విశాఖపట్నంలో, 70 వేల కోట్లతో, వచ్చే డేటా సెంటర్ పై ఆదానీ వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో, భారీ ప్రాజెక్ట్ నుంచి కూడా అదనీ వైదొలిగింది. శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలంలో నిర్మించతలపెట్టిన భావనపాడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనుల నుంచి కూడా అదానీ తప్పుకున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం, టెండర్లు రద్దు చేసుకుంది. 2300 ఎకరాల్లో భావనపాడు పోర్టు నిర్మాణానికి అదానీ కంపెనీ, సెజ్ లిమిటెడ్ గతంలో టెండర్లు దక్కించుకున్నాయి. షేర్ల పై 2018 మార్చి 27న లెటర్ ఆఫ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాయి. పీపీపీ ద్వారా 33 ఏళ్లు కలిసి పనిచేసేందుకు ఈ రెండూ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఒప్పందం ప్రకారం, అవసరమైన భూ సేకరణ చేపట్టాలని గత ప్రభుత్వం కలెక్టర్‌కు ఆదేశించింది. ఒప్పందం ప్రకారం, మర్రిపాడు, భావనపాడు, దేవునళ్తాడ గ్రామాల పరిధిలోని భూ సేకరణకు చర్యలు చేపట్టారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన 2300 ఎకరాల భూమికి రూ.1202 కోట్లు అవసరమని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
అయితే ప్రభుత్వం మారటంతో, కాకినాడ డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ గత ఏడాది సెప్టెంబర్ 27న తాము రూ.500 కోట్లు మాత్రమే భూములకు చెల్లించగలమని, మిగిలిన రూ.702 కోట్లు తము సాధ్యం కాదని ప్రకటించింది. అయితే దీనికి అదానీ కంపెనీ ఏకీభవించలేదు. తాము అగ్రిమెంట్ రద్దు చేసుకుంటామని, ఇప్పటి వరకు చెల్లించిన ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫీజు, బ్యాంక్ గ్యారెంటీ తిరిగి చెల్లించాలని కోరింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఈవో పోర్టు ట్రస్ట్ ఈ విషయాన్ని పరిశీలించి అదానీ కంపెనీ టెండర్ల రద్దుకే మెగ్గుచూపింది. ఈ మేరకు ప్రభుత్వం ఒప్పందం రద్దు చేస్తూ, జిఒ నంబరు 17ని విడుదల చేసింది. పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి అదానీ పోర్ట్సు తప్పుకోవడంతో కొత్త సంస్థకు అప్పగించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచనకు, ఇప్పుడు మార్గం సుగుమం అయ్యింది.