అక్రమాస్తుల కేసులో నిందితుడు, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసు పరిస్థితులు మారిపోవు అంటూ, జగన్మోహన్​రెడ్డి విషయంలో సీబీఐ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్రమాస్తుల కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్​పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ లో, సిబిఐ, జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి అనే హోదాను అడ్డుపెట్టుకుని జగన్​ కోర్టు హాజరు నుంచి తప్పించుకుంటున్నారని పిటిషన్​లో పేర్కొంది. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం జగన్ వేసిన పిటిషన్ విచారణార్హం కాదని సిబిఐ తెలిపింది. బెయిల్ షరతులను జగన్‌ అతిక్రమిస్తున్నారని, సిబిఐ తన కౌంటర్ లో స్పష్టం చేసింది. జగన్ ప్రతి వారం కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, ఏదో ఒక కారణంతో బయటపడాలని జగన్ ప్రయత్నిస్తున్నారని సిబిఐ తెలిపింది. సీఆర్‌పీసీ సెక్షన్ 205ను ఉపయోగించి కోర్టుకు హాజరు కాకుండా చూస్తున్నారని అభియోగించింది. సీఎం అయ్యాక జగన్ ఒక్కసారే సీబీఐ కోర్టుకు వచ్చారని కోర్ట్ కు తెలిపింది.

సరైన కారణం చెప్పకుండా, వ్యక్తిగత మినహాయింపు కోసం జగన్ మళ్లీ పిటిషన్ వేశారని, సిబిఐ అభ్యంతరం చెప్పింది. ఇప్పుడు తన హోదా మారింది కాబట్టి, అది కారణంగా చెప్పి, మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టును కోరింది. చట్టం ముందు, ఎవరైనా ఒక్కటే అని, సీఎం, సామాన్యుడు అనే తేడా ఉండదని, సీబీఐ పేర్కొంది. నిందితుడి హోదా మారినంత మాత్రాన కేసు పరిస్థితి మారినట్లు కాదని తెలిపింది. వారానికోసారి విజయవాడ నుంచి రావడం కష్టం అంటూ జగన్ చెప్పటం, సరైన కారణం కాదని చెప్పింది. జగన్ పై, సిబిఐ కేసులు 11, ఈడీ కేసులు 5 ఉన్నాయని, జగన్ కేసుల్లో సహా నిందితులుగా ఉన్న వారు, ఇప్పుడు ఆయాన ప్రభుత్వంలో, ఉన్నారని, సిబిఐ కోర్ట్ కు తెలిపింది.

బెయిల్ ఇచ్చిన సమయంలో, జగన్ షరతులకు ఒప్పుకున్నారని, వాటికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉండాలని సీబీఐ తన కౌంటర్ లో చెప్పింది. జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో, ఇంకా కొన్ని అభియోగాలు నమోది చెయ్యాల్సి ఉందని, జగన్ కు వెసులుబాటు ఇస్తే, వాటిని ప్రభావితం చేసే అవకాసం ఉందని చెప్పింది. దేశ ఆర్ధిక వ్యవస్థ పై, ప్రభావం చుపించినే భారీ ఆర్ధిక కుంభకోణంలో, జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని, కోర్ట్ వారు ఇది ద్రుష్టిలో పెట్టుకుని, జగన్ మోహన్ రెడ్డికి మినహాయింపు ఇవ్వనవసరం లేదని తెలిపింది. రాష్ట్ర విభజనకు, జగన్ రాజకీయానికి, ఈ కేసుకు సంబంధం లేదని, సిబిఐ చెప్పింది. జగన్ ఏమి చట్టానికి అతీతుడు కాదని, అతని తీవ్ర ఆర్ధిక నేరాలు ఉన్నాయని, షరతుల పై బెయిల్ తీసుకుని, ఇప్పుడు విచారణకు హాజరు కాకపోవటం ఏమిటని, సిబిఐ ప్రశ్నించింది.

