మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ, సంఘ్‌ పరివార్‌ వర్గాల్లో పార్టీ భవిష్యత్‌ గురించి అంతర్మథనం మొదలైంది. పలువురు నేతలు ఈ ఫలితాలపై పార్టీ సీనియర్‌ నేతలు లాల్‌ కృష్ణ ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషిలతో అంతర్గతంగా సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో నరేంద్రమోదీ, అమిత్‌ షాల ప్రచారం వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదని, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ల్లో స్థానిక నాయకత్వాలు బలంగా పనిచేసినందువల్ల పరాజయం పాలైనప్పటికీ గౌరవం దక్కించుకున్నామని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఫలితాల తర్వాత పాత ఆడ్వాణీ వర్గం క్రియాశీలకంగా మారిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీకి 2009లో వచ్చినట్లు 116 సీట్లు మాత్రమే వస్తాయని ఒక వర్గం బలంగా భావిస్తోంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ల్లో గతంలో వచ్చినట్ల్లు 62 సీట్లు రావనీ, సీట్ల సంఖ్య సగానికి తగ్గిపోవచ్చునని, ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ- ఎస్పీ-కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తే బీజేపీకి పాతిక సీట్లు రావడమూ కష్టమవుతుందని ఈ వర్గాలు అంటున్నాయి.

modi 22012018 2

2014లో బీజేపీకి ఒక్క యూపీ నుంచే 71సీట్లు వచ్చాయి. అప్పుడు బిహార్‌ లో 22 సీట్లు గెలుచుకున్న బీజేపీ- ఈ సారి ఆర్జేడీ-కాంగ్రె్‌స-లెఫ్ట్‌ కూటమి వల్ల బలంగా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. అలాగే గత ఎన్నికల్లో గుజరాత్‌లో 26కు 26 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి సగానికి పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాల అంచనా. ఇతర రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణలో ఇటీవల వచ్చిన ఫలితాల ప్రకారం- బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేవు. అసోం, గోవా, హర్యానా, హిమాచల్‌, జమ్ముకాశ్మీర్‌, జార్ఖండ్‌, కర్ణాటక, పంజాబ్‌. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో కమలనాథులు అత్యధిక సీట్లు గెల్చుకున్నప్పటికీ ఈసారి 25 నుంచి 30కి మించవని అంటున్నారు. ఒడిషాలో కొంత మెరుగుపడినప్పటికీ నాలుౖగెదు సీట్ల కంటే ఎక్కువ రాకపోవచ్చునని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ లో కూడా బీజేపీ సంఖ్యాబలం ఒకటి- రెండు సీట్లకంటే మించకపోవచ్చు. మొత్తం మీద- బీజేపీకి వచ్చే ఎన్నికల్లో 180-200 సీట్లక్లు మించి రావని, అపుడు ఒడిషాతో కలుపుకుని దక్షిణాదిలోనే 75 సీట్లు ప్రాంతీయ పార్టీలు గెలుచుకుంటాయని పార్టీ వర్గాల అంచనా.

modi 22012018 3

వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా వీస్తుందని అన్ని పార్టీలు కలిసి దాదాపు 200 పైగా సీట్లు దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని బీజేపీ సీనియర్‌ నాయకుడొకరు చెప్పారు. ఈ పరిస్థితుల్లో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలన్నీ కలిపి ఒక ఫ్రంట్‌ గా ఏర్పడే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ కంటే బీజేపీ కనీసం 50 సీట్లు ఎక్కువ సంపాదిస్తే ప్రాంతీయ పార్టీలన్నీ తమకు మద్దతునిస్తాయని, కాని మెజారిటీ పక్షాలు మోదీ నేతృత్వాన్ని ఆమోదించకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అపుడు ప్రధానమంత్రి ఎవరన్న విషయం చర్చనీయాంశం అవుతుందని బీజేపీ నేతలంటున్నారు. ఒకప్పుడు ఆడ్వాణీకి విధేయులుగా ఉండే ద్వితీయ శ్రేణి నేతలు తలోదిక్కూ అయ్యారు. అరుణ్‌ ౖజెట్లీ, సుష్మా స్వరాజ్‌ అస్వస్థతకు గురయ్యారని, రాజ్‌నాథ్‌ సింగ్‌ కు కేవలం హిందీ బెల్డ్‌ లోనే ఆదరణ ఉన్నదని, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పదోన్నతి పొందగా, రవిశంకర్‌ప్రసాద్‌ వంటివారు శాఖాపరమైన పనులకు పరిమితమయ్యారనీ, ఉమాభారతి ఎన్నికల రాజకీయాలకు దూరమయ్యారనీ, అనంతకుమార్‌ మరణించారని వారు వివరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లో పార్టీని దాదాపు గెలుపు అంచుల దాకా తీసుకొచ్చి హుందాగా తప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర జలవనరుల మంత్రి, మహారాష్ట్ర నేత నితిన్‌ గడ్కరీల పేర్లు ముందుకు రావచ్చునని బిజెపి వర్గాలంటున్నాయి.

