తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు టార్గెట్ గా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అన్ని వైపుల నుంచి ఎలాంటి ఒత్తిడి పెట్టాలో, అలాంటి ఒత్తిడి పెడుతూ, తన అధికారాన్ని ఉపయోగిస్తుంది. ప్రజల సంగతి ఏమో కాని, ప్రతిపక్షాల వేధింపులు మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలను టార్గెట్ చేస్తున్నారని, వారిని వేదిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తుంది. మానసికంగా వేధిస్తూ, ప్రతిపక్ష పాత్ర చెయ్యనివ్వకుండా, ప్రజల్లో తిరగానివ్వకుండా చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకు, మాజీ మంత్రులకు భద్రత తగ్గించిన ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా భద్రతను పూర్తిగా తొలగిస్తూ, సంచలన నిర్ణయం తీసుకోవటం చర్చనీయంసం అయ్యింది. ఇవన్నీ చూస్తున్న టిడిపి నేతలు, రాజశేఖర్ రెడ్డి టైములో, పరిటాల రవికి ఇలాగే చేసి, చంపేసిన ఉదంతాన్ని చూసి భయపడుతున్నారు.

తాజగా జగన్ ప్రభుత్వం, చాలా మంది తెలుగుదేశం సీనియర్లకు, ముఖ్య నాయకులకు భద్రత తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల క్రిందట, నారా లోకేష్ భద్రతను కుదించిన విషయం తెలిసిందే. నక్సల్స్ హిట్ లిస్టు లో ఉన్న లోకేష్, తొందర్లోనే సెలెక్ట్ కమిటీ విషయమై, రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే, నారా లోకేష్ స్వేచ్చగా గ్రామాల్లోకి, వివిధ ప్రాంతాలకు వెళ్ళకుండా, భద్రత తొలగించారని, తెలుగుదేశం ఆరోపిస్తుంది. అలాగే మూడు రోజుల క్రితం, తెలుగుదేశం సీనియర్ నేతలు అయిన, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డిల భద్రతను తొలగించింది జగన్ ప్రభుత్వం. ముఖ్యంగా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి భద్రత తొలగించటం ఆశ్చర్యకర విషయమే.

ఎందుకంటే, అది ఫాక్షన్ ఏరియా కావటం, జేసీ కూడా దూకుడుగా ఉండే మనిషి కావటంతో, జేసీని ఆత్మరక్షణలో పడేసి, మానసికంగా ఇబ్బంది పెట్టే చర్యగా దీన్ని భావించ వచ్చు. అయితే ఇప్పుడు తాజగా, కృష్ణా జిల్లాలో సీనియర్ మంత్రి అయిన, దేవినేని ఉమాకు భద్రత తొలగించారు. ఉమా చురుగ్గా అమరావతి ఉద్యమంలో పాల్గుంటున్న సంగతి తెలిసిందే. ఇక మరో సంచలన విషయం ఏమిటి అంటే, పల్నాడులో సున్నిత ప్రాంతమైన గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేనికి కూడా భద్రత తొలగించటం. ఈ రోజు వీరి ఇద్దరి రక్షణ తొలగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అంతే కాకుండా, వెంటనే వెనక్కు రావాలని, ఇవాళ మధ్యాహ్నంలోపు గన్‌మెన్‌లందరూ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని, ప్రభుత్వం ఆదేశించటం కొసమెరుపు. ఇప్పటికే చంద్రబాబుకి కూడా భద్రత తగ్గించగా, ఆయన హైకోర్ట్ కు వెళ్లి, మళ్ళీ సెక్యూరిటీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

సెలెక్ట్ కమిటీ ఉందో లేదో తెలియని మీమాంస ఎదురైంది. మూడు రాజధానులు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల భవిష్యత్తేమిటో తెలియని ఆగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. టిడిపి పట్టువీడకుండా చైర్మన్ నిర్ణయమే తుది నిర్ణయమని అంటుంటే, ప్రభుత్వం కమిటీ ఎక్కడుందని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. శాసనసభలో బిల్లులను ఆమోదించి మండలికి పంపారు. విచక్షణాధికారం పేరుతో మండలి చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఈ పరిణామాలపై ఆగ్రహం చెంది, చివరకు శాసనమండలినే రద్దు చేయాలనే తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. రాష్ట్రపతి తుది నోటిఫికేషన్ జారీ అయ్యేవరకు మండలి పనిచేస్తుందని, అదేవిధంగా సెలెక్ట్ కమిటీ ఉంటుందని టిడిపి వాదన. మండలి చైర్మన్ గణతంత్ర దినోత్సవం నాడు రెండ్రోజుల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల నుంచి పేర్లనుకోరారు.

