కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచంలోనే కాదు, మన దేశంలో కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, అన్ని విద్యాసంస్థలు ముసేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం, మన ప్రభుత్వం కరోనా గురించి పెద్దగా పట్టించుకోలేదు. జగన్ ప్రెస్ మీట్ పెట్టి, కరోనా పెద్ద రోగం కాదని, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అంటూ, సింపుల్ గా చెప్పేసారు. పారాసిటమాల్ వేసుకుంటే చాలు అని చెప్పారు. అలాగె బ్లీచింగ్ కొట్టుకుంటే చాలు అని చెప్పారు. అయితే ఇదంతా ఎన్నికల కోసం పడుతున్న పాట్లు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నాం ని చెప్పటంతో, కరోనాని తక్కువ చేసి చూపించాలి అనే చెప్పే ప్రయత్నం చేసారు. దీంతో, గత రెండు మూడు రోజులుగా, అన్ని రాష్ట్రాలు, జాగ్రత్తలు తీసుకుంటుంటే, మనం మాత్రం, కరోనా పెద్దగా లేదు అని చెప్పే ప్రయత్నం చేసారు. దీంతో అసలు ఇక్కడ ఏమి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండే పరిస్థితి అయిపొయింది. అయితే, ఇప్పుడు ఈ రోజు సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది.

కరోనా ఉన్న సమయంలో ఎన్నికలు వెళ్లకపోవటం మంచిదే అంటూ, ఎన్నికల కమీషనర్ నిర్ణయాన్ని సమర్ధించింది. దీంతో, ఇక కరోనా పై జాగ్రత్తలు తీసుకోక పొతే, అసలుకే మోసం వస్తుందని, ఇప్పటికి మన ప్రభుత్వం కదిలింది. కరోనా భయపెడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడిచేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. రేపట్నుంచి రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు, కోచింగ్ సంస్థలకు సెలవులు ఇవ్వాలని ఆదేశించింది. విద్యాశాఖ, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు మరో 276 మంది భారతీయులు కరోనా బారిన పడ్డట్లు వెల్లడించింది విదేశాంగ శాఖ. ఒక్క ఇరాన్​లోనే దాదాపు 255 మంది భారతీయులకు ఈ మహమ్మారు సోకినట్లు తాజాగా ధ్రువీకరించింది. వీరితో పాటు యూఏఈలో 12 మంది, ఇటలీలో అయిదుగురు, శ్రీలంక, రువాండా, కువైట్​, హాంగ్​కాంగ్​లో ఒక్కో భారతీయుడు కరోనా బారిన పడ్డట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్​ ప్రకటించారు. చైనాకు లక్ష సాధారణ మాస్కులు, మరో లక్ష వైద్య చికిత్స మాస్కులు, 4000 ఎన్​-95 మాస్కులతో పాటు ఐదు లక్షల జతల చేతి తొడుగులను ఎగుమతి చేసినట్లు మురళీధరన్​ తెలిపారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 ప్రత్యేక విమానం ద్వారా వీటన్నింటినీ వుహాన్​కు చేర్చినట్లు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య స్నేహానికి గుర్తుగానే వీటిని చైనాకు అందించామన్నారు మురళీధరన్​.

రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, కరోనా ప్రభావం దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, స్థానిక ఎన్నికలను వాయిదావేస్తే, దానిపై వితండవాదం చేసి, కులాలప్రస్తావన చేసి, రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచిన రాష్ట్రప్రభుత్వం, కమిషనర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు కు వెళ్లి, తీరని అవమానాన్ని మూటకట్టుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కూడాలెక్కచేయకుండా, ఎన్నికలే పరమావధిగా ముందుకెళ్లాని చూసిందన్నారు. ఎన్నికల నిర్వహణ అనేది, ఎన్నికల కమిషన్ ఇష్టమనే విషయం చిన్నపిల్లాడికి కూడా తెలుసునని, ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి, భంగపడిందన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీకి చెంపపెట్టు వంటిదన్న మాజీమంత్రి, ప్రభుత్వపెద్దలకు ఇంతకంటే అవమానం మరోటి ఉండబోదన్నారు. అత్యవసర ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఎన్నికలను వాయిదావేస్తే, దానిపై ముఖ్యమంత్రి విపరీత వ్యాఖ్యానాలు చేశాడు. తనకు 150 స్థానాలున్నాయని, తాను ముఖ్యమంత్రినంటూ, ఎస్ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషన్) నిర్ణయంపై అక్కసు వెళ్లగక్కిన జగన్, ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుని తప్పుపట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అచ్చెన్నాయుడు ఎద్దేవాచేశారు.

