వైసిపి ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక విధానాలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే వారం నుంచి ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని నిర్ణయించింది. మంగళవారం విజయవాడలో జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయడు ఈ షెడ్యూల్ ప్రకటించారు. 45రోజులపాటు గ్రామాల్లో, వార్డుల్లో పర్యటించి ప్రజలను చైతన్య పర్చాలని, వైసిపి ప్రభుత్వ దోపిడిని ఎండగట్టాలని పిలుపిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, ‘‘ రాష్ట్రంలో వైసిపి మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోయింది. శాండ్ మాఫియా/ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా/వైన్ మాఫియా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. బోగస్ ఇన్ వాయిస్ లతో, నకిలీ రశీదులతో రీచ్ లనుంచి, స్టాక్ పాయింట్ల నుంచి యధేచ్చగా ఇసుక దోచేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. నకిలీ ఇన్ వాయిస్ లతో వైసిపి నేతలే ఇసుక కొల్లగొడుతున్నారు. ఇక మద్యం అమ్మకాల్లో పెద్దఎత్తున గోల్ మాల్ చేస్తున్నారు. ఇక్కడ అమ్మకాలు తగ్గినట్లు చూపి తెలంగాణ మద్యానికి గేట్లు ఎత్తేశారు. పొరుగు రాష్ట్రాలనుంచి మద్యం ఏరులై పారుతోంది. అందుకే ఆయా రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి."
"తమకు ముడుపులు చెల్లించే సెలెక్టెడ్ బ్రాండ్స్ మాత్రమే అమ్మిస్తున్నారు. ల్యాండ్ మాఫియా పేట్రేగిపోయింది. ఒక్క విశాఖలోనే 32వేల ఎకరాలు ఆక్రమించారు. కనిపించిన భూమినల్లా కబ్జా చేస్తున్నారు. అసైన్డ్ భూములను బెదిరించి లాగేస్తున్నారు. చెరువులు పూడ్చేసి ఆక్రమిస్తున్నారు. గనుల లీజుదారులను వాటాల కోసం బెదిరిస్తున్నారు. వినని వాళ్ల లీజులు రద్దు చేసి, సొంత వాళ్లకు కేటాయిస్తున్నారు. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పటికే 30సార్లు కోర్టులు అక్షింతలు వేశాయి. అయినా వైసిపి నేతలు మొండిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడంపై హైకోర్టు తప్పు పట్టింది. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. సొంత బాబాయి హ-త్య జరిగి ఏడాది కావస్తున్నా హం-త-కు-ల-ను పట్టుకోలేక పోయారు. తనకు రక్షణ లేదని, తండ్రిని హ-త్య చేసిన వాళ్లవల్ల తనకు ప్రా-ణ-హా-ని ఉందని, తండ్రి హ-త్యపై సిబిఐ విచారణ జరిపించాలని, తనకు రక్షణ కల్పించాలని వి-వే-కా-నం-ద రెడ్డి కుమార్తె కోరింది. అది జరగ్గానే సిబిఐ విచారణపై గతంలో తాను వేసిన పిటిషన్ జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించాలి. తప్పుడు కేసులతో ప్రత్యర్ధులు మనలను వెంటాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనలో మనం కలహించుకోరాదు. విభేదాలు వదులుకోవాలి. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. పేదలకు అండగా ఉండాలి. కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. నాయకులకు అండగా ఉండాలి."
"సంస్థాగత కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలి. అన్నిస్థాయిల్లో సమర్ధవంతమైన వ్యక్తులను ఎంపిక చేసుకోవాలి. మీ నియోజకవర్గాలను చూసుకోవాలి, పరిశీలకులుగా మీ బాధ్యతలను నిర్వర్తించాలి. వైసిపి ప్రభుత్వ బాధితులకు అండగా ఉండాలి. గ్రామాల్లో అభివృద్ది పనులు చేసిన వాళ్ల బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. నరేగా బిల్లులను మొదట చేసినవాటికే తొలుత చెల్లింపులు జరపాలని కేంద్రం ఆదేశించినా బేఖాతరు చేశారు. హైకోర్టు తప్పు పట్టినా పట్టించుకోవడం లేదు. నరేగా స్ఫూర్తికే తూట్లు పొడుస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేయాలి. ఆశయం మంచిదైతే చాలదు, దాని అమల్లో చిత్తశుద్ది లేకపోతే ఇలాగే ఉంటుంది. ఉదాత్తమైన పథకం నరేగా వైసిపి నిర్వాకాల వల్ల నీరుగారిపోయిందని’’ చంద్రబాబు అన్నారు.
యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ‘‘ఆర్ధిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. కష్టపడి సంపాదించడం, ఖర్చు పెట్టడం, చాలకపోతే అప్పులు చేయడం కుటుంబంలో అయినా, వ్యవస్థలో అయినా సాధారణంగా జరిగే ప్రక్రియ. వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా ఆర్ధిక క్రమశిక్షణ ముఖ్యం. రాబడి, వ్యయం, అప్పుల మధ్య సమతుల్యం ఉండాలి. విచ్చలవిడిగా చేస్తే ఇలాంటి పరిణామాలే ఉత్పన్నం అవుతాయి. రాష్ట్ర రాబడి 16% పడిపోయింది. అప్పులు 17% పెరిగాయి, ద్రవ్యోల్బణం 6% పెరిగింది. ఏదీ కొనేట్లు లేరు, ఏదీ తినేట్లు లేరు. తలసరి ఆదాయం దారుణంగా పడిపోయింది, కొనుగోలు శక్తి, పొదుపు శక్తి క్షీణించాయి. ఏదీ సమర్ధంగా నిర్వహించలేకే దా-డు-లు, దౌ-ర్జ-న్యా-ల-కు దిగారని’’ ధ్వజమెత్తారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ‘‘ రాష్ట్రంలో సారా అమ్మకాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. సారా సామ్రాజ్యం నడుస్తోంది. ఏడాదికి రూ 20వేల కోట్ల ముడుపులు టార్గెట్ పెట్టుకున్నారు. మద్యం అమ్మకాలపై రూ 6వేల కోట్లు టార్గెట్. కమిషన్లు ఇచ్చిన సెలెక్టెడ్ బ్రాండ్స్ మాత్రమే అమ్ముతున్నారు. సిమెంట్ పై బస్తాకు రూ 10 జె ట్యాక్స్ కంపెనీల నుంచి వసూలు చేస్తున్నారు. బస్తాకు రూ 50పెంచి అమ్ముతూ వినియోగదార్లను దోచుకుంటున్నారు. సిమెంట్ అమ్మకాలపై రూ 4వేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. వైసిపి నేతల దోపిడి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని’’ కోరారు.
నూకల బాలాజీ మాట్లాడుతూ, ‘‘ టిడిపి క్రమశిక్షణ ఉన్న పార్టీ అయితే, వైసిపి బూతు శిక్షణ ఇచ్చేపార్టీ..వైసిపికి సంస్థాగత నిర్మాణం లేదు, టిడిపికి నిర్మాణం ఉంది. మీరు చేస్తున్న కష్టానికి గ్రామాల్లో బలమైన నాయకత్వం వస్తే టిడిపిని ఎవరూ ఎదుర్కోలేరు. నోరువాయి లేని వారిని కమిటిల అధ్యక్షులుగా పెడితే గ్రామాల్లో నాయకత్వం బలపడదు. బలమైన వాళ్లను కమిటిల్లో ఎంపిక చేసుకోకపోతే పార్టీకి ద్రోహం చేసిన వారవుతారు. పించన్ల తొలగింపు, కార్డుల తొలగింపుతో వైసిపిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజల్లో ఆ వ్యతిరేకతను టిడిపికి సానుకూలం చేసుకుంటే స్థానిక సంస్థల్లో గెలుపు ఖాయం’’ అని అన్నారు. గౌరివాని శ్రీనివాసులు మాట్లాడుతూ, ‘‘ ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వలేదని టిడిపిని మొదటి 3ఏళ్లు విమర్శించారు వైసిపి నేతలు, కానీ టిడిపి పాలనలో ముస్లింల సంక్షేమానికి ఎన్నో వినూత్న పథకాలు పెట్టారు, పెద్దఎత్తున బడ్జెట్ కేటాయించారు, కానీ ఈ 9నెలల్లో ముస్లింకు డిప్యూటి సీఎం ఇచ్చినట్లు గొప్పలు చెబుతూ టిడిపి చేసిన సంక్షేమం అంతా నిలిపేశారని, రంజాన్ తోఫా, దుల్హన్ ఆపేశారని, ఇమాంలు, మౌజన్ లకు వేతనాలు ఆపేశారని ఒక ముస్లింలే తనతో చెప్పి వాపోయారని’’ తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.