43వేలకోట్ల సొమ్ముని కాజేసి, అవినీతిరొచ్చులో పొర్లాడుతున్న జగన్మోహన్‌రెడ్డి, ఆ రొచ్చుని తెల్లచొక్కా వేసుకొని పక్కనుంచి వెళుతున్న వ్యక్తిపై విదిలించాలని చూస్తున్నాడని, సీబీడీటీ దాడుల్లో పట్టుబడిన సొమ్ముని చంద్రబాబునాయుడికి అంటగ్టాలని చూడటం అందులో భాగమేనని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీకేంద్ర కార్యాలయంలో విలేకరులతో మ్లాడారు. దేశంలో ఎక్కడెక్కడ దాడులుచేసింది... ఎంతసొత్తుస్వాధీనం చేసుకుందీ.. వివరాలతోసహా సీబీడీటీ స్పష్టంగా ప్రకటనలో పేర్కొంటే, అందులోని ఇంగ్లీషు అర్థంచేసుకోలేని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్‌ అవినీతి రొచ్చుని తాముపూసుకుంటూ, చంద్రబాబుకి పూయాలనిచూస్తున్నారని ఉమా దుయ్యబ్టారు. గతంలో చంద్రబాబు దగ్గర పనిచేసిన ఆయన మాజీకార్యదర్శి శ్రీనివాస్‌ ఇంటిలో రూ.2లక్షల14వేలనగదు, 12తులాల బంగారం దొరికితే, దాన్ని రూ.2వేలకోట్లుగా చిత్రీకరించడం జగన్‌కు, ఆయనమీడియాకే చెల్లిందన్నారు. వచ్చే నెలలో శ్రీనివాస్‌ కూతురి వివాహం ఉందని, అలాంటప్పుడు ఆయనింట్లో ఆమాత్రం సొమ్ము ఉండకూడదా అని దేవినేని ప్రశ్నించారు. గత ఏడేళ్లనుంచి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా తనతో సహా కుటుంబసభ్యుల ఆస్తులవివరాలను చంద్ర బాబు వెల్లడిస్తున్నాడని, జగన్‌ ఏనాడైనా తనకుగానీ, తనకుటుంబసభ్యులకుగానీ ఉన్న ఆస్తులజాబితాను ఎందుకు వెల్లడించలేదన్నారు?

ఉదయం నుంచి జగన్‌, ఆయనమీడి యా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దొంగే దొంగ..దొంగ అన్నట్లుగా వ్యవహ రిస్తున్నాయని ఉమా దుయ్యబ్టారు. ప్రతిమ ఇన్‌ఫ్రాకంపెనీ ఎవరిదో, దానికి జగన్‌కు ఉన్న సంబంధమేోం చెప్పాలన్నారు. పొద్దుట్నుంచీ మీడియా ముందుకేకలేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సీబీడీ చెప్పినమూడు కంపెనీల్లో ఒకటైన ప్రతిమ ఇన్‌ఫ్రా పేరెందుకు ఎత్తడంలేదన్నారు. కేసీఆర్‌ సన్నిహితుడు, మాజీఎంపీ వినోద్‌ పేరు ఎక్కడా ఎందుకు బయటకు రాలేదన్నారు. మెగా ఇన్‌ఫ్రా కంపెనీ పోలవరం కాంట్రాక్ట్‌ తీసుకున్న కృష్ణారెడ్డిదని, దానిపేరు కూడా చెప్పేస్థితిలో వైసీపీ లేదన్నారు. పట్టిసీమ కట్టినప్పుడు మెగాకంపెనీని తప్పుప్టిన జగన్మోహన్‌రెడ్డి, తిరిగి అదేకంపెనీకి పోలవరం పనుల అప్పగించాడన్నారు.సాక్షిపేపర్‌ ఉందికదా అని ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకుంటే ప్రజలెవరూ నమ్మేస్థితిలో లేరని ఉమా స్పష్టంచేశారు. మూడు కంపెనీల్లో మూడోది షాపూర్జీ పల్లోంజీ సంస్థదని, దానిపేరెత్తితే ఢిల్లీలో జగన్‌ను తన్ని తరిమేయడం ఖాయమన్నారు. సీబీడీ-ఐీశాఖ వెల్లడించిన రూ.2వేలకోట్ల పన్నుఎగవేతదారుల్లో ముగ్గురుమంత్రులు, ముగ్గురుఎంపీలు, ఇద్దరు శాసనసభ్యులు న్నారని, ఆ 8మందికి సంబంధించిన వివరాలు బయటకు రాకూడదనే హడావిడిగా జగన్‌ ఢిల్లీ బాటప్టాడన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా ఏపీలోనే పాలసీలు, ఇన్సెింవ్స్‌లు మారతున్నాయని, కియాను ఎందుకు బెదరించారని, పలువురు సీఈవోలు దావోస్‌లో కేంద్రమంత్రులను ప్రశ్నిం చడం జరిగిందని, దానిపై ఇప్పికే కేంద్రమంత్రి పీయూష్‌గోయెల్‌ తన నివేది కను మోదీకి ఇవ్వడంజరిగిందన్నారు.