హైదరాబాద్‌లో సైబరాబాద్‌ను సృష్టించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో సిలికాన్‌ సిటీని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరు-తిరుపతి-చెన్నైలను కలుపుతూ ఏర్పాటు కానున్న పారిశ్రామిక నడవా (ఇండస్ట్రియల్‌ కారిడార్‌)కు సిలికాన్‌ సిటీ అని పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తిరుపతిలో టీసీఎల్‌ సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి గురువారం భూమి పూజ చేశారు. రూ.2,200 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 60 లక్షల టీవీలు తయారు చేసే ప్రణాళికతో ఈ ప్లాంటును నిర్మిస్తున్నారు. 8 వేల మందికి ఇందులో ఉపాధి కల్పించనున్నారు. తిరుపతిలో ఏర్పాటు అవుతున్న, టీసీఎల్‌, రూ.2,200 కోట్ల పెట్టుబడి పెడుతూ, రూ.8 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

tcl 19122018 2

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ఏపీ హార్డ్‌వేర్‌, ఎలక్ట్రానిక్స్‌ తయారీ హబ్‌గా మారబోతోంది. ఈ రంగంలో ఇప్పటి వరకూ 59 కన్నా ఎక్కువ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించాం. వీటి ద్వారా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 20 వేల ఉద్యోగాలు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగాలు ఈ జిల్లాలోనే ఇస్తున్నాం. ప్రపంచంలోనే పారిశ్రామిక నగరంగా షెంజెన్‌ నగరానికి పేరుంది. ఇలాంటి పారిశ్రామిక వాతావరణాన్నే ఇప్పుడు మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ప్రారంభించబోతున్నాం. భవిష్యత్తులో నెల్లూరు-తిరుపతి-చెన్నై మంచి ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా మారబోతోంది. దీనికి సిలికాన్‌ సిటీగా నామకరణం చేస్తున్నాం. భవిష్యత్తులో షెంజెన్‌, సిలికాన్‌ సిటీ కలిసి పని చేస్తాయి. ఈ ప్రాంతంలో రూ.22వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. మొత్తానికి ఇక్కడ లక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్నాం.’’

tcl 19122018 1

‘‘టీసీఎల్‌ సంస్థ నిర్మాణం పూర్తి చేసేందుకు మేం తొమ్మిది నెలలు సమయం అడిగాం. కానీ ఎనిమిది నెలల్లోనే పూర్తి చేస్తామని టీసీఎల్‌ ఛైర్మన్‌ ముందుకొచ్చారు. ఇందుకు వారికి అభినందనలు. డిసెంబరు 2019 నాటికే ఉత్పత్తి చేసేలా సంస్థ నిర్మాణం చేస్తోంది. ఈ సిలికాన్‌ కారిడార్‌లోనే చక్కని వాతావరణ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్లు‌, విమానాశ్రయాలు, రోడ్డు మార్గాలు వంటి సకల సదుపాయాలు ఉన్నాయి. నాలుగేళ్లకు ముందు ఈ ప్రాంతంలో ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు చూస్తే ఈ ప్రదేశం ఒక కారిడార్‌గా మారిపోయింది. త్వరలోనే ఇక్కడికి రిలయన్స్‌ సంస్థ వస్తుంది. తిరుపతి, చెన్నైలో ఇప్పటికే విమానాశ్రయం ఉంది. నెల్లూరులో త్వరలో రాబోతోంది. సిలికాన్‌ సిటీకి దగ్గరలోనే కృష్ణపట్నం, చెన్నై పోర్టులు ఉండగా.. దుగ్గరాజపట్నం, రామాయపట్నం పోర్టులు త్వరలో రానున్నాయి. సిలికాన్‌ కారిడార్‌ నుంచి ఏ వైపునకు వెళ్లాలన్నా రోడ్డు సౌకర్యం ఉంది. సమీపంలోనే జలాశయాలు కూడా ఉండడంతో జల వనరులు కూడా పుష్కలంగా ఉండనున్నాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

అమరావతి: అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న భాష, వ్యాయామ ఉపాధ్యాయుల పదోన్నతులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందుకు ఏపీ జేఏసీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలియచేశారు. మంగళవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన పదోన్నతుల ద్వారా 12 వేల మందికి పైగా లబ్ది పొందుతున్నారన్నారు. విద్యాహక్కు చట్టంలో ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్లు మాత్రమే ఉండాలని ఉన్నప్పటికి కొంతకాలంగా బాషోపాధ్యాయులు.

