జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి... అయ్యా మీరు చంద్రబాబు నాయుడు మీద, స్తున్నటువంటి విమర్శలు-ఆరోపణలలో నిజం ఎంత! రుజువులేంటో అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కానీ మీరు నిన్న చంద్రబాబు నాయుడికి వయసైపోయిందని ముసలోడైపోయారని ఒక విమర్శ చేశారు...అయితే ఈ విషయంలో దయచేసి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే... చంద్రబాబు నాయుడు రోజుకి 18 గంటలు కష్టపడతారు...మరి మీరు రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా టైం మేనేజ్మెంట్ గురించి మీకు తెలుసని నేను అనుకోవడం లేదు.(ఈ విషయం మీరు ఏ రాజకీయ,బిజినెస్ కార్పొరేట్ రంగాలవారిని అడిగినా చెప్తారు)..పొద్దున లేచిన దగ్గర్నుంచి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు మొదలుకొని కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి గాని,పూర్తి కావలసిన ప్రాజెక్టుల గురించి గాని, కేంద్రంపై రాష్ట్రంలో ధర్మ పోరాట దీక్షల ద్వారా ప్రతి ఆంధ్రుడి ఆవేదనను కేంద్రానికి తెలియజేసే దిశలో ఆయన పడుతున్న కష్టం గురించి గానీ...ఇలా ఆయన రోజులో ఎన్ని పనులలో నిమగ్నమై ఉంటారో మీకు తెలుసా? కేంద్రంపై పోరాటం చేసే విషయంలో ఎంత వంతు మీరు మీ వైపునుంచి మీ పాత్ర పోషిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు!!
మీరు చేసేదల్లా ఏంటంటే....వారానికి రెండు మూడు మీటింగ్లు పెట్టి చంద్రబాబుని విమర్శించడం వరకే సరిపోతుంది. వారంలో మిగతా టైం అంతా మీ ఫాం హౌస్ లోనో,ఇంట్లోనో హ్యాపీ గా రెస్ట్ తీసుకుంటారు. ఆయన వయసు- ఓపిక గురించి చిన్న ఉదాహరణ...ఇది నేను చెబుతున్న మాట కాదు పబ్లిక్ గా టీవీలలో,సోషల్ మీడియాలో అందరూ చూసిందే...తిరుపతి మెట్లు ఎక్కడానికి చంద్రబాబు గారికి ఈ వయసులో కూడా కేవలం గంట అది కూడా ఎక్కడ కూర్చోకుండా పైకి వెళ్లి...మొదటి మెట్టు ఎక్కే ముందు ఎంత ఉత్సాహంగా ఉన్నారో చివరి మెట్టు వరకూ కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు.మీడియా,సెక్యూరిటీ ఆయన వెనుక పరుగులు పెట్టింది.ఇది నేను చెప్తున్న మాట కాదు...ఆ వీడియో క్లిప్పింగ్ లింక్ కూడా మీకు ఇస్తున్నాను.కానీ అదే మీరు మీ మెట్ల నడక ప్రయాణంలో ఎన్నిసార్లు కూర్చుని...ఎంత ఆయాసంతో వగర్చారో అందరూ చూసారు.మరి ఆయన వయసు-ఓపిక గురించి మాట్లాడే అర్హత మీకు ఏమాత్రం ఉందో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.
రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడానికి ఆ వయసులో అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చంద్రబాబునాయుడు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సుడిగాలి పర్యటన చేశారు.మీరూ ఆ మధ్యలో ఏదో యాత్ర మొదలు పెట్టారు పట్టుమని రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కూడా ఆ యాత్ర పూర్తి చేసింది లేదు.పైగా సెక్యూరిటీ లేదని,అదనీ ఇదనీ దాన్ని కూడా వాయిదా వేసారు.వారంలో రెండు మూడు రోజులు ఏదో ఒక యాత్ర పేరిట లేదా ఏదో కార్యక్రమం పేరిటో టైం పాస్ చేసి మిగతా నాలుగు రోజులు హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఇకపోతే తెలంగాణలో చంద్రబాబు నాయుడు తిరగలేరు అని చెప్పి మీరు అంటున్నారు. అసలు ముందు మీ సత్తా ఏంటో... తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజల కోసం మీరేం చేస్తారో మీ స్టాండేంటో చెప్పండి ముందు.
