ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. గోదావరి జిల్లాలో మంచి పేరు ఉన్న నేత.. ఆయనే ఎమ్మెల్యే గోరంట్లా బుచయ్య చౌదరి.. మొదటి నుంచి పార్టీకి, అధినాయకుడు చంద్రబాబుకి అండగా వస్తూ వస్తున్నారు. మొన్న ఎన్నికల్లో, అంత బలమైన వైసీపీ గాలి వీచినా, తట్టుకుని గెలిచారు. ఆయన ఎంత బాగా లాజిక్ మాట్లాడతారో అందరికీ తెలిసిందే. గోదావరి వెటకారంతో పంచ్ వేస్తె, అవతలి వారు సైలెంట్ అయిపోవటమే. అసెంబ్లీలో కూడా గోరంట్ల ఎలా ఫైట్ చేస్తారో చూస్తున్నాం. అయితే, ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి, చంద్రబాబుకి, పార్టీకి అండగా ఉన్నా, ఆయనకు ఇప్పటి వరకు మంత్రి పదవి మాత్రం రాలేదు. ఎందుకో అందరికీ తెలిసిందే. సామాజిక న్యాయం అనే ఉచ్చులో పడిన చంద్రబాబు గారు, ఇలాంటి వారికి అన్యాయం చేసారు అనే విమర్శలు ఉన్నాయి. అయినా బుచ్చయ్య చౌదరి గారు, ఎప్పుడూ బాధ పడలేదు. పార్టీకి పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కూడా, ఇదే నా చివరి ఎన్నిక అని కూడా చెప్పేశారు.
ఇక యువతకు, నా స్థానం ఇవ్వాలని అనుకుంటున్నా అని చెప్పారు. సహజంగా, ఇలా చివరి ఎన్నికలు అంటే, అందరూ రిలాక్స్ అయిపోతారు. అయితే, గోరంట్ల మాత్రం, మరింత దూకుడుగా వెళ్తున్నారు. యువతకు దగ్గర కావటం కోసం, సోషల్ మీడియా వేదికగా పంచులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఒక కారణం సోషల్ మీడియా. టిడిపి అధికారాన్ని కోల్పోయినప్పటి నుండి, పార్టీ తన సోషల్ మీడియా వ్యూహాన్ని మార్చింది. టిడిపి, నారా లోకేష్, మరియు చంద్రబాబు నాయుడు యొక్క ట్విట్టర్ ఖాతాలు ఈ రోజుల్లో మరింత చురుకుగా ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి సూటిగా ఉన్నాయి, అయినప్పటికీ, వైయస్ఆర్ కాంగ్రెస్ డిజిటల్ మీడియాను ఎదుర్కోవటం కష్టం అనే చెప్పాలి.
ప్రశాంత్ కిషోర్ ఇప్పటికీ తన సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరో పక్క అకస్మాత్తుగా, టిడిపి సీనియర్ నాయకుడు మరియు ఎమ్మెల్యే గోరంట్లా బుచయ్య చౌదరి ట్విట్టర్ ఖాతా గత రెండు నెలల్లో చురుకుగా పని చేస్తుంది. .చమత్కారమైన ట్వీట్లు మరియు వ్యంగ్యంతో అద్భుతమైన ట్రాక్షన్ పొందుతోంది. రాజకీయ నాయకుల తీవ్రమైన ట్వీట్ల మాదిరిగా కాకుండా, ఈ ఖాతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విషయాలతో పోస్ట్ లు చేస్తుంది. చాలామంది టిడిపి కార్యకర్తలు, ఈ టిడిపి ఖాతా అన్నికంటే బాగుందని, ఇలాగే వ్యంగ్యంతో కొట్టాలని అంటున్నారు. చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్ ఖాతాల కంటే, బుచ్చయ్య ట్విట్టర్ ఖాతా ఎక్కువ ఆకట్టుకుంటుందని, టిడిపి కార్యకర్తలు అంటున్నారు. గోరంట్లా బుచయ్య చౌదరి టిడిపి వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆరుసార్లు ఎమ్మెల్యే. ఎన్టీఆర్ పాలనలో పౌర సరఫరాల మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.