పార్టీలిచ్చిన పేర్లతో రెండు కమిటీ లను సిద్ధం చేశారు. ఐతే ప్రభుత్వం నుంచి మంత్రులు ఈ కమిటీలకు చైర్మన్ గా ఉండాల్సి ఉంటుంది. అందుకు ఆయా మంత్రులు ససేమిరా వీల్లేదంటున్నారు. అసలు ప్రభుత్వం మాత్రం కమిటీల ప్రస్తావన లేదని తేల్చి చెబుతుంది. జనవరి 22న మండలి చైర్మన్ తీసుకున్న సెలెక్ట్ కమిటీ నిర్ణయం ఇప్పటి వరకూ అమలు కాలేదు. అసలు అమలవుతుందా లేదా అనేది ఇప్పుడు ఎపి మొత్తంగా ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ వైఖరి స్పష్టమైనప్పటికీ నిబంధనలకు వ్యతిరే కంగా మండలి రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. శాసనమండలి చైర్మన్ సరైన నిర్ణయం తీసుకోలేదని, అదితప్పు అని, నిబంధనలకు వ్యతిరేకమంటూ మండలి కార్యదర్శికి లేఖలు రాశారు. ఓవైపు మండలి చైర్మన్ ఆదేశాలు తప్పుకాదని విచక్షణాధికారం ఉంటుందని టీడీపీ అంటోంది. గత కొద్ది రోజుల నుంచి అధికారులు ఈ అంశంపై తర్జనభర్జన పడుతున్నారు.

చైర్మన్ మాత్రం కమిటీలు ఏర్పాటవుతాయంటూ జనవరి 26న స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కమిటీల విషయంలో అటు టిడిపి.. బిజెపి.. పిడిఎఫ్ సభ్యుల పేర్లను అందించింది. ప్రభుత్వం నుంచి మంత్రులు లేకుండా కమిటీల ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిబంధనలు పక్కనబెట్టి టిడిపి అధినేత ఒత్తిడి మేరకు సెలెక్ట్ కమిటీకి పంపుతూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారనేది ప్రభుత్వ వాదన. ఈ విషయంలో రాజీపడకూడదని నిర్ణయించింది. అదే సమయంలో సాధ్యమైనంత త్వరగా మండలి రద్దు చేసేలా కేంద్రంతో సంప్రదింపులు చేయాలని భావిస్తోంది. మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు సెలెక్ట్ కమిటీకి బిల్లులు వెళ్లకుంటే మండలి రద్దయ్యేవరకు ప్రభుత్వం వేచి చూడాల్సి ఉంటుందని ఆతర్వాత అసెంబ్లీలో ఆమోదం పొందడంతో తాము అనుకున్న విధంగా ముందుకు వెళ్లే అవకాశముంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. మండలి కార్యదర్శి కూడా అందుకు సంబంధించిన ఫైల్‌ను తిరిగి ఛైర్మన్‌కు పంపారు. దీంతో అసలు ఇప్పుడు కొనసాగుతున్న ప్రతిష్ఠంబనతో ఈ రెండు బిల్లుల భవిష్యత్తేమిటి, ఈ మొత్తం వ్యవహారానికి ముగింపు ఏమిటనే చర్చ అటు అధికార వర్గాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ కొనసాగుతోంది.

