జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఫ్లైట్ టెక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే, ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైట్ వెంటనే మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చేసింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం రావటంతో, ఫ్లైట్ మళ్ళీ వెనక్కు వచ్చేసింది. గాల్లో చక్కర్లు కొట్టి, కొద్ది సేపటికి కిందకు దిగేసింది. అయితే అప్పటికే జగన్ కాన్వాయ్ తిరిగి వెళ్ళిపోయింది. జగన్ ఫ్లైట్ తిరిగి రావటంతో, సెక్యూరిటీకి ఒక్కసారి అర్ధం కాలేదు. మళ్ళీ జగన్ కాన్వాయ్ తిరిగి వచ్చింది. జగన్ మళ్ళీ తిరిగి తాడేపల్లి వెళ్లిపోయారని చెప్తున్నారు. మరి మళ్ళీ ఢిల్లీ వెళ్తారో లేక, ఢిల్లీ ట్రిప్ క్యాన్సిల్ అయిపోతుందో చూడాలి మరి.

వైసీపీకి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ తార‌క‌ర‌త్న పైకి పోతాడంటూ న‌వ్వుతూ పైశాచిక ప్ర‌క‌ట‌న చేశారు. నారా వారి పాద‌యాత్ర ఆరంభంలో నంద‌మూరి వార‌సుడు గుండెపోటుతో పోవ‌డం శుభ‌సూచ‌క‌మంటూ వికృతానందాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాడు. మ‌రోవైపు నందమూరి కుటుంబంలో ఎవ‌రికి వారుగానే ఉండే వాళ్లంతా ఒక్క‌సారిగా త‌మ ఇంటి బిడ్డ కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు, ప‌రామ‌ర్శ‌లకు వ‌చ్చారు. నంద‌మూరి తార‌క‌ర‌త్న రాజ‌కీయంగా పెద్ద అనుభ‌వం లేదు. సినిమా స్టార్‌గానూ పెద్ద‌గా పేరుప్ర‌తిష్ట‌లు లేవు. అన్న నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డిగానే ఈ రెండు రంగాల‌కీ ప‌రిచ‌యం అయ్యాడు. ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తిని క‌న‌బ‌రిచాడు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కి నెల రోజుల ముందే సంఘీభావం ప్ర‌క‌టించాడు. పాద‌యాత్ర‌లోనూ పాల్గొన్నాడు. త‌న‌కు తెలుగుదేశం టికెట్ ఇస్తే పోటీచేస్తానంటూ ఆస‌క్తి క‌న‌బ‌రిచాడు. మామ‌య్య చంద్ర‌బాబుని మించిన నాయ‌కుడు లేడంటూ తెలుగుదేశంపైనా, సీబీఎన్ నాయ‌క‌త్వంపైనా అచంచ‌ల విశ్వాసం ప్ర‌క‌టించాడు. అంత‌లోనే హార్ట్ ఎటాక్‌తో ఆస్ప‌త్రి పాల‌య్యాడు. అయితే నంద‌మూరి-నారా కుటుంబాల‌న్నీ తార‌క‌ర‌త్న కోసం నిద్రాహారాలు మాని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. నేరుగా బెంగ‌ళూరు చేరుకుని ఆస్ప‌త్రిలో తార‌క‌ర‌త్న‌ని చూసి వ‌స్తున్నారు. మామ చంద్ర‌బాబు, మేన‌త్త పురందేశ్వ‌రి, బాబాయ్ బాల‌య్య‌, అన్న‌య్య మోహ‌న కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్, బ్రాహ్మిణి,, ప్ర‌ణ‌తి, నంద‌మూరి సుహాసిని, మామ‌య్య‌లు, అత్త‌య్య‌లు, బాబాయ్‌లు ఒక‌రేమిటి నందమూరి-నారా కుటుంబాలు మొత్తం తార‌క‌ర‌త్న కోసం ఒక్క‌ట‌య్యారు. సినిమాలు, వ్యాపారాలు వేరువేరుగా ఉన్నా.. క‌ష్ట‌మొస్తే మేమంతా ఒక్క‌టేన‌ని ఎన్టీఆర్ కుటుంబం తార‌క‌ర‌త్న విష‌యంలో చాటిచెప్పారు.

