ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి, సాగర్ కుడి కాలువ, హంద్రీ నీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆపేయాలని ఆదేశించింది. మే నెల వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నీరు కంటే, ఎక్కవ వాడుకున్నారని, కృష్ణా బోర్డు రాష్ట్రానికి తెలిపింది. ఇప్పటికే కేటాయించిన నీటి కంటే ఎక్కవ వాడుకున్నారు కాబట్టి, సాగర్ కుడి కాలువ, హంద్రీ నీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. సాగర్ కుడి కాలువ నుంచి కేటాయించింది 158.255 టీఎంసీ అయితే, ఇప్పటికే 158.264 టీఎంసీల వాడుకున్నారని తెలిపింది. హంద్రీనీవా, ముచ్చుమర్రి నుంచి కేటాయించింది, 47.173 టీఎంసీలు అయితే, ఇప్పటికే 48.328 టీఎంసీలు వాడుకున్నట్టు బోర్డు తెలిపింది. ఇప్పటికే నీటిని వాడుకున్నారు కాబట్టి, బోర్డు ఉత్తర్వులు పాటించాలని, ఫిర్యాదులకు అవకాసం ఇవ్వకుండా సహకరించాలని కోరింది.

మరో పక్క కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ బృందం వివరణ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు జీవో పై బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వివరణ కోరింది. ఈ మేరకు హైదరాబాద్ లో సోమవారం నాడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారుల బృందం భేటీ జరిపింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఎదుట నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి అది త్యనాతో పాటు మరో ఇద్దరు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరై వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, గోదావరి జలాల వినియోగం విషయంలో తెలంగాణ పై ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఈ మేరకు గోదావరి రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని సమాచారం.

ఎలాంటి డిపిఆర్లు ఇవ్వకుండా అపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా తెలంగాణ అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని ఏపీ అధికారులు బోర్డుకు సమర్పించిన లేఖలో పేర్కొ న్నారని విశ్వసనీయంగా తెలిసింది. కాళేశ్వరం 225 టిఎంసీ, సీతారామ 70 టిఎంసీలు, తుపాకులగూడెం 100 టిఎంసీలు ఇలా మొత్తం 450.31 టీఎంసీల నీటి వినియోగానికి ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపించినట్లు తెలిసింది. గోదావరి వాటర్ డిస్పూట్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణ కింద రాష్ట్రాల ప్రాజెక్టుల పై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉంటుందో చూడకుండా అనేక నిర్మాణాలు చేపట్టిందని పేర్కొంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి నీటి కేటాయింపులు ఫైనల్ కాలేదని తెలిపింది, ఇప్ప టికే కాళేశ్వరం 225 నుంచి 450 టిఎంసీ లకు, సీతారామ 70నుంచి 100 టిఎంసీలకు సామర్యం పెంచినట్లు తెలుస్తుందని వివరణ లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజె క్టులను అడ్డుకోవాలని కోరుతున్నట్లు తెలిపింది.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి దుర్ఘటన జరిగి 10రోజులు దాటింది. 12మంది చావులకు, 365మంది తీవ్ర అస్వస్థతకు, 5గ్రామాలతో సహా విశాఖ నగరం యావత్తూ కల్లోలానికి కారణమైన కంపెనీ యాజమాన్యంపై చర్యలు లేవు. సీఎం జగన్ మొక్కుబడి స్పందన, కంటి తుడుపు కమిటీల ఏర్పాటు, వైసిపి మంత్రుల నిద్ర నాటకాలు.. ఇవన్నీ వైసిపి చేతులకు అంటిన బురద తుడుచుకునే పనులే. సీఎం జగన్మోహన్ రెడ్డి అబద్దాలు నిన్న పరాకాష్టకు చేరాయి. ఎల్జీ పాలిమర్స్ కు ఒక్క అనుమతి కూడా వైసిపి ప్రభుత్వం ఇవ్వలేదు అనడం కన్నా పచ్చి అబద్దం మరొకటి లేదు. అబద్దాలతో తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లాభాలు పొందాలని చూడటం హేయం. నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాం. 1961 నుంచి 2020వరకు ఈ కంపెనీ పూర్వాపరాలను ప్రజల దృష్టికి తెస్తున్నాం. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వినియోగిస్తున్న 219ఎకరాల భూమిని 23.11.1964న అప్పటి ప్రభుత్వం ఎకరం రూ2,500 చొప్పున కేటాయించింది( జివో నెం 217). ఆ తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపులను 8.10.1992న అప్పటి ప్రభుత్వం ఇచ్చింది(జీవో నెం 1033). టిడిపి హయాంలో ఒక్క ఎకరం భూమి కూడా ఎల్జీ పాలిమర్స్ కు కేటాయించలేదు. భూముల కేటాయింపుపై వైసిపి చేస్తున్న దుష్ప్రచారం దీనిని బట్టే తెలుస్తోంది.