నిరాదరణకు గురైన వృద్దులు, వికలాంగులు, వితంతువులు, అనాధ మహిళలపై ౖ వైసీపీ ప్రభుత్వం ప్రతాపం చూపుతోందని టీడీపీ పొల్‌ట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మ్లాడుతూ.... జీవిత చరమాంకంలో కుటుంబ సభ్యుల ఆదరణ కోల్పోయిన వృద్దులకు, వికలాంగులు, వితంతువులు, అనాధ మహిళలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారి ఫించన్లు తొలగించటం దుర్మార్గం. రాష్ట్రంలో 7 లక్షల ఫించన్లు తొలగించారు. తాము ఎన్టీఆర్‌ హయాం నుంచి ఫించన్లు తీసుకుంటున్నామని, చంద్రబాబు వచ్చిన తర్వాత 200 నుంచి రూ. 2 వేలకు పెంచారు, కానీ జగన్‌ ఎన్నికలకు ముందు రూ. 3 వేల ఫించన్‌ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఫించన్లు తొలగించి మా న్లో మ్టి క్టొారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిగిరా తిరిగింది ఫ్యాన్‌ పోయింది నాఫించన్‌ అంటూ మహిళలు నినదిస్తున్నారు. ఫించన్లు తొలగిస్తే వారు ఎలా బ్రతకాలి. వివిధ నిభందనలతో ఫించన్లు తొలగించి 7 లక్షల మందిని ముఖ్యమంత్రి జగన్‌ రోడ్డున పడేశారు.

వారికి అన్నం పెట్టే దిక్కెవరు, కోట్లకు పడగలెత్తిన జగన్‌ పేదల నోి కాడ కూడు లాగేయటం దుర్మార్గం. జగన్‌ వీరికి సమాధానం చెప్పకపోయినా ఒక రోజు దేవునికి సమాధానం చెప్పాలి. క్రమం తప్పకుండా చర్చికెళ్తానని చెప్తున్న జగన్‌... యేసు క్రీస్తు చూపించిన కరుణ, జాలి,దయలో కనీసం 1 శాతం కూడా చూపటం లేదు. పేదల పింఛన్లు అన్యాయంగా తొలగించారు. పింఛన్ల తొలగింపుపై ప్రభుత్వాన్ని పేదలు నిలదీస్తున్నారు.సీఎం జగన్‌ ఏం సమాధానం చెప్తారు. పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లులో మధురమీనాక్షి అనే 103 ఏళ్ల వృద్ధురాలి పింఛన్‌ తొలగించారు.ఆమెకు ఎన్టీఆర్‌ హయాం 1987 నుంచి వస్తున్న ఫించన్‌ ఇప్పుడు నిలిపివేశారు. ఆమె వయస్సు 3 సంత్సరాలుగా పడిందని చెప్పి ఆపేశారు. 2007లో తన భర్త చనిపోతే..భర్త బ్రతికే ఉన్నాడని మరో ముస్లిం వితంతు ఫించను ఆపేశారు. ఆమె తన భర్తను చూపించాలంటూ అధికారులను నిలదీసింది.పింఛన్ల తొలగింపుపై పౌరసరఫరాల శాఖ మంత్రి స్పందించమని వృద్దులు అడిగితే నీ యమ్మ మెగుడుకి ఇవ్వాలా ఫించన్‌ అంటారేమో అని భయపడుతున్నారు.