 

గ‌త కొద్ది రోజులుగా రాంగోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ఆయ‌న చేతిలో లేద‌ని ఆయ‌న హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. త‌ల్లి, చెల్లి, ఆలి, అమ్మాయికి తేడా తెలియ‌ని మ‌త్తులో ఉండే రాంగోపాల్ వ‌ర్మ ట్వీట్లు మాత్ర‌మే స‌ర్కాస్టిక్‌గా, సెటైరిక‌ల్ గా చాలా అతి త‌క్కువ ప‌దాల‌తో చిన్న వాక్యాల‌లో ఉండేవి. అవి  ఎవ‌రైనా ఎత్తిచూపేవి. బుల్లెట్టులా త‌గిలేవి. ఇటీవ‌ల కాలంలో మాన‌సికంగా, ఆర్థికంగా బాగా కుంగిపోయిన రాంగోపాల్ వ‌ర్మ వైసీపీకి అమ్ముడుపోయాడ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆర్జీవీని ఎంత పెద్ద‌వాళ్లు క‌ల‌వాల‌న్నా ముంబై వెళ్లేవారు. పొలిటీషియ‌న్ల‌ను అస్స‌లు లెక్క చేసేవాడు కాదు. అటువంటి రాంగోపాల్ వ‌ర్మ తాడేప‌ల్లి ప్యాలెస్ కి వ‌చ్చి జ‌గ‌న్ రెడ్డి ముందు చేతులు క‌ట్టుకుని నిలుచున్న‌ప్పుడే వ‌ర్మ‌ని అభిమానించేవాళ్లంతా షాక‌య్యారు. అనంత‌రం త‌న భాష కాని, త‌న జోన‌ర్ కాని ట్వీట్లు హ్యాండిల్‌లో ప్ర‌త్య‌క్షం అవ్వ‌డంతో ఇన్నాళ్లు వ‌ర్మ‌ని ఆరాధించిన యారోగెంట్, యాటిట్యూడ్ బ్యాచు అంతా ఇది అమ్ముడుపోయిన స‌రుకు అంటూ డిసైడ‌య్యారు. టిడిపి-జ‌న‌సేన అధినేత‌ల భేటీ అయితే కాపుల్ని కించ‌ప‌రిచేలా ట్వీటేశాడు. త‌న‌కేమాత్రం సంబంధంలేక‌పోయినా అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడుల‌ను వాడు వీడంటూ ట్వీట్ చేశాడు. నాదెండ్ల మ‌నోహ‌ర్, చంద్ర‌బాబు క‌లిసి ప‌వ‌న్ కి వెన్నుపోటు పొడుస్తారంటూ మ‌ళ్లీ త‌న హ్యాండిల్ నుంచి వైసీపీ పెయిడ్ ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేశాడు. అయితే ఆర్జీవీ స్టైల్ లాంగ్వేజ్, స్టైల్ కాని ఈ ట్వీట్లు పూర్తిగా వైసీపీ పేటీఎం బ్యాచు వేస్తోంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. రాంగోపాల్ వ‌ర్మ ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడో కానీ త‌న ట్వీట్ట‌ర్ హ్యాండిల్ కూడా వైసీపీకి తాక‌ట్టు పెట్టేశాడ‌ని ఆయ‌న ఫ్యాన్స్ తెగ బాధ‌ప‌డిపోతున్నారు. వైసీపీ క్యాంప్ మాత్రం క‌త్తి మ‌హేష్‌లా టిడిపి-జ‌న‌సేన‌పై దాడి చేసేందుకు క‌రెక్ట‌యిన ప‌ర్స‌న్ రాంగోపాల్ వ‌ర్మ అని నిర్ణ‌యించుకున్నాకే పేమెంట్ మాట్లాడుకుని రాంగోపాల్ వ‌ర్మ‌ని, ఆయ‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్నీ వాడుతున్నార‌ట‌.

ఇటీవ‌ల కాలంలో వైసీపీ కీల‌క నేత‌ల‌పై వైసీపీ స‌ర్కారుపై అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం నెల్లూరు నుంచి ఆరంభమైంది. ముందుగా వెంక‌ట‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి అస‌మ్మ‌తి గ‌ళం ఎత్తారు. ఆ త‌రువాత నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స‌ర్కారు తీరుని ఎండ‌గ‌ట్టారు. వెనువెంట‌నే సీఎం నుంచి పిలుపురావ‌డం, తాడేప‌ల్లిలో త‌లంట‌డం జ‌రిగిపోయాయి. అయితే మ‌రోసారి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌న‌ ఫోను ట్యాప్ చేస్తున్నార‌ని, ఈ విషయం తెలుసుకుని వారికి ఏం కావాల‌నుకుంటున్నారో అవే మాట్లాడుతున్నానంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. త‌న దగ్గర చాలా సిమ్‌లు ఉన్నాయ‌ని, చేతనైతే వాటిని కూడా ట్యాప్ చేయండి అంటూ స‌వాల్ విసిరారు. అవసరమైతే నా ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించుకోండంటూ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారం తెలియడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాట్లాడుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. అంటే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డిపై చాలా రోజులుగా వైసీపీ ప్ర‌భుత్వం నిఘా పెట్టింద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడుని కోటంరెడ్డి క‌లిశారు. అసంతృప్తిగా ఉన్నార‌ని తెలిసిన ఎమ్మెల్యేలు అంద‌రిపైనా నిఘా ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

Advertisements

Latest Articles

Most Read