వాిపై వివరణ ఇచ్చి, మోదీకాళ్లు పట్టుకోవడా నికే జగన్‌, తనఎంపీలతో కలిసి ఢిల్లీవెళ్లాడన్నారు. దేశవ్యాప్తంగా సీబీడీ దాడులుచేస్తే, వాిని చంద్రబాబునాయుడికి ఆపాదించడం సిగ్గుమాలిన తనమని ఉమా మండిపడ్డా రు. త్వరలో జరగబోయే ఐీదాడుల్లో తనపార్టీవారి వివరాలు బయటకు రాకూడదనే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లాడన్నారు. రైతులు, మహిళలు 60రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్టించుకోకుండా, మీడియా పై, జర్నలిస్టులపై ఎస్సీ,ఎస్టీ కేసులు ప్టిెనా, చలించని ముఖ్యమంత్రి, తనదాకా వచ్చేసరికి ఢిల్లీకి పరిగెత్తాడన్నారు. స్వయంగా డీజీపీనే కోర్టుముందు నించున్నాడని, రాష్ట్రహోంశాఖమొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే నడుస్తోందని, దారిదోపిడీ చేసి, బ్రోకరేజ్‌ద్వారా సంపాదించిన సొమ్ముని జగన్‌ కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నా డన్నారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్‌, సిమ్‌ెంఫ్యాక్టరీలు, మద్యంమాఫియాల ద్వారా పోగుచేస్తున్న సొమ్మంతా ఎక్కడికి పోతుందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలన్నారు. ీడీపీమద్ధతుదారుల ఆర్థికమూలాలు దెబ్బతీస్తున్నారని, అందులోభాగంగానే వారి కంపెనీలపై జరిగిన దాడుల్ని చంద్రబాబుకి అంటగ్టాలని చూస్తున్నారన్నారు. వాస్తవా లు మ్లాడేధైర్యం మంత్రులకుంటే, ప్రతిమ, మెగాఇన్‌ఫ్రా కంపెనీల పేరు ఎందుకు చెప్పడంలేదని, కేసీఆర్‌కు భయపడే వారు నోళ్లు తెరవడంలేదన్నారు.