అవగాహనలేని ముఖ్యమంత్రి ఉండటం వల్లే, రాష్ట్రానికి ఇన్ని అనర్థాలు దాపురిస్తున్నా యన్నారు. ఒక దశ నామినేషన్ల ప్రక్రియ పూర్తయినా, రెండోదశలో మున్సిపల్, పంచాయతీలకు నామినేషన్లు వేసిన ప్రతిపక్షపార్టీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తూ, నామినేషన్లు ఉపసంహరించుకునేలా అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారిపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. డబ్బు ఎరచూపుతూ నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని, ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, తిరిగి ఎన్నికల రీనోటిఫికేషన్ ఇవ్వాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాతైనా ముఖ్యమంత్రి కులభజన చేయడం మానుకొని, బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం ప్రభుత్వం మానుకోవాలన్నారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, యువత వివిధదేశాల్లో ఉన్నారని, కరోనా ప్రభావంతో ఆయా దేశాలన్నీ యూనివర్శీటీలను మూసివేసి, సమస్థలను మూసివేసి మనవిద్యార్థులను, స్వరాష్ట్రాలకు వెళ్లిపోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విద్యార్థుల గురించి పట్టించుకోకుండా మంత్రులంతా, ముఖ్యమంత్రి భజనచేస్తున్నారని అచ్చెన్నాయు డు మండిపడ్డారు. ఎన్నికలు నిలిచిపోయాయి కాబట్టి, ప్రభుత్వం ఇప్పటికైనా కరోనా కట్టడిపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ, విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు, యువత ఆరోగ్యం దృష్ట్యా, ఏవిధమైన చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, కరోనా నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకున్నారో, రాష్ట్రంలో ఎంతమంది వైరస్ బారిన పడ్డారో, దాని ప్రభావానికి గురైనవారి విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో, ప్రజలకు వివరించాలన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ మరలా ఇచ్చి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని తమపార్టీ తరుపున ఎన్నికల కమిషనర్ కు విజ్ఞప్తి చేయబోతున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుతోనైనా ముఖ్యమంత్రి తన వితండవాదాన్ని మానుకొని, ప్రజానుగుణంగా పాలనసాగిస్తే మంచిదన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికలకమిషన్ కే సర్వాధికారాలుంటాయని, తాము కలుగచేసుకునేది లేదని సుప్రం ధర్మాసనం చెప్పిన తరువాతైనా, ముఖ్యమంత్రి తన తప్పు తెలుసుకొని, ఎస్ఈసీకి క్షమాపణలు చెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ అంటే ఎన్నికల్లో గెలవడం.. ఓడటం మాత్రమే కాదని, ఎల్లప్పడూ ప్రజల గురించి ఆలోచిస్తూ, వారికోసం పనిచేసేదే నిజమైన రాజకీయపార్టీ అని, అటువంటి పార్టీ అధినేతగా ఉన్నచంద్రబాబు ఎన్నికలకు భయపడుతు న్నాడని, వైసీపీ చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రభుత్వం, పక్కరాష్ట్రాలనుంచి కూడా ఎవరూ రాకుండా నిరోధిస్తున్నారని, సినిమాహాళ్లు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్ వంటి వాటిని మూసేసిందని, రాష్ట్రప్రభుత్వ ప్రబుద్ధులు మాత్రం ఇప్పటివరకు అటువంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల కోడ్ తీసేయమన్నారనే సాకుతో, ప్రభుత్వం కొత్తపథకాలపేరుతో ప్రజల్ని మభ్యపెడుతుందని, దానితోపాటు, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను బెదిరిస్తూ నామినేషన్లు ఉపసంహరింపచేయడంపై, పార్టీ తరుపున కోర్టుని ఆశ్రయిస్తామన్నారు. జ్ఞానం ఉన్నవాడెవడూ కూడా రాష్ట్రమంత్రులు మాట్లాడినట్లుగా మాట్లారని, అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా వేశారనే ఇంగితం లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ప్రజలు హర్షించరని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.

