ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ అనే టాపిక్ నడుస్తుంది. ఒక రాజధాని వద్దు , మూడు ముక్కల రాజధాని కావాలి అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, పరిపాలనా వికేంద్రీకరణ అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. విశాఖపట్నంలో సెక్రటేరియట్, అమరావతిలో అసెంబ్లీ, కర్నూల్ లో హైకోర్ట్ అంటూ వింత వాదన ముందు పెట్టరు. అయితే, దీని పై తెలుగుదేశం పార్టీతో పాటు, వివిధ వర్గాలు కూడా, పరిపాలనా వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించారు. కేంద్రం నుంచి వచ్చే జాతీయ విద్యాసంస్థలు, ఒక్కో జిల్లాలో ఒక్కొక్కటి పెట్టరు. అలాగే విశాఖపట్నంలో, ఐటి, ఫైనానిష్యల్ కంపెనీలు పెట్టించారు. తిరుపతిలో ఎలెక్ట్రోనిక్ హబ్ చేసారు. అనంతపురంలో ఆటోమొబైల్ హబ్ చేసారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెట్టారు. గోదావరి జిల్లాల్లో ఆక్వాని ప్రోమోట్ చేసారు.
ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధిని మొదలు పెట్టి, చూపించారు. అయితే, వైసీపీ ప్రభుత్వం మాత్రం, అవేమీ జరగలేదని, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా, మూడు ముక్కల రాజధాని చేస్తేనే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వాదిస్తుంది. కియా లాంటి కంపెనీలు వస్తే ప్రాంతం అభివృద్ధి చెండుతునా, లేక ఒక వంద ఉద్యోగాలు వచ్చే హైకోర్ట్, 50 ఉద్యోగాలు ఉండే అసెంబ్లీ వల్ల అభివృద్ధి చెందుతుందా అని టిడిపి ప్రశ్నిస్తుంది. అయితే, టిడిపి అభివృద్ధి ఏమి చెయ్యలేదు అని చెప్తున్న సమయంలో, అది కూడా అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి, స్మార్ట్ సిటీకి వచ్చిన అవార్డులు, ఇప్పుడు టిడిపి చేసిన పనిని మరోసారి, ప్రజలకు గుర్తు చేస్తున్నాయి. అటు అమరావతికి, ఇటు విశాఖపట్నంకు కూడా, చంద్రబాబు సమానంగా , ఇంకా చెప్పాలంటే, వైజాగ్ నే ఎక్కువ అభివృద్ధి చేసారని చెప్పొచ్చు.
శుక్రవారం వంద 'స్మార్ట్' నగరాల మూడవ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇందులో అమరావతికి, వైజాగ్ కి అవార్డులు వచ్చాయి. దేశంలోనే తొలిసారిగా వైజాగ్ లోని ముడసర్లోవ రిజర్వాయర్ లో, 2 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్కు ‘వినూత్న ఆలోచన అవార్డు’ దక్కింది. ఇక మూడో విడత ఎంపిక చేసిన పది స్మార్ట్ సిటీల్లో, ప్రాజెక్టుల అమలులో మెరుగైన ప్రతిభ చూపినందుకు అమరావతికి అవార్డు వచ్చింది. ఇక మొదటి రౌండ్‌లో స్మార్ట్‌సిటీలుగా ఎంపికైన 20 నగరాల్లో విశాఖపట్నం స్మార్ట్‌సిటీకి ఉత్తమ అవార్డు లభించింది. అమరావతి పై ఒక పక్క అనిశ్చితి ఉన్న వేళ, ప్రభుత్వ పెద్దలే, అమరావతిని స్మశానం అని, ఎడారి అని, అలాగే అక్కడ పందులు, కుక్కలు తిరుగుతాయి అంటూ చెప్తున్న వేళ, ఏకంగా కేంద్రమే ఇప్పుడు అమరావతికి అవార్డ్ ఇస్తూ, విశాఖను చంద్రబాబు ఎంతలా అభివృద్ధి చేస్తున్నారో విశాఖకు రెండు అవార్డులు ఇచ్చి, సమాధానం చెప్పింది.