రివర్స్‌టెండరింగ్‌ ద్వారా కడపజిల్లాలో జగన్‌మేనమామ చేప్టిన సాగునీిప్రాజెక్ట్‌ కాంాక్ట్‌లో ఇతరులు ఎందుకు టెండర్‌ వేయలేదని, దేవినేని ప్రశ్నించారు. జగన్‌ బంధువు, ఎంపీఅయిన మరోవ్యక్తి చేప్టిన ప్రాజెక్ట్‌, ముఖ్యమంత్రి మేనమామప్రాజెక్ట్‌ పని తప్ప, రాష్ట్రంలో ఎక్కడా ఏవిధమైన పనులుజరగడంలేదన్నారు. సాగునీి రంగానికి రూ.13వేలకోట్లు కేయించారని, ఆమొత్తం ఇప్పివరకు ఎక్కడ ఖర్చుచేశారో చెప్పాల ని ఉమా డిమాండ్‌చేశారు. ఏముఖ్యమంత్రి కొడుకూ ఇంతవరకు జైలుకు వెళ్లిరాలేదని, సీబీఐ-ఈడీకేసుల్లో ముద్దాయిగా ఉండలేదని, రూ.43వేలకోట్లను జప్తు చేయించుకోలే దని ఉమా దుయ్యబ్టారు. ీడీపీప్రభుత్వం క్టినభవనానికి రంగులేసి, దిశపోలీస్‌స్టే షన్‌ ప్రారంభించారన్నారు. కోర్టుల్లో విచారణ ఆలస్యమైతే నేరస్తులు తప్పించుకుంటున్నారని చెబుతున్న జగన్మోహన్‌రెడ్డి, తానెందుకు కోర్టులకు హాజరుకావడంలేదో కూడా చెబితే ప్రజలంతా సంతోషిస్తారన్నారు. కోర్టుల విచారణకు వెళ్లకుండా, ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని జగన్మోహన్‌రెడ్డి కాలక్షేపం చేస్తున్నాడన్నారు. తన పాలనావైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఇచ్చిన హామీలునెరవేర్చలేక, ప్రజలకు ముఖంచూపించలేకే, ప్రజానాయకుడైన చంద్రబాబుపై బురదజల్లే యత్నాలను ముఖ్యమంత్రి ప్రారంభించా డన్నారు. రాష్ట్రంలో కొద్దిరోజుల్లోనే ఆర్థిక అత్యవసరస్థితి రాబోతుందని, ఉద్యోగులకు జీతాలిచ్చేకూడా పరిస్థితి కూడా లేదన్నారు. డీఏల గురించి మ్లాడలేని ఉద్యోగసంఘా లనేతలు, మూడురాజధానుల గురించి మ్లాడటం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ విలీనం కథలోని గుట్టుమట్లేమిో త్వరలోనే బయటకు వస్తాయన్నారు. 7లక్షల పింఛన్లు, 20 లక్షల రేషన్‌కార్డులు తీసేసిన ప్రభుత్వం, రీవెరిఫికేషన్‌ పేరుతో నాటకాలు ఆడుతూ, గ్రామవాలీంర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టేయజ్ఞాన్ని కొనసాగిస్తోందన్నా రు. పందులమాదిరి అవినీతిబురదలో పొర్లాడుతూ, ఆ దరిద్రాన్ని ీడీపీవారికి అంిం చాలని చూస్తున్న జగన్మోహన్‌రెడ్డికి ఏమాత్రం దమ్ము, ధైర్యమున్నా ప్రతిమ, మెగాఇన్‌ ఫ్రా, షాపూర్జీ పల్లోంజీ సంస్థల పేర్లను కూడా బయటప్టోలన్నారు.

నేర చరితులు, కళంకితులకు ఎన్నికల్లో టికెట్లు కేటాయించడం పై రాజకీయ పార్టీలు వివరణ ఇవ్వాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేసింది. నేర చరితులకు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకుండా నిరోధించడానికి సరికొత్త విధానం తీసుకొచ్చేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ బిజెపినేత సీనియర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చట్టింది. రాజకీయ పార్టీలకు న్యాయ స్థానం కీలక సూచనలు చేసింది. క్రిమినల్ రికార్డులు ఉన్నవారికి ఎందుకు టికెట్లు కేటాయి స్తున్నారో కల కారణాలను తమ పార్టీల అధికారిక వెబ్ సైట్ లో పొందుపరచాలని సూచిం చింది. నేర చరితులకు టికెట్లను కేటాయించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం గతంలో వలు ఆదేశాలు జారీచేసినా అంతగా ఫలితం లేకపోయింది. ఈ అంశాన్ని మరోసారి పరిశీలించడానికి ఇటీవల సమ్మతించిన సుప్రీం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యను నియంత్రించడానికి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉన్నట్లు ఎన్నికల సంఘం అభిప్రాయపడుతున్నట్లు జసిస్ ఆర్ఎఫ్ నారిమన్ జస్టిస్ ఎ రవీంద్రభట్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రాజకీయాల నుంచి నేరస్తులను పారద్రోలడానికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఎలాంటి ప్రభావం చూపించలేదని ధర్మాసనం వెల్లడించింది. గత నెల 24నాటి విచారణ ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్, పిటిషనర్ ఉపాధ్యాయను దీనికి సంబంధించి ఓ ప్రతిపాదన రూపొందించి వారం రోజుల్లో సమర్పించాలని ధర్మాసనం సూచించింది. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నా దోషిగా నిర్ధారించబడని వ్యక్తిని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించడం అంటే రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించడమే అవుతుందని ఏదేమైనా తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీచేయకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పార్టీలు తమపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే తప్పనిసరిగా నామినేషన్ పత్రాల్లో పొందుపరచాలని 2018లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనిని అమలుచేయడం లేదంటూ తాజాగా అశ్విని ఉపాధ్యాయ్ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసారు. రాజకీయ పార్టీలు తమతమ వెబ్ సైట్ లో ఈ వివరాలను సైతం పొందుపరిచేవిధంగా ఆదేశాలు జారీచేయాలని ఆయన కోరారు. అయితే ఇప్పుడు ఈ ఆదేశాలు జగన్ మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. అందరికంటే ఎక్కువ కేసులు ఉన్న వ్యక్తిగా, అయన పై 31 కేసులు ఉన్నాయి. అలాగే చంద్రబాబు పై, ఒకే ఒక్క కేసు, అది కూడా బాబ్లీ కేసు ఉంది. ఇప్పటికీ, శుక్రవారం కోర్ట్ కు వెళ్తున్న జగన్, ఈ కొత్త ఆదేశాలతో, మరింతగా ప్రజల్లో చులకన అయ్యే అవకాసం ఉందని, అలాగే తమ పార్టీ నుంచి 80 మందికి పైగా ఉన్న కేసులు గురించి కూడా వెబ్ సైట్ లో వెయ్యాలని, వైసీపీ ఇబ్బంది పడుతుంది.

దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా వైసీపీమాఫియా వ్యవహరిస్తో ందని, పనికిమాలిన చెత్తపేపర్‌లో వచ్చిన రాతలను ఆధారంగా చేసుకొని, రాష్ట్రమంత్రు లు వెల్లంపల్లి, బొత్స, అవంతి, రంగనాథరాజు, పేర్నినాని వింవారు అవగాహన లేకుండా మ్లాడుతున్నారని ీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీకేంద్రకార్యాల యంలో విలేకరులతో మ్లాడారు. సీబీడీటీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌టాక్సేషన్‌) ఇచ్చిన పత్రికాప్రకటన అర్థంకాకపోవడంతో మంత్రులంతా ఇష్టమొచ్చినట్లు తమనాలుక లకు పనిచెప్పారన్నారు. దేశవ్యాప్తంగా 40చోట్ల దాడులుచేశామని, 86లక్షల నగదు, 71 లక్షలవిలువైన నగలు, సక్రమంగా పన్నుచెల్లించకుండా రూ.2వేలకోట్లవరకు జరిపిన విదేశీలావాదేవీలు గుర్తించామని సీబీడీ స్పష్టంగా పేర్కొంటే, ఆ రెండువేల కోట్లు చంద్రబాబువంటూ బుద్ధి, జ్ఞానంలేని సాక్షిపత్రిక విషపురాతలు రాసిందన్నారు. వైసీపీమాఫియా, సాక్షిమీడియా చంద్రబాబు వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. ఎన్నికల్లో ఓడినా, ప్రజల్లో చంద్రబాబుకు ఆదరణ, అభిమానం తగ్గలేదని, దాన్నిచూసి ఓర్వలేకనే అసూయాద్వేషాలతో జగన్‌ రగిలిపోతున్నా డని వర్ల మండిపడ్డారు. సూర్యుడిపై ఉమ్మేస్తే, తిరిగి అది తమముఖంపైనే పడుతుందన్న నిజాన్ని జగన్‌, ఆయన మంత్రులు తెలుసుకోవాలన్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా గెలిచినంత మాత్రాన ఆయనపైఉన్న కేసులు మాఫీ అయినట్లు కాదన్న రామయ్య, ప్రజాక్షేత్రంవేరు-న్యాయస్థానాలు వేరనే విషయాన్ని జగన్‌ గ్రహించేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఆర్టికల్‌-14ప్రకారం చట్టంముందూ అందరూ సమానమైనా, జగన్‌ ముఖ్యమంత్రిననే సాకుతో ఎందుకు కోర్టులవిచారణ నుంచి మినహాయింపు కోరుతున్నా డని వర్ల ప్రశ్నించారు.