చంద్రబాబు నాయుడు సత్తా ఏంటనేది ఈరోజు తెలంగాణ ప్రజలు,ఆంధ్ర ప్రజలతో పాటు దేశం మొత్తం చూస్తుంది,గమనిస్తుంది. పార్టీ పెట్టిన మీరు నాలుగు సంవత్సరాల కాలంలో అక్కడ ఓ ప్రక్కన తెలంగాణలో ఎలక్షన్లు జరుగుతుంటే ఒక అభ్యర్థిని నిలబెట్ట లేకపోయినా మీ పార్టీ ఎక్కడ!! అసలు ఇక్కడ తెలుగుదేశం లేదు రా బాబు అయిపోయింది చంద్రబాబును మేం తోలేసాం అని అన్న కేసిఆర్ కి ముచ్చెమటలు పోయించిన చంద్రబాబు నాయుడు ఎక్కడ!! ఇవే కాకుండా ప్రజలకు మీరు చెప్తున్న అబద్ధాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.మీరు మీ కాన్వాయ్ని లేదంటే నాదెండ్ల మనోహర్ కారును ఇసుక లారీ గుద్దేసినయ్ అని అన్నారు. ఎందుకు జరుగుతున్నాయో అని లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను అమాయకులను చేసి గందరగోళంలోకి నెట్టాల్సిన అవసరం లేదు.మీరు ఆ రోజు ఎందుకు స్పందించలేక పోయారు.మీరు చెప్పే కబుర్లు ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు దయచేసి గమనించగలరు.
ఈరోజు తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజల కోసమే కాదు తెలంగాణ ప్రజలందరి కోసం ఒక మహా కూటమి ఏర్పాటు చేసి దానిలో కాంగ్రెస్ ను పెద్దన్న పాత్రధారిని చేసి తెలుగుదేశం అక్కడ పోటీ చేస్తుంది అంటే దానికి కారణం ఎవరు?? ఈరోజు కేసిఆర్ కూడా కాంగ్రెస్ విమర్శించడంలేదు....కేవలం 12 సీట్లకు పోటీ చేస్తున్న తెలుగుదేశంను చూసి చంద్రబాబును విమర్శిస్తున్నాడు. మరిక్కడ దమ్ము-ధైర్యం,రోషం-పౌరుషం ఎవరికున్నట్ టోతెలుసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అసలిక్కడ ప్రజలకు ఏం కావాలో,వాళ్లేం కోరుకుంటున్నారో వాళ్ల భావోద్వేగాలు ఎలా ఉన్నయ్యో ఏనాడన్నా తెలుసుకునే ప్రయత్నం చేసారా? ఎంతసేపూ విమర్శలగోల తప్ప ప్రజల ఘోష మీకేమన్నా అర్ధమౌతుందా? ప్రజలంటే చంద్రబాబు,పవన్,లోకేష్,జగనే కాదు...వాళ్ల అభిమానులే కాదు.తటస్థంగా కూడా ఉండేవాళ్ళుంటారు. దయచేసి మీరు ఏదోటి మాట్లాడి మీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేసి వారి అమాయకత్వాన్ని మీ బలంగా మల్చుకుని ఏదో సాధిద్దామనుకుంటే అది బూమారాంగౌతుందే తప్ప మరోటికాదు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం.కానీ నాయకుడనేవాడు వారికి మార్గదర్శిగా ఉండాలేగానీ వాళ్లను అజ్ఞానంలోకి తోయకూడదు.