అన్ని వ్యవస్థలను, వ్యక్తులను మేనిప్లేట్ చేస్తున్న విజయసాయి, కరోనాను మాత్రం మేనిప్లేట్ చేయలేడన్నారు. కరోనాను మేనేజ్ చేయడం, వ్యవస్థలను, వ్యక్తులను మేనేజ్ చేసి, తప్పుడు లెక్కలతో డబ్బులు గడించినంత తేలిక కాదనే విషయాన్ని ఏ2 గ్రహిస్తే మంచిదన్నారు. కరోనా ప్రభావంతో మిగతా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ, ఎన్నికలు వాయిదా వేయించుకుంటే, రాష్ట్రప్రభుత్వం మాత్రం ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని తప్పుపట్టి, కోర్టుకు వెళ్లడం ద్వారా తీరని అవమానాన్ని మిగుల్చుకుందన్నారు. ఇంతటి బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం ఉండటం, ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని టీడీపీ నేత వాపోయారు. రాష్ట్రంలోని 2-3జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదని, నామినేషన్లు వేయకుండా చేయడం, వేసినవారిని అడ్డుకోవడం, అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడం వంటి చర్యలు జరిగాయంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోర్టుకు వెళ్లిందని, అవసరమైతే, ఆజిల్లాలలో తిరిగి నోటిఫికేషన్ ఇస్తామని కూడా కమిషన్ చెప్పిందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూచాతప్పకుండా అమలుచేయాల్సిన బాధ్యత సీ.ఎస్ పై ఉందని, అలాచేయకపోతే నేడుకాకపోతే రేపైనా సరే, ఆమే కోర్టులో నిలబడాల్సి వస్తుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కొందరు అధికారులు, డీఎస్పీలు, ఎస్పీలు, ఐజీలను మార్చాలని ఈసీ ఆదేశించిన ప్రభుత్వం లెక్కచేయలేదని, దానికి సీ.ఎస్ బాధ్యత వహించి తీరాలన్నారు. సీ.ఎస్ వైఖరిపై రాష్ట్రపౌరుడిగా తాను కోర్టును ఆశ్రయిస్తానని, ఆమె తన పద్ధతి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని మాజీ మంత్రి హెచ్చరించారు. అత్యుత్సాహం చూపిన అధికారులపై మాత్రమే ఎన్నికల కమిషన్ చర్యలుతీసుకుందని, ఈసీ ఆదేశాలను పట్టించుకోకుండా సీ.ఎస్ తప్పుచేశారన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ లో సర్వత్రా సందిగ్ధత నెలకుంది. ఎన్నికల వాయిదా నిర్ణయం కొనసాగుతుందా. ,కోర్టు కొట్టివేస్తుందా అనే సందేహాలు తలెత్తున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుహ్య నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను యథాతథ స్థితిలో వాయదా వేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఏపీ సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈసీ నిర్ణయాన్ని ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేసారు. గవర్నర్ ఆయనను రాజభవనకు పిలిపించి మాట్లాడారు. తరువాత ఈ విషయం పై సుప్రీం కోర్ట్ లో కేసు వేసారు. అయితే, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఆరు వారల పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్న తీసుకున్న నిర్ణయం తాము కలుగ చేసుకోలేం అంటూ, సుప్రీం కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఆరు వారల తరువాత రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, కొత్త తేదీలు ప్రకటించాలని చెప్పింది. అయితే కొత్త పధకాలు ప్రకటించ కూడదు అని, కొత్త తేదీలు ప్రకటించిన తరువాత, నాలుగు వారాల ముందు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని చెప్పింది.

ఎన్నికల కమీషనర్ ఆరు వారాలు వాయిదా వెయ్యటంతో, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేసింది. ఇదే సందర్భంలో హైకోర్టులోను ప్రజా వాజ్యం దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మరో పక్క రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శికి సిఎస్ నీలం సాహ్ని లేఖ రాసారు. ఎన్నికల నిర్వహణ వాయిదాను విరమించుకోమని ఆమె ఆయనకు విజృప్తి చేసారు. ఈ పరిణామాల నడుమ ఈ అంశంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి జగన్ కూడా ఆలోచన చేసారు. మాజీ ఎన్నికల కమీ షనర్ రమాకాంత్ రెడ్డితో ఆయన సమాలోచనలు చేసారు. మంత్రులు పెదిరెడ్డి రామచంద్రరెడ్డి,బొత్స సత్యనారాయణతో కలిసి ఆయన రమాకాంత్ రెడ్డితో సమావేశమై పలు సూచనలు తీసుకున్నారు.