08.05.2007న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. 01.09.2009న మరోసారి రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 13.04.2012న, 06.05.2012న క్లియరెన్స్ ఇచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2సార్లు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2సార్లు పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ లు ఇచ్చాయి. (ఎనెగ్జర్స్) టిడిపి ప్రభుత్వం గత ప్రభుత్వాల పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లను రెన్యువల్ చేసిందే తప్ప కొత్తగా అనుమతి ఇవ్వలేదు. పైగా పాలిస్టైరీన్ ఉత్పత్తులకు, ఎక్స్ పాండబుల్ పాలిస్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి నిరాకరించింది. కంపెనీకి ఎప్పుడెప్పుడు ఏయే ప్రభుత్వాలు ఎలాంటి అనుమతులు ఇచ్చాయో మావద్ద ఉన్నాయి. వీటిపై చర్చకు సిద్దమా అని ఛాలెంజ్ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 08.05.2007న మరియు 01.09.2009న ఇచ్చిన అనుమతులను ఎందుకు జగన్మోహన్ రెడ్డి బైట పెట్టలేదు..? తండ్రి ఇచ్చిన అనుమతి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కొడుకుగా జగన్ పై లేదా..? 20.06.2019 నుంచి 23.06.2019 వరకు మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇవే రుజువులు. విజయవాడలో జరిగిన స్టేట్ ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటి(ఎస్ ఈఏసి) సమావేశంలో అజెండాలో 128.48 అంశం కింద ఎల్జీ పాలిమర్స్ అప్లికేషన్ ను క్లియరెన్స్ చేసి స్టేట్ లెవల్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటి(ఎస్ ఈఐఏఏ) కు పంపారు. ఇది వాస్తవం కాదా.

స్టైరీన్ విస్తరణకు అనుమతిని టిడిపి ప్రభుత్వం నిరాకరించిందని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఇచ్చిన అఫిడవిట్ లోనే చెప్పారు(10.05.2019న అఫిడవిట్ ఇదిగో..) టిడిపి అనుమతి ఇచ్చింది కేవలం ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఉత్పత్తులకే. స్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి నిరాకరించింది. 27.12.2018 మరియు 20.6.2018న టిడిపి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వైసిపి నాయకులు, దొంగ సాక్షి చేస్తున్న ప్రచారం వాస్తవాలను వక్రీకరించడమే. ఎల్జీ పాలిమర్స్ కేటగిరి మార్పు వెనుక హస్తం వైసిపి ది కాదా..? ఈ కంపెనీ స్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి ఇచ్చింది ఎవరు..? 2019 జులై 9న కేంద్రానికి సిఫారసు చేసింది మీరు కాదా..?( ఏపి స్టేట్ లెవెల్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటి పంపిన సిఫారసు ఇదిగో) విశాఖలో జరిగిన దుర్ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హుటాహుటిన స్పందించి రూ50కోట్ల డిపాజిట్ చేయాలని కంపెనీని ఆదేశించింది. దీనిపై స్టే కోసం ఎల్జీ పాలిమర్స్ సుప్రీంకోర్టుకు వెళ్లడం వెనుక హస్తం వైసిపిదే. ఇంత దురాగతానికి పాల్పడిన కంపెనీకి సీఎం జగన్ వత్తాసు పలుకుతారు. పరిహారం కంపెనీ నుంచి ఇప్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తారు. కంపెనీతో తామేదో మాట్లాడుకుంటామని నిస్సిగ్గుగా చెబుతారు. ఆ కంపెనీలోనే ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇస్తారు. ఈ వ్యాఖ్యలతోనే ఎల్జీ పాలిమర్స్ తో వైసిపికి ఉన్న ములాఖత్ రుజువైంది.

