చట్టం ముందు అందరూ సమానమే అని ఈ రోజు సిబిఐ కోర్ట్ తీర్పు ఇచ్చింది. ముఖ్యమంత్రి అయినా, సామాన్య ప్రజలు అయినా, ఎవరైనా సరే, చట్టం ముందు అందరూ సమానామే అని సిబిఐ కోర్ట్ చెప్పింది. ప్రతి శుక్రవారం నాకు కోర్ట్ కు రావటం ఇబ్బంది, నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాను, నేను విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలి అంటే, 60 లక్షలు ఖర్చు అవుతుంది, నాతొ పాటే సెక్యూరిటీ రావాలి, మా రాష్ట్రం ఆర్ధిక కష్టాల్లో ఉంది అంటూ జగన్ మోహన్ రెడ్డి సిబిఐ కోర్ట్ లో పిటీషన్ వేసారు. అయితే, ఈ పిటీషన్ పై సిబిఐ తీవ్రంగా స్పందించింది. సియం అయినా, ఎవరైనా చట్టం ముందు సమానమే అని వాదించింది. ఈ కేసుకు జగన్ సియం అవ్వటం, రాష్ట్ర ఆర్ధిక భారానికి సంబంధం లేదని వాదించింది. జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా ఉండగానే, సాక్షులను ప్రభావితం చేసారని, ఇప్పుడు ఈయన సియాం అని, సాక్ష్యులను ప్రభావితం చేస్తారని వాదించింది.
అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ రావటానికి పెద్ద ఖర్చు అవ్వదని, ఒక రోజు పొతే, రాష్ట్రం కోసం, మిగతా రోజుల్లో పని చెయ్య వచ్చని సిబిఐ వాదించింది. ఇలా సిబిఐ చాలా ఘాటుగా తమ వాదనలు వినిపించింది. అయితే వాదనలు జరుగుతున్న టైంలో, జగన్ లాయర్ మాట్లాడుతూ, జగన్ ఇప్పుడు సియం అని, గౌరవనీయ జగన్ మోహన్ రెడ్డి గారు అని పిలవాలని సంబంధించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇరువురి వాదనలు, సిబిఐ కోర్ట్ వింది. అక్టోబర్ 18న ఈ వాదనలు విని, తీర్పుని ఈ రోజుకి వాయిదా వేసింది. అయితే దీని పై ఈ రోజు తీర్పు చెప్పిన కోర్ట్, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు అనే సిబిఐ వాదనలనతో అంగీకరించింది. అలాగే సిబిఐ చేసిన ప్రతి వాదనతో కూడా సిబిఐ కోర్ట్ ఏకీభవించింది.
దీంతో జగన్ పిటీషన్ కొట్టేసి, ప్రతి శుక్రవారం జగన్ విచారణకు హాజరు కావాల్సిందే అంటూ, కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో జగన్ క్యాంప్ డీలాలో పడింది. ఇలా అయితే జగన్ పరువు పోతుందని, వైసిపీ నేతలు భావిస్తున్నారు. మోడీ, అమిత్ షా మా వాళ్ళే అని చెప్పిన జగన్, విజయసాయి రెడ్డికి, ఇది నిజంగా షాక్ అనే చెప్తున్నారు. మరో పక్క, తెలుగుదేశం పార్టీ, ఈ తీర్పు పై స్పందిస్తూ, జగన్ పై మండి పడుతుంది. ఇలాంటి వారు సియం అవ్వటం మన ఖర్మ అని, ఇతనికి ఏమైనా నైతిక విలువులు ఉంటే, వెంటనే రాజీనామా చెయ్యాలని టిడిపి అంటుంది. అసలు వ్యక్తిగత మినహాయింపులకు, 60 లక్షలు రాష్ట్రం పై భారం పడటం ఏంటి అంటూ టిడిపి వాదిస్తుంది. ఇప్పటికైనా జగన్ రాజీనామా చేసి, కోర్ట్ వాయిదాలకు వెళ్ళాలని, వేరే వారికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.