అది మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. తనకి అన్ని విధాలుగా అడ్డు పడుతూ, తన గుట్టు అంతా రచ్చ చేస్తున్న రేవంత్ ను ఈ సారి ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టారు. అందుకే డబ్బు విషయంలో వెనకాడ కూడదని స్పష్టాతిస్పష్టంగా తన ముఠాకు చెప్పేశారు. పైగా ధనవంతుడైన మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపారు. వందకోట్లైనా ఫర్వాలేదు రేవంత్ రెడ్డి ని ఓడించాలని టార్గెట్ పెట్టారు. కేసీఆర్ ఆదేశం... నోట్ల ఆశీర్వాదం చూసుకుని పట్నం ముఠా రంగంలోకి దిగింది. గడచిన నాలుగు నెలలుగా పచ్చనోటు పుచ్చుకుని కొడంగల్ గడ్డ పై స్వైరవిహారం చేస్తోంది.

kodangal 28112018 2

ఈ క్రమంలోనే కోస్గీలోని తమ బంధువు, విద్యాశాఖలో జాయింట్ కమిషనర్ రేంజ్ లో పని చేసి రిటైర్ అయిన ఓ వ్యక్తి ఫాంహౌస్ ను కేంద్రంగా చేసుకుని నరేందర్ రెడ్డి అండ్ కో... డబ్బులు వెదజల్లడం మొదలు పెట్టారు. ఇంత విచ్చలవిడి తనంగా వ్యవహారం చేస్తే ఏమౌతుంది... అవ్వాల్సిందే అయింది. మంగళవారం అర్థరాత్రి నరేందర్ రెడ్డి స్టే చేస్తోన్న ఫౌంహౌస్ పై ఐటీ రైడ్స్ జరిగాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు పక్కా సమాచారంతో విరుచుకుపడ్డారు. సుమారు 15 కోట్ల రూపాయలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరో ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన లెక్కల వివరాలు స్వాధీనం చేసుకున్నారు. ఫాం హౌస్ సీజ్ చేశారు.

kodangal 28112018 3

15 కోట్ల రూపాయల నగదు సీజ్ చేశారు. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని రాజీ చేసే ప్రయత్నం చేసినా ఐటీ అధికారులు వినలేదు. దీంతో నరేందర్ రెడ్డి సొమ్ములు అడ్డంగా బుక్కయ్యాయి. పంచనామా కూడా నిర్వహించారు. ఇంత జరిగినా విషయం మాత్రం బయటకు పొక్క లేదు. పొక్కలేదు అనే కంటే... పొక్కకుండా తీవ్రమైన జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే వీటిని టీఆర్ఎస్ నేతలు కొట్టి పారేసినప్పటికీ, ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ దీన్ని ధృవీకరించడం సంచలనంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరి ఇళ్లలో సోదాలు జరిగాయని, సోదాకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం మీడియాకు తెలియజేస్తామని రజత్ కుమార్ తెలిపారు. పట్టుబడిన నగదంతా టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమీప బంధువునివిగా భావిస్తున్నారు. ఐటీ సోదాలతో కొడంగల్ రాజకీయాల్లో కలకలం రేగింది.

తాను ఎక్కడ ఉన్నా తెలంగాణ తనకు ప్రియప్రాంతమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తనను తెలంగాణ ప్రజలంతా ఎంతో అభిమానించారని, ఎవరికీ దక్కని గౌరవం తనకు ఇచ్చారని.. దాన్ని ఎప్పుడూ మరిచిపోలేనన్నారు. 37 ఏళ్లుగా కాంగ్రెస్‌, తెదేపా ఒకరిపై మరొకరు పోరాటం చేసినా దేశ ప్రయోజనాల కోసమే ఈ రోజు ఏకమయ్యామన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాలనా వైఫల్యాలను ఎండగడుతూనే.. తనపై కేసీఆర్‌, తెరాస చేసిన విమర్శలకు దీటుగా జవాబిచ్చారు. నేను నీళ్ళు ఆపుతున్నా అని కేసీఆర్ అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ కింద ఉంది, పైన తెలంగాణా ఉంది, తెలంగాణా వదిలిన నీటినే, ఏపి వాడుకుంటుంది, మరి నేను తెలంగాణాకు నీళ్ళు ఎలా ఆపుతాను అంటూ, ఒక్క సమాధానంతో, కేసీఆర్ నోరు ముపించారు చంద్రబాబు.