cbn emplyees 20122018 2

వ్యాయమ ఉపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లగా మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారని తెలిపారు. భాష ఉపాధ్యాయుల సంఘం వ్యాయమ ఉపాధ్యాయుల సంఘాలతో కలసి ఏపీ జేఎసీ అమరావతి తరపున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి డిసెంబరు 17న పదోన్నతులు కల్పిస్తూ జీవో విడుదల చేసిందని తెలిపారు. 10,224 మంది ఉపాధ్యాయులు, 2603మంది వ్యాయామ ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు టైం స్కేలు అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనిని వెంటనే కేబినేట్‌ సమావేశంలో అనుమతించాలని కోరారు.

cbn emplyees 20122018 3

మోడల్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, వీటిని ప్రభుత్వ పాఠశాలలో కలపాలని ప్రభుత్వాన్ని కోరిన ట్లు తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్లకు టైమ్ స్కేలు అమలు చేయాలని, దీనిని క్యాబినెట్ లో ఆమోదించాలని ఆయన కోరారు. మోడల్‌ స్కూల్స్‌ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వీరి వినతులన్నీ పరిశీలిస్తామని గంటా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్‌ టీవీ పేర్రాజు, గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేశవనాయుడు, జిల్లా జేఏసీ చైర్మన్‌ ఈశ్వర్‌, కంకల కొండయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గం పై దృష్టి పెట్టటంతో, రాజకీయం వేడెక్కింది. ఈసారి ఎలాగైనా చంద్రగిరిలో తెలుగుదేశం జెండా ఎగురవేయాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మల్యేగా ఉన్న చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డిని ధీటుగా ఎదుర్కొనే నేత కోసం చంద్రబాబు అన్వేషించారు. అన్నీ కోణాల్లో చుసిన తరువాత, జిల్లాలో యువనేత, టీడీపీ జిల్లా అధ్యక్షుడయిన పులివర్తి నానిని చంద్రగిరి అభ్యర్థిగా బాబు చంద్రబాబు ప్రకటించారు. ఈ పరిణామం తెలుగుదేశం నేతల్లోనే కాదు, చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాల్లోనే సంచలనం రేపింది. ఇక్కడ సీనియర్ నేత అయిన గల్లా అరుణకుమారి వచ్చేఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీకి అయిష్టంగా ఉండటంతో, కొత్త అభ్యర్థిని పోటీకి దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నీ ఆలోచించిన బాబు, చివరికి పాకాల మండలం పులివర్తివారిపల్లెకు చెందిన పులివర్తి నాని అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు.

chivereddy 20122018 1

రాజకీయ కుటుంబానికి చెందిన నాని వార్డు మెంబరు స్థాయి నుంచి పైకి వచ్చారు. 2001లో పులివర్తివారిపల్లెకు సర్పంచ్‌గాఈయన ఎన్నికయ్యారు. టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ బలోపేతానికి అలుపెరుగని కృషిచేశారు. ఈ తరుణంలోనే ఆయన పై చంద్రబాబు దృష్టి పడింది. పార్టీ కార్యాలయంలోనే పులివర్తి నాని ఎక్కువ సమయం గడుపుతారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం పాటు పడతారు. ఈ అర్హతల అన్నీ చూసిన, చంద్రబాబుకు నాని పై అభిమానం పెరిగింది. ఆయన అయితేనే చెవిరెడ్డి పై పోటీచేసి గెలవగల అభ్యర్థి అని చంద్రబాబు భావించారు. బాబు తన పేరు ప్రకటించిన తర్వాత పులివర్తి నాని చంద్రగిరిలో తన మార్క్‌ రాజకీయం ప్రారంభించారు.

chivereddy 20122018 1

నియోజకవర్గంలో చిన్నాచితకగా ఉన్న అసంతృప్తులను కూడగడుతున్నారు. వారిని ఒక తాటిపైకి తీసుకువస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పనిలో వేగం పెంచారు. ఇది వరకు చంద్రగిరిలో ఏ నాయకుడు ఇంతగా పనిచేసింది లేదట. అన్ని వర్గాలను కలుపుకు వచ్చేందుకు కూడా నాని ప్రయత్నిస్తున్నారు. సూటిగా చెప్పాలంటే ఎన్నికల ప్రచారంలోకే ఆయన దిగేశారు. ప్రచారరథాన్ని సైతం సిద్ధం చేసుకుని దూకుడు పెంచారు. మాజీమంత్రి, సీనియర్ నేత గల్లా అరుణకుమారి సహకారం తీసుకుంటున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యవహార శైలి పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ కారణంగా నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల కాక రేగుతోంది. అందుకే చంద్రగిరి రాజకీయాల్లో ప్రస్తుతం పులివర్తి నాని చర్చనీయాంశంగా మారారు. చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందో లేదో తెలియాలంటే, ఎన్నికల వరకు ఆగాల్సిందే.

 

Advertisements

Latest Articles

Most Read