ఎన్నికల వాయిదాకు రమేష్ కుమార్ తన అధికారాలకు సంబంధించి చెబుతున్న సెక్షనులు ఏమీ రాష్ట్ర ఎన్నికల అధికారికి వర్తించవని ఈ సందర్భంగా రమాకాంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. నిజానికి అవన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ పరిధిలోని సెక్షనులని స్పష్టం చేసారంటున్నారు. ఎన్నికల అధికారి విచక్షణాధికారాన్ని ప్రశ్నించడమనే అంశాన్ని పక్కన పెడితే, ఖచ్చితంగా ఎన్నికల కమీషనర్ ఒక వివత్తు సందర్భంలో నిర్ణయం తీసుకునేటప్పుడు విధిగా గవర్నర్ అనుమతిని తీసుకోవడం, ప్రభుత్వానికి వివరించడం చేయాలని రమాకాంత్ రెడ్డి స్పష్టం చేసారంటున్నారు. ఒక వేళ రాష్ట్ర ఎన్నికల అధికారి ఏదైనాకోర్టు తీర్పు ను ఉదాహరించి తాను అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్ని కల అధికారి మాదిరిగా తనకు అధికారాలున్నాయని వాదించినా, తప్పని సరిగ్గా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు గవర్నర్ అనుమతి తీసుకుని ఉండాలని రమాకాంత్ రెడ్డి వివరించారంటున్నారు. అయితే ఈ రోజు సుప్రీం మాత్రం, ఇవేమీ పరిగణలోకి తీసుకోలేదు.

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దా-డు-లు, దౌ-ర్జ-న్యా-లు, బెదిరింపులు చోటు చేసు కుంటు న్నాయి. ప్రధానంగా అధికారపక్షమైన వైసీపీ ఎంతటి అరాచకం చేసిందో అందరూ చూసారు. రోజురోజుకీ దా-డు-లు ఉధృతమవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, రాష్ట్రంలో ఖాకీ టె-ర్ర-రి-జం సాగుతోందని విమర్శలు గుప్పిస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారారని, తమ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, బీహార్ కంటే అద్వానం గా మారిందని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికారపక్షం దౌ-ర్జ-న్యం చేస్తూ, నామినేషన్ పత్రాలను చించివేస్తున్న అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడుతోంది. ముఖ్యమంత్రి జగన్ కు పోలీసు అధికారులు తొత్తులుగా మారారని ఆరోపణలు చేయడమే కాకుండా గవర్నర్ బిశ్వభూ షణ్ హరిచందనకు జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు.

మరోవైపు ఎన్నికల కమిషను కూడా ఫిర్యాదు చేసి, దా-డు-ల-కు సంబంధించిన వీడియోలను, ఫోటోలను అందజేశా రు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు కొందరు పోలీసులు సహకరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. గుంటూరు జిల్లా మా-చ-ర్ల-లో బుద్దా వెంకన్న, బొండా ఉమాలు పార్టీ ఆదేశాల మేరకు పర్యటనకు వెళ్లగా, వైకాపా శ్రేణులు వారిపై దా-డి-కి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ తరపు న్యాయవాది రమేష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యం లో పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి నిందితులపై హ-త్యా-య-త్నం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సెక్షన్లు మార్చి నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త పెను వివాదంగా మారింది. ప్రజలు ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులు భక్షకులుగా మారారని, హ-త్యా-య-త్నం చేసిన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని మండిపడుతున్నారు. ప్రస్తుతం మాచ-ర్ల సంఘటన పెనువివాదంగా మారి టీడీపీ, పోలీసుల మధ్య మాటల యుద్దానికి తెరతీసింది.

బుద్దా వెంకన్నలు తమ పర్యటనకు సంబంధించి ముందుగానే పోలీసులకు సమాచారం అందించారని, అయినప్పటికీ పోలీసులు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమ య్యారని చెబుతున్నారు. టీడీపీ చేస్తున్న విమర్శలు, ఆరోప ణలపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బుద్దా వెంకన్న, బొండా ఉమాలు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఇదంతా అవాస్తమని పోలీసు అధికారుల సంఘం చెబుతోంది. ప్రాణాలకు తెగించి కాపాడితే విమర్శలు, ఆరోపణలు చేస్తారా..? అంటూ ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారుల పై ప్రైవేటు కేసులు దాఖలు చేసేందుకు టీడీపీ నేతలు యోచిస్తున్నారు. మరోవైపు తమకు భద్రత కల్పించాలని పోలీసు అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు తగిన భద్రత కల్పించకపోతే అవసరమైతే ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read