kcr water 28112018

‘‘నేనేదో పెత్తనం చేస్తానంటున్నారు. ఈ రోజు నేను తెలంగాణకు వచ్చి పోటీచేసే అవకాశం లేదు. నేనే ఏపీకి సీఎంగా ఉంటాను. తెలంగాణలో ప్రజల అభ్యున్నతికి అండగా నిలుస్తానని హామీ ఇస్తున్నా. గోదావరి జలాలు ఏవిధంగా ఉపయోగించుకోవాలనేది ఆనాడు ఆలోచించాం. కృష్ణానదిలో నీళ్లు రాలేదు. గోదావరి 2500 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లింది. దాన్ని ఉపయోగించుకుంటే తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలమవుతాయి. తెలంగాణ కింద ఉన్న ఏపీ నీళ్లకు అడ్డు పడుతోందని మాట్లాడటం ఎంతవరకు సబబు? దేవాదుల, మాధవరెడ్డి ఎత్తిపోతల, భీమ తదితర నీటిపారుదల ప్రాజెక్టులకు నేనే నాంది పలికాను. తెలుగుజాతి ప్రయోజనాల కోసం అన్ని విధాలా సహకరిస్తా. విద్యకు నేనే ప్రాధాన్యమిచ్చాను. హైదరాబాద్‌ను నేనే నిర్మించాని చెప్పుకొంటున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌ను నేనే నిర్మించానని ఎక్కడా అనలేదు. సైబరాబాద్‌ను నేనే నిర్మించా’’ అని చంద్రబాబు వివరణ ఇచ్చారు.

kcr water 28112018

‘‘ఎన్డీయే పాలనతో ప్రజలకు లాభం వచ్చిందా? పెద్ద నోట్ల రద్దుతో లాభం వచ్చిందా? ఏటీఎంలలో డబ్బులు వస్తున్నాయా? బ్యాంకుల్లో కరెన్సీ ఉందా? దానికి కారణం ఎన్డీయే కాదా? జీఎస్టీ తీసుకొచ్చి అమలు సరిగా చేయలేదు. దీంతో అనేక ఇబ్బందులు వచ్చాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రూపాయి విలువ పడిపోయింది. రైతులు, పేదలు ధరలు పెరుగుదలతో అవస్థలు పడుతున్నారు. పద్ధతి ప్రకారం ఆలోచించకుండా దేశహితం గురించి ఆలోచించకుండా స్వార్థంతో పనిచేస్తున్నారు. ముస్లిం సోదరుల పట్ల అసహనంతో వ్యవహరించి అభద్రతా భావంతో ఉన్నారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఆవేశాలు ఉన్నాయి. విభజన జరిగినా, జరగకపోయినా తెలుగు జాతి కలిసి ఉండాలని ఆనాడే చెప్పాను. సమన్యాయమని చెప్పాను తప్ప ఏకపక్షంగా విభజన చేయాలని ఎప్పుడూ నేను చెప్పలేదు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు అపరిష్కృతంగా ఉన్నాయి. తెలంగాణలో కూడా బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ ఇచ్చే పరిస్థితిలో కేంద్రం లేదు. ఇవన్నీ తెరాస అడగకపోవడం న్యాయమా? నేనెక్కడున్నా తెలంగాణ నాకు ప్రియప్రాంతమే’’ అని చంద్రబాబు అన్నారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి సభలో రాహుల్‌తో కలిసి వేదిక పంచుకున్న చంద్రబాబు తన ప్రసంగం సమయంలో కేసీఆర్ తిడుతున్న బూతులు పై స్పందించారు. కేసీఆర్‌ తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఏం తప్పుచేశానని తనను తిడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్‌ అనే వ్యక్తి ఉంటాడా అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. టీడీపీ రాజకీయ జన్మనిస్తే తనను విమర్శిస్తున్నారని ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. తనకు సభ్యత ఉందని, తాను కేసీఆర్‌ను విమర్శించనని, అలాంటి మాటలు నేను మాట్లాడనని చంద్రబాబు చెప్పారు.

