పుతినకు 66ఏళ్లని పవ నీకు ఏం అనుభవం ఉందని ఇలా మాట్లాడుతున్నారో అర్దం కావటంలేదన్నారు. ప్రశ్నించడం కోసమే పుట్టానని చెప్పిన పవన్ నిత్యం సమీక్షలతో, పర్యటనలతో, టెలికాన్ఫరెన్స్లతో రోజుకి 18గంటలు పనిచేసే సీఎంని హేళనగా ప్రశ్నిస్తారా - మీరెంత, మీఅనుభమెంతా అంటూ నిలదీశారు.
చాలా చోట్ల నిలబడతానన్న పవన్ శ్రీకాకుళం తిల్లీ తుపాన్ బాధితులకు కేంద్రం నుంచి రావాల్సిన పరిహారం గురించి, వెనుకబడిన జిల్లాలకు నిధిలిచ్చి వెనక్కి తీసుకున్న కేంద్రాన్ని, కాకినాడకు కేటాయించిన పెట్రో కాంప్లెక్స్, లోటు బడ్జెట్ గురించి ఎందు కు ప్రశ్నించరన్నారు. ప్రతిపక్షనేత జగన్ కోడి కత్తి డ్రామా ఆడతారని, పవన్ ఇసుక లారీల కథలు చెబుతారని, పవన్ బౌన్సర్లు ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ మిడిల్ లైన్ దాటి వెళ్లి ఇసుక లారీని కొట్టిందని, ఆ ఘటన పై స్కార్పియో డ్రైవర్ తనదే తప్పని పరోక్షంగా అంగీకరించారని చెబుతూ దానికి సంబంధించిన వీడియోను మీడియాకు చూపెట్టారు. పవన్ చెన్నైలో మీడియా సమావేశం ఎందుకు పెట్టారో అర్ధంకావటంలేదని, దక్షిణాదిలో రాజధాని కోసం అన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతిస్తాయని, దీనికోసం పవన్ ప్రధాని మోడీకి వినతిపత్రం ఇవ్వలేదే అని ప్రశ్నించారు.