అబద్దాల ముఖ్యమంత్రి దాపురించడం దౌర్భాగ్యం: ముఖ్యమంత్రి స్థాయిలో అబద్దాలు చెప్పడం మంచిది కాదు. తన అబద్దాలతో జగన్ సీఎం హోదాను దిగజారుస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం దౌర్భాగ్యం. లాక్ డౌన్ ఆంక్షల సడలింపుపై ‘‘మే 1న’’ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు ఇచ్చింది (అనెగ్జర్). నిత్యావసరాలు, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్, ఫార్మా ఐటి హార్డ్ వేర్, జూట్ ఇండస్ట్రీస్ తదితర పరిశ్రమలనే తెరవాలని స్పష్టంగా చెప్పింది. ఆ జాబితాలో పెట్రో కెమికల్స్ లేకపోయినా ఎల్జీ పాలిమర్స్ కు మీరెందుకు అనుమతి ఇచ్చారు..? లాక్ డౌన్ లో కేంద్రం అనుమతి లేకున్నా ఎల్జీ పాలిమర్స్ తెరిచేందుకు మీరెలా అనుమతి ఇచ్చారు.? కంపెనీని అడిగేందుకు ప్రశ్నలు పంపాలట. కమిటి వేసే ప్రశ్నలకు జనం అడిగే ప్రశ్నలు కలిపి కంపెనీకి పంపుతారట. వాళ్లిచ్చిన జవాబును బట్టి చర్యలు తీసుకుంటారట. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతోంది వైసిపి నాయకులా ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులా..? ఎల్జీ పాలిమర్స్, వైసిపి లాలూచి రాజకీయాలకు ఇవే నిదర్శనం. 12మంది చావుకు కారణమైన కంపెనీపై చర్యలు లేవు. పది రోజులైనా ఎవరినీ అరెస్ట్ చేసింది లేదు. దానిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వృద్దురాలు రంగనాయకమ్మ(గుంటూరు)పై తప్పుడు కేసులు పెట్టడానికి చేతులేలా వచ్చాయి..? 66ఏళ్ల వృద్దురాలైన ఒక సమాజ సేవకురాలిపై అక్రమ కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నాం, వైసిపి ప్రభుత్వ దుర్మార్గ చర్యలను గర్హిస్తున్నాం.

10రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి మళ్లీ విశాఖ తొంగిచూడకుండా నిన్న వీడియో కాన్ఫరెన్స్ పేరుతో డ్రామా చేశారు. హుద్ హుద్ విపత్తులో టిడిపి ప్రభుత్వ పనితీరుకు, ఇప్పటి దుర్ఘటనలో వైసిపి ప్రభుత్వ పనితీరును విశాఖ వాసులే బేరీజు వేస్తున్నారు. సోషల్ మీడియాలో వైసిపి నాయకుల నిర్వాకాలపై ధ్వజమెత్తుతున్నారు. 10రోజులైనా గ్రామాల్లో పరిస్థితులు చక్కదిద్ద లేకపోవడం, బాధితుల్లో భరోసా లేకపోవడం కంపెనీపై చర్యలు చేపట్టక పోవడం, పదిరోజులైనా ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం వైసిపి ప్రభుత్వ వైఫల్యాలకు హద్దు అదుపు లేదు. దుర్ఘటనపై సైంటిఫిక్ స్టడీగురించి గాని, కమిటిలలో నిపుణుల నియామకంపైగాని, దీర్ఘకాలిక ఉపశమన చర్యలపై గాని, పరిహారం చెల్లింపులో వివక్షతపైగాని, బాధితులపై-వారికి అండగా నిలబడ్డ ప్రతిపక్షాల నాయకులపై కేసుల గురించి కాని సీఎం నోరు తెరవలేదంటేనే కంపెనీతో వైసిపి లోగుట్టు తెలుస్తోంది. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోడానికి టిడిపిపై సీఎం జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిని బట్టే జగన్మోహన్ రెడ్డిని మించిన అబద్దాల కోరు మరొకరు లేరనేది స్పష్టం అవుతోంది. టిడిపిపై కక్ష సాధింపుతోనో, నాపై అక్కసుతోనో రాష్ట్రానికి, భావితరాలకు నష్టం చేసే చర్యలకు ఇకనైనా జగన్మోహన్ రెడ్డి స్వస్తి చెప్పాలి. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన బాధిత కుటుంబాలకు దక్షిణ కొరియాలో ఇచ్చినట్లుగా పరిహారం అందజేయాలని, వారిని దీర్ఘకాలంలో కలిగే అనర్ధాలనుంచి కాపాడటంపై దృష్టి పెట్టాలని, సూపర్ స్పెషాలిటి హాస్పటల్ ఆ 5 గ్రామాల వారికి అందుబాటులో నెలకొల్పాలని, వారికి అందులో అత్యున్నత చికిత్స లభ్యం అయ్యేలా చూడాలని, అందరికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు మెయింటైన్ చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, ఆయా ప్రాంతాల్లో పర్యావరణాన్ని, భూగర్భ జలాలను పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