cbnkcr 28112018

‘‘తెలంగాణ అభివృద్ధికి నేను ఏనాడూ అడ్డుపడలేదు. అనవసరంగా నన్ను కేసీఆర్‌ టార్గెట్‌ చేసుకున్నారు. ఆరోజు, ఈ రోజు ఒకేమాటపై ఉన్నాను. కేసీఆర్‌ నన్ను తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారో నాకైతే అర్థంకాలేదు. మీకేమైనా అర్థమైందా తమ్ముళ్లూ. నన్ను దూషించడం న్యాయమా? నేనేం తప్పు చేశాను? తెలంగాణ అభివృద్ధికి తెదేపా సహకరించ లేదా? తెదేపా లేకపోతే కేసీఆర్‌ అనే వ్యక్తి ఉంటాడా? తెదేపా రాజకీయ జన్మినిస్తే నన్నే విమర్శిస్తున్నారు. నాకు సభ్యత ఉంది. విమర్శించను గానీ తెలంగాణ అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నా. దేశంలో నెం.1 రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. నాలుగేళ్ల పాలన చూస్తే బాధేస్తోంది. అభివృద్ధి జరగలేదు. అప్పులు పెరిగాయి. దారుణంగా తయారైంది. ప్రజాకూటమిని ప్రజలు గెలిపించాలి. ప్రజాకూటమి ఐక్యత వర్థిల్లాలి’’అని అన్న చంద్రబాబు.. జైతెలంగాణ.. జైజై తెలంగాణ’’ అని ప్రజలతో అన్పించారు.

cbnkcr 28112018

మరో పక్క, ఎన్నికలకు ఇంకా కొద్ది రోజుల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార తెరాసకు అక్కడ మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇద్దరు కార్పొరేటర్లు తెరాసకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. ఈ రోజు ఖమ్మంలో ఎన్నికల ప్రచార సభకు వచ్చిన చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ (ఐడీసీ) ఛైర్మన్‌, ఖమ్మం జిల్లా తెరాస మాజీ అధ్యక్షుడు బుడాన్‌ఇటీవల కారు దిగి సైకిల్‌ ఎక్కుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కూడా ఈ రోజు బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరనున్నారు. 2014 ఎన్నికల్లో బుడాన్‌ బేగ్‌ ఖమ్మం లోక్‌ సభ స్థానం నుంచి తెరాస అభ్యర్థుగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.

విభజన జరిగినా జరగకపోయినా.. తెలుగుజాతి కలిసుండాలనేదే తాను ఆకాంక్షించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఖమ్మంలో జరిగిన ప్రజాకూటమి సభలో ఆయన మాట్లాడారు. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్‌గాంధీ కూడా హాజరయ్యారు. సమైక్య రాష్ట్రంలో అందరూ రెండుగా విడిపోయినా .. తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని తాను ఒకే మాటపై ఉన్నానన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాను మోదీ నెరవేర్చలేదన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయాల గురించి మోదీని టీఆర్ఎస్ అడగడం లేదన్నారు. తానేదో పెత్తనం చేస్తానని బూచిగా చూపిస్తున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అండగా ఉంటానన్నారు. తాను ఇక్కడకు వచ్చి పోటీ చేసే పరిస్థితి లేనప్పుడు పెత్తనం ఎలా చేస్తానని చంద్రబాబు ప్రశ్నించారు.

kcr question 28112018

దేశంలో రెండే రెండు ఫ్రంట్‌లు ఉన్నాయని.. ఒకటి ఎన్డీయే ఫ్రంట్‌, రెండోది ఎన్డీయే వ్యతిరేక ఫ్రంట్‌ అని, ఎవరు ఎటువైపు ఉన్నారో తేల్చుకోవాల్సిన సమయం ఆసననమైందని, కేసీఆర్‌ ఎక్కడుంటారో చెప్పాలని, ఎంఐఎం ఎక్కడుంటుందో తెలపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈవీఎంలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఓటు ఎవరికి వేసింది వచ్చిన స్లిప్పుతో చూసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలను హ్యాక్‌ చేయడం చాలా తేలికని, అందుకే జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నానని ఆయన అన్నారు. టెక్నాలజీనీ అధికంగా వాడే వ్యక్తిగా లోటుపాట్లు తనకు తెలుసునని చంద్రబాబు పేర్కొన్నారు.

kcr question 28112018

నూటికి నూరుశాతం కాదు... తెలంగాణలో 1000 శాతం ప్రజాకూటమిదే గెలుపని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ధైర్యంగా పోరాడుదామని, భయపడితే జీవితాంతం నష్టపోతామని ఆయన అన్నారు. తెలంగాణ యువతకు ప్రోత్సహిస్తే... ప్రపంచాన్నే శాసించే శక్తి ఉందని, ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుంటే... తెలంగాణ నెంబర్‌వన్‌ రాష్ట్రంగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో ఏం అభివృద్ధి జరగలేదని, అప్పులు పెరిగిపోయాయని విమర్శించారు. బీజేపీకి ఓట్లు లేవు కానీ... హెలికాప్టర్లు ఉన్నాయని, బీజేపీ నేతలు డబ్బు సంచులతో తిరుగుతున్నారని బాబు విమర్శించారు.

 

Advertisements

Latest Articles

Most Read