జగన్‌ ముఖ్యమంత్రైనాసరే, తప్పకుండా కోర్టుకు హాజరుకావాల్సి ందేనని, ఆయన ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులనుప్రభావితం చేశాడని, ఆయనపై తొలిఛార్జ్‌ షీటువేసి 8ఏళ్లయినా ఇంతవరకు విచారణ ఆరంభంకాలేదని సీబీఐ చెప్పింది వాస్తవం కాదా అని రామయ్య నిలదీశారు. గతంలో చంద్రబాబు అవినీతిపై విచారణజరపమని సుప్రీంకోర్టుని ఆశ్రయించిన జగన్‌తల్లి విజయమ్మ, తన పిషన్‌ను ఎందుకు ఉపసంహ రించుకుందన్నారు. చంద్రబాబుని దోషిగా చూపే ప్రయత్నంలో 26 ఎంక్వైరీకమిటీలు వేసిన వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి చివరకు భంగపాటే మిగిలిందన్నారు. తనకు శిక్షపడుతుం దన్న భయంతోనే జగన్‌, కోర్టులకు గైర్హాజరవుతూ, కేసులనుంచి తప్పించుకోవడానికి ఢిల్లీయాత్రలు చేస్తున్నాడన్నారు. తనకంట్లో దూలాన్ని ఉంచుకున్న సీఎం, ఎదుటివారి కంట్లోని నలకను చూసి అవహేళనచేయడం విచిత్రంగా ఉందన్నారు. తండ్రి ముఖ్య మంత్రి కాకముందు అంబాసిడర్‌కారులో తిరుగుతూ, రెండుగదుల ఇంో్ల నివసించిన జగన్మోహన్‌రెడ్డికి నేడు, లక్షలకోట్లు ఎక్కడినుంచి వచ్చాయని వర్ల నిలదీశారు.

కేసుల నుంచి బయటపడానికి, రాష్ట్రప్రజల్ని నానాగడ్డి కరిపించడానికే జగన్‌ ముఖ్యమంత్ర య్యాడు తప్ప, ప్రజలకు సేవచేయడానికి కాదన్నారు. వై.ఎస్‌ హాయాంలో నిమ్మగడ్డ ప్రసాద్‌కు 28వేల ఎకరాలిస్తే, అందుకు ప్రతిఫలంగా ఆయన జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో రూ.834కోట్లు పెట్టుబడి ప్టోడన్నారు. రస్‌అల్‌ఖైమా ఫిర్యాదుతో సెర్బియాలో నిమ్మగడ్డ అరెస్టవడంతో, ఎక్కడ తనబండారం బయటపడుతుందోనన్న భయం జగన్‌లో మొదలైందని వర్ల తేల్చిచెప్పారు. నిమ్మగడ్డను విడిపించడంకోసం తనపార్టీకి చెందిన 22మంది ఎంపీలను జగన్మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి జైశంకర్‌కు వద్దకు పంపించి నిజం కాదా అన్నారు. జగన్‌కు నిమ్మగడ్డకు మధ్యనున్న ఆర్థికవ్యవహా రాల్లోని లోగుట్టు గురించి తెలిసినంతనే కేంద్రమంత్రి, వైసీపీఎంపీల విజ్ఞప్తిని బుట్టదాఖ లు చేయడం జరిగిందని రామయ్య తెలిపారు. నిమ్మగడ్డ ప్రసాద్‌ అప్రూవర్‌గా మారితే ఎక్కడ తనదాకా వస్తుందోనన్న భయం జగన్‌లో మొదలైందని, దానితోపాటు, సీబీఐ -ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆయన ఢిల్లీయాత్రలు చేస్తున్నాడన్నారు. దిశపోలీస్‌స్టేషణ్‌ ప్రారంభం సందర్భంగా జగన్‌ మ్లాడుతూ, కోర్టులవిచారణ ఏళ్లకు ఏళ్లుగా సాగితే, దోషులకు శిక్షఎలా పడుతుందని ప్రశ్నించారని, అదేసూత్రాన్ని ముఖ్యమంత్రి తనకేసులకు ఎందుకు వర్తింపచేసుకోవడం లేదని వర్ల నిగ్గదీశారు. జగన్‌కు, ఆయనవిషపత్రిక సాక్షికి నీతి, నిజాయితీ, ఉంటే తక్షణమే తప్పుతెలుసుకొని చంద్రబాబునాయుడికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని వర్ల డిమాండ్‌చేశారు.

Advertisements

Latest Articles

Most Read