బేసిన్లు లేక ఎండా.. బేషజాలు లేకుండా చర్చించుకుందామని, ఇచ్చి పుచ్చుకుందామని కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి వాటేసుకుని, ఒకరిని ఒకరు నోట్లో స్వీట్లు తినిపించుకున్న సీన్లు ఇంకా గుర్తున్నాయి. రోజా ఇంటికి పూలు చల్లించుకుంటూ వెళ్ళిన కేసీఆర్, రాయలసీమను రతనాలు సీమ చేస్తానని చెప్పారు. ఏపి అసెంబ్లీలో, కేసీఆర్ ఈజ్ మ్యగ్నానమస్ అని జగన్ మోహన్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు బేసిన్ల పంచాయతీ పోతిరెడ్డిపాడు సాక్షిగా ఢిల్లీకి చేరింది. తెలంగాణ, ఆం ధ్రప్రదేళ్ల మధ్య నెలకొన్న పోతిరెడ్డిపాడు పంచాయతీ పై త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేయాలంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కృష్ణానదీ యాజమాన్య బోర్డు మెంబర్ సెక్రటరీని శనివారం ఆదేశించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండిసంజయ్ తెలంగాణకు అన్యాయం చేస్తూ అనుమతులు లేకుండా ఏపి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి జీవో జారీ చేసిందంటూ ఫిర్యాదు చేయగా, దీనిపై స్పందించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కేఆర్ఎంబికి స్పష్టమైన లేఖ రాశారు.

పోతిరెడ్డిపాడుపై జీవో దాటి ముందుకెళ్ళకుండా ఎపి ప్రభుత్వానికి ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని, కొత్త ప్రాజెక్టుకు సంబందించి డిపిఆర్ ఇవ్వమని కోరాలని, 2014 పునర్విభజన చట్టం ప్రకారం ఉందో లేదో చూడాలని ఆదేశించారు. దీంతో పాటు త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని ఆదేశించాంరు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై, తెలంగాణ ప్రభుత్వం ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడులపై ఫిర్యాదు చేయడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో జరగ్గా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఎపి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఆ చర్చల్లో కొత్త ప్రాజెక్టులు ఏవి చేపట్టినా కెఆర్ఎంబి, అపెక్స్ కౌన్సిల్ అనుమతితో ముందుకెళ్ళాలని నిర్ణయించారు. అయితే.. ఇపుడు ఎపి ప్రభుత్వ దూకుడుతో మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ వరుస ఫిర్యాదులు జనవరిలోనే తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కెఆర్ఎంబికి పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రతిపాదన పై లేఖ రాశారు.

తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 5తేదీన లేఖ రాసినప్పటికీ ఏపీ ప్రభుత్వం స్పందించలేదని కేఆర్ఎంబీ తాజాగా రాసిన లేఖలో పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి ప్రాజెక్ట - రిపోర్టును అందజేయాలని కోరినా స్పందిం చకపోవడం పై కేఆర్ఎంబి ఆగ్రహంగా ఉంది. ఫిబ్రవరి 5 తేదీన కృష్ణా యాజమాన్య బోర్డు రాసిన లేఖకు కొనసాగింపుగా ఈ నెల 18న కూడా మరో లేఖను పంపించామని, అయినా స్పందన లేదని పేర్కొంది. విభజన చట్టంలోని 11షెడ్యూల్ ఏడో పేరా ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలన్నా కేఆర్ఎంబీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, అందుకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట ల ప్రతిపాదనలను, సాంకేతికపరమైన అంశాలను బోర్డు ఆమోదించాకే చేపట్టాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల కొత్త పథకానికి సంబం ధించి సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను అందజేయాలని జీవో నంబరు 208లో పేర్కొన్న అన్ని అంశాలను సత్వరమే తమకు చేరేలా సమాచారం అందించాలని ఆ లేఖలో కోరింది. కేంద్రప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవడం, కేఆర్ఎంబికి ఆదేశాలు ఇవ్వడంతో పోతిరెడ్డిపాడు వివాదం ఆసక్తికరంగా మారింది.

విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంలో, 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కంపెనీలో స్టరైన్ గ్యాస్ లీక్ కావటంతో, వందలాది మంది ఆ విష వాయువులు పీల్చి, స్పృహ తప్పి పడిపోయిన విషయం తెలిసిందే. దాదాపుగా 5 నుంచి 8 గ్రామాల ప్రజలు, ఈ గ్యాస్ బాధితుల లిస్టు లో ఉన్నారు. వీరిలో 12 మంది చనిపోగా, చాలా మంది చికిత్స తీసుకుని ఇంటికి వెళ్ళగా, ఇంకా కొంత మంది చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ఘటన పై, ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ పై అనేక అనుమానాలు నేలకోనటంతో, కేంద్రం సీరియస్ అవ్వటం, అటు హైకోర్ట్ ఈ విషయం సుమోటోగా తీసుకోవటం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా తీసుకోవటం జరిగిపోయాయి. అలాగే మానవ హక్కుల సంఘం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం కూడా జరిగిన ఘటన పై ఎంక్వయిరీకి ఆదేశించింది. మరో పక్క, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పరిధిలో కొంత మందితో ఎంక్వయిరీ వేసింది.

ఇప్పటికే కొంత మంది విచారణ కూడా ప్రరంభించారు. ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఘటన జరిగిన మూడో రోజే, ఎల్జీ పాలిమర్స్ కు షాక్ ఇచ్చింది. ముందు 50 కోట్లు మధ్యంతర పరిహారం కాట్టాలి అంటూ, ఎల్జీ పాలిమర్స్ ను ఆదేశించింది. అయితే ఎల్జీ పాలిమర్స్ ఏమి అనుకుందో ఏమో కాని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఈ కేసుని సుమోటోగా తీసుకుని, విచారణ జరిపే హక్కు లేదు అని,దని పై స్టే ఇవ్వాలి అంటూ, సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేసింది. అయితే దీని పై స్పందించిన సుప్రీం కోర్ట్, ఈ విషయం మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తేల్చుకోండి, మేము ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం అని తేల్చి చెప్పింది. జూన్ 1న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వాదనలు ఉన్నాయి, కాబట్టి అక్కడే తేల్చుకోవాలని సూచించింది.

గ్రీన్ ట్రిబ్యునల్ లోనే, మీకు విచారణ అధికారం లేదని చెప్పండి, అంటూ, ఈ కేసుని జూన్ 8కి వాయిదా వేసింది సుప్రీం కోర్ట్. తమ పై, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్ట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇలా మొత్తంగా 7 విచారణ కమిటీలు వేసారని, మే 7న ఘటన జరిగితే, మే 8నే తమ పై విచారణ కమిటీలు వేసారని, ఎల్జీ పాలిమర్స్ సుప్రీం కోర్ట్ కు తెలిపింది. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పై మాత్రమే, ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం చెప్తూ, సుప్రీం కోర్ట్ కు వెళ్ళటం పై, ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒక వేళ ఏ తప్పు లేకపోతే, విచారణ ధైర్యంగా ఎదుర్కోవాలి కాని, ఇలా వారికి విచారణ అధికారం లేదు, వారు సుమోటోగా తీసుకోకూడదు అని సాకులు చెప్పటం ఎందుకు ?

Advertisements

Latest Articles

Most Read