వికలాంగుల పింఛన్లు సైతం తొలగిస్తున్నారు. భీమిలిలో పింఛన్లు తొలగింపుపై మంత్రి అవంతి సమాధానం చెప్పాలి. టీడీపీలో ఉన్నపుడు నీతి కధలు చెప్పిన అవంతి వైసీపీలోకి చేరారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ఆ పార్టీలో గద్దలా వాలుతారు. ఇలా పార్టీలు మారేవారిని ప్రజలు బియ్యంలో రాళ్లు వేరేసినట్లు వేరెయ్యాలి. ఫించన్ల తొలగింపుపై వారు ఎవరిని అడగాలి. తమ ఫించన్ల ఎందుకు తొలగించారని వారు ప్రశ్నిస్తే వారిపైన కూడా కేసులు పెడతారా? నేడు ఫించన్ల తొలగింపుపై టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఆందోళనలకు ఫించన్ల కోల్సోయిన వారంతా తరలివచ్చారు. ఫించన్లు తొలగించిన వృద్దులను చూసి ఒక మహిళా ఎమ్మార్వో తానమే చేయలేనంటూ కంటతడి పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 ఏళ్లకే ఫించను ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారు. పేదల ఫించన్లు తొలగించి వారి ఉసురు పోసుకోవద్దు. రద్దు చేసిన 7 లక్షల ఫించన్లు తిరిగి ఇవ్వాలని వర్ల రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కేంద్ర బడ్జెట్ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిన సంగతి తెలిసిందే. ప్రత్యెక హోదాతో పాటుగా, ఒక్క విభజన హామీని కూడా, కేంద్రం బడ్జెట్ లో పట్టించుకోలేదు. ఏడాది క్రితం ప్రకటించిన రైల్వే జోన్ అడ్డ్రెస్ లేదు. అడనప్డు కేటాయింపులు లేవు. విద్యాసంస్థలకు నిధులు కేటాయింపు లేదు. కొత్త రైల్వే లైన్ల ఊసే లేదు. ఇలా అనేక హామీలు, కేటాయింపులు కేంద్రం చెయ్యలేదు. సహయం చెయ్యకపోగా, 15వ ఆర్ధిక సంఘంతో, రాష్ట్రానికి వచ్చే వాటా తగ్గిపోయింది. అయితే రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీ మాత్రం, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, ప్రశ్నించటంలో విఫలం అయ్యింది అనే చెప్పాలి. 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి, ప్రత్యెక హోదా తెస్తాం అని చెప్పిన జగన్, ఇప్పుడు మెడలు వంచటం సంగతి ఏమో కాని, కనీసం మాట్లాడటానికి కూడా, అడ్డ్రెస్ కనిపించటం లేదు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి, ఇప్పటికి 10 రోజులు దాటింది. అయినా, వైసీపీ ఒక నిరసన చెయ్యటం కాని, గట్టిగా కేంద్రాన్ని అడగటం కాని జరగలేదు.

ఈ రోజు బడ్జెట్ సమావేశాల పై, పార్లమెంట్ లో చర్చ జరిగింది. అలాగే రాజ్యసభలో కూడా చర్చ జరిగింది. రాజ్యసభలో బిడ్జెట్ ప్రసంగం జరిగే సమయంలో వైస్సార్సీపీ ఫ్లోర్ లీడర్, ఎంపీ విజయసాయిరెడ్డి పేరుని, చైర్మెన్ పిలిచారు. అయితే, ఆయన పేరు పిలిచినప్పుడు సభలో విజయసాయి రెడ్డి లేరు అంటూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కేంద్ర బిడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం అన్యాయం చేసింది అని విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి, బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగం సమయంలో హాజరుకపోవడం చర్చియాంశంగా మారింది. కేంద్ర పెద్దలను మంచి చేసుకుంటానికి, ఇలా చేసారా ? లేక ముందే చైర్మెన్ కు చెప్పరా అనేది తెలియాలి. అయితే, ముందు చెప్పి ఉంటే, అసలు చైర్మెన్ పిలిచే వారే కాదని అంటున్నారు.

ఇక మరో పక్క ముగ్గురు ఎంపీలు పార్లమెంట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం, కేంద్రం పై విమర్శలు గుప్పించింది. గత ఎనిమిది ఏళ్ళుగా బడ్జెట్ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉన్నారంటూ, బీజేపీ పై విరుచుకు పడ్డారు, రామ్మోహన్ నాయుడు. రాజకీయాలతో ఏపీ అన్యాయమైపోతోందని అన్నారు. వైజాగ్‌కు రైల్వేజోన్ ఇచ్చామన్నారని, కాని ఆదాయమిచ్చే ప్రాంతం మాత్రం ఆ జోన్ పరిధిలో లేదని అన్నారు. బడ్జెట్‌లో ఏపీకి ఇది కచ్చితంగా ఇచ్చాం అని స్పష్టంగా ఏమీ లేదని, విభజన ఆంధ్రప్రదేశ్ ని ఇలాగేనే చూసేది అని అన్నారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ఏం రావాల్సి ఉంది అని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని అన్నారు. పోలవరాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉందని, ఇప్పటి వరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలు ప్రస్తావించ కూడదు అంటారు, కాని ఇదే పార్లమెంట్ లో చట్టం చేసిన, ఏపి విభజన చట్టం అమలు కాకపోతే, ఇక్కడ కాక ఎక్కడ చెప్పుకుంటాం అని రామ్మోహన్ అన్నారు. ఇక ప్రత్యేక హోదా ఎలా తెస్తారో రాష్ట్ర ప్రజలకు వైసీపీ సమాధానం చెప్పాలని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read